Lok Sabha Election 2024: బిహార్‌లో ఆరో విడత... బీజేపీకి అగ్నిపరీక్ష! | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: బిహార్‌లో ఆరో విడత... బీజేపీకి అగ్నిపరీక్ష!

Published Fri, May 24 2024 4:06 AM

Lok Sabha Election 2024: Bihar BJP Used Its Full Strength In The Sixth Phase Poling

8 లోక్‌సభ స్థానాలకు రేపు పోలింగ్‌    

వాటిలో ఏడు ఎన్డీఏ సిట్టింగ్‌ సీట్లే    

ఆర్జేడీ–కాంగ్రెస్‌ కూటమి గట్టి పోటీ

బిహార్‌లో ఇప్పటిదాకా ఐదు విడతల్లో 24 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. శనివారం ఆరో దశలో 8 చోట్ల పోలింగ్‌ జరగనుంది. వీటిలో ఏకంగా ఏడు ఎన్డీఏ సిట్టింగ్‌ స్థానాలే కావడం విశేషం. దాంతో వాటిని నిలబెట్టుకోవడం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్‌–ఆర్జేడీ–లెఫ్ట్‌ పారీ్టలతో కూడిన ఇండియా కూటమి ఈసారి గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో కీలక స్థానాలపై ఫోకస్‌... 

వాలీ్మకి నగర్‌... పోటాపోటీ 
గత ఎన్నికల్లో జేడీ(యూ) నేత బైద్యనాథ్‌ ప్రసాద్‌ మహతో 3.5 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఆయ న మరణానంతరం ఉప ఎన్నికలో తనయుడు సునీల్‌ కుమా ర్‌ కుష్వాహ గెలుపొందారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నా రు. ఇండియా కూటమి తరఫున ఆర్జేడీ అభ్యర్థి దీపక్‌ యాదవ్‌ తలపడుతున్నారు. బీఎస్పీ దుర్గేశ్‌ సింగ్‌ చౌహాన్‌ను రంగంలోకి దించడంతో పోటీ హీటెక్కింది. నేపాల్‌ సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గంలో 22 శాతం ముస్లింలు, 15 శాతం ఎస్సీ ఓటర్లుంటారు. 

పశి్చమ్‌ చంపారన్‌... కమలం అడ్డా 
నియోజకవర్గాల పునరి్వభజన తర్వాత 2008లో ఉనికిలోకి వచ్చినప్పటి నుంచీ ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది. బీజేపీ తరఫున సంజయ్‌ జైశ్వాల్‌ గత ఎన్నికల్లో హ్యాట్రిక్‌ కొట్టారు. ఈసారి ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌ మోహన్‌ తివారీ, బీఎస్పీ నుంచి ఉపేంద్ర రామ్‌ పోటీ చేస్తున్నారు. పలువురు ముస్లిం అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా బరిలో ఉండటం విశేషం. సుమారు 4 లక్షలున్న ముస్లిం ఓటర్లు ఇక్కడ కీలకం. బనియా, బ్రాహ్మణ ఓటర్లు రెండేసి లక్షల చొప్పున, యాదవులు, కురి్మ, కుశ్వాహ సామాజిక వర్గ ఓటర్లు 1.5 లక్షల చొప్పున ఉన్నారు.నితీశ్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత, ఇండియా కూటమి గట్టి పోటీ నేపథ్యంలో బీజేపీ ఎదురీదుతోంది.

గోపాల్‌గంజ్‌... లాలు సొంత జిల్లా 
తొలుత కాంగ్రెస్‌ గుప్పిట్లో ఉన్న ఈ ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గంలో క్రమంగా ప్రాంతీయ పార్టీలు పాగా వేశాయి. బిహార్‌ మాజీ ముఖ్య మంత్రి అబ్దుల్‌ గఫNర్‌ జనతాదళ్‌ తరఫున, సమతా పార్టీ తరఫున రెండు సార్లు ఇక్కడ గెలిచారు. ఆర్జేడీ, బీజేపీ ఒక్కోసారి మాత్రమే విజయం సాధించాయి. గత ఎన్నికల్లో జేడీయూ తరఫున అలోక్‌ కుమార్‌ సుమన్‌ 2.86 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఆర్జేడీ నేత సురేంద్ర రామ్‌పై విక్టరీ కొట్టారు. కాగా, ఈసారి కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్, వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ) ఇండియా కూటమి తరఫున వీఐపీ అభ్యర్థి ప్రేమ్‌నాథ్‌ చంచల్‌ పాశ్వాన్‌ బరిలోకి దిగారు.

 ఎన్డీఏ నుంచి జేడీయూ సిట్టింగ్‌ ఎంపీ అలోక్‌ కుమార్‌ పోటీలో ఉన్నారు. కాగా, ముస్లిం ఓటర్లు కూడా ఎక్కువగానే ఉన్న నేపథ్యంలో ఇక్కడ మజ్లిస్‌ పార్టీ (ఎంఐఎం) దియానాథ్‌ మాంఝీని రేసులో నిలపడంతో పోటీ రసవత్తరంగా మారింది. బీఎస్పీ కూడా సుజీత్‌ రామ్‌ను రంగంలోకి దించింది. ఇది లాలు, తేజస్వి సొంత జిల్లా కావడంతో ఆర్జేడీ ఈ సీటుపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. 94 శాతం గ్రామీణ జనాభా గల ఈ సిట్టింగ్‌ సీటును నిలబెట్టుకోవడానికి నితీశ్‌ కుమార్‌ కూడా తీవ్రంగానే కష్టపడుతున్నారు. ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో జేడీయూ, బీజేపీ, ఆర్జేడీ ఖాతాలో తలో రెండు సీట్లు ఉన్నాయి.

పూర్వీ చంపారన్‌... రాధామోహన్‌ జోరు 
బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ రాధామోహన్‌ సింగ్‌ గత ఎన్నికల్లో హ్యాట్రిక్‌ కొట్టారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. 1989లో ఇక్కడ తొలిసారి కాషాయ జెండా పాతింది కూడా ఆయనే! ఇండియా కూటమి నుంచి వంచిత్‌ సమాజ్‌ ఇన్సాఫ్‌ పార్టీ అభ్యర్థి రాజేశ్‌ కుమార్‌ పోటీ చేస్తున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 బీజేపీ ఖాతాలో ఉండగా, జేడీయూ, ఆర్జేడీ చెరొకటి దక్కించుకున్నాయి.  

వైశాలి... ప్రాంతీయ పారీ్టల హవా 
1977లో ఏర్పాటైన ఈ ఎంపీ సీటును కాంగ్రెస్‌ నుంచి ప్రాంతీయ పార్టీలు చేజిక్కించుకున్నాయి. 1996 నుంచి ఆర్జేడీ కంచుకోటగా మారింది. ఆ పార్టీ సీనియర్‌ నేత రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్‌ వరుసగా ఐదుసార్లు గెలిచారు. ఆర్జేడీ జైత్రయాత్రకు 2014లో ఎల్జేపీ బ్రేకులేసింది. రఘువంశ్‌పై ఎల్జేపీ అభ్యర్థి రామ్‌కిశోర్‌ సింగ్‌ గెలిచారు. 2019లో కూడా ఎల్జేపీ అభ్యర్థి వీణా దేవి చేతిలో రఘువంశ్‌ ఓటమి చవిచూశారు! ఈసారి కూడా ఎల్జేపీ (రాం విలాస్‌) నుంచి వీణా దేవే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి నుంచి ఆర్జేడీ మున్నా శుక్లాను పోటీకి దించింది. ఆయన హత్య కేసులో బెయిల్‌పై ఉన్నారు. బీఎస్పీ నుంచి శంభు కుమార్‌ సింగ్‌ రేసులో ఉన్నారు. ఇక్కడ యాదవులు, కుష్వాహ, నిషాద్‌ సామాజిక వర్గాల ఓటర్లు కీలకం.

  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
 
Advertisement