
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ప్రస్తుత సాంకేతిక జీవనంలో మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక చింతన మనిషికి ఎంతో అవసరమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రం 9వ వార్డు పరిధిలోని పాలకొండలో నూతనంగా నిర్మించిన చౌడేశ్వరిమాత ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌడేశ్వరిమాత ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఆలయ అభివృద్ధికి అన్నివిధాలా తోడ్పాటు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్‌యాదవ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, శివుడు, ఆంజనేయులు, శ్రీను, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.