ముగిసిన డెడ్ లైన్‌.. భార‌త కొత్త హెడ్ కోచ్ ఎవ‌రో? | India head coach application deadline ends | Sakshi
Sakshi News home page

#India head coach: ముగిసిన డెడ్ లైన్‌.. భార‌త కొత్త హెడ్ కోచ్ ఎవ‌రో?

Published Tue, May 28 2024 7:28 AM

India head coach application deadline ends

టీమిండియా ప్ర‌స్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ప‌దవీ కాలం టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2024తో ముగియున్న సంగ‌తి తెలిసిందే. దీంతో కొత్త కోచ్‌ను భ‌ర్తీ చేసే ప‌నిలో బీసీసీఐ ప‌డింది. అయితే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి ధ‌ర‌ఖాస్తు చేసుకునేందుకు గ‌డువు సోమ‌వారం(మే 27) సాయంత్రం ఆరు గంట‌లతో ముగిసింది.

కాగా ధర‌ఖాస్తుల‌ను బీసీసీఐ స్వీక‌రించిన‌ప్ప‌ట‌కి..కొత్త హెడ్ కోచ్‌ను ఎంపిక చేసేందుకు మ‌రింత స‌మ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. అయితే టీమిండియా హెడ్‌కోచ్ ప‌ద‌వికి విదేశీయులెవరూ దరఖాస్తు చేసుకోలేదని ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. తొలుత ఆస్ట్రేలియా దిగ్గ‌జాలు జ‌స్టిన్ లాంగ‌ర్‌, రికీ పాంటింగ్ పేర్లు వినిపించిన‌ప్ప‌టికి.. వార‌వ్వ‌రూ హెడ్‌కోచ్ ప‌దవికి ఆప్లై చేసేందుకు ఆస‌క్తి చూప‌లేద‌ని బీసీసీఐ మాలాలు వెల్ల‌డించాయి. 

నో చెప్పిన వీవీఎస్ లక్ష్మణ్..!
కాగా భార‌త హెడ్ కోచ్ రేసులోప్ర‌ధానంగా దిగ్గ‌జ క్రికెట‌ర్లు వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం హెడ్‌కోచ్ పోస్ట్ కోసం దరఖాస్తు చేయ‌లేదంట‌. ప్ర‌స్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మణ్‌కు పూర్తి స్ధాయి హెడ్‌కోచ్ ప‌ద‌విపై ఆస‌క్తి లేనిట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. 

టీమిండియా హెడ్ కోచ్ ఎంపికైతే జ‌ట్టుతో పాటు 10 నెలల పాటు క‌లిసి ప్ర‌యాణం చేయాలి. ఈ క్ర‌మంలోనే లక్ష్మణ్ ప్ర‌ధాన కోచ్ ప‌దవి వైపు మొగ్గు చూప‌క‌పోయిన‌ట్లు తెలుస్తోంది. 

గంభీర్ కోచ్ అవుతాడా? 
ఇక వీవీఎస్ లక్ష్మణ్ హెడ్‌కోచ్ బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు నిరాక‌రించ‌డంతో ద్ర‌విడ్ వారుసుడుగా టీమిండియా మాజీ ఓపెన‌ర్ గౌతం గంభీర్ ఎంపిక చేయాల‌ని బీసీసీఐ భావిస్తోంది. ఇప్ప‌టికే బీసీసీఐ పెద్ద‌లు గంభీర్‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది.

 అయితే ఈ విష‌యంపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు. గంభీర్ ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మెంటార్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌రిస్తున్నాడు. ఐపీఎల్‌-2024లో అత‌డి నేతృత్వంలోనే కేకేఆర్ ఛాంపియ‌న్స్‌గా నిలిచింది. కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టును వీడి గౌతీ వస్తాడా అనే విషయం సందిగ్ధంగా ఉంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement