అతిలోక సుందరితో ముగ్గురు హీరోయిన్లు.. ఎవరో గుర్తుపట్టారా? | Guess This Actor, Do You Know These South Star Heroine Sisters Their Childhood Pic Trending On Social Media | Sakshi
Sakshi News home page

Guess This Actor: ఫోటోలోని ముగ్గురు అక్కాచెల్లెళ్లు తెలుగులో టాప్‌ హీరోయిన్లు.. చిరంజీవితోనూ యాక్ట్‌..

Published Mon, May 27 2024 6:19 PM

Guess This Actor: South Star Heroine Sisters Childhood Pic

పై ఫోటోలో శ్రీదేవితోపాటు కలిసి కూర్చున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు సౌత్‌ ఇండస్ట్రీలో చాలా పాపులర్‌ హీరోయిన్లు. తెలుగులో స్టార్‌ హీరోల సరసన నటించారు. మెగాస్టార్‌ చిరంజీవితో ఈ ముగ్గురూ యాక్ట్‌ చేశారు. ఇంతకీ ఈ కథానాయికలెవరో గుర్తుపట్టారా?

తెలుగులో ఆ చిత్రంతో ఎంట్రీ
ఫోటోలో అతిలోక సుందరి శ్రీదేవి పక్కన కూర్చుని క్యూట్‌గా కనిపిస్తున్న ఈ ముగ్గురు నగ్మా, జ్యోతిక, రోషిణి. నగ్మా విషయానికి వస్తే సల్మాన్‌ ఖాన్‌ భాగి: ఎ రెబల్‌ ఫర్‌ లవ్‌ అనే సినిమాతో తన కెరీర్‌ మొదలైంది. పెద్దింటి అల్లుడు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఘరానా మొగుడు, మేజర్‌ చంద్రకాంత్‌, కొండపల్లి రాజా, అల్లరి అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, రిక్షావోడు, అల్లరి రాముడు.. ఇలా అనేక చిత్రాల్లో యాక్ట్‌ చేసింది.

అక్కడ ఫుల్‌ బిజీ
జ్యోతిక.. డోలి సజా కే రఖ్‌ణా అనే హిందీ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బిజీ అయింది మాత్రం తమిళ ఇండస్ట్రీలోనే! ఠాగోర్‌, మాస్‌, చంద్రముఖి, షాక్‌ చిత్రాలతో తెలుగువారికీ దగ్గరైంది. హీరో సూర్యను పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోంది.

తెలుగులో ఫేమస్‌
రోషిణి.. తన ఇద్దరు అక్కల్లా ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా రాణించలేకపోయింది. శిష్య అనే తమిళ చిత్రంతో కథానాయికగా పరిచయమైన ఈ మూవీ మాస్టర్‌, పవిత్ర ప్రేమ, శుభలేఖలు సినిమాతో తెలుగులో ఫేమస్‌ అయింది. రెండేళ్లు మాత్రమే సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్న ఆమె తర్వాత చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పింది.

పేరెంట్స్‌..
కాగా ఈ హీరోయిన్ల తల్లి సీమా 1969లో అరవింద్‌ మొరార్జీని పెళ్లాడింది. వీరికి పుట్టిన కూతురే నగ్మా. మనస్పర్థల వల్ల ఈ దంపతులు 1974లో విడాకులు తీసుకున్నారు. తర్వాతి ఏడాది నిర్మాత చందర్‌ను పెళ్లాడింది. వీరికి ఒక బాబుతో పాటు జ్యోతిక, రోషిణి సంతానం.

చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!

Advertisement
 
Advertisement
 
Advertisement