జాతీయ బాస్కెట్‌బాల్ పోటీలకు చైత్ర
మహబూబ్‌నగర్ క్రీడలు: రాజస్తాన్ రాష్ట్రం బార్మర్‌లో శుక్రవారం నుంచి జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 జాతీయ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో జిల్లాకేంద్రానికి చెందిన గంజి చైత్ర పాల్గొననుంది. తెలంగాణ రాష్ట్ర బాలికల జట్టు తరపున టోర్నీలో ప్రాతినిధ్యం వహిస్తుంది. చైత్ర స్థానిక మాడ్రన్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది.
సామాజిక మాధ్యమాల్లో పరిమళిస్తున్న ‘మొగ్గలు’
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: సామాజిక మాధ్యమాల్లో నిత్యం ‘మొగ్గలు’ పరిమళిస్తున్నాయని జిల్లా కవి డా.భీంపల్లి శ్రీకాంత్ అన్నారు. ఏపీలోని గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఆదివారం ఆయన ‘మొగ్గలు’ కవితా ప్రక్రియపై మాట్లాడారు. ఇప్పటికీ 45 పుస్తకాలు ఈ ప్రక్రియలోనే పుస్తకాలు వెలువడ్డాయన్నారు. పలు జాతీయ సదస్సుల్లోనూ పత్రసమర్పణలు చేశారన్నారు. అనంతరం ఆయనను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు, సభాధ్యక్షుడు వెంకట రాణాప్రతాప్, కవులు పంతుల వెంకటేశ్వరరావు, వడిచర్ల సత్యం, గోస్కుల రమేష్, తాండ్ర చిరంజీవి, యనగందుల దేవయ్య, కోటగిరి వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.9,220
కల్వకుర్తి రూరల్: వేరుశనగ దిగుబడులు మొదలయ్యాయి. ఈ క్రమంలో కల్వకుర్తిలో ఆదివారం అత్యధికంగా క్వింటాల్ రూ.9,220 ధర లభించింది. మార్కెట్‌కు 42 మంది రైతులు 1,488 బస్తాలలో వేరుశనగ విక్రయానికి తెచ్చారు. వ్యాపారులు గరిష్టంగా రూ.9,220, కనిష్టంగా రూ.5,510, సరాసరిగా రూ.8,620 టెండర్లు వేశారు. మార్కెట్‌లో పంట తీసుకొచ్చిన రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కార్యదర్వి శివరాజు తెలిపారు.
జాతీయ బాస్కెట్‌బాల్ పోటీలకు చైత్ర


