Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Pinnelli Ramakrishna closing arguments on interim anticipatory bail in AP High Court
బాబు సేవలో బదిలీ బలగాలు!

సాక్షి, అమరావతి: రాజకీయ ఒత్తిళ్లతో తాను నియమించుకున్న కొందరు పోలీసుల ద్వారా చంద్రబాబు పన్నిన కుట్రలు న్యాయస్థానం సాక్షిగా బట్టబయలయ్యాయి! ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలు పంచుకుంటూ పోటీ చేసిన ఓ అభ్యర్ధిని కౌంటింగ్‌ రోజు బయటకు రానివ్వకుండా చేసేందుకు బరి తెగించి ఆడుతున్న నాటకానికి తెర పడింది. ఈసీపై రాజకీయ ఒత్తిడి తెచ్చి నియమించుకున్న కొద్ది మంది పోలీసులు బాబుకు ఏజెంట్ల మాదిరిగా పని చేస్తున్నట్లు తేటతెల్లమైంది. న్యాయస్థానానికి సైతం వారు తప్పుడు సమాచారం ఇవ్వడంపై తీవ్ర విస్మ యం వ్యక్తమవుతోంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు బనాయించడంలో డీజీపీ, టీడీపీకి కొమ్ము కాస్తున్న కొందరు పోలీసుల కుట్ర హైకోర్టు సాక్షిగా రుజువైంది. పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసమైన రోజు ఉదయం నుంచి ఏం జరిగిందో వాస్తవాలను వెల్లడించకుండా ఎడిటెడ్‌ వీడియో ఆధారంగా పిన్నెల్లి అరెస్టుకు ఎన్నికల కమిషన్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే పిన్నెల్లి ఈనెల 23న సానుకూల ఉత్తర్వులు పొందడం విదితమే. పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు కానున్నట్లు అదే రోజు సాయంత్రం కల్లా సంకేతాలు అందడంతో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే కొందరు పోలీసు అధికారులు అడ్డగోలు వ్యవహారాలకు తెర తీశారు. అదే రోజు రాత్రి పిన్నెల్లిపై పాత ఘటనలకు సంబంధించి మూడు వేర్వేరు కేసులు హడావుడిగా నమోదు చేశారు. ఆ ఘటనలు ఎప్పుడో జరిగితే పది రోజుల తరువాత తాపీగా పిన్నెల్లిపై హత్యాయత్నం సహా మూడు కేసులు బనాయించారు. మధ్యంతర ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులను అమలు చేయకుండా ఎన్నికల సంఘం, పోలీసులు ఈ తప్పుడు కేసులు పెట్టారని, వాస్తవానికి పిన్నెల్లిని 23వ తేదీ రాత్రి నిందితుడిగా చేర్చారని ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే పోలీసులు తాము 22వ తేదీనే పిన్నెల్లిని నిందితునిగా చేర్చామని పేర్కొనడంతో న్యాయస్థానం ఈ విషయంలో వారిని స్పష్టత కోరింది. లిఖితపూర్వకంగా ఆ వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. సంబంధిత డాక్యుమెంట్లను పిన్నెల్లి తరఫు న్యాయవాదులు స్థానిక కోర్టు నుంచి అధికారికంగా పొందారు. వాటిని సోమవారం కోర్టుకు సమరి్పంచారు. దీంతో పచ్చ ముఠాలకు వత్తాసు పలుకుతున్న పోలీసులు నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. పిన్నెల్లిని నిందితుడిగా చేర్చి 23వతేదీ రాత్రి స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన విషయాన్ని కోర్టుకు వెల్లడించాల్సి వచ్చింది. దీంతో 23న మధ్యంతర ముందస్తు బెయిల్‌ పొందిన తరువాత పిన్నెల్లిపై ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్లు రుజువైంది. పిన్నెల్లిపై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసినట్లు నిర్ధారణ కావడంతో కుట్ర కోణం బహిర్గతమైంది. డీజీపీ, పల్నాడులో కొందరు పోలీసులు దిగజారిపోతున్న తీరుకు ఇది అద్దం పడుతోంది. తీర్పు నేటికి వాయిదా తనపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. మంగళవారం తన నిర్ణయం వెలువరిస్తామని ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈవీఎంల కేసులో హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిలు మంజూరు చేయగానే పిన్నెల్లిపై పోలీసులు అప్పటికప్పుడు మరో మూడు అక్రమ కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు హత్యాయత్నం కేసులున్నాయి. ఈ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కౌంటింగ్‌ ప్రక్రియలో పాలు పంచుకునేందుకు వీలుగా ఈ కేసుల్లో తనకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో అనుబంధ పిటిషన్లు వేశారు. అనుబంధ వ్యాజ్యాలు.. పిన్నెల్లి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాల్లో బాధితులు నంబూరి శేషగిరి రావు, నాగ శిరోమణి ఇంప్లీడ్‌ అవుతున్నారని, ఆ మేరకు అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశామని విచారణ సందర్భంగా టీడీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. వారి తరఫున తాను వాదనలు వినిపిస్తానని తెలిపారు. అయితే మౌఖిక వాదనలకే పరిమితం కావాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈవీఎం ధ్వంసం చేయడాన్ని అడ్డుకున్నందుకు టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావును పిన్నెల్లి బెదిరించారని పోసాని పేర్కొన్నారు. నాగ శిరోమణి అనే మహిళను కూడా బెదిరించారన్నారు. కౌంటింగ్‌ రోజు పిన్నెల్లి అల్లర్లు సృష్టించే అవకాశం ఉందన్నారు. 23 రాత్రి 8 గంటలకు స్థానిక కోర్టులో మెమో పోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దని అభ్యర్ధించారు. ఇప్పటికే పిన్నెల్లిపై 9 కేసులున్నాయన్నారు. పిన్నెల్లిపై నిఘా ఉంచాలని ఇదే కోర్టు ఈ నెల 23న ఉత్తర్వులిచ్చినా ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. క్రైం నెం 59లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎప్పుడు నిందితునిగా చేర్చారు? దీనికి సూటిగా సమాధానం చెప్పాలని పీపీని ఆదేశించారు. సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో పిన్నెల్లిని నిందితుడిగా చేరుస్తూ 23వతేదీ రాత్రి 8 గంటల సమయంలో స్థానిక కోర్టులో మెమో దాఖలు చేశామని పీపీ వెల్లడించారు. దీంతో పిన్నెల్లిని 22వ తేదీనే నిందితుడిగా చేర్చామంటూ పోలీసులు చెప్పడం పచ్చి అబద్ధమని తేలిపోయింది. అస్మిత్, చింతమనేనికి ఇచ్చినట్లే.. పిన్నెల్లి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా తప్పుపట్టారు. పిన్నెల్లి విషయంలో ఎన్నికల సంఘం తీరు వల్ల ఆ సంస్థ విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోందన్నారు. పిన్నెల్లిపై పలు కేసులున్నాయని పోసాని, పీపీ పేర్కొనటాన్ని ప్రస్తావిస్తూ.. టీడీపీ నేతలైన చింతమనేని ప్రభాకర్, అస్మిత్‌రెడ్డిపై కూడా పెద్ద సంఖ్యలో కేసులున్నాయని గుర్తు చేశారు. అస్మిత్‌రెడ్డిపై 30, చింతమనేనిపై 31 కేసులు నమోదయ్యాయన్నారు. కేసుల ఆధారంగా ముందస్తు బెయిల్‌ ఇవ్వకూడదంటే వీరిద్దరికీ కూడా ముందస్తు బెయిల్‌ రాకూడదన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియలో పాలు పంచుకునేందుకు వీరిద్దరికీ ఇదే హైకోర్టు ఈ నెల 23న మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిందన్నారు. అదేవిధంగా పిన్నెల్లికి కూడా ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్ధించారు. పోలింగ్‌ కేంద్రం బయట ఒకే ఘటనకు సంబంధించి పోలీసులు పిన్నెల్లిపై రెండు కేసులు నమోదు చేశారని, ఒకే నేరానికి రెండు కేసులు చెల్లవని కోర్టుకు నివేదించారు. కౌంటింగ్‌ పాల్గొనే హక్కు ప్రతీ అభ్యర్ధికి ఉంది.. కౌంటింగ్‌ ప్రక్రియలో పాలుపంచుకునే హక్కు ఎన్నికల్లో పోటీ చేసే ప్రతీ అభ్యర్ధికి ఉంటుందని టి.నిరంజన్‌రెడ్డి తెలిపారు. కౌంటింగ్‌ తేదీ సమీపిస్తున్నందువల్ల కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకోవాల్సిన బాధ్యత పిన్నెల్లిపై ఉందన్నారు. కౌంటింగ్‌ వద్ద అభ్యర్థి లేని పక్షంలో తీవ్రంగా నష్టపోతారన్నారు. చింతమనేని, అస్మిత్‌రెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించని పోలీసులు పిన్నెల్లి విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు, ఈవీఎంల కేసులో మధ్యంతర బెయిల్‌ వస్తుందని 23వ తేదీ సాయంత్రం కల్లా గ్రహించడంతో అదే రోజు రాత్రి పిన్నెల్లిపై హత్యాయత్నంతో సహా మూడు కేసులు నమోదు చేశారన్నారు. అయితే పోలీసులు 22నే ఆయన్ను నిందితుడిగా చేర్చామంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని నివేదించారు. ఈమేరకు పోలీసులు స్థానిక కోర్టులో దాఖలు చేసిన డాక్యుమెంట్ల సరి్టఫైడ్‌ కాపీలను పిన్నెల్లి తరఫు మరో న్యాయవాది రామలక్ష్మణరెడ్డి కోర్టుకు సమరి్పంచారు. పోలీసులు దాఖలు చేసిన మెమోను పరిశీలించాలని నిరంజన్‌రెడ్డి కోరడంతో న్యాయమూర్తి దాన్ని పరిశీలించి పిన్నెల్లిని 23వ తేదీనే నిందితుడిగా చేర్చిన విషయాన్ని ధృవీకరించుకున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని పిన్నెల్లికి ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని నిరంజన్‌రెడ్డి అభ్యర్ధించారు. విచారణకు అశ్వనీ కుమార్‌ గైర్హాజర్‌.. క్రైం నెంబర్‌ 59 కేసులో సీఐ నారాయణ స్వామి తరఫున అసాధారణ రీతిలో హాజరై ఆదివారం వాదనలు వినిపించిన న్యాయవాది ఎన్‌.అశ్వనీ కుమార్‌ సోమవారం విచారణకు గైర్హాజరయ్యారు. ఆయన జూనియర్‌ కోర్టు ముందు హాజరై పిన్నెల్లి వ్యాజ్యాల్లో ఇంప్లీడ్‌ అవుతూ ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసినట్లు చెప్పారు. హైకోర్టు చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఓ పోలీసు తరఫున ప్రైవేటు న్యాయవాది హాజరు కావడం విస్మయం కలిగించింది. అశ్వనీ కుమార్‌ ఆ పోలీసు తరఫున హాజరు కావడం వెనుక మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌ ఉన్న విషయం బయటకు రావడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారాన్ని మరింత సాగదీస్తే ఇబ్బందులు తప్పవన్న నిర్ణయానికి రావడంతో అశ్వనీ కుమార్‌ సోమవారం విచారణకు గైర్హాజరైనట్లు న్యాయవర్గాలు చెబుతున్నాయి. బాబు కుట్రలలో భాగస్వాములు.. చంద్రబాబు కుట్రలో భాగం కావడం వల్లే ఎన్నికల సంఘం, డీజీపీ, కొందరు పోలీసు అధికారులు ఆయన చెప్పినట్లు ఆడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. కీలకమైన ఓట్ల లెక్కింపు రోజు పోటీలో ఉన్న అభ్యర్ధి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్‌ కేంద్రం వద్దకు రాకుండా అడ్డుకునేందుకు టీడీపీకి వంతపాడే పోలీసులు అడ్డదారులు తొక్కడం మొత్తం ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసినట్లుగా భావించాలని ప్రజాస్వామ్యవాదులు పేర్కొంటున్నారు. చంద్రబాబు, బీజీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పినట్లుగా ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన ఉన్న పోలీసు అధికారులను ఆకస్మికంగా బదిలీ చేసి పురందేశ్వరి సూచించిన జాబితాలోని వారిని నియమించడంతోనే అడ్డదారులు తొక్కే వ్యవహారం ప్రారంభమైందని స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా పోలింగ్‌ రోజు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు స్వేచ్ఛగా ఓటును వినియోగించుకొనే అవకాశం లేకుండా చేయడంతోపాటు హింస చెలరేగేందుకు దోహదం చేసిందని పేర్కొంటున్నారు. హైకోర్టు సాక్షిగా తాజాగా బయటడిన కుట్ర దీనికి స్పష్టమైన రుజువుగా నిలుస్తుందని స్పష్టం చేస్తున్నారు.

Delhi Varanasi Indigo Plane Bomb Threat Latest News
ఇండిగో విమానానికి బాంబ్‌ బెదిరింపు

ఢిల్లీ, సాక్షి: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపుతో విమాన సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రయాణికులను ఎమర్జెన్సీ ద్వారం నుంచి దించేసి.. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మంగళవారం వేకువ జామున ఈ ఘటన చోటు చేసుకుంది.ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానం టాయిలెట్‌ మీద బాంబ్‌ అని రాసి ఉండడాన్ని సిబ్బంది గమనించారు. దీంతో.. విమానం గాల్లోకి ఎగరకముందే అప్రమత్తమైన సిబ్బంది ఎయిర్‌పోర్ట్‌ అధికారులకు సమాచారం అందించారు. విమానాన్ని ప్రత్యేక ప్రాంతానికి తరలించారు. ప్రయాణికులను అత్యవసర ద్వారం గుండా దించేశారు. ఆపై సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టింది. వేకువ జామున ఐదు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు ఇండిగో ప్రకటించింది. ఈ ఘటనపై కాసేపట్లో అధికారులు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. The IndiGo crew before taking off found a note with the word "bomb" written on it in the aircraft's lavatory, says aviation security official who was on the spot.— ANI (@ANI) May 28, 2024 Passengers of #IndiGo flight from #Delhi to #Varanasi were evacuated via emergency exit following a #bombthreat, earlier today.The aircraft has been moved to isolation bay and further investigations are being carried out. More details are awaited.#imxplorer #travel #indigo pic.twitter.com/QYRVgGKpIR— IMxplorer-Travel The World (@IMTravelService) May 28, 2024

Sakshi special story about International Day of Action for Women Health 2024
ఆరోగ్యం ఆమె హక్కు!

ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండాలనుకోవడం కూడా ఒక హక్కే. ఈ విషయాన్ని ప్రపంచంలోని ప్రతి మహిళా గుర్తించాలని ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా మే 28న‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ యాక్షన్‌ ఫర్‌ ఉమెన్‌ హెల్త్‌’ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహిళ తన ఆరోగ్య సంరక్షణ కోసం అవగాహన పెంచుకోవడంతో ΄ాటు హక్కుగా ఎలా భావించాలో తెలుసుకోవాలి. మహిళల ఆరోగ్య సంరక్షణలో కొనసాగుతున్న ఇబ్బందులు, అవకాశాలను హైలైట్‌ చేసే ఒక ముఖ్యమైన వేడుకగా ఈ రోజును భావించాలి.మహిళల ఆరోగ్య సంరక్షణలో అసమానతలను తొలగించడానికి లాటిన్‌ అమెరికన్, కరీబియన్‌ ఉమెన్‌ హెల్త్‌ నెట్‌వర్క్‌ 1987లో గ్లోబల్‌ నెట్‌వర్క్‌ (డబ్ల్యూజిఎన్‌ఆర్‌ఆర్‌)ను ఏర్పాటు చేశారు. ఆరోగ్య సంరక్షణలో మహిళల తక్షణ అవసరాలను గుర్తించడానికి ఈ నెట్‌వర్క్‌ ఆవిర్భవించింది. మహిళల ఆరోగ్య సేవలు, హక్కులలో నిరంతరంగా వచ్చే అవాంతరాలను పరిష్కరించాలి. మరింత పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను సాధించాలనేది ఈ నెట్‌వర్క్‌ ఉద్దేశ్యం.మొదటిది ప్రసూతి ఆరోగ్యంమొదట పునరుత్పత్తి, ప్రసూతి సమయాలలో సురక్షితమైన ఆరోగ్య సేవలను ΄÷ందడంపై దృష్టి సారించడానికి ఈ రోజును కేటాయించారు. ప్రపంచంలో ముప్పై ఏళ్ల క్రితం ప్రసూతి మరణాలు అధికంగా ఉండటంతో తొలుత వాటిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ తర్వాత స్త్రీల మానసిక ఆరోగ్యం, హెచ్‌ఐవి, గర్భనిరోధక సాధనాలు, నాన్‌–కమ్యూనికబుల్‌ వ్యాధులు, ఆర్థిక–సామాజిక కారకాల ప్రభావం... వంటి విస్తృత శ్రేణి అంశాలను చేర్చే దిశగా క్రమంగా విస్తరణ జరిగింది. ఒక విధంగా చె΄్పాలంటే ఈ అవగాహన అంతర్జాతీయ స్థాయిలో మహిళల ఆరోగ్య ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి సెమినార్‌లు, శిక్షణ, పరిశోధన కార్యక్రమాలను స్పాన్సర్‌ చేశాయి. నిధుల పెట్టుబడిని ్ర΄ోత్సహిస్తూ ‘సురక్షిత మాతృత్వం’ అనే థీమ్‌తో సమస్యను చేపట్టాయి. 1987 మే, 28 నుంచి ఈ రోజుకు ఓ ్ర΄ాధాన్యాన్ని కల్పిస్తూ అనేక ప్రభుత్వాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళ ΄ûర సమాజ సంస్థలు మహిళల ఆరోగ్యం కోసం తమ చేయూతను అందిస్తున్నాయి. అవగాహనే కీలకంగా! ఎవరూ ఏ మాత్రం పట్టించుకోని, హాని కలిగించే వ్యాధులతో సహా ప్రపంచవ్యాప్తంగా మహిళలను ప్రభావితం చేసే క్లిష్టమైన ఆరోగ్య సమస్యలను ఈ రోజు చర్చకు తెస్తూ, వాటిని హైలైట్‌ చేస్తుంది. బహిరంగ సమావేశాల ఏర్పాటు ద్వారా ఈ సమస్యలను వెలుగులోకి తీసుకు వస్తూ, మహిళల ఆరోగ్య సంబంధిత విద్యలను ్ర΄ోత్సహిస్తుంది. .ఆరోగ్య హక్కుల కోసం న్యాయవాదిగా!మహిళల ఆరోగ్య హక్కుల కోసం వాదించడానికి, ఆరోగ్య సంరక్షణలో జెండర్‌ సమానత్వాన్ని ్ర΄ోత్సహించే విధానాల అమలుకు అవసరమైన కార్యక్రమాల ఆవశ్యకతను నొక్కి చెప్పడానికి ఇదొక వేదికగా ఉపయోగపడుతుంది. ప్రపంచంలోని వివిధ ్ర΄ాంతాల నుంచి మహిళల ఆరోగ్య న్యాయవాదులు, సంస్థలు, కమ్యూనిటీలను ఒకచోట చేర్చి, వారిలో సంఘీభావాన్ని పెం΄÷ందిస్తుంది. ఈ సమష్టి చర్య మహిళల ఆరోగ్య హక్కుల కోసం చేసే ఉద్యమాలను బలపరుస్తుంది.మహిళా సాధికారత మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించడం ద్వారా ఆరోగ్యం, శ్రేయస్సుపై బాధ్యత వహించడానికి ఈ ప్రత్యేకమైన రోజు మహిళలకు ఓ శక్తినిస్తుంది. ఆరోగ్య సమాచారాన్ని వెతకడానికి, సేవలను ΄÷ందడానికి తామే నిర్ణయాత్మక శక్తిలా మారే కార్యక్రమాలలో ΄ాల్గొనేలా మహిళలను ్ర΄ోత్సహిస్తుంది. మహిళల ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వాలు మద్దతునివ్వాలి. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయులలో మహిళల ఆరోగ్యం, హక్కులను ్ర΄ోత్సహించే కార్యక్రమాలలో ΄ాల్గొనేలా చేయాలి. ఆరోగ్య నిపుణులు, విధాన రూపకర్తలు, కమ్యూనిటీ నాయకులతో సహా వివిధ సంస్థలు కూడా ఇందులో భాగం కావాలన్నది డబ్ల్యూజిఎన్‌ఆర్‌ఆర్‌ నెట్‌వర్క్‌ ప్రధాన లక్ష్యం.

India head coach application deadline ends
ముగిసిన డెడ్ లైన్‌.. భార‌త కొత్త హెడ్ కోచ్ ఎవ‌రో?

టీమిండియా ప్ర‌స్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ప‌దవీ కాలం టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2024తో ముగియున్న సంగ‌తి తెలిసిందే. దీంతో కొత్త కోచ్‌ను భ‌ర్తీ చేసే ప‌నిలో బీసీసీఐ ప‌డింది. అయితే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి ధ‌ర‌ఖాస్తు చేసుకునేందుకు గ‌డువు సోమ‌వారం(మే 27) సాయంత్రం ఆరు గంట‌లతో ముగిసింది.కాగా ధర‌ఖాస్తుల‌ను బీసీసీఐ స్వీక‌రించిన‌ప్ప‌ట‌కి..కొత్త హెడ్ కోచ్‌ను ఎంపిక చేసేందుకు మ‌రింత స‌మ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. అయితే టీమిండియా హెడ్‌కోచ్ ప‌ద‌వికి విదేశీయులెవరూ దరఖాస్తు చేసుకోలేదని ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. తొలుత ఆస్ట్రేలియా దిగ్గ‌జాలు జ‌స్టిన్ లాంగ‌ర్‌, రికీ పాంటింగ్ పేర్లు వినిపించిన‌ప్ప‌టికి.. వార‌వ్వ‌రూ హెడ్‌కోచ్ ప‌దవికి ఆప్లై చేసేందుకు ఆస‌క్తి చూప‌లేద‌ని బీసీసీఐ మాలాలు వెల్ల‌డించాయి. నో చెప్పిన వీవీఎస్ లక్ష్మణ్..!కాగా భార‌త హెడ్ కోచ్ రేసులోప్ర‌ధానంగా దిగ్గ‌జ క్రికెట‌ర్లు వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం హెడ్‌కోచ్ పోస్ట్ కోసం దరఖాస్తు చేయ‌లేదంట‌. ప్ర‌స్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మణ్‌కు పూర్తి స్ధాయి హెడ్‌కోచ్ ప‌ద‌విపై ఆస‌క్తి లేనిట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ ఎంపికైతే జ‌ట్టుతో పాటు 10 నెలల పాటు క‌లిసి ప్ర‌యాణం చేయాలి. ఈ క్ర‌మంలోనే లక్ష్మణ్ ప్ర‌ధాన కోచ్ ప‌దవి వైపు మొగ్గు చూప‌క‌పోయిన‌ట్లు తెలుస్తోంది. గంభీర్ కోచ్ అవుతాడా? ఇక వీవీఎస్ లక్ష్మణ్ హెడ్‌కోచ్ బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు నిరాక‌రించ‌డంతో ద్ర‌విడ్ వారుసుడుగా టీమిండియా మాజీ ఓపెన‌ర్ గౌతం గంభీర్ ఎంపిక చేయాల‌ని బీసీసీఐ భావిస్తోంది. ఇప్ప‌టికే బీసీసీఐ పెద్ద‌లు గంభీర్‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ విష‌యంపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు. గంభీర్ ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మెంటార్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌రిస్తున్నాడు. ఐపీఎల్‌-2024లో అత‌డి నేతృత్వంలోనే కేకేఆర్ ఛాంపియ‌న్స్‌గా నిలిచింది. కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టును వీడి గౌతీ వస్తాడా అనే విషయం సందిగ్ధంగా ఉంది.

Today Horoscope: Rasi Phalalu 28-05-2024 In Telugu
Today Horoscope: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.పంచమి ప.3.09 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.9.43 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ప.1.32 నుండి 3.04 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.56 వరకు, తదుపరి, రా.10.49 నుండి 11.34 వరకు, అమృతఘడియలు: రా.10.44 నుండి 12.16 వరకు; రాహుకాలం : ప.3.00, నుండి 4.30 వరకు, యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం : 5.29, సూర్యాస్తమయం : 6.25. మేషం: వ్యవహార విజయం. అరుదైన ఆహ్వానాలు. విందువినోదాలు. కాంట్రాక్టులు పొందుతారు. సోదరుల నుంచి శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు..వృషభం: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. బంధువులతో అకారణ వైరం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యసమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి.మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితుల నుంచి విమర్శలు. కాంట్రాక్టులు చేజారతాయి. పనులలో అవాంతరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు. కళాకారులకు సమస్యలు ఎదురుకావచ్చు.కర్కాటకం: పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొత్త ఉద్యోగయోగం.సింహం: కొత్త పనులు ప్రారంభిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహం. కళాకారులకు సత్కారాలు జరుగుతాయి.కన్య: కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. ముఖ్యమైన పనులలో అవరోధాలు. ఆరోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులకు నిరాశ.తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి.. బంధువులతో తగదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. దూరప్రయాణాలు.వృశ్చికం: నూతన ఉద్యోగయోగం. ప్రముఖులతో పరిచయాలు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రగతి కనిపిస్తుంది. వాహనయోగం.ధనుస్సు: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం. నిరుద్యోగుల యత్నాలు మందుకు సాగవు.మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూవివాదాల పరిష్కారం. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. పాతమిత్రులను కలుసుకుంటారు. వస్తులాభాలు.కుంభం: కుటుంబసభ్యులతో వైరం. పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు.బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చే స్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. అనుకోని ప్రయాణాలు.మీనం: మిత్రులతో వివాదాలు పరిష్కారం. ఆస్తిలాభం. బ«ంధువుల నుంచి ఆహ్వానాలు. కళాకారులకు ఊహించని అవకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలపరిస్థితి. నూతన ఉద్యోగయోగం. ప్రముఖులతో పరిచయాలు.

Sakshi Guest Column On NTR Jayanthi
మహోన్నత వ్యక్తిత్వం... మేరునగ ధీరత్వం!

‘న నిశ్చితాత్‌ విరమంతి ధీరాః’ అని భర్తృహరి చెప్పినట్లు... తలపెట్టిన కార్యాన్ని సాధించే వరకు ధీరులు తమ ప్రయత్నాలను ఎన్ని ఇబ్బందులెదురైనా నిలబడి సాధిస్తారు. వెనక్కు తగ్గరు. అందుకు ఉదాహరణ ఎన్టీఆర్‌. ఆశయం లేని అడుగులు బురద గుంటలో ప్రయాణం లాంటివనీ, గమ్యం చేరవనీ నమ్మి ఆచరించిన వ్యక్తుల్లో ఎన్టీఆర్‌ అగ్రస్థానంలో నిలుస్తారు. గొప్ప మనసున్న తండ్రి ఆయన. భార్యను ప్రేమించి గౌరవించే మహోన్నత సంస్కారం ఆయనది. పేద ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పరిపాలించారు. అవినీతి రహితమైన సమాజాన్ని ఏర్పరచటానికి చిత్తశుద్ధితో పాటుపడ్డారు. అందుకే – మరణించిన తరువాత కూడా ఆ మహోన్నత వ్యక్తి నేటికీ జీవించే ఉన్నారు.తెలుగు రాష్ట్రంలో కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో 1923 మే 28న జన్మించిన మహానేత ఎన్టీఆర్‌ గారికి నేటికి 101 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ ఆయన దివ్య తేజస్సు తగ్గలేదు. మరణించి 28 సంవత్సరాలు అయినా ఎన్టీఆర్‌ పేరు అభిమానుల గుండెల్లో మారుమ్రోగుతూనే వుంది. ఆ రూపం అలరిస్తూనే ఉంది. ఆయన సినిమాలు, రాజకీయ జీవితంలో మాదిరిగానే ఆయన వ్యక్తిత్వంలోనూ అనేకానేక విశేషాంశాలు ఇమిడి ఉన్నాయి. ఎన్టీఆర్‌ గారిలో మొదటి నుండి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడటం, అనుకున్నది సాధించేవరకు వెనుకడుగు వేయకపోవటం అనేవి ప్రత్యేక గుణాలు. ఇవే ఆయనను సినీ, రాజకీయ రంగాల్లో విజయపథం వైపు నడిపించాయి. ‘న నిశ్చితాత్‌ విరమంతి ధీరాః’ అని భర్తృహరి చెప్పినట్లు... తలపెట్టిన కార్యాన్ని సాధించే వరకు ధీరులు తమ ప్రయత్నాలను ఎన్ని ఇబ్బందులెదురైనా నిలబడి సాధిస్తారు. వెనక్కు తగ్గరు. ఆ లక్షణం ఎన్టీఆర్‌ తర్వాత మళ్లీ ఇప్పుడు జగన్‌ మోహన్‌ రెడ్డిలో చూశాను. ముక్కుసూటిగా పోయే ఇలాంటి నాయకులకు శత్రువులు కూడా ఎక్కువే అనడటానికి వీరిద్దరూ ఎదుర్కొన్న సంఘటనలే సాక్ష్యం. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా – ఆయన భార్యగా అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తిని కనుక ఆయన వ్యక్తిత్వాన్ని తెలియచేసే ప్రధానమైన రెండు మూడు సంఘటనలు వివరిస్తాను. ఒక్క మా పెళ్లి విషయంలోనే తీసుకుంటే పెళ్లికి ముందు– తర్వాత ఎన్టీఆర్‌ ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొన్నారు. తిరుపతిలో జరిగిన ‘మేజర్‌ చంద్రకాంత్‌’ సినిమా వేడుకల్లో ఎన్టీఆర్‌ మా వివాహ ప్రకటన చేయగానే చంద్రబాబు ఆ ప్రకటన ప్రజల్లోకి వెళ్లకూడదని మైకులాపించి, లైట్లు ఆర్పించారు. అయినా ఆయన మరుసటి రోజు ఇంట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా పెళ్లిని ప్రకటించి మరీ వివాహం చేసుకున్నారు. అక్కడ నుండి నన్ను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా చేయటానికి చంద్రబాబు, కుటుంబ సభ్యులు కలిసి ఎన్నో పన్నాగాలు పన్నారు. ఎన్టీఆర్‌ ధైర్యంగా నన్ను అందరి ముందుకు తీసుకెళ్లి నా స్థానం ఏమిటో సగర్వంగా ప్రకటించారు. ప్రతి అవమానంలో అండగా నిలబడి మాకు కీడు చేస్తున్న వారందరినీ ఎదిరించారు. చీకటి రాజకీయాలకు అలవాటు పడ్డ చంద్రబాబు లాంటి వ్యక్తికి ఆయనొక సవాలుగా నిలబడ్డారు. పెద్ద వయస్సులో ఒంటరితనంతో బాధపడుతున్న ఎంతోమందికి మా వివాహం ఒక మార్గం చూపించింది. దాని మీద కొన్ని ఆర్గనైజేషన్స్‌ ఏర్పడటం కూడా ఒక విశేషమే! మరో సంఘటన – 1994 ఎన్నికల ప్రచారంలో నన్ను ఇంట్లో ఉంచమని అనేకమంది ద్వారా చెప్పించారు. ఎన్‌.వి రమణ లాంటి అన్యాయవాదుల్ని ఇంటికి పంపి ఈ పెళ్లి చెల్లదని కూడా వాదించేటట్లు చేశారు. ఎన్టీఆర్‌ దేనికీ చలించలేదు. తన ఆలోచన మార్చుకోలేదు. నన్ను తీసుకునే ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. స్వయంగా 216 స్థానాలు, మిత్ర పక్షాలకు మరో 34 స్థానాలు సంపాదించి రాజకీయరంగంలో ఒక రికార్డు సాధించారు. మళ్లీ ఆ స్థాయి రికార్డును ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తిరగరాశారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి పదవిని తమ అధికార దాహంతో లాగేయాలని కుట్రలు పన్నిన రామోజీ, చంద్రబాబు అందుకు నన్నే కారకురాలిగా చూపించారు. ఒక రాజ్యాంగేతర శక్తిగా నా ప్రాతను చిత్రీకరించి, నన్ను విడిచి పెడితేనే తిరిగి పదవి ఇస్తామని ప్రలోభపెట్టారు. ఇక్కడే ఎన్టీఆర్‌ గొప్ప వ్యక్తిత్వం మేరు పర్వతం లాగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవటానికి సిద్ధపడ్డారు కానీ భార్యను మాత్రం వదులుకోలేదు. పైగా వారికో సవాల్‌ విసిరారు. ‘‘నా పార్టీ, నేను సాధించుకున్న పదవి నాకు తిరిగి ఇవ్వటమేమిటి? ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న స్త్రీని బయటకు పంపించటం ఏమిటి? మీ భార్యల్ని అలా వదిలేస్తారా? నా భార్య తప్పు చేసిందని నిరూపించండి. బహిరంగంగా ఆమెను శిక్షిస్తాను’’ అన్నారు. ఈ మాటలు ఆయన ఆత్మవిశ్వాసాన్ని, తనపై నమ్మకాన్ని నిలబెట్టాయి. ఎప్పటికప్పుడు వారి నిందల నుండి నన్ను గుండెల్లో పొదువుకొని కాపాడుకున్నారు ఆయన. ఒక సందర్భంలో ఎన్టీఆర్‌ విలేకర్లతో మాట్లాడుతూ– ‘‘రాజ్యం కోసం ఆ రాముడు తన భార్యను అడవులకు పంపేశాడు. కానీ ఈ రాముడు తన భార్య గౌరవం కోసం అధికారాన్నే వదులుకున్నాడు’’ అన్నారు. ఇలాంటి నిశ్చితాభిప్రాయాలు ఎంతమంది మగవాళ్లలో ఉంటాయి?! చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తారు. ఎన్టీఆర్‌ గారి సదభిప్రాయాలను, ఆశయాలను అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుని కుటుంబ సభ్యులు ఎంతో బాధించారు– వేధించారు– అవమానాల పాలు చేశారు. అయినా చివరి క్షణం వరకు ఆయన తన కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉన్నారు. ప్రతిరోజూ వాళ్ల ఇంటికి స్వీట్లూ, ఫ్రూట్లూ పంపిస్తూనే వచ్చారు. వాళ్లు అప్పుడప్పుడూ వచ్చి డబ్బు పట్టుకుని పోతూ ఉండేవారు. మళ్లీ బయట మాత్రం వాళ్లంతా చంద్రబాబుతో చేతులు కలపడం! ఏది ఏమయినా గొప్ప మనసున్న తండ్రి ఎన్టీఆర్‌. భార్యను ప్రేమించి గౌరవించే మహోన్నత సంస్కారం ఆయనది. పేద ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పాలించినవారు. అవినీతి రహితమైన సమాజాన్ని ఏర్పరచటానికి ప్రయత్నించి భంగపడ్డ ధీరుడు.ఎన్ని రకాలుగా చంద్రబాబు, రామోజీలు కుట్రలు పన్ని అవమానించినా, పదవి లాగేసినా తల వంచకుండా తన చివరి క్షణం వరకు ఆయన తన పోరాటాన్ని కొనసాగించారే తప్ప ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ‘‘స్థిరత్వం, ధీరత్వం, ఉచితజ్ఞతా, ప్రియ వక్తృత్వం– చత్వారో సహజాగుణాః అభ్యాసే న లభ్యంతే’’ అని పెద్దలు చెప్పినట్లు ఈ లక్షణాలు ఆయన పుట్టుకతోనే వచ్చాయి. చివరి వరకు ఆ గుణాలు నిలబెట్టుకున్న ధీర గంభీరుడు ఎన్టీఆర్‌. నిబద్ధత లేని జీవితం ముళ్ల చెట్టు లాంటిది. ఎవరికీ ఉపయోగం ఉండదు. ఆశయం లేని అడుగులు బురద గుంటలో ప్రయాణం లాంటివి. గమ్యం చేరవు. ఇది నమ్మి ఆచరించిన వ్యక్తుల్లో ఎన్టీఆర్‌ అగ్రస్థానంలో నిలుస్తారు. అందుకే మరణించి కూడా నేటికీ మన మధ్య జీవించే ఉన్నారు. డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త ఎన్టీఆర్‌ సతీమణి

AP Elections 2024 May 28th Political Updates In Telugu
May 28th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 28th AP Elections 2024 News Political Updates.. 7:15 AM, May 28th, 2024హైకోర్టు సాక్షిగా దొరికిపోయిన డీజీపీ, పచ్చ పోలీసులు పిన్నెల్లిపై కేసుల విషయంలో రికార్డులు తారుమారు ఆయన్ను ఎప్పుడు నిందితుడిగా చేర్చారని ప్రశ్నించిన హైకోర్టుముందస్తు బెయిల్‌ ఇచ్చాకే నిందితుడిగా చేర్చినట్లు అంగీకారంఈమేరకు స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులుసంబంధిత డాక్యుమెంట్లను కోర్టు ముందుంచిన పిన్నెల్లి న్యాయవాదులుపిన్నెల్లి మధ్యంతర ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు.. నేడు హైకోర్టు నిర్ణయంకౌంటింగ్‌లో పాల్గొనే హక్కు ప్రతీ అభ్యర్ధికి ఉందన్న సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి 6:45 AM, May 28th, 2024రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలుకౌంటింగ్‌ రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత చర్యలు పోలింగ్‌ అనంతర ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టంగా ఏర్పాట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్‌ మీనా 6:30 AM, May 28th, 2024పెత్తందారులకు, పేదలకు యుద్ధం: సీఎం జగన్‌మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. మేము చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.-సీఎం @ysjagan… pic.twitter.com/BvDgxcKYWO— YSR Congress Party (@YSRCParty) May 27, 2024

Sakshi Editorial On Central Election Commission
ఈసీ నోరుమెదపదేం?!

కోట్లాదిమంది పౌరులు నచ్చినవారిని, సమర్థులనుకున్నవారిని తమ ప్రతినిధులుగా ఎంపిక చేసుకునే అసాధారణ ప్రక్రియ ఎన్నికలు. ఆ ప్రక్రియను ఎంత పారదర్శకంగా...ఎంత వివాదరహితంగా...ఎంత తటస్థంగా నిర్వహిస్తే అంతగా ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఆదినుంచీ ఇందుకు విరుద్ధమైన పోకడలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడింది మొదలు చిత్ర విచిత్ర ధోరణులు కనబడ్డాయి. పోలింగ్‌ రోజైన ఈనెల 13న, ఆమర్నాడు రాష్ట్రంలో జరిగిన ఉదంతాలు వీటికి పరాకాష్ఠ. వివిధ జిల్లాల్లో చెదురుమదురుగా చోటుచేసుకున్న ఘటనలు ఒక ఎత్తయితే నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరిగిన ఉదంతాల పరంపర మరో ఎత్తు. టీడీపీ రౌడీ మూకలు పోలింగ్‌ కేంద్రాల్లోకి జొరబడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఏజెంట్లపై దౌర్జన్యం సాగించి వెళ్లగొట్టడం, వోటేయడానికి క్యూలో నించున్న బలహీనవర్గాలవారినీ, మహిళలనూ కొట్టి వెనక్కిపంపడం వంటి ఉదంతాలపై ఫిర్యాదు చేసినా అరణ్యరోదనే అయింది. అసాంఘిక శక్తులు చొరబడి పోలింగ్‌ ప్రక్రియను దెబ్బతీయకుండా చూడటానికీ, అవసరమైనప్పుడల్లా కిందిస్థాయి అధికారులకు తగిన ఆదేశాలివ్వడానికీ, సమస్యాత్మక ప్రాంతాలకు బలగాలు తరలించటానికీ వీలుంటుందని ఏర్పాటుచేసిన వెబ్‌కాస్టింగ్‌ను ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. దాని నియంత్రణ టీడీపీ చేతుల్లోకి పోయింది. ఆ తర్వాత రెండురోజులూ పచ్చమూకలు తెగబడి రోడ్లపై స్వైరవిహారం చేశాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు వోటేశారనుకున్నవారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించాయి. ఈ మూకలకు భయపడి వందలమంది ఇళ్లూ వాకిళ్లూ వదిలి వేరేచోట తలదాచుకోవాల్సివచ్చింది. ఇదంతా చానెళ్లలో ప్రసారం అవుతున్నా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు బాధ్యతవహించాల్సిన అధికారులకుగానీ, శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సిన పోలీసు అధికారులకుగానీ చీమకుట్టినట్టయినా లేదు. ఎన్నికలకు రెండురోజుల ముందు త్రికూటమి సౌజన్యంతో విధుల్లో చేరిన ఉన్నతాధికారులు ఈ విధ్వంసకాండ సాగుతున్న సమయంలో మౌనదీక్షలో మునిగిపోయారు. పరువు బజార్నపడిందనుకున్నదో ఏమో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని నివేదిక తెప్పించుకుని ముగ్గురు ఎస్పీలనూ, ఒక కలెక్టర్‌నూ బదిలీచేసింది. మూడు జిల్లాల్లో 12 మంది పోలీస్‌ అధికారులను సస్పెండ్‌ చేసింది. సిట్‌ ఏర్పాటుచేసి దర్యాప్తు చేయించింది. ఇంత జరిగినా కారంపూడి సీఐగా ఉంటూ టీడీపీ విధ్వంసకాండకు కొమ్ముకాసిన నారాయణస్వామికి మాత్రం ఏం కాలేదు. ఐజీ త్రిపాఠి సరేసరి. వీరు కొత్త కొత్త కేసులు బనాయిస్తూ స్వామిభక్తిని చాటుకుంటున్నారు.త్రికూటమి ఆడించినట్టల్లా ఆడటానికి ఎన్నికల సంఘం రెడీ అయిపోయిందని ఉన్నతాధికారుల ఏకపక్ష బదిలీలు మొదలైనప్పుడే అందరికీ అర్థమైపోయింది. ఎవరిని ఎక్కడ నియమించాలో ఆదేశిస్తూ కూటమి ఇచ్చిన ఆదేశాలకు ‘జీ హుజూర్‌’ అంటూ కొత్త అధికారులను దించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా కొందరు అధికారులను నియమించటంతో మొదలైన కుట్రపై లోతుగా దర్యాప్తు చేస్తే తప్ప ఎన్నికల రోజునా, ఆ తర్వాతా కొనసాగిన హింస, విధ్వంసకాండ వెనక ఏయే శక్తులున్నాయో వెల్లడి కాదు. మన దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న పోలింగ్‌ ప్రక్రియను చూసి ముచ్చటపడి అనేక దేశాలు దాన్ని అనుసరించటం మొదలెట్టాయి. ఎప్పటికప్పుడు అభివృద్ధి అవుతున్న కొత్త సాంకేతికతలతో ఎన్నికల ప్రక్రియ మరింత మెరుగ్గా, సాఫీగా సాగేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్నది. మరి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు ఏమైంది? ఈ ఉదంతాల సమయంలో ఎందుకాయన మౌనంగా ఉండిపోయారు? కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునేవరకూ తన వంతుగా చేసిందేమిటి? ఎన్నికల రోజున మాచర్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 8 గ్రామాల్లో టీడీపీ రిగ్గింగ్‌ చేస్తున్న వైనం గురించి వరసగా రెండు లేఖలు రాసినా, అలాంటిచోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండు చేసినా మీనా ఎందుకు జవాబీయలేదు? ఈవీఎం పగలగొట్టినట్టు టీడీపీ ఒక వీడియో విడుదల చేసేవరకూ ఆ ఉదంతం తెలియనట్టే ఎందుకున్నారు? 23 గంటల నిడివికిపైగా ఉన్న ఆ వీడియోలో ముందూ వెనకా ఏం జరిగిందో అసలు ఎన్నికల సంఘం చూసిందా? చూస్తే ఎందుకు మౌనం వహించింది? అన్నిటికన్నా చిత్రమేమంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి అదే రోజు రీ పోలింగ్‌ కోసం డిమాండ్‌ చేయగా నాలుగైదు రోజుల తర్వాత ఆ వీడియో బయటపెట్టిన టీడీపీ ఇంతవరకూ రీపోలింగ్‌ కోరనేలేదు. వెబ్‌కాస్టింగ్‌ మొత్తం టీడీపీ ముఠా నియంత్రణలో ఉందన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం నోరు మెదపటం లేదు.ఇంత బరితెగింపుతో దేశంలో ఎక్కడా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు. తన బాధ్యతేమిటో, కర్తవ్యవేమిటో మరిచి తోకపట్టుకుని పోయే చందంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం ఇప్పటికైనా మౌనం వీడాలి. నర్సరావుపేట పరిధిలోనే కాదు... ఇతర నియోజకవర్గాల్లోనూ ఈవీఎంలు ధ్వంసం చేసిన ఉదంతాలు వెల్లడయ్యాయి. మంత్రి అంబటి రాంబాబు కొన్నిచోట్ల రీపోలింగ్‌ కోరారు. వీటన్నిటికీ జవాబు రావాలి. సంజాయిషీ ఇవ్వాల్సిన స్థానంలోవున్నవారు మూగనోము పడితే అనుమానాలు మరింత బలపడతాయి. కౌంటింగ్‌ ప్రక్రియ సక్రమంగా సాగుతుందా అన్న సందేహాలు తలెత్తుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఈ తలకిందుల వ్యవస్థను నిటారుగా నిలబెట్టాలి. ప్రజాస్వామ్యంపై ప్రజలకుండే విశ్వసనీయతను కాపాడాలి.

Surveillance on BRS leaders too in Phone Tapping Case
బీఆర్‌ఎస్‌ నేతలపైనా నిఘా!

సాక్షి, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన ఈ నిఘా కేవలం ప్రతిపక్ష నేతలకే పరిమితం కాలేదని, అధికార బీఆర్‌ఎస్‌కు చెందిన అసమ్మతి నేతలపైనా సాగినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు నేతృత్వంలో అనేక అక్రమాలు సాగాయని నేరాంగీకార వాంగ్మూలాల్లో పోలీసులు పేర్కొన్నారు. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ ఆపరేషన్‌ కోసం అవసరమైన నిఘా పరికరాలను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి కొనుగోలు చేయగా... కేరళకు చెందిన ఓ కీలక వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు ఏకంగా చార్టర్డ్‌ ఫ్లైట్‌లో అక్కడకు వెళ్లినట్లు బయటపడింది. పంజగుట్ట పోలీసులు గతంలో అరెస్టు చేసిన మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, డీఎస్పీ నాయిని భుజంగరావులకు సంబంధించిన నేరాంగీకార వాంగ్మూలాల్లో ఈ కీలకాంశాలను పొందుపరిచిన దర్యాప్తు అధికారులు.. వీటిని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఆపరేషన్‌ దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఆ పారీ్టకి బ్రేక్‌ వేయాలని నాటి సీఎం కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు. 2022 అక్టోబర్‌ చివరి వారంలో నాటి ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ద్వారా ఓ కీలక విషయం కేసీఆర్‌కు తెలిసింది. బీఆర్‌ఎస్‌ను వీడి తమ పార్టీలో చేరేలా బీజేపీకి చెందిన కొందరు వ్యక్తులు ఎర వేస్తున్నారంటూ రోహిత్‌రెడ్డి నాటి సీఎంకు చెప్పారు. అప్పటికే మునుగోడు ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీని ఇరుకున పెట్టాలని నిర్ణయించుకున్న కేసీఆర్‌ ఈ విషయాన్ని ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావులకు అప్పగించడంతోపాటు వారికి సహకరించాలని రోహిత్‌రెడ్డిని ఆదేశించారు. డీఎస్పీ ప్రణీత్‌రావు ద్వారా కొందరు ప్రైవేట్‌ వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టడం ద్వారా కీలక విషయాలు రాబట్టారు. ఈ ఆడియో క్లిప్స్‌ను కేసీఆర్‌కు అందించారు. వీటి ఆధారంగా మొయినాబాద్‌ సమీపంలోని అజీజ్‌ నగర్‌లో ఉన్న రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక ఆపరేషన్‌కు ప్లాన్‌ చేశారు. ఫలానా రోజున అక్కడికి రావాలని రోహిత్‌రెడ్డి ద్వారా నందుతోపాటు ఇద్దరు స్వామీజీలకు సందేశం పంపారు. అప్పట్లో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్సై శ్రీకాంత్‌లను రాధాకిషన్‌రావు ఢిల్లీకి పంపి ప్రత్యేక స్పై కెమెరాలు ఖరీదు చేయించారు. వీటిని శ్రీకాంత్‌తోపాటు మరో ఇద్దరు ఎస్సైలు మల్లికార్జున్, అశోక్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో బిగించారు. రోహిత్‌రెడ్డితోపాటు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను స్వయంగా కేసీఆర్‌ రంగంలోకి దింపారు. క్షేత్రస్థాయిలో సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. ఆపై ఏర్పాటైన సిట్‌ ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక నేత బీఎల్‌ సంతోష్‌ను అరెస్టు చేయించాలని తద్వారా బీజేపీని దారిలోకి తెచ్చుకుని తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై ఉన్న ఈడీ కేసు నీరుగారేలా చేయాలని భావించారు. కొందరు సైబరాబాద్‌ పోలీసుల అసమర్థత కారణంగా కేరళలోని మాతా అమృతానందమయి ఆశ్రమానికి చెందిన ఒక ముఖ్యమైన వ్యక్తి తప్పించుకున్నాడు. దీంతో ఆయన్ను పట్టుకోవడానికి ఎస్పీ రెమా రాజేశ్వరి, ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లుతో కూడిన బృందాన్ని ఏకంగా చార్టర్డ్‌ ఫ్లైట్‌లో అక్కడకు పంపించారు. ఈ ప్రయత్నమూ సఫలీకృతం కాకపోవడంతోపాటు ఆయా నిందితులను అరెస్టు చేయొద్దని, కేసును సీబీఐకి అప్పగించాలని న్యాయస్థానం నుంచి ఆదేశాలు రావడంతో అంతా అసంతృప్తి చెందారు. తాను అనుకున్నది జరగకపోవడంపై కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు ఇబ్బందికరంగా ఉన్న పరిణామాలను గుర్తించి... ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు మధ్య తరచూ వివిధ నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిగేవి. బీఆర్‌ఎస్‌తోపాటు దాని నాయకులకు ఇబ్బందికరంగా ఉన్న పరిణామాలను వీళ్లు గుర్తించే వాళ్లు. ఈ సమాచారాన్ని ప్రణీత్‌కు పంపి ఆయా వ్యక్తులపై నిఘా పెట్టమని ఆదేశించే వాళ్లు. ఇలా ఎస్‌ఐబీ నిఘా ఉంచిన వారిలో బీఆర్‌ఎస్‌కు చెందిన వాళ్లూ ఉండటం గమనార్హం. నాటి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యేతో విభేదించిన అప్పటి ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, అప్పట్లో కడియం శ్రీహరితో విభేదాలు ఉన్న మాజీ మంత్రి టి.రాజయ్య, తాండూరు ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్న పట్నం మహేందర్‌ రెడ్డి దంపతులతోపాటు మాజీ ఐపీఎస్‌ అధికారి, నాటి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్‌ మల్లన్న, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కుటుంబ సభ్యులు, రెండు మీడియా సంస్థల అధినేతలు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్, గద్వాలకు చెందిన సరిత తిరుపతయ్య, కోరుట్ల వాసి జువ్వాడి నర్సింగరావు, అచ్చంపేటకు చెందిన వంశీకృష్ణ, మానకొండూరుకు చెందిన కవ్వంపల్లి సత్యనారాయణ, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల ఫోన్లు ట్యాప్‌ చేశారు. వీరితోపాటు వివిధ నిర్మాణ సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు చెందిన యజమానులు, వ్యాపారవేత్తల ఫోన్ల పైనా అక్రమ నిఘా ఉంచారు. ఫోన్‌ కాల్స్‌కు దూరంగా ఉన్న వారిపై.. ఎస్‌ఐబీ నిఘా ఉంటుందన్న భయంతో అప్పట్లో అనేక మంది రాజకీయ నాయకులు, న్యాయాధికారులు, ప్రభుత్వ అధికారులు ఫోన్‌ కాల్స్‌కు దూరంగా ఉన్నారు. వీళ్లు ఎక్కువగా సిగ్నల్, స్నాప్‌చాట్‌ తదితర సోషల్‌ మీడియాను వినియోగిస్తూ ఎ¯న్‌క్రిపె్టడ్‌ విధానంలో మాట్లాడటం ప్రారంభించారు. దీన్ని గుర్తించిన ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు.. వారు ఎవరితో మాట్లాడారో గుర్తించడానికి వారి ఐపీడీఆర్‌లు (ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ డేటా రికార్డ్స్‌) సేకరించి, విశ్లేషించారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబర్‌–నవంబర్‌ల్లో ట్యాపింగ్‌ మరింత పెరిగింది. నాటి మంత్రి టి.హరీశ్‌రావు సిఫార్సుతో ఐన్యూస్‌ సంస్థ అధినేత శ్రావణ్‌ కుమార్‌ ప్రభాకర్‌రావుతో సన్నిహితంగా మెలిగారు. అనేక సందర్భాల్లో ఆయన వాట్సాప్‌ ద్వారా ప్రణీత్‌రావుతో టచ్‌లో ఉన్నారు. అలా కాంగ్రెస్, బీజేపీ నాయకులు, వారి మద్దతుదారుల వివరాలు సేకరించి అందించే వారు. ప్రత్యర్థి నాయకులను లక్ష్యంగా చేసుకుని వారి నగదును స్వా«దీనం చేసుకోవడానికి, టార్గెట్‌ చేసిన వ్యక్తులను ట్రోల్‌ చేయడానికి శ్రావణ్‌ పూర్తి సహాయ సహకారాలు అందించారు. తాను 2020లో పదవీ విరమణ చేసిన తర్వాత రెండుసార్లు టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్డీగా పెద్దాయన (కేసీఆర్‌) అవకాశం ఇచ్చారని, ఈ విశ్వాసంతో కొన్ని కేసులకు అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపెట్టనని రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో పేర్కొన్నారు.

transparency in Budget making over 10 years: FM Nirmala Sitharaman
సంస్కరణలు కొనసాగుతాయ్‌

న్యూఢిల్లీ: బడ్జెట్‌ అంటే ఏదో ఖర్చుల పద్దుగా పరిమితం కాకుండా అందరికీ ప్రయోజనాలను సమానంగా అందించేందుకు ఉపయోగపడే బ్లూప్రింట్‌గా గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం మార్చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. భారత్‌ను సంపన్న దేశంగా తీర్చిదిద్దే దిశగా సంస్కరణల అమలు ఇకపైనా వేగవంతంగా కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. బడ్జెట్‌ విధానాల్లో మోదీ ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేసిందని మంత్రి వివరించారు. ఇలాంటి పారదర్శక బడ్జెట్‌లు ఉండే దేశాల విషయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్‌ మొదలైనవి సానుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు. తద్వారా దేశానికి అంతర్జాతీయంగా విశ్వసనీయత పెరుగుతుందని నిర్మలా సీతారామన్‌ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ఎక్స్‌లో (గతంలో ట్విటర్‌) చెప్పారు. ట్యాక్స్‌పేయర్లు తమ కష్టార్జితం నుంచి కట్టే ప్రతి రూపాయిని సమర్ధవంతంగా ఉపయోగించేందుకు, ప్రజా ధనం విషయంలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement