బీజేపీ: సత్తా చాటేలా..
పురపాలికల్లో అత్యధిక స్థానాలను కై వసం చేసుకునేలా బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ మేరకు ఇప్పటికే మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయా డివిజన్ల వారీగా పార్టీ పరిస్థితి, గెలుపు గుర్రాలపై కీలక నేతలతో చర్చించారు. గెలవడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని.. పార్టీ అభ్యున్నతే లక్ష్యంగా ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. 2024 ఎంపీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ఆధారంగా డివిజన్ల వారీగా నేతలు సమన్వయం చేసుకుంటూ ఓటర్లను ఆకర్షించాలని పిలుపునిచ్చారు. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ కు దీటుగా అభ్యర్థులను రంగంలోకి దించేలా క్షేత్రస్థాయిలో గెలుపు గుర్రాలను జల్లెడ పట్టే బాధ్యతలను పలువురికి అప్పగించినట్లు సమాచారం.
బీజేపీ: సత్తా చాటేలా..


