జోగుళాంబ సన్నిధిలో వనపర్తి కలెక్టర్‌ | Sakshi
Sakshi News home page

జోగుళాంబ సన్నిధిలో వనపర్తి కలెక్టర్‌

Published Mon, May 27 2024 11:15 PM

జోగుళ

అలంపూర్‌ రూరల్‌: శక్తిపీఠమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను ఆదివారం వనపర్తి కలెక్టర్‌ తేజస్‌నంద్‌లాల్‌ పవార్‌ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఈఓ పురేందర్‌కుమార్‌ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబదేవి ఆలయాల్లో వారు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాల ను అందజేయడంతోపాటు శేషవస్త్రాలతో సత్కరించారు. అదేవిధంగా, టీవీ యాక్టర్‌, కమెడియన్‌ ఫణి సైతం ఆలయాన్ని దర్శించుకున్నారు.

బీజేపీపై

తిరుగుబాటు తప్పదు

అమరచింత: ఐకమత్యంతో ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజల మధ్య మత ఘర్షణలు సృష్టిస్తూ బీజేపీ రాజకీయం చేస్తోందని సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు హన్మేష్‌ ఆరోపించారు. మండల కేంద్రంలోని మార్క్స్‌ భవనంలో మాస్‌లైన్‌ ఉమ్మడి జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు సమావేశం ఆదివారం జరగగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 200 ఏళ్లు పాలించిన బ్రిటిష్‌ ప్రభుత్వం, మోఘలాయిలు, తురుష్కులు, నవాబుల కన్నా పదేళ్ల బీజేపీ పాలన మరింత దారుణంగా ఉందన్నారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలే ముఖ్యమంటూనే పేదలకు సంక్షేమ ఫలాలను దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరాచకాలు ఎక్కువయ్యాయని.. వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీహెచ్‌ రాంచందర్‌, సూర్యం, అరుణ్‌కుమార్‌, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

కల్వకుర్తి టౌన్‌: నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లోని ఎస్సీ గురుకులాల ఈస్ట్‌ రీజియన్‌లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా ఆర్‌సీఓ వనజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఎల్‌టీ, సీజీటీ కోర్సులలో సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు www. tswreis.ac.in వెబ్‌సైట్‌ ద్వారా రూ. 100 ఫీజు చెల్లించి, ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సమీపంలోని ఎస్సీ గురుకుల కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.

జోగుళాంబ సన్నిధిలో వనపర్తి కలెక్టర్‌
1/1

జోగుళాంబ సన్నిధిలో వనపర్తి కలెక్టర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement