గ్యాంగ్‌స్టర్‌తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్‌ | Sakshi
Sakshi News home page

గ్యాంగ్‌స్టర్‌తో పార్టీ చేసుకున్న బాలీవుడ్‌ బ్యూటీ? కంగనా ఆన్సరిదే!

Published Mon, May 27 2024 5:00 PM

Kangana Ranaut Response on Rumors That She Partied with Gangster Abu Salem

సినిమాలు, రాజకీయాలు.. అనే రెండు పడవల మీద ప్రయాణం చేయనని చెప్పేసింది బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌. తాను ఎంపీగా గెలిస్తే సినిమాలు మానేస్తానని ప్రకటించింది. పూర్తిగా ప్రజా సేవకే పరిమితమవుతానంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ బ్యూటీ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో ఉంటుంది. తాజాగా కంగనా గురించి ఓ వార్త వైరల్‌గా మారింది. 

గ్యాంగ్‌స్టర్‌తో పార్టీ?
ఆమె ఓ వ్యక్తితో దిగిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అతడు గ్యాంగ్‌స్టర్‌ అబు సలీమ్‌ అని.. అతడితో పార్టీ చేసుకుందని ప్రచారం చేస్తున్నారు. దీనిపై కంగనా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించింది. గ్యాంగ్‌స్టర్‌ అబు సలీమ్‌తో పార్టీనా? అక్కడ ఉన్నది మిస్టర్‌ మార్క్‌ మాన్యూల్‌ అనే జర్నలిస్ట్‌. తనను గ్యాంగ్‌స్టర్‌తో పోల్చి అవమానిస్తున్నారు. ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన పార్టీలో ఆయనతో దిగిన ఫోటో ఇది అని ఇన్‌స్టా స్టోరీ ద్వారా క్లారిటీ ఇచ్చింది.

సినిమా విషయానికి వస్తే..
కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎమర్జెన్సీ. భారత దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టింది. ఇందులో అనుపమ్‌ ఖేర్, శ్రేయాస్‌ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్‌ సోమన్, సతీష్‌ కౌశిక్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. జూన్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేశారు.

చదవండి: ఏడ్చేసిన కావ్య.. ఆమెను అలా చూస్తే బాధేసింది: బిగ్‌ బీ

Advertisement
 
Advertisement
 
Advertisement