ఇండిగో విమానానికి బాంబ్‌ బెదిరింపు | Delhi-Varanasi IndiGo Plane Receives Bomb Threat Latest News | Sakshi
Sakshi News home page

ఇండిగో విమానానికి బాంబ్‌ బెదిరింపు.. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ గుండా బయటకు ప్రయాణికులు

Published Tue, May 28 2024 7:19 AM

Delhi-Varanasi IndiGo Plane Receives Bomb Threat Latest News

ఢిల్లీ, సాక్షి: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపుతో విమాన సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.  ప్రయాణికులను ఎమర్జెన్సీ ద్వారం నుంచి దించేసి.. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మంగళవారం వేకువ జామున ఈ ఘటన చోటు చేసుకుంది.

ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానం టాయిలెట్‌ మీద బాంబ్‌ అని రాసి ఉండడాన్ని సిబ్బంది గమనించారు. దీంతో.. విమానం గాల్లోకి ఎగరకముందే అప్రమత్తమైన సిబ్బంది ఎయిర్‌పోర్ట్‌ అధికారులకు సమాచారం అందించారు. విమానాన్ని ప్రత్యేక ప్రాంతానికి తరలించారు. ప్రయాణికులను అత్యవసర ద్వారం గుండా దించేశారు. 

ఆపై సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టింది. వేకువ జామున ఐదు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు ఇండిగో ప్రకటించింది. ఈ ఘటనపై కాసేపట్లో అధికారులు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. 

 

Advertisement
 
Advertisement
 
Advertisement