సైబర్ నేరాల్లో రీఫండ్‌లో ప్రతిభ చాటిన కానిస్టేబుల్స్
● రాష్ట్రంలో టాప్–5లో ముగ్గురు మన జిల్లా సిబ్బందే
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాల నిర్వహణలో ప్రతిభ చూపిన జిల్లాకు చెందిన ముగ్గురు సైబర్ వారియర్స్(కానిస్టేబుల్స్)కు ప్రశంసలు దక్కాయి. వారికి సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కార్యాలయంలో డీజీపీ శివధర్‌రెడ్డి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌చార్జి శికా గోయల్ ప్రశంస పత్రాలతో పాటు నగదు రివార్డులు అందించారు. రాష్ట్రంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి సైబర్ నేరాల్లో బాధితులకు ఇచ్చే రీఫండ్ సాధనలో రాష్ట్రంలో టాప్–5లో జిల్లాకు చెందిన ముగ్గురు మహబూబ్‌నగర్ రూరల్ కానిస్టేబుల్స్ మధుగౌడ్, మహబూబ్‌నగర్ వన్‌టౌన్ వికాస్‌రెడ్డి, దేవరకద్ర పోలీస్‌స్టేషన్ నుంచి శ్రీనివాసులు ఎంపిక అయ్యారు. వీరికి ఒక్కొక్కరికి రూ.25వేల నగదు రివార్డు అందించారు. ముగ్గురు కానిస్టేబుల్స్‌ను ఎస్పీ డి.జానకి ప్రత్యేకంగా అభినందిచారు.


