నటరాజ్‌కు సావిత్రిబాయి జీవిత సాఫల్య పురస్కారం
పాలమూరు: మానవ శరీర అవయవాలు అధికంగా సేకరించినందుకు గాను ఇండియన్ రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్‌కు అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సావిత్రి బాయిపూలే జీవిత సాఫల్య పురస్కారం అందించారు. 312 సార్లు రక్తదానం, 33 ఏళ్లుగా రెడ్‌క్రాస్ ద్వారా సేవా కార్యక్రమాలు, కరోనా సమయంలో 48 మందికి అంత్యక్రియల నిర్వహణ, రెడ్‌క్రాస్ విద్యానిధి కింద ఏడుగురు పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.7 లక్షలు వెచ్చించి ఫీజులు, పుస్తకాలు, వసతి సౌకర్యం కల్పించారు.


