అతనితో రవితేజ హీరోయిన్‌ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు! | Sakshi
Sakshi News home page

Asin: ఆ హీరో వల్లే ఆసిన్‌ పెళ్లి.. ఇప్పుడేమో రూ.1300 కోట్ల వ్యాపారం!

Published Mon, May 27 2024 4:53 PM

Tollywood Actress Asin Marriage With Businessman Goes Viral

అమ్మా, నాన్న.. ఓ తమిళ అమ్మాయి చిత్రంతో రవితేజ సరసన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ భామ ఆసిన్. ఆ తర్వాత శివమణి, లక్ష్మీనరసింహా, షుర్షణ, అన్నవరం లాంటి చిత్రాల్లో స్టార్ హీరోలతో నటించింది. తమిళంతో పాటు హిందీలోనూ పలు సినిమాల్లో కనిపించింది. కోలీవుడ్‌లో కమల్‌ హాసన్‌ సరసన దశవతారం, సూర్యకు జంటగా గజిని లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. అయితే ఆసిన్ 2001లో మలయాళ చిత్రం నరేంద్రన్ మకాన్ జయకాంతన్ వకాతో సినిమాల్లో అడుగుపెట్టింది.

అయితే ఆసిన్ చివరిసారిగా 2015లో వచ్చిన అభిషేక్ బచ్చన్, రిషి కపూర్, సుప్రియా పాఠక్‌లతో కలిసి ఆల్ ఈజ్ వెల్ అనే కామెడీ చిత్రంలో కనిపించింది. అంతకుముందు బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ నటించిన గజిని, రెడీ, బోల్ బచ్చన్, హౌస్‌ఫుల్ -2 లాంటి హిట్ చిత్రాలలో నటించింది. కాగా.. అసిన్ 2016లో మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అక్టోబర్ 2017లో తమ అరిన్‌ జన్మించింది. అయితే రాహుల్ శర్మను పెళ్లాడిన తర్వాత ఆసిన్ సినిమాలకు పూర్తిగా దూరమైంది. అయితే తాజాగా ఆసిన్ భర్త రాహుల్ శర్మ గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. వ్యాపారరంగంలోకి అడుగుపెట్టిన ఆయన కెరీర్‌ సక్సెస్ వెనుక పెద్ద స్టోరీనే ఉంది. ఇప్పుడు అదేంటో తెలుసుకుందాం.

రాహుల్ శర్మ మహారాష్ట్రలోని రాష్ట్రసంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. అనంతరం కెనడా వెళ్లి సస్కట్చేవాన్ యూనివర్సిటీ నుంచి కామర్స్‌ బ్యాచిలర్ డిగ్రీ చేశాడు. చదువు పూర్తయిన వెంటనే రాహుల్ శర్మ తన తండ్రి వద్ద రూ. 3 లక్షలు అప్పుగా తీసుకుని వ్యాపారం ప్రారంభించారు. అప్పుడు కేవలం రూ. 3 లక్షల మొదలైన వ్యాపారం ఇప్పుడేమో ఏకంగా రూ. 1300 కోట్లకు చేరుకుంది.

రాహుల్ శర్మ మొదట మైక్రో మ్యాక్స్ సహ వ్యవస్థాపకుడి, సీఈఓగా ఉన్నాడు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి 2000 మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ స్థాపించారు. ఆ తరువాత 2008లో మొబైల్ రంగంలోకి ప్రవేశించారు. 2010 నాటికి హ్యూ జాక్‌మాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్లను అందించే సంస్థగా దేశంలోనే టాప్ లో నిలిచింది. 2017లో భారతదేశపు తొలి ఏఐ బేస్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రివోల్ట్ ఇంటెల్లి కార్ప్  కంపెనీకి వ్యవస్థాపకుడు కూడా రాహుల్ శర్మనే. కేవలం రూ.3 లక్షలతో వ్యాపార మొదలు పెట్టి.. వందల కోట్లకు చేరుకున్న రాహుల్ శర్మ నిజ జీవితంలో ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచారు. 

అక్షయ్‌ కుమార్ వల్లే పరిచయం..

ఆసిన్‌ను పెళ్లి చేసుకోవడానికి రాహుల్ శర్మకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సహకరించాడు. అక్షయ్ కుమార్, అసిన్ కలిసి నటించిన కామెడీ చిత్రం హౌస్‌ఫుల్ 2. అదే సమయంలో అక్షయ్ తన బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ శర్మకు ఆసిన్‌ను పరిచయం చేశాడు. అలా రాహుల్, అసిన్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆసిన్ ఫ్యామిలీ ఢిల్లీలో ఉన్నారు. వీరికి ఢిల్లీలో ఫామ్‌హౌస్ ఉంది. అతని వద్ద ఖరీదైన బెంట్లీ సూపర్‌స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్, బీఎండబ్య్లూ, మెర్సిడెజ్‌ బెంజ్‌, రోల్స్‌ రాయిస్ కార్లు ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement