అమెరికాలో టోర్నడోల బీభత్సం | Sakshi
Sakshi News home page

అమెరికాలో టోర్నడోల బీభత్సం

Published Tue, May 28 2024 5:37 AM

Tornadoes and storms leave 28 dead across 16 states

28 మంది మృతి

హూస్టన్‌: అమెరికాలో పలు ఓవైపు ఎండలు మండుతుంటే మరోవైపు టోర్నడోలు ప్రతాపం చూపుతున్నాయి. గాలుల తీవ్రతకు ఇళ్లు కూలడం, చెట్లు పడిపోవడం వంటి ఘటనల్లో 28 మందికి పైగా చనిపోయారు. వేలాదిగా ఇళ్లు నేల మట్టమయ్యాయి.

 టెక్సాస్, ఒక్లహామా, అర్కన్సాస్‌ సహా 16 రాష్ట్రాల్లో 6 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు టెక్సాస్, ఆస్టిన్, డాలస్, న్యూ మెక్సికో, ఒక్లహామా, అరిజోనా, కొలరాడో రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఇలినాయీ, మిస్సోరీ, కెంటకీ, టెన్నెస్సీల్లో తీవ్రమైన గాలి తుఫాన్లు వీస్తాయని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement