మాచర్లను రావణకాష్టంలా మార్చేందుకు టీడీపీ కుట్ర | Sakshi
Sakshi News home page

మాచర్లను రావణకాష్టంలా మార్చేందుకు టీడీపీ కుట్ర

Published Sat, May 25 2024 6:10 AM

Punuru Gowtham Reddy Comments On TDP

అందుకు ఈసీలోని కొంతమంది సహకారం  

చంద్రబాబు, పవన్‌లకు మరో 10 రోజులే కలలుగనే అవకాశం   

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ సీఎం జగన్‌కు బాసట  

వైఎస్సార్‌సీపీ కార్మిక విభాగం అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి

సాక్షి, అమరావతి: పల్నాడు ప్రాంతంలో మాచర్లలో గొడవలకు తెరలేపి ఆ ప్రాంతాన్ని రావణకాష్టంలా మార్చేందుకు టీడీపీ కుట్రలు పన్ని విజయం సాధించిందని, దీనికి ఎన్నికల సంఘంలోని కొంత మంది సహకరిస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు, ఆందోళనలు కలిగేలా చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్మిక విభాగం(వైఎస్సార్‌టీయూసీ) అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి చెప్పారు. అందుకే ఎన్నికల కమిషన్‌లో దొంగలు పడ్డారని అనాల్సి వస్తోందని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు, పవన్‌లకు మరో పది రోజులే కలలు కనే అవకాశం ఉందన్నారు. పెత్తందారులకు అధికారం వస్తే ప్రమాదమని గ్రహించే ఓటింగ్‌ శాతం పెరిగిందని, మహిళలు ఏకంగా 89 శాతం మంది పాల్గొనడం సీఎం జగన్‌ విజయానికి తొలి సంకేతమని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని, ఎక్కడా చీలిక లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ సీఎం జగన్‌కి బాసటగా నిలిచాయని తెలిపారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై గతంలో చినకాకాని సమీపంలో టీడీపీ గూండాలు దాడిచేస్తే తృటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, ఆయన వాహనాలు ధ్వంసమైన విషయాన్ని గుర్తు చేశారు.

విజయవాడకు చెందిన బొండా ఉమా మాచర్ల వెళ్లి పిన్నెల్లి మీద కర్రలు, రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించిన విషయాన్నీ ప్రస్తావించారు. తాజాగా పిన్నెల్లికి సంబంధించిన వీడియో అంటూ ఆయనను టార్గెట్‌ చేస్తూ టీడీపీ నేత లోకేశ్‌ తన ఎక్స్‌లో పోస్టు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ వరుస ఘటనలు చూస్తే నూటికి నూరు శాతం దుర్బుద్ధితో, కుట్ర పూరితంగా పిన్నెల్లిని టీడీపీ టార్గెట్‌ చేస్తోందని చెప్పారు. ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయిగేట్‌ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటించకుండా.. అదెలా బయటకొచ్చిందో విచారణ చేస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 

లోకేశ్‌పై చర్యలేవి?  
సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే.. అమాయక ఓటర్లపై టీ­డీపీ గూండాలు దాడి చేస్తున్నట్లు స్పష్టంగా తె­లు­స్తోందని, అయితే వారి మీద ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశి్నంచారు. ఘటనకు సంబంధించి ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేశామని చెబుతున్న ఈసీ.. ఈ వీడియోను సంపాదించుకుని ఎక్స్‌లో పోస్టు చేసిన లోకేశ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశి్నంచారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement