పెళ్లయి మూడు నెలలు కాలేదు.. వెడ్డింగ్‌ పిక్స్‌ డిలీట్‌ చేసిన నటి | Sakshi
Sakshi News home page

'అర్థం చేసుకునే భర్త దొరికాడు'.. అంతలోనే పెళ్లి ఫోటోలు డిలీట్‌ చేసిన నటి

Published Mon, May 27 2024 7:39 PM

Divya Agarwal Deletes Wedding Pics With Apurva Padgaonkar Sparks Divorce Rumours

ప్రేమ ఎప్పుడు పుడుతుందో చెప్పలేమంటారు. అలాగే బ్రేకప్‌, విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎందుకు వస్తున్నాయో ఎవరూ ఊహించలేకపోతున్నారు. హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ విన్నర్‌, నటి దివ్య అగర్వాల్‌ మనసు రెండేళ్లక్రితమే ముక్కలైంది. ప్రియుడు వరుణ్‌ సూద్‌తో నడిపిన నాలుగేళ్ల ప్రేమాయణానికి ఫుల్‌స్టాప్‌ పెట్టింది. తాను కోరుకున్న విధంగా, సొంతంగా జీవించాలనుకుంటున్నా అని 2022 మార్చి 6న బ్రేకప్‌ వార్తను బయటపెట్టింది.

పెళ్లయి మూడు నెలలు కాలేదు
తర్వాత వ్యాపారవేత్త అపూర్వ పడ్గాంకర్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరికీ 2022లో నిశ్చితార్థం జరగ్గా ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఓ షోలో కూడా తనను అర్థం చేసుకునే భర్త దొరికాడంటూ పొంగిపోయింది నటి. కానీ అంతలోనే సడన్‌ షాకిచ్చింది. పెళ్లయిన మూడు నెలలకే తన వివాహ ఫోటోలన్నింటినీ సోషల్‌ మీడియాలో నుంచి తీసేసింది. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

నమ్మలేకపోతున్నాం..
మొన్నే పెళ్లయింది? అంతలోనే ఏంటీ ఘోరం? అని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం మొన్నే కదా కలిసి నవ్వుతూ ఫోటోలకు పోజిచ్చారు.. ఇంతలోనే ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాం.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌ అయితే కాదు కదా.. అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: అతిలోక సుందరితో ముగ్గురు హీరోయిన్లు.. ఎవరో గుర్తుపట్టారా?

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement