ఈ స్కూటర్‌ను 8 లక్షల కంటే ఎక్కువ మంది కొనేశారు | Sakshi
Sakshi News home page

ఈ స్కూటర్‌ను 8 లక్షల కంటే ఎక్కువ మంది కొనేశారు

Published Mon, May 27 2024 9:43 PM

TVS Jupiter Sales Crossed 8 Lakh Units in FY2024

దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. గత దశాబ్ద కాలంలో 10 మిలియన్ స్కూటర్లను విక్రయించింది. ఇందులో జుపీటర్, జుపీటర్ 125 అమ్మకాలు మాత్రం 63 శాతం ఉన్నట్లు సమాచారం.

భారతీయ స్కూటర్ మార్కెట్లో జుపీటర్, జుపీటర్ 125 వాటా 25 శాతం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. జుపీటర్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 844863 యూనిట్లు. గడిచిన 10 ఆర్ధిక సంవత్సరాల్లో జుపీటర్ పొందిన అత్యుత్తమ అమ్మకాలు ఇవే అని స్పష్టమవుతోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో జుపీటర్ అమ్మకాలు కేవలం 98937 యూనిట్లు మాత్రమే.

110సీసీ, 125సీసీ వేరియంట్‌లలో అమ్ముడవుతున్న ఈ స్కూటర్ ప్రస్తుతం టీవీఎస్ బెస్ట్ సెల్లింగ్ వెహికల్3. కాగా టీవీఎస్ కంపెనీకి చెందిన రైడర్ 125  (478443 యూనిట్లు), ఎక్స్ఎల్ (481803 యూనిట్లు), అపాచీ (378112 యూనిట్లు), ఎన్‌టార్క్ 125 (331865 యూనిట్లు) వేహనాలు ఉత్తమ అమ్మకాలను పొందగలిగాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement