తండ్రికి సహాయంగా వచ్చి.. | Sakshi
Sakshi News home page

తండ్రికి సహాయంగా వచ్చి..

Published Mon, May 27 2024 10:05 PM

-

తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన దండు లక్ష్మణ్‌ (12) తన తండ్రి వెంకటయ్యతో పాటు మేకలను మేపడానికి వ్యవసాయ పొలానికి వెళ్లాడు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో సమీపంలో ఉన్న చెట్టు కిందకు వెళ్లాలని తండ్రి సూచించాడు. లక్ష్మణ్‌ చెట్టు కిందకు వెళ్లిన కొద్దిసేపటికే పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. తన కళ్లెదుటే కొడుకు చనిపోవడంతో తండ్రితో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోధించారు. మృతుడు స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.

పిడుగుపాటుతో మరో ఇద్దరు..

పిడుగుపాటుతో రైతుతోపాటు ఓ బాలుడు మృతిచెందాడు. తిమ్మాజిపేట మండలం మారేపల్లికి చెందిన రైతు వెంకటయ్య(52) తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా.. పిడుగుపాటుకు గురయ్యాడు. గమనించిన స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతిచెందాడు. అతడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement