స్వాతి మలివాల్‌ ‘ఆప్‌’ను వీడతారా..? | Sakshi
Sakshi News home page

స్వాతి మలివాల్‌ ‘ఆప్‌’ను వీడతారా..?

Published Mon, May 27 2024 3:11 PM

MP Swati Maliwal Clarified On Leaving AAP

న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌)కి రాజీనామా చేసే విషయమై ఆ పార్టీ ఎంపీ స్వాతిమలివాల్‌ స్పందించారు. తాను ఆప్‌ను వీడటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలివాల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

మే13న సీఎం కేజ్రీవాల్‌ ఇంట్లో ఆయన అనుచరుడు బిభవ్‌కుమార్‌ చేతిలో మలివాల్‌ దాడికి గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెను బీజేపీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానించారని, ఆమె త్వరలో పార్టీ మారనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అయితే  ఈ ప్రచారాన్ని ఆమె తాజాగా ఖండించారు. బీజేపీ నేతలు తనతో టచ్‌లోకి రాలేదని చెప్పారు.

తాను ఆప్‌లోనే కొనసాగుతానని, ఆ పార్టీ ఏ ఒకరిదో ఇద్దరిదో కాదన్నారు. పార్టీ కోసం తన చెమట, రక్తాన్ని ధారపోశానన్నారు. నిజానికి తనపై దాడి తర్వాత లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా మాత్రమే తనతో మాట్లాడారని, ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తని మలివాల్‌ చెప్పుకొచ్చారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement