రాజస్తాన్‌పై ఘన విజయం.. ఫైనల్‌కు చేరిన ఎస్‌ఆర్‌హెచ్‌ | Sakshi
Sakshi News home page

IPL 2024 : రాజస్తాన్‌పై ఘన విజయం.. ఫైనల్‌కు చేరిన ఎస్‌ఆర్‌హెచ్‌

Published Fri, May 24 2024 7:14 PM

Rajasthan Royals and Sunrisers Hyderabad Qualifier 2 Live Updates

Rajasthan Royals and Sunrisers Hyderabad Qualifier 2 Live Updates

రాజస్తాన్‌పై ఘన విజయం.. ఫైనల్‌కు చేరిన ఎస్‌ఆర్‌హెచ్‌

ఐపీఎల్‌-2024లో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ ఫైన‌ల్లో అడుగు పెట్టింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-2లో 36 ప‌రుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో స‌న్‌రైజ‌ర్స్ ఫైన‌ల్ పోరుకు అర్హ‌త సాధించింది.  

ఈ క్వాలిఫయ‌ర్‌-2లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత  స‌న్‌రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో హెన్రిచ్ క్లాసెన్‌(50) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్‌(34) ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. 

ఇక రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సందీప్ శ‌ర్మ రెండు వికెట్లు సాధించాడు. అనంత‌రం 176 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 139 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌ల్గింది. రాజ‌స్తాన్ బ్యాట‌ర్ల‌లో ధ్రువ్ జురెల్‌(56) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా..య‌శ‌స్వీ జైశ్వాల్‌(42) ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌న్పించాడు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. 

అయితే ల‌క్ష్య చేధ‌న‌లో రాజ‌స్తాన్‌ను ఎస్ఆర్‌హెచ్ స్పిన్న‌ర్ షాబాజ్ అహ్మ‌ద్ దెబ్బ‌తీశాడు. 3 వికెట్లు ప‌డ‌గొట్టి రాయ‌ల్స్ ప‌త‌నాన్ని శాసించాడు. అత‌డితో పాటు అభిషేక్ రెండు.. న‌ట‌రాజ‌న్‌, క‌మ్మిన్స్ త‌లా వికెట్ సాధించారు. ఇక మే 26న చెపాక్ వేదిక‌గా ఫైన‌ల్ పోరులో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఎస్ఆర్‌హెచ్ త‌ల‌ప‌డ‌నుంది.

క‌ష్టాల్లో రాజ‌స్తాన్‌.. విజ‌యం దిశ‌గా ఎస్ఆర్‌హెచ్‌

రాజ‌స్తాన్ ఆరో వికెట్ కోల్పోయింది.  4 ప‌రుగులు చేసిన హెట్‌మైర్‌.. అభిషేక్ శ‌ర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 13 ఓవర్లకు రాజ‌స్తాన్  స్కోర్‌: 102/6. క్రీజులో జురెల్‌(24), పావెల్‌(2) ప‌రుగుల‌తో ఉన్నారు. రాజ‌స్తాన్ విజ‌యానికి 30 బంతుల్లో 74 ప‌రుగులు కావాలి.

శెభాష్‌ షాబాజ్.. రాజస్తాన్‌ విలవిల 

రాజస్తాన్‌ రాయల్స్‌ను షాబాజ్ అహ్మ‌ద్ దెబ్బ తీశాడు. అతడి స్పిన్‌ దాటికి రాజస్తాన్‌ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 12వ ఓవర్‌ వేసిన షాబాజ్‌ బౌలింగ్‌లో తొలి బంతికి పరాగ్‌ ఔట్‌ కాగా.. ఐదో బంతికి అశ్విన్‌ పెవిలియన్‌కు చేరాడు.  13 ఓవర్లకు రాజ‌స్తాన్  స్కోర్‌: 90/5

మూడో వికెట్‌ డౌన్‌..
సంజూ శాంసన్‌ రూపంలో రాజస్తాన్‌ రాయల్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 10 పరుగులు చేసిన శాంసన్‌.. అభిషేక్‌ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

రెండో వికెట్ కోల్పోయిన రాజ‌స్తాన్‌..
65 ప‌రుగుల వ‌ద్ద రాజ‌స్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 42 ప‌రుగులు చేసిన య‌శ‌స్వీ జైశ్వాల్‌.. షాబాజ్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 8 ఓవర్లకు రాజ‌స్తాన్  స్కోర్‌: 66/2
రాజ‌స్తాన్ తొలి వికెట్ డౌన్‌..
176 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ 24 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. 10 ప‌రుగులు చేసిన కాడ్‌మోర్‌.. క‌మ్మిన్స్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.

దూకుడుగా ఆడుతున్న రాజ‌స్తాన్‌..
176 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవ‌ర్లు ముగిసే సరికి వికెట్ న‌ష్ట‌పోకుండా  19 ప‌రుగులు చేసింది. క్రీజులో కాడ్‌మోర్‌(6), య‌శ‌స్వీ జైశ్వాల్‌(13) ప‌రుగుల‌తో ఉన్నారు.

రాజ‌స్తాన్ టార్గెట్ ఎంతంటే?
చెపాక్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రుగుతున్న క్వాలిఫయ‌ర్‌-2లో ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్లు రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది.

ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో హెన్రిచ్ క్లాసెన్‌(50) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్‌(34) ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సందీప్ శ‌ర్మ రెండు వికెట్లు సాధించాడు.

19 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 169/7
హెన్రిచ్‌ క్లాసెన్‌ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 50 పరుగులు చేసిన క్లాసెన్‌ సందీప్‌ శర్మ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. 19 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 169/7

16 ఓవ‌ర్ల‌కు ఎస్ఆర్‌హెచ్ స్కోర్‌: 136/6
16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఎస్ఆర్‌హెచ్ 6 వికెట్ల న‌ష్టానికి 136 ప‌రుగులు చేసింది. క్రీజులో క్లాసెన్‌(37), షాబాజ్ అహ్మ‌ద్‌(5) ప‌రుగుల‌తో ఉన్నారు.

ఆరో వికెట్‌ డౌన్‌..
ఎస్‌ఆర్‌హెచ్‌ మరోసారి వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 14 ఓవర్‌ వేసిన అవేష్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఐదో బంతికి నితీష్‌ రెడ్డి(5) ఔట్‌ కాగా.. ఆరో బంతికి అబ్దుల్‌ సమద్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు.
నాలుగో వికెట్ డౌన్‌.. హెడ్ ఔట్‌
99 ప‌రుగుల వ‌ద్ద ఎస్ఆర్‌హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 34 ప‌రుగులు చేసిన ట్రావిస్ హెడ్‌.. సందీప్ శ‌ర్మ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి నితీష్ కుమార్ రెడ్డి వ‌చ్చాడు. 11 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఎస్ఆర్‌హెచ్ 4 వికెట్ల న‌ష్టానికి 102 ప‌రుగులు చేసింది.  

9 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ ఎం‍తంటే?
9 ఓవర్లు ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్ 3 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిచ్ క్లాసెన్‌(12), ట్రావిస్ హెడ్‌(33) పరుగులతో ఉన్నారు.

వారెవ్వా బౌల్ట్‌.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. 5వ ఓవర్ వేసిన బౌల్ట్ బౌలింగ్‌లో తొలుత రాహుల్ త్రిపాఠి(37), అనంతరం మార్‌క్రమ్‌(1) పెవిలియన్‌కు చేరాడు. 6 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది.

తొలి వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్‌కు ఆదిలోనే బిగ్ షాక్ త‌గిలింది. 12 ప‌రుగులు చేసిన అభిషేక్ శ‌ర్మ‌.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులో రాహుల్ త్రిపాఠి(7), ట్రావిస్ హెడ్‌(3) ప‌రుగుల‌తో ఉన్నారు. 3 ఓవ‌ర్లకు ముగిసే సరికి వికెట్ న‌ష్టానికి 29 ప‌రుగులు చేసింది.

ఐపీఎల్‌-2024లో క్వాలిఫ‌య‌ర్‌-2కు రంగం సిద్ద‌మైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక‌గా క్వాలిఫ‌య‌ర్‌-2లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగగా.. రాజ‌స్తాన్ ఎటువంటి మార్పులు చేయ‌లేదు. ఎస్ఆర్‌హెచ్ జట్టులోకి మార్‌క్ర‌మ్‌, జయదేవ్ ఉనద్కత్ వ‌చ్చారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్‌కు అర్హ‌త సాధిస్తోంది.

తుది జ‌ట్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్‌), అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్

రాజస్తాన్‌ రాయల్స్ : యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌/ కెప్టెన్‌), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

Advertisement
 
Advertisement
 
Advertisement