అలాంటి పాత్రలంటే ఇష్టం: ఐశ్వర్యా మీనన్‌ | Sakshi
Sakshi News home page

అలాంటి పాత్రలంటే ఇష్టం: ఐశ్వర్యా మీనన్‌

Published Tue, May 28 2024 12:01 AM

Iswarya Menon about Bhaje Vaayu Vegam

‘‘భజే వాయు వేగం’ సినిమాలో యాక్షన్, ఎమోషన్‌తో పాటు లవ్, రొమాన్స్ కూడా ఉంటాయి. ఇదొక రా కంటెంట్‌ మూవీ. ఇందులో ఇందు అనే ట్రెడిషనల్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తా. నాకు ఇలాంటి పాత్రలు చేయడం ఇష్టం. ఎందుకంటే నిజ జీవితంలోనూ నేను సంప్రదాయకమైన దుస్తులు ధరించేందుకు ఇష్టపడతాను’’ అని హీరోయిన్‌ ఐశ్వర్యా మీనన్‌ అన్నారు. కార్తికేయ గుమ్మకొండ హీరోగా ప్రశాంత్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘భజే వాయు వేగం’.

యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌ బ్యానర్‌ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 31న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఐశ్వర్యా మీనన్‌ మాట్లాడుతూ–‘‘స్పై’ సినిమాకి ముందే ‘భజే వాయు వేగం’ ఒప్పుకున్నాను. అయితే ‘స్పై’ ముందుగా వచ్చింది. అయినప్పటికీ నన్ను తెలుగుకి పరిచయం చేసింది దర్శకుడు ప్రశాంత్‌ రెడ్డి అనుకోవాలి. ‘భజే వాయు వేగం’లో ఇందు అనే బ్యూటీషియన్‌ పాత్ర చేశాను. కార్తికేయతో నటించడం హ్యాపీగా ఉంది. యూవీ క్రియేషన్స్ లాంటి పేరున్న సంస్థలో సినిమా చేయడం గర్వంగా ఉంది.

రథన్‌ చక్కని మ్యూజిక్‌ ఇచ్చాడు. నా ప్రతి సినిమా సూపర్‌ హిట్‌ కావాలని కోరుకుంటా. కానీ ఫలితం ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. ‘హైవే’ సినిమాలో ఆలియా భట్‌గారిలా నటనకు ఆస్కారం ఉండే పాత్ర చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా ఒప్పుకున్నా.. అలాగే మరో రెండు చర్చల్లో ఉన్నాయి. తమిళంలో కూడా ఓ సినిమా చేస్తున్నా’’ అన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement