కేన్స్‌ రెడ్‌కార్పెట్‌పై సంప్రదాయ చీరలో మెరిసిన ప్రీతి జింటా! | Actor Preity Zinta In Pink Graces Cannes 2024 Red Carpet In A Gorgeous Saree, Photo Goes Viral | Sakshi
Sakshi News home page

Cannes 2024 Red Carpet: కేన్స్‌ రెడ్‌కార్పెట్‌పై సంప్రదాయ చీరలో మెరిసిన ప్రీతి జింటా!

Published Mon, May 27 2024 5:00 PM

 Actor Preity In Pink Graces Cannes 2024 Red Carpet In A Saree

ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకలో వివిధ రకాల సెలబ్రిటీలు, ప్రముఖులు విభిన్నమైన డిజైనర్‌వేర్‌ దుస్తులతో సందడి చేశారు. కానీ అస్సాం నటి, వ్యాపారవేత్త భారతీయ సంప్రదాయ చీరలో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. వీరి సరసన బాలీవుడ్‌ నటి, ఐపీఎల్‌ పంజాబ్‌ కింగ్స్‌ జట్టు ఓనర్‌ ప్రీతీ జింటా కూడా చేరింది ఆమె కూడా దేశీ ష్యాషన్‌ రూట్‌నే సెలక్ట్‌ చేసుకుంది. చాలా విరామం తర్వాత ఈ 77 ఫ్రాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ రెడ్‌ కార్పెట్‌పై మెరిసింది. 

ఆమె ఈ చీరలుక్‌లో లేత గులాబీలా అందంగా కనిపించింది. డిజైనర్‌ సీమా గుజ్రాల్‌ చేతిలో రూపుదిద్దుకున్న ఓండ్రే పింక్‌ సీక్విన్‌ జార్జెట్‌ చీరలో అద్భుతంగా కనిపించింప్రీతి. ఈ చీరపై చక్కటి ముత్యాలు, సీక్విన్‌, బీడ్‌వర్క్‌ ఉన్నాయి. ఇది ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌తో జత చేయబడింది. ఈ చీర ధర ఏకంగా రూ. 118,000/. ఈ వేడుకలో ప్రీతి జంటా తన అభిమానులకు ఆటోగ్రాఫ్‌ కూడా ఇచ్చింది. ఈ స్టైలిష్‌ మిలీనియల్‌ చీరకు తగ్గట్టుగా స్లీవ్‌లెస్‌ వి నెక్‌ బ్లౌజ్‌ మంచి లుక్‌ తెచ్చిపెట్టింది ఆమెకు. వాటన్నింటకీ అనుగుణంగా కర్లీ హెయిర్‌ని వదులుగా ఉంచడం ఓ డిఫెరెంట్‌ లుక్‌ తెప్పించింది ప్రీతికి.

 అంతేగాదు ఆమె ఈ కేన్స్‌లో ఇంతలా సింప్లిసిటీగా రెడీ అయ్యి రావడం అందర్నీ ఆశ్యర్యానికి గురిచేసినా..ఆమె స్టన్నింగ్‌ లుక్‌ అందర్నీ చూపుతిప్పుకోనివ్వ లేదు. ఇద వేడుకలో మరో డిజైన డ్రెస్‌లో కూడా కనిపించింది.  ఈ ఈవెంట్‌లో తొలి ప్రదర్శనలో పెళ్లి కూతురు మాదిరి నైరా బ్రైడల్ గౌనులో మెరిసింది. దీని ధర ఏకంగా రూ. 5,57,600/-. ఇక ప్రీతీ కేన్స్‌ వేడుకలో మాట్లాడుతూ..ఇది అద్భుతమైనది. ఈ కేన్స్‌ వేడుకలతో తనకు విడదీయలేని సంబంధం ఉందన్నారు. తాను మళ్లీ మూవీస్‌‌లోకి రీ ఇంట్రీ ఇచ్చానని, ఇది తనకు సినీ జీవితంలో సెకండ్‌ లైఫ్‌ అని అన్నారు. 

అందువల్లే తాను సంతోష్‌తో కలిసి లాహోర్‌ 1947లో నటించానని చెప్పుకొచ్చారు. ఈ అద్భుతమైన ప్రతిష్టాత్మకమైన అవార్డను రాజ్‌కుమార్‌ సంతోష్‌కి అందించే అవకాశం తరకు లభించడంతో ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ అవార్డు పొందిన తొలి భారతీయుడు కాదు, తొలి ఆసియా వ్యక్తి కాబట్టి నేను చాలా గొప్పగా భావిస్తున్నానని అన్నారు ప్రీతి. కాగా, బాలువుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ సరసన ప్రీతి జింటా నటించిన తొలి చిత్రం దిల్‌ సే(1998) మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు రాజ్‌కుమార్‌ సంతోష్‌. ప్రేక్షకుల ముందుకు రానున్న పీరియాడికల్‌ డ్రామా లాహోర్‌ 1947 కోసం రాజ్‌కుమార్‌ సంతోషితో మరోసారి కలిసి పనిచేశారు.

(చదవండి: ‘మిట్టీకూల్’: మట్టితో ఫ్రిడ్జ్‌‌!..కరెంట్‌తో పనిలేదు..!)
 

Advertisement
 
Advertisement
 
Advertisement