టీ20 వ‌ర‌ల్డ్‌కప్‌-2024కు కామెంటేట‌ర్‌లు వీరే.. డీకేకు చోటు | Sakshi
Sakshi News home page

టీ20 వ‌ర‌ల్డ్‌కప్‌-2024కు కామెంటేట‌ర్‌లు వీరే.. డీకేకు చోటు

Published Fri, May 24 2024 7:21 PM

ICC Announces Commentary Panel For Men's T20 World Cup 2024

క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌కప్‌-2024కు మరో వారం రోజుల్లో తెరలేవనుంది. జాన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ కామెంటేటర్ల (వ్యాఖ్యాతలు) జాబితాను శుక్రవారం ప్రకటించింది. 

41 మంది సభ్యులున్న ఈ కామెంట్రీ ప్యానెల్‌లో భారత్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ దేశాలకు చెందిన దిగ్గజాలు ఉన్నారు. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి , లెజెండరీ సునీల్ గవాస్కర్‌, దినేష్ కార్తీక్, ఆసీస్ మాజీ కెప్టెన్ పాంటింగ్‌, వసీం అక్రమ్ వం‍టి వారు ఈ ప్యానల్‌లో ఉన్నారు.

కాగా దినేష్ ​కార్తీక్ ఇటీవలే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కామెంటేటర్‌గా వ్యవహరించడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో వన్డే వరల్డ్‌కప్‌-2023, యాషెస్ సిరీస్‌లో వ్యాఖ్యతగా వ్యవహరించాడు. మరోవైపు టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు ఆశించి భంగపడ్డ ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్‌కు ఈ వ్యాఖ్యాతల జాబితాలో చోటుదక్కింది.

టీ20 ప్రపంచ కప్ 2024 కోసం కామెంటరీ ప్యానెల్: రికీ పాంటింగ్, సునీల్ గవాస్కర్, మాథ్యూ హేడెన్, రమీజ్ రాజా, ఇయాన్ మోర్గాన్, టామ్ మూడీ, జాంబోయ్, రవిశాస్త్రి, ఇయాన్ బిషప్, నాజర్ హుస్సేన్, హర్ష భోగ్లే, డేల్ స్టెయిన్, గ్రేమ్ స్మిత్, మైఖేల్ అథర్టన్, వకార్‌ యూనిస్, సైమన్ డౌల్, షాన్ పొలాక్, కేటీ మార్టిన్, దినేష్ కార్తీక్, మెల్ జోన్స్,

ఎబోనీ రెయిన్‌ఫోర్డ్-బ్రెంట్, లిసా స్థలేకర్, శామ్యూల్ బద్రీ, మ్పుమెలెలో మ్బాంగ్వా, ఇయాన్ స్మిత్, నటాలీ జర్మనోస్, కార్లోస్ బ్రాత్‌వైట్, డానీ మోరిన్‌సెల్, అలీసన్ విల్కిన్‌సెల్, అలీసన్ విల్కిన్‌సెల్, ఫించ్, బ్రియాన్ ముర్గాట్రాయిడ్, మైక్ హేస్మాన్, ఇయాన్ వార్డ్, స్టీవ్ స్మిత్, అథర్ అలీ ఖాన్, రస్సెల్ ఆర్నాల్డ్, నియాల్ ఓబ్రియన్, కాస్ నైడూ, డారెన్ గంగా , వసీం అక్రమ్

Advertisement
 
Advertisement
 
Advertisement