యూజర్ ప్రశ్న.. మస్క్ సమాధానం: ట్వీట్స్ వైరల్ | Sakshi
Sakshi News home page

యూజర్ ప్రశ్న.. మస్క్ సమాధానం: ట్వీట్స్ వైరల్

Published Fri, May 24 2024 5:54 PM

Elon Musk And X User Tweet Viral

బిలినీయర్, టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' ఇటీవల ఎక్స్(ట్విటర్)లో ఓ యూజర్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎక్స్ఏఎన్ బార్క్స్‌డేల్ అనే యూజర్ ట్విటర్‌లో వచ్చిన మార్పులు గురించి, చాలా రోజుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వివరించారు. ''ఐ లవ్ ట్విటర్ అంటూ.. ఇప్పటివరకు ఇందులో చెత్త ఫీచర్ ఏమిటంటే, నేను యాప్‌ని ఓపెన్ చేసిన ప్రతిసారీ ఆసక్తికరంగా అనిపించే ట్వీట్‌ని చూస్తాను, ఆపై ఫీడ్ రిఫ్రెష్ అవుతుంది. దాన్ని మళ్ళీ కనుగొనలేకపోతున్నాను'' అని పేర్కొన్నారు. ఈ సమస్య ఎంతోమందికి ఎదురైంది. ఇది సరైనదేనా అంటూ ప్రశ్నించారు.

యూజర్ ప్రశ్నకు మస్క్ రిప్లై ఇస్తూ.. అవును, మేము దీన్ని సరి చేస్తున్నాము, కాబట్టి మీరు ఆసక్తికరమైన పోస్ట్‌లను చూడటానికి వెనుకకు స్క్రోల్ చేయవచ్చు'' అని ట్వీట్ చేశారు. తన ప్రశ్నకు రిప్లై ఇచ్చిన ఇలాన్ మస్క్‌కు.. బార్క్స్‌డేల్ కృతఙ్ఞతలు తెలిపారు. ఈ చర్చ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement