బలపడుతున్న రెమాల్ తుఫాను.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన | Sakshi
Sakshi News home page

బలపడుతున్న రెమాల్ తుఫాను.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Published Fri, May 24 2024 2:42 PM

Cyclone Remal to affect South Bay of Bengal

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. మరింత బలపడి రేపటికి తీవ్ర తుఫానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫానుకు 'రెమాల్'గా నామకరణం చేశారు. ఈ తుఫాను ఆదివారం బెంగాల్, బంగ్లాదేశ్‌ తీరం దాతుతుందని సమాచారం.

రెమాల్ తుఫాన్ ప్రభావం.. ఈశాన్య రాష్ట్రాల మీద ప్రభావం చూపుతుందని, దీంతో బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరాం, త్రిపుర, మణిపూర్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 

తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ వర్షాలతో పాటు గంటకు 90 నుంచి 110 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, మత్యకారులు ఎవరూ సముద్రం మీద వెళ్లకూడదని వాతావరణ శాఖ పేర్కొంది. రెమాల్ తుఫాన్ ప్రభావం.. ఏపీలో పెద్దగా ఉండకపోవచ్చు.

పశ్చిమబెంగాల్‌లో జూన్ 1 చివరి దశ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనిపైన తుఫాను ప్రభావం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. తుఫాను నేపధ్యంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలని, తగిన ఏర్పాట్లు చెయ్యాలని ఎన్నికల సంఘం సూచనలు జారీ చేసింది. కోల్‌కతా, హౌరా, నదియా మొదలైన ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురిసే సూచనలు ఉండటం వల్ల ఆ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement