
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.పంచమి ప.3.09 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.9.43 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ప.1.32 నుండి 3.04 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.56 వరకు, తదుపరి, రా.10.49 నుండి 11.34 వరకు, అమృతఘడియలు: రా.10.44 నుండి 12.16 వరకు; రాహుకాలం : ప.3.00, నుండి 4.30 వరకు, యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం : 5.29, సూర్యాస్తమయం : 6.25.
మేషం: వ్యవహార విజయం. అరుదైన ఆహ్వానాలు. విందువినోదాలు. కాంట్రాక్టులు పొందుతారు. సోదరుల నుంచి శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు..
వృషభం: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. బంధువులతో అకారణ వైరం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యసమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి.
మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితుల నుంచి విమర్శలు. కాంట్రాక్టులు చేజారతాయి. పనులలో అవాంతరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు. కళాకారులకు సమస్యలు ఎదురుకావచ్చు.
కర్కాటకం: పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొత్త ఉద్యోగయోగం.
సింహం: కొత్త పనులు ప్రారంభిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహం. కళాకారులకు సత్కారాలు జరుగుతాయి.
కన్య: కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. ముఖ్యమైన పనులలో అవరోధాలు. ఆరోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులకు నిరాశ.
తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి.. బంధువులతో తగదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. దూరప్రయాణాలు.
వృశ్చికం: నూతన ఉద్యోగయోగం. ప్రముఖులతో పరిచయాలు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రగతి కనిపిస్తుంది. వాహనయోగం.
ధనుస్సు: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం. నిరుద్యోగుల యత్నాలు మందుకు సాగవు.
మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూవివాదాల పరిష్కారం. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. పాతమిత్రులను కలుసుకుంటారు. వస్తులాభాలు.
కుంభం: కుటుంబసభ్యులతో వైరం. పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు.బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చే స్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. అనుకోని ప్రయాణాలు.
మీనం: మిత్రులతో వివాదాలు పరిష్కారం. ఆస్తిలాభం. బ«ంధువుల నుంచి ఆహ్వానాలు. కళాకారులకు ఊహించని అవకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలపరిస్థితి. నూతన ఉద్యోగయోగం. ప్రముఖులతో పరిచయాలు.