కేటీఆర్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌లపై పరువు నష్టం దావా: మంత్రి జూపల్లి | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌లపై పరువు నష్టం దావా: మంత్రి జూపల్లి

Published Fri, May 24 2024 1:18 PM

Jupallai Krishna Rao Politicial Counter To KTR And RS Praveen

సాక్షి, హైదరాబాద్: తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ క్షమాపణ చెప్పాలని మంత్రి జూపల్లి కృష్ణారావు డిమా​ండ్ చేశారు. వీరిద్దరిపై పరువు నష్టం దావా వేస్తాను. భూ తగదాల కారణంగా కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ నేత శ్రీధర్‌ రెడ్డి హత్యకు గురయ్యాడని జూపల్లి చెప్పుకొచ్చారు. 

కాగా, మంత్రి జూపల్లి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌ నాకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. కేటీఆర్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై పరువు నష్టం దావా వేస్తాను. వీరిద్దరూ నన్ను ఏ చౌరస్తాను రమన్నా వస్తాను. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. శ్రీధర్‌ రెడ్డి హత్యను ఖండిస్తున్నాను. శ్రీధర్‌ రెడ్డి హత్య కేసులో పూర్తి వివరాలు తెలియాలి అంటూనే కేటీఆర్‌ను నాపై ఆరోపణలు చేస్తున్నాడు. శ్రీధర్‌ రెడ్డికి తన కుటుంబ సభ్యులు, పలువురితో భూ తగాదాలు ఉన్నాయి. శ్రీధర్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి. 

నేను, పొంగులేటి.. కేసీఆర్‌తో విభేదించి బయటకి వచ్చాక ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కేసీఆర్‌ను నియంత అన్న ఆర్ఎస్ ప్రవీణ్ ఇప్పుడు కేసీఆర్ పంచన చేరారు. ప్రవీణ్ కుమార్ ఆత్మగౌరవం అమ్ముకున్నారు. ఒకాయన ఐపీఎస్ ఆఫీసర్, ఒకాయన ఎన్ఆర్ఐ ఇద్దరూ కలిసి బట్టకాల్చి మీద వేస్తున్నారు. నన్ను, పొంగులేటిని కేసీఆర్ బర్తరఫ్ చేసినందుకు, ప్రజలు కేసీఆర్‌ను బర్తరఫ్‌ చేశారు. నాపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ క్షమాపణ చెప్పాలి. శ్రీధర్‌రెడ్డి గ్రామానికి వెళ్లి కేటీఆర్‌ అసలు నిజాలు తెలుసుకోవాలి. నిజనిర్ధారణ చేసి తప్పు నాదుంటే ఎలాంటి చర్యలైనా తీసుకోండి’ అంటూ కామెంట్స్‌ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement