పరువు నష్టం కేసు.. మేధాపాట్కర్‌ను దోషిగా తేల్చిన కోర్టు | Sakshi
Sakshi News home page

పరువు నష్టం కేసు.. మేధాపాట్కర్‌ను దోషిగా తేల్చిన కోర్టు

Published Fri, May 24 2024 7:00 PM

Delhi Court Convicts Medha Patkar In Defamation Case

న్యూఢిల్లీ: ‘నర్మదా బచావో’ ఆందోళన్‌ ఉద్యమానికి నాయకత్వం వహించిన మేధాపాట్కర్‌ను పరువు నష్టం కేసులో ఢిల్లీ‌ కోర్టు దోషిగా తేల్చింది. ఈకేసులో ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదంటే రెండూ విధించే అవకాశం ఉంది. 

పాట్కర్‌ దోషిగా తేలిన పరువు నష్టం కేసును ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా గతంలో ఫైల్‌ చేశారు. అప్పట్లో సక్సేనా అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఎన్జీవో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌కు నేతృత్వం వహించేవారు. పాట్కర్‌ గుజరాత్‌లో ‘నర్మదా బచావో’ ఆందోళన్‌కు నాయకత్వం వహించేవారు.

ఈ క్రమంలోనే పాట్కర్‌, సక్సేనా ఒకరిపై ఒకరు తరచూ కోర్టులకెక్కేవారు. తనపై పాట్కర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని సక్సేనా క్రిమినల్‌ డిఫమేషన్‌ కేసు దాఖలు చేశారు. ఈ కేసులోనే ప్రస్తుతం ఢిల్లీ సాకేత్‌ కోర్టు పాట్కర్‌ను దోషిగా తేల్చింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement