సికందర్‌కు విలన్ గా | Sakshi
Sakshi News home page

సికందర్‌కు విలన్ గా...

Published Tue, May 28 2024 12:02 AM

Sathyaraj to play villain in Salman Khan Sikandar

సల్మాన్ ఖాన్ కు విలన్ గా నటుడు సత్యరాజ్‌ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. సల్మాన్ ఖాన్  హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ‘సికందర్‌’ అనే ఓ యాక్షన్  థ్రిల్లర్‌ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించనున్నారు. జూన్  నుంచి ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ జరిగేలా యూనిట్‌ సన్నాహాలు చేస్తోందని బాలీవుడ్‌ సమాచారం. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ విలన్  రోల్‌కు సత్యరాజ్‌ను తీసుకున్నారట మురుగదాస్‌.

ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని బాలీవుడ్‌ టాక్‌. సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మించనున్న ‘సికందర్‌’ వచ్చే ఏడాది రంజాన్‌కి విడుదల కానుంది. ఇదిలా ఉంటే రజనీకాంత్‌ కూలీ మూవీలో అతడి స్నేహితుడి పాత్రలో సత్యరాజ్‌ నటించనున్నారని కోలీవుడ్‌ టాక్‌. 1986లో వచ్చిన ‘మిస్టర్‌ భరత్‌’ సినిమాలో రజనీకాంత్, సత్యరాజ్‌ చివరిసారి స్క్రీన్  షేర్‌ చేసుకున్నారు. మళ్లీ 38 సంవత్సరాల తర్వాత ‘కూలీ’ సినిమా కోసం స్క్రీన్  షేర్‌ చేసుకుంటారా? వేచి చూడాలి.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement