PM Narendra Modi: ‘ఇండియా’ కూటమి గెలిస్తే... హిందువులు రెండో తరగతి పౌరులే.. | Sakshi
Sakshi News home page

PM Narendra Modi: ‘ఇండియా’ కూటమి గెలిస్తే... హిందువులు రెండో తరగతి పౌరులే..

Published Mon, May 27 2024 4:06 AM

Lok Sabha Election 2024: SP-Congress can cross any limit to pursue vote bank politics says PM MODI

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తారు  

మొత్తం రిజర్వేషన్లు ముస్లింలకే కట్టబెడతారు  

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో మోదీ  

మీర్జాపూర్‌/దేవరియా: దేశంలో మతపరంగా మెజార్టీగా ఉన్న ప్రజలను(హిందువులు) రెండో తరగతి పౌరులుగా మార్చేందుకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోని పారీ్టలు కుట్ర పన్నుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఓటు బ్యాంక్‌కు మతపరంగా రిజర్వేషన్లు కట్టబెట్టడమే లక్ష్యంగా రాజ్యాంగాన్ని మార్చేందుకు పథకం రచిస్తున్నాయని ధ్వజమెత్తారు. 

ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్, ఘోసీ, దేవరియాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి మాట్లాడారు. ప్రతిపక్షాలు దేశంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయని మండిపడ్డారు. వేర్వేరు కులాలు పరస్పరం కొట్టుకొనేలా చేయడమే ఇండియా కూటమి ధ్యేయంగా మారిపోయిందన్నారు. కులాలను బలహీనపర్చి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. బహిరంగ సభల్లో మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే..  

రాజ్యాంగాన్ని మళ్లీ రాస్తారు.. 
‘‘ప్రతిపక్షాలు సాగిస్తున్న కుట్రల గురించి ప్రజలను హెచ్చరించడానికే ఈ రోజు పూర్వాంచల్‌కు వచ్చా. విపక్ష కూటమికి అధికారం కట్టబెడితే మొదట రాజ్యాంగాన్ని మార్చేస్తారు. మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలుగా రాజ్యాంగాన్ని మళ్లీ రాస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తారు. మొత్తం రిజర్వేషన్లు ముస్లింలకే కట్టబెడతారు. ముస్లింలను రాత్రికి రాత్రే ఓబీసీ కేటగిరీలో చేరుస్తారు. ఓబీసీ కేటగిరీ కింద వారికి రిజర్వేషన్లు కలి్పస్తారు. మెజార్టీ ప్రజలను రెండో తరగతి పౌరులుగా మార్చేయాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టలు భావిస్తున్నాయి. 

ఇంతకంటే అన్యాయం ఉంటుందా?  
2014 కంటే ముందు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రాత్రికి రాత్రే చట్టాన్ని మార్చేసింది. పలు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను మైనార్టీ విద్యాసంస్థలుగా గుర్తించింది. దాంతో ఆయా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు దక్కడం లేదు. అక్కడ కేవలం ముస్లింలకే ప్రవేశాలు లభిస్తున్నాయి. గిరిజనులు, దళితులు, వెనుకబడిన తరగతుల బిడ్డలకు ఇంతకంటే అన్యాయం ఇంకేదైనా ఉంటుందా?  

మాడోసారీ మాదే విజయం  
ఒక మంచి ఇల్లు కట్టించాలంటే 10 మంది తాపీ మేస్త్రీలను నియమించుకుంటారా? అలా ఎవరూ చేయరు. ఒక్కరికే అప్పగిస్తారు. విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు వస్తారట! ఏడాదికొకరు అధికారంలో ఉంటారట! ఇదెక్కడి చోద్యం. ఇలా జరగడం ఏక్కడైనా ఉందా? పదవి కాపాడుకోవడానికి ఆరాటపడే ప్రధానమంత్రి ఇక ప్రజలకేం చేస్తారు. దేశాన్ని బలోపేతం చేయగలరా? బలమైన దేశం కోసం బలమైన ప్రధాని కావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. మాకు రెండుసార్లు అధికారం అప్పగించారు. మూడోసారి కూడా మమ్మల్ని గెలిపించబోతున్నారు. ఓడిపోయేవారికి ఓటు వేసి ఓటు వృథా చేసుకోవద్దని ప్రజలు నిర్ణయానికొచ్చారు’’ అని మోదీ స్పష్టం చేశారు.  

ఛాయ్‌ కప్పులు కడుగుతూ...  
బాల్యంలో ఛాయ్‌ కప్పులు, ప్లేట్లు కడుగుతూ, కస్టమర్లకు ఛాయ్‌లు అందిస్తూ పెరిగానని ప్రధాని మోదీ అన్నారు. ఛాయ్‌కి, తనకు మధ్య లోతైన అనుబంధం ఉందని చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement