వొడాఫోన్‌ ఐడియా యూజర్లకు శుభవార్త..అదనంగా | Sakshi
Sakshi News home page

వొడాఫోన్‌ ఐడియా యూజర్లకు శుభవార్త..అదనంగా

Published Mon, May 27 2024 7:05 PM

Vodafone Idea Launches Vi Guarantee For 4g, 5g Smartphone Users

ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (వీఐ) తన కస్టమర్లను ఆకట్టుకునే ప‍్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా సంస్థ వీఐ నెట్‌ వర్క్‌ సబ్‌ స్క్రైబర్లు 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం అదనపు డేటాను అందిస్తోంది.

ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ‘వీఐ గ్యారెంటీ ప్రోగ్రామ్’ను ప్రకటించింది. 5జీ, 4జీ ఫోన్ వినియోగదారులందరికీ 130 జీబీ డేటాను అందిస్తుంది. ఈ ప్యాక్‌ను ఎంచుకున్న యూజర్లకు మరో ఏడాది పాటు ఈ డేటాను పొందవచ్చని వీఐ పేర్కొంది. 13 వరుస సైకిళ్లకు ప్రతి 28వ రోజు ఆటోమేటిక్‌గా 10జీబీ జమ అవుతుందని  కంపెనీ ఒక విడుదలలో తెలిపింది.

ఈ సందర్భంగా వీఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవనీష్ ఖోస్లా మాట్లాడుతూ..దేశంలో చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తగినంత డేటా లేకపోవడం వల్ల వారి 4జీ/5జీ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం సామర్థ్యాన్ని పెంచుకోవడం లేదని చెప్పారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement