
ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పదుకొనె, దిశా పటానీ ఇతర పాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ మూవీలో ఆయన వాడిన కారు పేరు బుజ్జి.
ఈ బుజ్జికి కీర్తీ సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ‘బుజ్జి అండ్ భైరవ’ యానిమేషన్ ప్రెల్యూడ్ వీడియోను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు వెల్లడించి, టీజర్‌ను విడుదల చేశారు. ‘‘ఓకే బుజ్జి.. వీళ్లకి సర్‌ప్రైజ్ చూపించేద్దామా?’ (ప్రభాస్), ‘ఓకే భైరవ..’ (వాయిస్ ఓవర్‌తో బుజ్జి) వంటి డైలాగ్స్ ఈ టీజర్‌లో ఉన్నాయి. అమేజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ వీడియో స్ట్రీమింగ్ కానుంది. ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలోని వివిధ పాత్రల పరిచయంతో ఈ వీడియో ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణన్