breaking news
YS Jagan Mohan Reddy
-
వైఎస్ జగన్ ను కలవొద్దని మామిడి రైతులను కూటమి నేతలు బెదిరిస్తున్నారు
-
ఈనెల 9న చిత్తూరు జిల్లాలో YS జగన్ పర్యటన: పెద్దిరెడ్డి
-
అదంతా కూటమి కుట్రే.. జగన్ రైతులను కలవడం ఖాయం: భూమన
సాక్షి, తిరుమల: ఏపీలో కూటమి ప్రభుత్వం మామిడి రైతులతో చలగాటం ఆడుతుందని ఆరోపించారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చిత్తూరులో కుమార్ అనే రైతును ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. బిన్ లాడెన్‌పై అమెరికా దాడిచేసినట్లు.. మారుమూల గ్రామంలో ఉన్న రైతును కూటమి నేతలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు అని మండిపడ్డారు. రైతుల కోసం వైఎస్ జగన్ తప్పకుండా వస్తారు.. వారిని కలిసి కష్టాలను తెలుసుకుంటారు అని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారు. రైతుల కోసమే బంగారుపాల్యం గ్రామానికి వైఎస్ జగన్ వస్తున్నారు. అందుకే కూటమి నాయకులు రైతులను వేధింపులకు గురిచేస్తున్నారు. జగన్ చూస్తే కూటమి నాయకులకు భయం.. అందుకే రైతులను రాకుండా అడ్డుకుంటున్నారు. మరోపక్క వైఎస్సార్సీపీ నాయకులను భయపెడుతున్నారు. జనసేన, టీడీపీ వారు జగన్ పర్యటన రద్దు అయిందని అంటున్నారు. జగన్ రావడం.. రైతులను కలవడం ఖాయం.కర్ణాటకలో మామిడికి ప్రభుత్వం మంచి ధర కల్పించింది. కానీ, చిత్తూరులో కుమార్ అనే రైతు నష్టాలకు భరించలేక, చెట్లు నరికేశాడు. దానికి ఫారెస్టు అధికారులు.. కుమార్‌ను నా ఇబ్బందులకు గురి చేశారు. అటవీశాఖ పవన్ కళ్యాణ్ అధీనంలో ఉంది. ఓ మామిడి రైతును ఎర్ర చందనం స్మాగ్లర్ గా చూపించారు. తన తోటలో తోతాపురి మామిడి కుళ్లిపోయే పరిస్థితి వచ్చింది. మామిడి రైతులతో కూటమి సర్కార్ చెలగాటం ఆడుతుంది. వైఎస్సార్సీపీ నాయకులు నిజాలు చెబితే తట్టుకోలేకపోతున్నారు.వైఎస్ జగన్ పర్యటనపై నిర్బంధాలను విధించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ప్రజా సముద్రాన్ని ఎవరూ అడ్డుకోలేరు. వైఎస్ జగన్ రాష్ట్రంలోనే అత్యధిక, అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి. జగన్‌కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు పెట్టే పద్దతి మారాలి. హెలికాప్టర్ అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ను కోరాము’ అని తెలిపారు. పవన్ కళ్యాణ్ మాటలను మేము పట్టించుకోము. ఎవరో చెప్పారు. నేను లేస్తే మనిషి కాదని బెదించేవాడంటా.. ప్రజలు కూడా అతనికి భయపడేవారు.. వాస్తవానికి అతనికి కాళ్లే లేవు.. పవన్ కళ్యాణ్ మాటలు కూడా అలా ఉంటాయ్.. వాటిని మేము పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అంటూ ఎద్దేవా చేశారు. -
ఇప్పుడంతా తలకిందులు!
అంతా నా వాళ్లే అని భావించిన గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్విప్లవాత్మక మార్పులతో మహిళా సాధికారతకు బలమైన పునాదులు వేశారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయం.. ఇవన్నీ ఏవీ చూడకుండా అర్హత ఉన్న వారందరికీ అండగా నిలిచారు. విలక్షణమైన పథకాలతో అక్కచెల్లెమ్మలకు అడుగడుగునా అండగా నిలిచి రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించారు. ఒక మహిళ అభివృద్ధి చెందితే ఆ కుటుంబం బాగు పడుతుందని.. కుటుంబాలు బాగు పడితే ఊరు అభివృద్ధి చెందుతుందని..అలా ఊళ్లు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని తన పాలనలో ప్రత్యక్షంగా నిరూపించారు. ఫలితంగా మహిళా ఆర్థిక స్వావలంబన సాకారమై పూర్తిగా నిలదొక్కుకునే దశలో కూటమి నేతల ‘మాయాఫెస్టో’ ఆ విప్లవాత్మక అడుగులకు బ్రేక్ వేసింది. వెరసి ఇపుడు చిరు వ్యాపారాలన్నీ పడకేశాయి. ఆశలు అడియాశలయ్యాయి. చేయి పట్టుకుని నడిపించే భరోసా కరువైంది. అడుగులు ఎలా ముందుకు వేయాలో తెలియక క్రాస్‌రోడ్‌లో నిలుచున్నారు. రమ సరస్వతి – రాయలసీమ జిల్లాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన నీలమ్మ (పేరు మార్చాం) దిగువ మధ్యతరగతికి చెందిన సాధారణ గృహిణి. టైలర్. అమ్మ ఒడి, జగనన్న చేదోడు, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ సున్నా వడ్డీ లాంటి పథకాలతో ఆ కుటుంబం చాలా లాభపడింది. అంతకు ముందు కేవలం బట్టలు కుట్టడం వరకే పరిమితమైన ఆమె ఈ పథకాలతో వచ్చిన డబ్బును కొట్టుకు పెట్టుబడిగా మలచుకుంది. దగ్గర్లో ఉన్న టౌన్‌లోని హోల్‌సేల్ షాపులో ఖాతా తెరిచి.. ఫాల్స్, పెట్టీకోట్లు, బ్లౌజ్ పీసెస్ లాంటి వాటిని తెచ్చుకొని ఇంట్లోనే ఓ గదిని చిన్న మ్యాచింగ్ సెంటర్లా మార్చుకుంది. ఓవైపు బట్టలు కుడుతూనే ఆ చిన్న ఊర్లో ఆడవాళ్ల మ్యాచింగ్ దుస్తుల అవసరాలనూ తీరుస్తూ వాళ్లు పట్నానికి వెళ్లే ఖర్చు, సమయాన్నీ ఆదా చేస్తోంది. ‘జగనన్న పెట్టిన పథకాలు చాలానే వచ్చాయి మా కుటుంబానికి. వాటిల్లో కొన్నిటికి నేరుగా నా అకౌంట్లోనే డబ్బు పడటంతో అవి వేస్ట్ కాకుండా నా కుట్టు మిషన్ పనికి వాడుకున్నాను. మొదటి రెండు నెలలు వేస్ట్‌గానే ఖర్చయిపోయాయి. మేము బాగు పడాలని ఆయప్ప ఇచ్చిన డబ్బులు అలా వేస్ట్ అయినందుకు కొంచెం బాధ పడ్డాను. తర్వాత మా ఆడబిడ్డే సలహా ఇచ్చింది. కుట్టు పని వచ్చు కదా వదినా.. ఇంట్లోనే టైలర్ షాప్ లాంటిది పెట్టుకోవచ్చు కదా అని! నిజమే అనిపించింది. పెట్టాను. అంతకు ముందు కాళ్లతో తొక్కే మిషనే ఉండేది నాకు. పథకాల డబ్బుతో ముందు కరెంట్ మిషన్ కొనుక్కున్నా.. తర్వాత మెటీరియల్ తెచ్చుకున్నా. ఏ నెలకు ఆ నెల ఖాతా తీర్చేసి అప్పు లేకుండా చేసుకున్నా. కానీ గవర్నమెంట్ మారిపోయి.. డబ్బులు రాక మళ్లీ అప్పుల్లో పడింది జీవితం. ఇప్పుడు ఇదివరకంతటి మెటీరియల్ తీసుకురాలేకపోతున్నా! ఓ నాలుగు నెలలుగానైతే బ్లౌజులు కుట్టడం వరకే పరిమితమైపోయా’ అని చెబుతోంది నీలమ్మ. సమీనా వ్యాపారవేత్త అయింది..సమీనా (పేరు మార్చాం)ది ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతం. నలుగురు పిల్లలు, తాగుబోతు భర్త, వితంతు అత్త, వ్యవసాయ కూలీగా పనిచేసే మరిది ఉన్న ఉమ్మడి కుటుంబం. పెద్దకొడుకు చదువులో చురుకు. ఆర్థిక పరిస్థితి బాలేక చదువు మానిపించి పనిలో పెట్టింది. అలా ఆమె, కొడుకు, మరిది కష్టపడ్డా అప్పులతోనే సంసారాన్ని నెట్టుకొచ్చేది సమీనా. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆమె రాత మారింది. కుటుంబం బాగు పడింది. వాళ్ల అత్తగారికి రూ.మూడు వేలు పెన్షన్ వస్తుండటంతో ఆమె భారం తగ్గింది. వైఎస్సార్ చేయూతకు దరఖాస్తు చేసుకుని ఆ బెనిఫిట్ పొందిన సమీనా ఊర్లోనే చిన్న కిరాణా కొట్టు పెట్టుకుంది. భర్తనూ అందులో కూర్చోబెట్టి బేరం బాధ్యతను అప్పగించి తాగుడు వ్యసనానికి దూరం చేసింది. ఆమె పెద్దకొడుకు పై చదువుల కోరికను జగనన్న విద్యా దీవెన తీర్చింది. ఇప్పుడు ఆ అబ్బాయి బెంగళూరులో మంచి కంపెనీలో చక్కటి ఉద్యోగం చేస్తున్నాడు. కొట్టు మీద వస్తున్న ఆదాయంతో మరిదికి ఓ ఆటో కొనిపెట్టింది. ఆటో తోలుతూ ఆర్థికంగా వెసులుబాటు తెచ్చుకున్న ఆ మరిదిని వెదుక్కుంటూ వచ్చింది పెళ్లి సంబంధం. పెళ్లయింది. ఆ జంట వైఎస్సార్ షాదీ తోఫా అందుకుంది. దాంతో కొత్త కాపురానికి కావల్సిన వస్తువులు కొనుక్కున్నారు. ఆ వరుడి ఆటో మెయింటెనెన్స్‌కు వైఎస్సార్ వాహన మిత్ర తోడ్పడింది. ‘మా కుటుంబం ఈరోజు కడుపు నిండా తిండి తినడమే కాదు, మా షాపులో ఓ అబ్బాయికి జీతం ఇవ్వగలిగే స్థితికీ రాగలిగామంటే కారణం జగన్ సారే! ఆయప్ప ఇచ్చిన పథకాలు మా కుటుంబాన్నే మార్చేశాయి. ఈ ఊర్లో మాలాగా ఇంకెన్నో కుటుంబాలు బాగుపడ్డాయి’ అని చెప్పింది సమీనా.. తన కిరాణా కొట్టుకు వచ్చిన ఓ వ్యక్తికి ఉప్మా రవ్వ పొట్లం కట్టిస్తూ.వైఎస్సార్ కడప జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఆశ ( పేరు మార్చాం) విడో. పెద్దగా చదువుకోలేదు. పైగా పోలియో. ఆమెను పోషించే ఆర్థిక స్థోమత ఆమె అత్తకు లేనందున పుట్టింటికి వచ్చేసింది. అన్న పంచన చేరింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లో చేరింది. అప్పుడే ఆమెను ఆదుకుని అన్న మీద ఆధారపడే ఆగత్యాన్ని తప్పించేసింది వైఎస్సార్ ఆసరా పథకం. ‘ఈ పథకం కింద వచ్చిన డబ్బు నాకు నిజంగానే ఎంతో ఆసరాగా నిలిచింది. స్వతంత్రంగా బతికే ధీమానిచ్చింది’ అని చెప్పింది ఆశ.ఆ ఐదేళ్లు అంతా సాఫీగా..నీలమ్మ, సమీనా, ఆశే కాదు.. రాయలసీమలోని ఆ మూడు జిల్లాల్లోని ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయి. అమ్మ ఒడి నుంచి జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ (రైతులకు), స్వయం సహాయక బృందాల సున్నా వడ్డీ రుణాలు, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, కాపు నేస్తం, నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, వాహన మిత్ర, ఆరోగ్య ఆసరా, ఈబీసీ నేస్తం, ఆరోగ్య శ్రీ, కళ్యాణమస్తు, హౌజింగ్.. తదితర పథకాల డబ్బు నేరుగా మహిళల పేరు మీదే బ్యాంకు ఖాతాలో పడటంతో.. ఆ డబ్బును కుటుంబ ప్రగతికే ఖర్చు పెట్టారు. ఇంటిని బాగు చేయించుకున్నారు. ఇంట్లో అవసరమైన వస్తువులను అమర్చుకున్నారు. స్కూల్‌కు వెళ్లే పిల్లలకు సైకిళ్లు కొనిపెట్టారు. మునుపటిలా ఆర్థిక ఇబ్బందులు ఇంటి ఇల్లాలి బంగారం మీద, పిల్లల చదువు మీద ప్రభావం చూపించలేదు వైఎస్సార్ జగన్ హయాంలో! ఈ పథకాల ద్వారా వచ్చిన డబ్బుతో ఆర్థిక అవసరాలు తీరాయి. ఖర్చు లేకుండా పిల్లల చదువు సాగింది. తాకట్టులో ఉన్న ఇల్లాలి బంగారం తిరిగి ఆమె ఒంటి మీదకు చేరింది. అదనంగా ఇంకొంత కొని కూతురి పెళ్లి కోసం దాచగలిగింది. అదివరకు పస్తులున్న కుటుంబాలు సైతం పౌష్టికాహారాన్ని తినగలుగుతున్నామని ఆరోగ్యకరమైన నవ్వుతో చెబుతున్నారు. ఆరోగ్యం అంటే గుర్తొచ్చింది.. జగనన్న పంపించిన ఫ్యామిలీ డాక్టర్.. గ్రామ ఆరోగ్యాన్ని కాపాడిందని చెప్పారు గ్రామ ప్రజలు. రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీలు ఒకరకంగా విప్లవాత్మక స్కీమ్స్ అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు రైతులు. సాగంటేనే అప్పుల కుప్ప అని భయపడ్డ రైతన్నలకు ఆ స్కీమ్స్ అండగా నిలిచాయి. వెరవక వ్యవసాయం చేసే భరోసానిచ్చాయి. వాటివల్ల రైతులు మొదటిసారి చేతులనిండా డబ్బు చూశారు. ఈ స్కీమ్స్ అన్నిటికీ స్త్రీలే ఖాతాదారులవడంతో ఒకరకంగా వాళ్లు ఆర్థిక స్వావలంబనను సాధించినట్టయింది. పొదుపు.. మదుపు గత ప్రభుత్వ సమయంలో ఇంట, బయట అన్ని పనులకు ఆర్థి కంగా కుటుంబం మహిళల మీదే ఆధార పడటంతో ఆడవాళ్ల ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రణాళికా బద్ధంగా కుటుంబ ఆర్థిక నిర్వహణ సాగింది. అవసరాల ప్రాధాన్యంగా ఖర్చును నిర్ణయించుకున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పొదుపు, మదుపులను సాగించారు. స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రుణాలు, చేయూత, చేదోడు, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో ఎంట్రప్రెన్యూర్స్ (వ్యాపారవేత్తలు) అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పథకాలతో ఇంటి ఆర్థిక పరిస్థితే కాదు గ్రామీణ ప్రమాణాలు ఊహించని రీతిలో మెరుగుపడ్డాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మన పంచవర్ష ప్రణాళికలు, ఇతర ఆర్థిక ప్రణాళికలన్నీ కసరత్తు చేస్తోంది దీనికోసమే కదా! అన్నేళ్ల శ్రమ సాధించలేనిది అయిదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలోని ఈ సంక్షేమ పథకాలు సాధించగలిగాయి. సంక్షేమం వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది అని పెదవి విరిచిన నిపుణులంతా వైఎస్ జగన్ పథకాలను మనసారా అభినందిస్తున్నారు. గ్రామ సచివాలయం, వలంటీర్స్ ఏర్పాటు నుంచి డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్), నాన్ డీబీటీ దాకా పలు పథకాలు దేశానికే ఆదర్శం అని కొనియాడుతున్నారు. భారత్ లాంటి దేశాలకు ఇలాంటి సంక్షేమ పథకాలే అనుసరణీయమని ప్రపంచ స్థాయి సదస్సులో ఉదాహరణగా చూపుతున్నారు. కరోనా సమయంలో సైతం మార్కెట్లో మనీ రొటేట్ చేసిన ఈ పథకాల మీద ప్రతి దేశం అధ్యయనం చేయాలని సూచనలిస్తున్నారు. క్రాస్ రోడ్లో లక్షలాది మంది జీవితాలు అంత ఆర్థికోన్నతికి పాటుపడ్డ ఆ పథకాలు ఇప్పుడు.. తెలుగుదేశం కూటమి పాలనలో దిక్కుమొక్కు లేకుండా పోయాయి. ఏడాది గడిచినా.. ఇచ్చిన హామీల అమలు కనిపించడం లేదు. అందుకే ఊళ్లల్లో పరిస్థితి మళ్లీ దిగజారడం మొదలైంది. ఎవరిని కదిలించినా తీరని అసంతృప్తి. ఎవరి ఖాతా తెరుచుకోలేదు. కొనుగోలు శక్తి లేదు. మార్కెట్లో కళ లేదు. నత్తనడకనైనా నడుస్తుందంటే గత అయిదేళ్లలో మహిళలు జాగ్రత్తపడ్డ ఆదా వల్లనే! వాళ్ల ఎంట్రప్రెన్యూర్ స్కిల్స్ వల్లనే! అదైనా ఇంకెన్నాళ్లు నడిపించగలమనే బెంగను వ్యక్తపరస్తున్నారు అక్కచెల్లెమ్మలు.అభివృద్ధి పేరుతో ఉన్న డబ్బంతా అమరావతికే మళ్లించి మిగిలిన రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారనే బాధను అత్యధికులు వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమంతో అభివృద్ధి సాధ్యమని వైఎస్ జగన్ నిరూపిస్తే.. అభివృద్ధి నినాదంతో ఒక వర్గం సంక్షేమాన్నే కాంక్షిస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి అని యువత, ఉద్యోగులు, మహిళలు, రైతులు అభిప్రాయ పడుతున్నారు. గ్రామ సచివాలయం, వలంటరీ వ్యవస్థ ఏర్పాటుతో అధికార వికేంద్రీకరణ, విద్య, వైద్యంలో సంస్కరణలు, సంక్షేమ పథకాల ద్వారా స్త్రీ సాధికారత వంటివాటితో గ్రామ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడి గాంధీ గ్రామ స్వరాజ్య కలను వైఎస్ జగన్ నెరవేరిస్తే.. అధికార కేంద్రీకరణతో నేటి ముఖ్యమంత్రి గ్రామాలను ధ్వంసం చేస్తున్నారని వాపోతున్నారు అన్ని వర్గాల వారు. ఇప్పుడు ఏపీలోని పల్లెల్లో జీవం లేదు. ఉత్సాహం కరువై.. నిరాశ, నిస్పృహల నిలయంగా కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ మేనిఫెస్టో ముఖ్యమంత్రి అయితే.. చంద్రబాబు మానిప్యులెటివ్ ముఖ్యమంత్రి అని చెబుతున్నారు ప్రజలు. గత ప్రభుత్వ పాలనలో క్రమం తప్పకుండా అందిన సాయంతో నిలదొక్కుకునే దిశగా వేగంగా అడుగులు పడ్డాయని, ఇంకొన్నేళ్లు ఆ సాయం అలానే అంది ఉంటే లక్షలాది కుటుంబాలు పూర్తిగా గాడిన పడేవనడంలో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం రావడంతో పరిస్థితి అంతా తలకిందులైందని ఇప్పుడు ఊరూరా వినిపిస్తున్న మాట. ఎందరి జీవితాలోఇప్పుడు క్రాస్ రోడ్లో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఏడాదిగా ప్రస్తుత ప్రభుత్వ పాలన చూసిన ఈ లబ్దిదారులందరూ తామంతా మోసపోయామని కుమిలిపోతున్నారు. అదే విషయాన్ని ‘సాక్షి’తో చెబుతూ తమ పేర్లు రాయొద్దని కోరారు. ఈ లెక్కన కూటమి ప్రభుత్వ పాలన ఎలా సాగుతోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దుర్మార్గపు ప్రభుత్వ తీరుపై గళం విప్పడానికి ఇప్పుడిప్పుడే ధైర్యం కూడగట్టుకుంటున్నారు. సమయం వచ్చినప్పుడు తాము చేయాల్సింది మాత్రం చేస్తామని బల్లగుద్ది చెప్పారు. -
రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నెన్స్‌తో రక్తమోడుతోన్న రాష్ట్రం
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నెన్స్‌లతో రాష్ట్రం రక్తమోడుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న దారుణాలపై నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వరరావును టీడీపీ గూండాలు పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ ఘటనపై శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు.. అదీ వీలుకాకపోతే, తన వాళ్లను ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వరరావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించి వైరల్ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోంది. నాగమల్లేశ్వర్రావు కుటుంబం మొదటి నుంచి వైఎస్సార్సీపీలో ఉండడం, వారికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారింది. పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా వెనకడుగు వేయలేదు. దీంతో రాజకీయంగా ఆ ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి ఈ దాడులు చేయించారు. ఆ వీడియోలు చూస్తే, జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయి. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను’ అని పేర్కొన్నారు.నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై జగన్ ఆరా టీడీపీ మూకలు మారణాయుధాలతో చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. నాగమల్లేశ్వరరావు అన్న, మాజీ ఎంపీపీ వేణుప్రసాద్‌తో వైఎస్ జగన్ శుక్రవారం ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే టీడీపీ మూకలు నాగమల్లేశ్వరరావుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. వైఎస్సార్సీపీకి స్థానికంగా బలమైన నాయకత్వాన్ని అందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్న కుటుంబాన్ని చూసి ఓర్వలేక ఈ దారుణానికి పాల్పడ్డారని అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామంలో విచ్చలవిడిగా చేస్తున్న అక్రమాలకు నాగమల్లేశ్వరరావు అడ్డుగా ఉన్నాడనే ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు.నాగమల్లేశ్వరరావు కుటుంబానికి వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, పార్టీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి అందుబాటులో ఉండి అవసరమైన సహకారం అందిస్తారని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు తెలిజేయాలని అంబటి మురళీకృష్ణకు వైఎస్ జగన్ సూచించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను అడ్డుకుని ప్రజలకు మంచి చేయాలనుకున్న నాగమల్లేశ్వరరావు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు సోదరుడికి వైఎస్ జగన్ ఫోన్
సాక్షి,గుంటూరు: టీడీపీ నేతల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. నాగమల్లేశ్వరరావు సోదరుడు వేణు ప్రసాద్‌తో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా నాగమల్లేశ్వరరావు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
పచ్చమూకల పైశాచికత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్న దారుణాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును టీడీపీ నేతలు పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ ఘటనపై వైఎస్ జగన్ శుక్రవారం (జులై 4) ఎక్స్ వేదికగా స్పందించారు.‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు.గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వైరల్ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోంది. నాగమల్లేశ్వర్రావు కుటుంబం మొదటినుంచి వైఎస్సార్సీపీలో ఉండడం, ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారింది. పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా వెనకడుగు వేయకపోవడంతో, రాజకీయంగా అక్కడ, ఆ ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి ఈ దాడులు చేయించారు. ఆ వీడియోలు చూస్తే, జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో కనిపిస్తుంది. చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయి. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు. గుంటూరు… pic.twitter.com/VfNxKZRUlz— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2025 విషమంగా నాగమల్లేశ్వర్రావు ఆరోగ్యంకూటమి ప్రభుత్వంలో దారుణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అందుకు గుంటూరు జిల్లా మన్నవ గ్రామంలో జరిగిన ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. మన్నవ గ్రామంలో టీడీపీ అడ్డు అదుపూ లేకుండా పోతున్న ఆగడాల్ని ఆ ఊరి సర్పంచి నాగమల్లేశ్వర్రావు ప్రశ్నించారు. జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేయడంతో పాటు ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో నాగమల్లేశ్వర్రావును టీడీపీ నేతలు కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, సర్పంచి నాగమల్లేశ్వర్రావు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. -
కూటమి పాలనలో కునారిల్లుతున్న విద్యా వ్యవస్థ
-
YS Jagan: ఆయన సేవలు చిరస్మరణీయం
-
పింగళి వెంకయ్యకు వైఎస్ జగన్ నివాళి
-
రోశయ్యకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: రోశయ్య జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొణిజేటి రోశయ్య రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయం’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొణిజేటి రోశయ్య గారు రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు రోశయ్యగారి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/OGj2nFysZT— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2025 -
నేడు పింగళి వెంకయ్య వర్థంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు పింగళి వెంకయ్య వర్ధంతి. ఈ సందర్భంగా పింగళి వెంకయ్యకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళి అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘గుండెల నిండా దేశభక్తిని నింపుకుని.. మువ్వన్నెల జాతీయ జెండాను రూపొందించిన మన ఆంధ్రుడు పింగళి వెంకయ్య. నేడు ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు’ అని పోస్టు చేశారు. గుండెల నిండా దేశభక్తిని నింపుకుని, మువ్వన్నెల జాతీయ జెండాను రూపొందించిన మన ఆంధ్రుడు పింగళి వెంకయ్య గారు. నేడు ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు. pic.twitter.com/5s2YGKcjcB— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2025 -
అల్లూరి జయంతి.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: అల్లూరి సీతారామరాజుకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘బ్రిటిష్ పాలనను ఎదురించి, స్వరాజ్య సాధనలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.‘‘గిరిజనుల హక్కుల కోసం ఆయన చేసిన స్వాతంత్ర్య పోరాటం చిరస్మరణీయమైనది. ఆ గొప్ప యోధుడిని కలకాలం గుర్తించుకునేలా అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాను ఏర్పాటు చేసి, ఆయన్ని గౌరవించుకున్నాం. నేడు ఆ మహావీరుడి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ఎక్స్‌లో పేర్కొన్నారు.బ్రిటిష్ పాలనను ఎదురించి, స్వరాజ్య సాధనలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు గారు. గిరిజనుల హక్కులకోసం, వారి ఆత్మగౌరవం కోసం, వారితో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర్య పోరాటం చిరస్మరణీయమైనది. ఆ గొప్ప యోధుడిని కలకాలం గుర్తుంచుకునేలా అల్లూరి సీతారామరాజు… pic.twitter.com/3VtISU9UwL— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2025 -
రోప్ పార్టీకి దిక్కులేదు.. జెడ్ ప్లస్ భద్రత ఇస్తున్నారంట!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని గొప్పగా చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, కనీసం ఆయన పర్యటనల్లో రోప్ పార్టీని కూడా ఏర్పాటుచేయడం లేదని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. జగన్ భద్రత విషయంలో ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చునన్నారు. ఓ వ్యక్తి భద్రత విషయంలో రోప్ పార్టీది కీలకపాత్ర అని ఆయన వివరించారు. భారీ సంఖ్యలో వచ్చే జనాలను రోప్ పార్టీ నియంత్రిస్తుందని, తద్వారా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉంటాయని తెలిపారు. జగన్‌కు అన్నిరకాల భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా రోప్ పార్టీని ఎందుకు ఏర్పాటుచేయడం లేదో చెప్పడం లేదన్నారు.రోప్ పార్టీ విషయంలో ఎందుకు దాగుడుమూతలు ఆడుతోందో అర్థంకావడంలేదన్నారు. అది లేకుంటే జగన్ భద్రతకు ముప్పు ఉన్నట్లేనని శ్రీరామ్ స్పష్టంచేశారు. జగన్ పర్యటన విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య తీరుకు ఇదే నిదర్శనమన్నారు. జడ్ ప్లస్ భద్రత ఉన్న జగన్‌కు రక్షణ కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కనీస స్థాయిలో కూడా పాటించడంలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే వారిలా చేస్తున్నారని ఆయన వివరించారు. ఇక జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా హెలీప్యాడ్ ఏర్పాటునకు అనుమతిచ్చే విషయంలో పోలీసులు తీవ్రజాప్యం చేశారన్నారు. అడుగు కూడా వేయలేని ప్రాంతంలో హెలీప్యాడ్ ఏర్పాటుకు అనుమతిచ్చారని, ఈ ప్రాంతంలో చెట్లు, పొదలు తొలగించడానికే మూడ్రోజులు పడుతుందని శ్రీరామ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఈ నేపథ్యంలో జగన్ తన నెల్లూరు పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారని తెలిపారు. జగన్‌కు రోప్ పార్టీతో సహా అన్నీ రకాలుగా భద్రత కల్పించే విషయాన్ని కేవలం నెల్లూరు పర్యటనకు మాత్రమే కాకుండా, ఆయన చేసే ప్రతీ పర్యటనకు సైతం వర్తింపజేసేలా పోలీసులకు ఆదేశాలు జారీచేయాలని ఆయన కోర్టును కోరారు. జగన్‌కు సేఫ్ ట్రావెల్, సేఫ్ ల్యాండింగ్, సేఫ్ మూవ్మెంట్ అన్నది కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే జగన్ భద్రత కోసం ప్రభుత్వ నిర్లక్ష్యంపై రెండు పిటిషన్లు దాఖలు చేశామని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తాం..రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, జగన్ పర్యటన వాయిదా నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్ నిరర్థకమైందన్నారు. జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామన్నారు. జడ్ ప్లస్ వ్యక్తులకు భద్రత కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో పిటిషనర్లు అనుబంధ పిటిషన్ వేశారని, దీనికి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు.ఇందుకు న్యాయస్థానం అంగీకరిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఆ రోజుకి కౌంటర్ దాఖలు చేయాలని, ఆ రోజునే వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిష్కరిస్తామని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. నెల్లూరు పర్యటనకు వెళ్తున్న జగన్మోహన్రెడ్డికి హెలీప్యాడ్ ఏర్పాటుకు అనుమతులిచ్చే ఆదేశాలు జారీచేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతనేని చంద్రశేఖర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
రోప్పార్టీలపై ఎందుకీ దాగుడు మూతలు?
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనకు సంబంధించిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఇవాళ(గురువారం, జులై 3న) విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున మాజీ ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. హెలిప్యాడ్ కోసం సూచించిన స్థలం మనుషులు సంచరించడానికి వీల్లేకుండా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ నెల్లూరు హెలిపాడ్ అనుమతి పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. ‘‘హెలిప్యాడ్‌కు అనుమతి ఇవ్వడంలేదని కోర్టులో పిటిషన్ వేసిన వెంటనే.. హడావిడిగా ఒక ప్రాంతాన్ని ఎంపికచేశారు. ఇదే హెలిపాడ్ అంటున్నారు. ఆ స్థలంలో తుప్పలు, డొంకలు ఉన్నాయి. మనుషులుకూడా నడవడానికి వీల్లేకుండా ఉంది. హెలిపాడ్ కోసం ఆ స్థలాన్ని సిద్ధం చేయాలంటే మూడు నుంచి నాలుగు రోజుల సమయం పట్టేలా ఉంది...మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి విషయంలో కేంద్ర ప్రభుత్వపు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదు. ఆ మార్గదర్శకాల ప్రకారం.. జడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తులకు రోప్‌పార్టీలు ఇవ్వాలి కదా?పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పుడు మేనేజ్ చేయడానికి రోప్ పార్టీలు అత్యంత అవసరం. జగన్‌లాంటి వ్యక్తికి సేఫ్ ల్యాండింగ్, సేఫ్ ట్రావెల్, సేఫ్ మూవ్ అనేది కల్పించాలి కదా. రోప్‌పార్టీలు ఇవ్వడానికి ప్రభుత్వ ఎందుకు దాగుడుమూతలు ఆడుతుందో అర్థం కావడంలేదు’’ అని లాయర్ శ్రీరాం వాదించారు. పై విషయాలన్నింటికీ ప్రభుత్వం నుంచి సమాధానాలు రావడం లేదు. పైగా వైఎస్ జగన్ భద్రత గురించి వేసిన 2 పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి అని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదిస్తూ.. జడ్ ప్లస్ కింద ఇవ్వాల్సిన భద్రత ఇస్తున్నామంటూ చెప్పారు. అలాంటప్పుడు రోప్ పార్టీలు లేవు కదా? అని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీరాం మరోసారి ప్రశ్నించారు. దీంతో.. ఈ పిటిషన్‌పై వాదనలకు మరింత సమయం కావాలని ఏజీ కోరడంతో.. కోర్టు వచ్చే బుధవారానికి(జులై 9) విచారణ వాయిదా వేసింది. -
వైఎస్ జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ (ఫొటోలు)
-
విడుదల తర్వాత మొదటిసారి జగన్ తో..!
-
వైఎస్ జగన్ ను కలిసిన వల్లభనేని వంశీ..
-
వైఎస్ జగన్‌కు వల్లభనేని వంశీ కృతజ్ఞతలు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని గురువారం కలిశారు. కూటమి ప్రభుత్వ కక్షరాజకీయాలకుగానూ వంశీ సుమారు నాలుగున్నర నెలలపాటు విజయవాడ జైల్లో గడిపిన సంగతి తెలిసిందే. న్యాయస్థానాల్లో ఊరట లభించడంతో బుధవారమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. సాక్షి, గుంటూరు: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన వంశీ.. కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో వంశీ ఆరోగ్య స్థితి గురించి జగన్ ఆరా తీశారు. వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ కూడా ఉన్నారు. వల్లభనేని వంశీపై మొత్తం 11 కేసులు పెట్టి వేధింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఆయన 140 రోజులపాటు జైల్లో గడిపారు. ఆ సమయంలోనే అనారోగ్యం బారిన పడ్డారు కూడా. చివరకు వంశీకి బెయిల్ వచ్చినా తర్వాత కూడా విడుదలను అడ్డుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేశారు. అందులో భాగంగానే సుప్రీం కోర్టులో బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ కూడా వేశారు. అయితే సుప్రీం కోర్టు వంశీకి ఊరట ఇవ్వడంతో.. బుధవారం ఉదయం విజయవాడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. -
Thopudurthi Prakash: ఇదంతా చూస్తుంటే జగన్‌కి కూడా రక్షణ లేదనిపిస్తుంది..
-
పచ్చ బ్యాచ్ మొత్తం దొరికిపోయారు.. సింగయ్య మృతిలో ట్విస్ట్
-
మెడికల్ విద్యార్థులపై పోలీసులతో దాడి చేయిస్తారా: YS జగన్
-
యువ వైద్యులపై పోలీసులతో దాడులు చేయిస్తారా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘విదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?’ అని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ఆ విద్యార్థుల కెరీర్‌ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని.. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణు్ణలైన వారికి వెంటనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అందులో ఏమన్నారంటే..మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? ‘చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఎన్ఎంసీ గైడ్‌లైన్స్ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ (ఎఫ్ఎంజీ) ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులైన తరువాత ఇక్కడే ఇంటర్న్‌షిప్ పూర్తిచేసినా, ఎందుకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వడం లేదు? ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా.. ఇది ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారు? ఇదేనా మీ పరిపాలన? మీరు చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే వారిపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఏడాది కాలంగా వారిపై వివక్ష చూపుతూ.. ఇంటర్న్‌షిప్ పేరుతో దీర్ఘకాలం వెట్టిచాకిరి చేయించుకుంటూ.. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు లాభం చేకూర్చేలా.. ఉద్దేశ పూర్వకంగా వీరికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్) నంబర్ ఇవ్వకపోవడం వాస్తవం కాదా? తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తమ పిల్లలను విదేశాలకు పంపిస్తే.. ఆ పిల్లలు కష్టపడి చదువుకుని కోర్సులు పూర్తిచేశారు. అలాంటి వారిని అంటరాని వారిగా చూస్తూ వారి కెరీర్‌ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? వారిని నిరుత్సాహపరచాలన్నది మీ ప్లాన్‌లో భాగం కాదా?.విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్రబాబూ?డాక్టర్లు కావాలనుకుంటున్న పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకునే ఇబ్బందుల్లేకుండా ఇక్కడే.. మన రాష్ట్రంలోనే.. ప్రభుత్వ రంగంలో 17 కాలేజీలను, వాటిద్వారా 2,550 సీట్లను తీసుకు వచ్చేలా మా ప్రభుత్వం పనులు చేసి, అందులో ఐదు కాలేజీలను ప్రారంభించింది. మిగిలిన కాలేజీలను కూడా పూర్తిచేసే స్థాయికి తీసుకువెళ్తే.. చంద్రబాబు గారూ.. మీరు వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తే వాటిని వద్దు అన్న ప్రభుత్వం దేశ చరిత్రలో మీది మాత్రమే కాదా? మీ అవినీతి కోసం స్కామ్‌లు చేస్తూ ఆ కాలేజీలను ప్రైవేటీకరించే కుట్ర చేస్తున్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ కేటాయించిన సీట్లను కూడా వద్దు అంటూ లేఖరాసి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. ఇప్పుడు దేశంకాని దేశం వెళ్లి అక్కడ ఖర్చులు తగ్గించుకుని.. కష్టపడి కోర్సులు పూర్తిచేసి వస్తే వారికి పీఆర్ నంబర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. పైగా అడిగితే పోలీస్ స్టేషన్లో వేశారు. తల్లిదండ్రులపైనా, విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్రబాబూ? ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, ఎన్ఎంసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వీరికి వెంటనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను’ అని వైఎస్ జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.వైఎస్ జగన్‌కు గోడు వెళ్లబోసుకున్న యువ వైద్యులువిదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తిచేసుకున్న యువ వైద్యులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూటమి ప్రభుత్వం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకపోవడంతో తామంతా విజయవాడలోని వైద్య విశ్వవిద్యాలయానికి మంగళవారం వెళ్లామన్నారు. అక్కడ నిరసన వ్యక్తం చేస్తుండగా.. పోలీసులు తమపై దాడి చేశారని యువ వైద్యులు వైఎస్ జగన్‌కు వివరించారు. ఇక్కడ మెడికల్ సీట్లు రాకపోవడంతో తమ తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకోర్చి, అప్పులు చేసి మరీ తమను విదేశాలకు పంపించారని చెప్పారు. తాము కష్టపడి మెడికల్ కోర్సులు పూర్తిచేశామని, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్ష, ఇంటర్న్‌షిప్ చేసినా తమకు పర్మినెంట్ నంబర్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఎంజీ చేసిన మరికొంతమంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఇవ్వడం లేదని, గడువుకు మించి ఇంటర్న్‌షిప్ పేరిట గొడ్డుచాకిరీ చేయించుకున్నారని యువ వైద్యులు వైఎస్ జగన్‌కు వివరించారు. యువ వైద్యుల వెంట వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్ర ఉన్నారు. -
బాబు సర్కారు కుట్రలకు చెంపదెబ్బ!
ఇదో అసాధారణ కేసు.. సాధారణంగా ఎఫ్ఐఆర్ దశలో మేం జోక్యం చేసుకోం.. కానీ ఇది న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సినంత అరుదైన కేసు.. మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులు కేవలం కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రమే. సెక్షన్ 105 కింద కేసు పెట్టాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం, తమ చర్యల వల్ల ఆ వ్యక్తి చనిపోతారని స్పష్టంగా తెలిసి ఉండటం తప్పనిసరి. అయితే ఫిర్యాదును, అందులో ఇతర అంశాలను పరిశీలిస్తే.. జగన్ తదితరులకు సింగయ్యను చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఆయన చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదు.– సింగయ్య మృతి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి ఘటనను రాజకీయం చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు లాంటి ఉత్తర్వులను హైకోర్టు ఇచ్చింది. సింగయ్యను ఉద్దేశపూర్వకంగానే కారు కింద పడేసి తొక్కించారంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు వాదనను హైకోర్టు ఎండగట్టింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై బీఎన్ఎస్లోని కఠిన సెక్షన్ 105 కింద కేసు పెట్టడాన్ని తప్పుబట్టింది. జీవిత ఖైదు పడే ఈ సెక్షన్ కింద జగన్ తదితరులపై ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును తీవ్రంగా ఆక్షేపించింది. సెక్షన్ 105 కింద కేసు పెట్టేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. సాధారణంగా ఏ కేసులో కూడా ఎఫ్ఐఆర్ దశలో తాము జోక్యం చేసుకోమని, అయితే ఇది జోక్యం చేసుకోవాల్సినంత అరుదైన కేసని, అందుకే తాము జోక్యం చేసుకుంటున్నామని ప్రకటించింది. మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, జగన్ పీఏ నాగేశ్వరరెడ్డిలపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్– ఓ వ్యక్తి మరణానికి కారణమైనప్పటికీ హత్య కానిది) కింద కేసు నమోదు చేయడంపై హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. జగన్ తదితరులు కేవలం కారులో ప్రయాణిçÜ్తున్న ప్రయాణికులు మాత్రమేనని స్పష్టం చేసింది. సెక్షన్ 105 కింద కేసు పెట్టాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం, తమ చర్యల వల్ల ఆ వ్యక్తి చనిపోతారని స్పష్టంగా తెలిసి ఉండటం తప్పనిసరి అని, అప్పుడు మాత్రమే ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం సాధ్యమవుతుందని తెలిపింది. అయితే ఫిర్యాదును, అందులో ఇతర అంశాలను పరిశీలిస్తే, జగన్ తదితరులకు సింగయ్యను చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఆయన చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదంది. సాధారణంగా తాము ఏ కేసులో కూడా ఎఫ్ఐఆర్ దశలో జోక్యం చేసుకోబోమని, అయితే ఎఫ్ఐఆర్లోని నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవన్న నిర్ణయానికి వస్తే మాత్రం జోక్యం చేసుకోకుండా ఉండలేమంది. జోక్యం చేసుకోకుండా ఉండే విషయంలో ఎలాంటి నిషేధం లేదంది. అలా జోక్యం చేసుకోవాల్సినటువంటి అరుదైన కేసుల్లో ఈ కేసు కూడా ఒకటని, అందువల్ల ఈ కేసులో జోక్యం చేసుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. జగన్ తదితరులపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల కాపీ బుధవారం అందుబాటులోకి వచ్చింది.దుర్గారావు చెప్పింది ఇదీ...‘ఈ కేసులో నిమ్మకాయల దుర్గారావు అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈ కోర్టు పరిశీలించింది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఘటన జరిగిన రోజు ఉదయం 10.30–11 గంటలకు మాజీ సీఎం కాన్వాయి తాడేపల్లి వైపు నుంచి జాతీయ రహదారి వైపు వచ్చింది. కారు డ్రైవర్‌కు సమీపంలో మాజీ సీఎం నిలబడి ఉన్నారు. అక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలందరూ ఆయన వైపు పరిగెత్తుకెళ్లారు. దీంతో మాజీ సీఎం కారు నుంచి బయటకు వచ్చి అక్కడికి వచ్చిన ప్రజలందరికీ అభివాదం చేశారు. ఈ సమయంలోనే కారు ఎడమ వైపు సర్వీసు రోడ్డులోకి తిరిగింది. ఓ వ్యక్తి డ్రైవరు వైపు ఉన్న కారు చక్రం కింద పడ్డారు. వెంటనే కాన్వాయిలో ఉన్న నలుగురు ఆ వ్యక్తిని పక్కకు తీసి చెట్ల కిందకు తీసుకెళ్లారు. ఆ తరువాత కాన్వాయి సర్వీసు రోడ్డులోకి వచ్చింది. అనంతరం గాయపడిన వ్యక్తిని చూసేందుకు వెళ్లా. కొద్దిసేపటికి అంబులెన్స్‌లో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయపడిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఆ తరువాత నాకు తెలిసింది ఏమిటంటే గాయపడిన వ్యక్తి మరణించాడు..’ అని దుర్గారావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో తెలిపారు. పోలీసులు దుర్గారావు ఇచ్చిన ఈ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని మొదట పెట్టిన బీఎన్ఎస్ సెక్షన్ 106 (నిర్లక్ష్యంతో మరణానికి కారణమయ్యారంటూ)ను సెక్షన్ 105 కింద మార్చారని పేర్కొన్నారు.అలా చనిపోతారని జగన్ తదితరులకు తెలుసని పోలీసులు చెబుతున్నారు...దర్యాప్తులో భాగంగా పోలీసులు మాజీ సీఎం వెంట ఉన్న భద్రతా సిబ్బందిని విచారించారని న్యాయమూర్తి తెలిపారు. వారి వాంగ్మూలాలను నమోదు చేశారని, అనంతరం జూన్ 25న పోలీసులు మేజిస్ట్రేట్ ముందు ఓ మెమో దాఖలు చేశారన్నారు. టర్నింగ్ తీసుకునే సమయంలో కారును వేగంగా నడపడం వల్ల ప్రజలు కారు కింద పడి మరణిస్తారని డ్రైవర్‌తోపాటు ఆ కారులో ఉన్న జగన్ తదితరులకు స్పష్టంగా తెలుసునని పోలీసులు ఆ మెమోలో పేర్కొన్నారన్నారు. జగన్ తదితరులు కారును వేగంగా నడపాలని డ్రైవర్‌కు చెప్పారని, అందువల్లే భారీగా జనాలు ఉన్న చోట కారును వేగంగా నడిపారని పోలీసులు ఆ మెమోలో చెప్పారని తెలిపారు. అయితే సెక్షన్ 105 వర్తించాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల చనిపోతాడని తెలిసి ఉండటం తప్పనిసరని, ఈ కేసులో జగన్ తదితరులకు చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఓ వ్యక్తి చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదన్నారు. అందువల్ల వారిని సెక్షన్ 105 పరిధిలోకి తీసుకురాలేరని తేల్చి చెప్పారు. -
ఊరు.. బేజారు!
‘కొత్త బట్టలు ఎక్కడ్నుంచి తేవాలయ్యా...? అర్థం చేసుకోవేం? ఏడాదిగా శని పట్టుకుంది. ఎట్లా చెప్పాల్రా నీకు..?’ – తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో కుమారుడి ఎదుట వానపల్లి దుర్గాదేవి నిర్వేదం!‘నేనేం చేయనవ్వా? నన్నే తీసేశారు.. ఏడాదిగా దరిద్రాన్ని చూస్తున్నా..’ – జక్కంపూడి నగర్లో పెన్షన్ కోల్పోయిన 80 ఏళ్ల వృద్ధురాలి వద్ద మాజీ వలంటీర్ సయ్యద్ బాషా నిస్సహాయత!!‘పండగొస్తే గుండె దడ వస్తోంది. పైసా అప్పు కూడా పుట్టడం లేదు. చుట్టాలొస్తున్నారంటే భయమేస్తోంది. సంతోషంగా ఉన్న రోజు లేదు. ఊరంతా కలిసి పండగ చేసుకుని ఏడాది దాటింది...’ – అనపర్తి ఎస్సీ కాలనీలో లక్ష్మీ భవాని, కోటేశ్వరి ఆక్రోశం!‘అవును మరి.. తాపీగా కూసున్నా...! సెంద్రబాబు డబ్బులు పంపాడని...! వడ్లు కొని ఇరగదీశాడని...! మా ఆవిడ ఫ్రీ బసెక్కి ఊరెళ్లింది...ఇంటినిండా గ్యాస్ బండలున్నాయి..!’ – సింగగూడెం, లింగపాలెం దగ్గర గోదావరి జిల్లాల యాసలో గండుల సుబ్బారావు, పొట్టవూరు శ్రీనివాస్ వ్యంగ సంభాషణ!!వనం దుర్గాప్రసాద్ – ఉభయ గోదావరి జిల్లాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : గోదారి పల్లెలంటే.. ఉప్పొంగే సంతోషాల పరవళ్లు! పచ్చని తోరణాల లోగిళ్లు! మర్యాదలతో అతిథులను ఉక్కిరిబిక్కిరి చేసే గోదారమ్మ తీరం ఏడాదిగా బావురుమంటోంది! పల్లె కళ తప్పింది. గత ప్రభుత్వ హయాంలో సాఫీగా సాగిన బతుకు బండి ఇప్పుడు గతుకుల బాటలో కూరుకుపోయి నరకం అనుభవిస్తోంది! వైఎస్ జగన్ పాలనలో ఏదో ఒక పథకం కింద నెలనెలా డబ్బులొచ్చేవి. అమ్మ ఒడి... విద్యా దీవెన.. వసతి దీవెన.. రైతు భరోసా... చేయూత... చేదోడు.. కాపునేస్తం... వాహన మిత్ర.. ఇలా ఒకదాని వెంట మరొకటిగా డబ్బులు అందేవి. పండుగలు వస్తే పేదలు సంతోషంగా జరుపుకొనేవారు. నెలకు సరిపడా సరుకులు ముందే తెచ్చుకునేవారు. స్కూళ్లు తెరవటమే ఆలస్యం.. పిల్లలకు యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, పుస్తకాలు.. విద్యా కానుక సిద్ధంగా ఉండేది! చేతిలో ట్యాబ్‌లతో పిల్లలు ఆత్మ విశ్వాసంతో ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లేవారు. టీడీపీ కూటమి సర్కారు ఏడాది పాలనలో అంతా తిరగబడింది! బతుకు బండి తలకిందులైంది!! మావోడు ఏమయ్యాడు..? ఊరితో బంధం తెగిందవ్వా..! కాళ్ల మండలం వేంపాడులో గ్రామ సచివాలయానికి వచ్చిన ఓ 60 ఏళ్ల అవ్వ ‘మావోడు ఏమయ్యాడయ్యా?’ అంటూ వలంటీర్ గురించి ఆరా తీసింది. ఇంటికే వచ్చేవాడు. పెన్ష¯న్Œ తెచ్చి ఇచ్చేవాడు. బిడ్డలా అండగా ఉండేవాడు.. అంటూ పేగు బంధమే తెగినంతగా బా«ధ పడింది. ఉండి దగ్గర ఉప్పులూరు గ్రామ వలంటీర్ కనిపించడంతో ఊరిలో వారంతా చుట్టూ చేరి ఆప్యాయంగా పలుకరించారు. ‘ఏమయ్యావ్ తండ్రీ..?’ అంటూ 80 ఏళ్ల లక్ష్మి ఆదుర్దాగా ఆరా తీసింది. మాసిన దుస్తులు, పెరిగిన గడ్డం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. రాజమహేంద్రవరంలో రోజూ కూలీకి వెళ్తున్నానని ఆ వలంటీర్ చెప్పాడు. ‘ప్రభుత్వం మారింది. మన ఊరితో బంధం తెగిందవ్వా..’ అంటూ కంట తడి పెట్టాడు. వీరవాసరం కొణితివాడలోనూ ఇదే సన్నివేశం. గణపవరం మండలం కొమ్మూరులో వలంటీర్ కోసం గ్రామస్తులు వాకబు చేస్తున్నారు. బడ్డీ కొట్టు బంద్.. కొవ్వూరు డివిజన్ పైడిమెట్ట, పోచారం, తాళ్లపూడి, బల్లిపాడు, చింతలపూడిలోని లింగపాలెం... ఇలా ఏ ఊరు చూసినా ఉసూరుమంటున్నాయి. ఆ పథకం... ఈ పథకం వచి్చందని, టీ కోసం నేను డబ్బులిస్తానంటే నేనిస్తానని పోటీ పడ్డ వాతావరణం ఇప్పుడు కానరావడం లేదు. బడ్డీ కొట్టు నరేష్ వ్యాపారం సాగక ఊరొదిలి వెళ్లాడు. ఊరందరికీ కూరలు అమ్మే సుజాత పట్నం చేరుకుంది. గ్రామంలో ట్యూషన్లు చెప్పే మాణిక్యం కాకినాడ కాలేజీలో అధ్యాపకుడిగా చేరాడు. పథకాలు వచ్చినన్నాళ్లు జనం చేతిలో డబ్బులుండేవి. పిల్లలకు ట్యూషన్లు చెప్పించేవాళ్లు! ఏడాదిగా పైసా రాకపోవడంతో గ్రామాల్లో గుబులు రేగుతోంది! చిన్న వ్యాపారాలు నడవడం లేదు. ఆటోవాలాలు డీలా పడ్డారు. ‘మేం టీడీపీనే... అయినా జగన్ పాలనే బాగుంది..’ ధర్మాజీ గూడెం వద్ద ఆటోవాలా నరేష్ తేల్చి చెప్పేశాడు! రైతుల ఆనందం ఆవిరి.. గోదావరి జిల్లాల్లో రైతన్న పరిస్థితి దయనీయంగా ఉంది. పంటలకు గిట్టుబాటు ధర లేదు.. ఈ ప్రభుత్వం దళారీల దయకు వదిలేసింది. ధాన్యం అమ్మితే డబ్బులివ్వకుండా తిప్పలు పెడుతోంది. తేమ శాతం అంటూ కోతలు పెడుతోంది. రైతు కూలీలకు పనులు లేవు. పట్టణాల్లో తాపీ పనులకు వెళ్తున్నారు. పిల్లల చదువులకు అప్పులే శరణ్యమయ్యాయి. వైఎస్ జగన్ పాలన సాగిన ఐదేళ్లూ స్వర్ణ యుగమని, ఇప్పుడు మాకు ఖర్మ పట్టుకుందని ఆవేదనగా చెబుతున్నారు. రైతుల ఆనందం ఆవిరైందని వ్యవసాయదారుడు సుబ్బారావు కండువాతో కన్నీళ్లు తుడుచుకున్నాడు. చెయ్యి తడిపితేనే అర్జీలు తీసుకునే పాడు రోజులు మళ్లీ దాపురించాయని చెప్పాడు.పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడకు చెందిన టైలర్ కృష్ణారావు ఏడాదిగా అష్ట కష్టాలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు పథకాలు ఏవీ రాకపోవడంతో బట్టలు కుట్టించేందుకు తనవద్దకు ఎవరూ రావడం లేదని, గతంలో నెలకు రూ.15 వేలు సంపాదించిన తాను రూ.3 వేలు ఆర్జించడం కూడా గగనంగా ఉందని చెబుతున్నాడు. కుమార్తెను చదివించేందుకు అప్పులు చేయాల్సి వచ్చిందని, భీమవరం వస్త్ర దుకాణంలో సగం రోజులు కూలీకి వెళ్తున్నానని చెప్పాడు. ఆ దేవుడి దయే..! ఆ దేవుడే నాకు తిండి పెట్టే ఏర్పాటు చేశాడు.. పెన్షన్ మంజూరు చేశాడు (వైఎస్ జగన్‌ను తలచుకుంటూ...) వలంటీర్ ఇంటికొచ్చి పలకరించేవాడు. ఇప్పుడు పలకరించే దిక్కులేదయ్యా. ఊరే బావురు మంటోంది – జోగి రామలక్ష్మి, (జక్కంపూడి నగర్, తూ.గో)బంధం తెగిపోయింది ఇంటర్ వరకు చదివా. జగనన్న పుణ్యమా అని వలంటీర్‌గా చేరి ఊరందరి కష్టసుఖాలు తెలుసుకునే భాగ్యం దక్కింది. మీకు ఐదు వేలు ఏమిటి.. పదివేలు ఇస్తానన్న చంద్రబాబు మమ్మల్ని రోడ్డున పడేశారు. దీనికి బాధపడటం లేదు గానీ మా పల్లెతో బంధం తెగిపోయిందని ఏడుపొస్తోంది. – సయ్యద్ బాషా (మాజీ వాలంటీర్) -
చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?.. విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘‘ఎన్ఎంసీ (NMC) గైడ్‌లైన్స్ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ (FMG) ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులైన తరువాత, ఇక్కడే ఇంటర్న్‌షిప్ పూర్తి చేసినా, ఎందుకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వడం లేదు? ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా, ఇది ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారు?’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు.‘‘ఇదేనా మీ పరిపాలన? మీరు చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే వారిపై పోలీసులతో దాడులు చేయిస్తారా? గడచిన ఏడాది కాలంగా వారిపై వివక్ష చూపుతూ, ఇంటర్న్‌షిప్ పేరుతో దీర్ఘకాలం వెట్టిచాకిరి చేయించుకుంటూ, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు లాభం చేకూర్చేలా, ఉద్దేశ పూర్వకంగా వీరికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్) నంబర్ ఇవ్వకపోవడం వాస్తవం కాదా?..తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తమ పిల్లలను విదేశాలకు పంపిస్తే, ఆ పిల్లలు కష్టపడి చదువుకుని కోర్సులు పూర్తిచేశారు. అలాంటి వారిని అంటరాని వారిగాచూస్తూ, వారి కెరీర్‌ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? వారిని నిరుత్సాహపరచాలన్నది మీ ప్లాన్‌లో భాగం కాదా?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘డాక్టర్లు కావాలనుకుంటున్న పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకునే ఇబ్బందుల్లేకుండా, ఇక్కడే, మన రాష్ట్రంలోనే, ప్రభుత్వ రంగంలో 17 కాలేజీలను, వాటి ద్వారా 2,550 సీట్లను తీసుకు వచ్చేలా మా ప్రభుత్వం పనులు చేసి, అందులో ఐదు కాలేజీలను ప్రారంభించింది. మిగిలిన కాలేజీలను కూడా పూర్తిచేసే స్థాయికి తీసుకువెళ్తే, చంద్రబాబూ.. మీరు వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తే, వాటిని వద్దు అన్న ప్రభుత్వం, దేశ చరిత్రలో మీది మాత్రమే కాదా? మీ అవినీతికోసం స్కామ్‌లు చేస్తూ ఆ కాలేజీలను ప్రయివేటీకరించే కుట్ర చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు..@ncbn గారూ మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఎన్ఎంసీ (NMC) గైడ్‌లైన్స్ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్(FMG) ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులైన తరువాత, ఇక్కడే ఇంటర్న్‌షిప్… pic.twitter.com/GKBsMr7e9J— YS Jagan Mohan Reddy (@ysjagan) July 2, 2025‘‘పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ కేటాయించిన సీట్లనుకూడా వద్దు అంటూ తిరిగి లేఖరాసి, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. ఇప్పుడు దేశంకాని దేశం వెళ్లి అక్కడ ఖర్చులు తగ్గించుకుని, కష్టపడి కోర్సులు పూర్తిచేసి వస్తే, వారికి పీఆర్ నంబర్ ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారు. పైగా అడిగితే పోలీస్ స్టేషన్లో వేశారు. తల్లిదండ్రులపైనా, విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్రబాబూ? ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, ఎన్ఎంసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వీరికి వెంటనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలి’’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన వైద్య విద్యార్థులు
సాక్షి, తాడేపల్లి: ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వంలో ఎవ్వరికీ భరోసా లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తిచేసుకుని, ఈ ప్రభుత్వ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వక ఇబ్బందిపడుతున్న విద్యార్థులు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు.వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో ఆ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్ర, పలువురు యువ వైద్యులు ఉన్నారు. గత రాత్రి పోలీసుల దాడి వివరాలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. తమ ఆందోళనకు కారణాలను వైఎస్ జగన్‌కు విద్యార్థులు వివరించారు.ఇక్కడ మెడికల్ సీట్లు రాకపోవడంతో తమ తల్లిదండ్రులు ఎన్నో కష్ట నష్టాలకోర్చి, అప్పులు చేసి మరీ తమను విదేశాలకు పంపించారని, తాము కూడా కష్టపడి మెడికల్ కోర్సులు పూర్తిచేశామని, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్ష, ఇంటర్న్‌షిప్ అన్ని చేసినా తమకు పీఆర్ నంబర్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఎఫ్ఎంజీ చేసిన మరి కొంతమంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఇవ్వడం లేదని, గడువుకు మించి ఇంటర్న్‌షిప్ పేరిట గొడ్డుచాకిరీ చేయించుకురన్నారని తెలిపారు. చదువులు పట్ల, విద్యార్థుల పట్ల, విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్యాయంగా ఉందని, మరో వైపు తమ ప్రభుత్వం హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైద్య ఆరోగ్య రంగాన్ని అత్యంత బలోపేతం చేస్తే ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు.ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చి, మన రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెంచేలా చర్యలు తీసుకున్నామని, ఐదు కాలేజీలు కూడా ప్రారంభించామని, కాని ఈ ప్రభుత్వం మిగిలిన వాటిని అడ్డుకుని, పైగా కేంద్రం ఇచ్చిన సీట్లను కూడా తిప్పిపంపిందన్నారు. మెడికల్ సీట్లు ఇస్తే, వద్దని తిప్పి పంపిన దేశంలో ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమేనని అన్నారు. విద్యార్థుల సమస్యలపై మాజీ సీఎం ఆవేదన వ్యక్తంచేస్తూ వారి పోరాటాలకు సంఘీభావాన్ని వ్యక్తంచేశారు. ప్రభుత్వం దృష్టిపెట్టి, ఈ సమస్యలను పరిష్కరించేంతవరకూ అండగా ఉంటామన్నారు. -
జులై 9న చిత్తూరు జిల్లాకు వైఎస్ జగన్
సాక్షి,తిరుపతి: కూటమి ప్రభుత్వంలో మామిడి రైతులకు ఆర్థిక కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఆరుకాలం కష్టపడి పండించిన మామిడి పంటను కొనేవారు కరువవడంతో రైతు కంట కన్నీరు కారుతోంది. బరువెక్కిన హృదయంతో వెనుదిరిగి వెళుతున్న రైతులు ఈ ప్రభుత్వంలో బతకలేమని మామిడి చెట్లను నరికివేస్తున్నారు. ఈ క్రమంలో జులై 9న వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తురు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌ను సందర్శించనున్నారు. అక్కడ మామిడి రైతులను పరామర్శించనున్నట్లు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి బుధవారం అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో లక్షల హెక్టార్లలో సాగు చేసిన మామిడి పంటను కొనేవారు లేకపోవడంతో రైతులు రోడ్లపైనే పారబోస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే మామిడి రైతులు నష్టాలతో కుదేలవుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. మామిడి రైతుల కష్టాలను తెలుసుకుని, ప్రభుత్వ మెడలు వంచి గిట్టుబాటు రేటు కల్పించేందుకు వైఎస్ జగన్ ఈ ప్రాంతంలో పర్యటించనున్నారని వెల్లడించారు. ఇంకా వారేమన్నారంటే..98 శాతం పల్ప్ ఫ్యాక్టరీలు టీడీపీకి చెందిన వారివే : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిరాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం, పొగాకు, మిర్చి, పత్తి, మామిడి, చెరకు ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. చిత్తూరు జిల్లా మామిడిపంటకు ప్రసిద్దిగాంచింది. ఈ ప్రాంతంలో అనేక పల్ప్ పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడి నుంచి పలు రాష్ట్రాలు, దేశాలకు కూడా ఎగుమతులు జరుగుతుంటాయి. కానీ ఈ ఏడాది మామిడి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. జిల్లాలోని ప్రధాన మామిడి మార్కెట్ల వద్ద ఎక్కడ చూసినా మామిడి పంటతో కూడిన లారీలు, ట్రాక్టర్లే బారులు తీరి కనిపిస్తున్నాయి. రైతుల నుంచి పల్ప్ కొనుగోలు చేయాల్సిన ఫ్యాక్టరీలు గత ఏడాది ఉత్పత్తి చేసిన పల్ప్ నిల్వలే అధికంగా ఉండటం వల్ల ఈ ఏడాది మళ్ళీ పల్ప్ ఉత్పత్తి చేస్తే తమకు నష్టం వస్తుందని చెబుతున్నాయి. దీనిలో అధికశాతం పల్ప్ ఫ్యాక్టరీలు కొనుగోళ్ళు నిలిపివేశాయి. ఫలితంగా మార్కెట్లో మామిడి కొనేవారు లేక, రైతులు తెచ్చిన పంటను రోడ్ల మీద పారవేసి వెళ్లిపోయే దుస్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ రైతులు ఇంత దారుణంగా నష్టపోలేదు. గతంలో మామిడికి రేటు పడిపోయినప్పుడు కోల్డ్ స్టోరేజీలను నిర్మించి, పల్ఫ్‌ను స్టోరేజీ చేసేందుకు సదుపాయాలు కల్పించారు. దీనిపై కూటమి ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి సారించడం లేదు. పైగా పల్ప్ ఫ్యాక్టరీల సిండికేట్ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉందని పథకం ప్రకారం ఒక తప్పుడు ప్రచారాన్ని ఎల్లో మీడియా ద్వారా ప్రారంభించారు. ఈ జిల్లాలో 98 శాతం పల్ప్ ఫ్యాక్టరీలు తెలుగుదేశంకు చెందిన వారివే. వారికి చెందిన పల్ప్ ఫ్యాక్టరీలతో కొనుగోళ్లు చేయించలేక, ప్రతిదానికీ వైఎస్సార్సీపీపై నెపాన్ని నెట్టేయడం, ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేయించడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. సమస్యను పరిష్కరించలేక, దానిపై ఎదురుదాడి చేయడం చంద్రబాబుకు అలవాటు. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచేందుకు, వారి పక్షనా పోరాడేందుకు జగన్ ఈ ప్రాంతంలో మామిడి మార్కెట్‌ను సందర్శించి, రైతులతో మాట్లాడనున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.దద్దమ్మ ప్రభుత్వమిది : భూమన కరుణాకర్రెడ్డికూటమి ఏడాది పాలన సందర్భంగా అబద్దాలతో పండుగలు చేసుకుంటున్న సీఎం చంద్రబాబుకు చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కన్నీరు, వారి కష్టాలు కనిపించడం లేదు. మార్కెట్లో కేజీ రూ.2 లకు కూడా ఎవరూ కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈ తరుణంలో మద్దతుధరను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? గతంలో ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిబడింది వైఎస్సార్, వైఎస్ జగన్.చిత్తూరు జిల్లాలో లక్షల హెక్టార్లలో మామిడి పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం తోటల్లోని మామిడిని కోయడం కూడా నష్టదాయకమేనంటూ రైతులు చెట్లమీదనే వదిలేస్తున్నారు. ఈ పరిస్థితిలో కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలి. కానీ చంద్రబాబు మాత్రం తనకు నిత్యం భజన చేసే ఈనాడు పత్రిక, టీవీ5 మీడియాల ద్వారా మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడానికి మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణమంటూ దిగజారుడు ప్రచారం చేయిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది ఎవరో కూడా వారికి తెలియదా? పల్ప్ ఫ్యాక్టరీలు గత ఏడాది నిల్వలను చూపి, కొత్తగా మామిడి కొనుగోళ్ళు చేయడానికి ముందుకు రావడం లేదు. ఇలాంటప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలో కూడా తెలియకుండా పాలన చేస్తున్నారా? తూతూ మంత్రంగా జిల్లా కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేయించి, ప్రభుత్వం మద్దతుధర ఇస్తుంది, ఫ్యాక్టరీలు కేజీ రూ.4 కి కొనుగోలు చేయాలని చెప్పి వెళ్ళిపోయారు. అంతేకానీ ఫ్యాక్టరీలను ఒత్తిడి చేసి, పంటను కొనుగోలు చేయించడం లేదు. ఈ దారుణమైన పరిస్థితుల్లో రైతులు స్వచ్ఛందంగా రైతులు మామిడి తోటలను నరికేస్తున్నారు. గిట్టుబాటుధర కల్పించలేని దద్దమ ప్రభుత్వం చంద్రబాబుది. స్వయంగా మామిడి రైతులను కలిసి, వారి సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెట్‌కు రానున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. -
సింగయ్య మృతిపై భార్య సంచలన వ్యాఖ్యలు
-
వైఎస్ జగన్‌ను కలిసిన సింగయ్య ఫ్యామిలీ
-
సింగయ్య, జయవర్దన్ కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా
సాక్షి, తాడేపల్లి: తన రెంటపాళ్ల పర్యటనలో మృతి చెందిన చీలి సింగయ్య, పాపసాని వెంకట జయవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ రెండు కుటుంబాలను రప్పించుకున్న ఆయన.. పార్టీ తరఫున అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. తొలుత చీలి సింగయ్య భార్య లూర్ధు మేరి, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు జగన్‌ను కలిశారు. ఇప్పటికే ఆ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. రూ.10 లక్షల ఆర్థిక సాయం కూడా అందజేసింది. ఈ తరుణంలో సింగయ్య కుటుంబ సభ్యులను ఓదార్చిన వైఎస్ జగన్.. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని, ఆదుకుంటామని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ సింగయ్య కుటుంబాన్ని వెంట పెట్టుకుని వచ్చారు. అదే సమయంలో.. ఈ పర్యటనలో సత్తెనపల్లికి చెందిన పాపసాని వెంకట జయవర్దన్‌రెడ్డి గుండెపోటుకు గురై మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కుటుంబానికి కూడా వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. తక్షణమే పార్టీ తరఫున రూ.10 లక్షల సాయం అందజేశారు. ఇవాళ జయవర్ధన్ తల్లిదండ్రులు సావిత్రి, భాస్కర్ రెడ్డి, సోదరుడు మణికంఠ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు జగన్‌ను కలిశారు. జయవర్ధన్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అన్నివిధాల ఆదుకుంటుందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఈ కుటుంబం వెంట వైఎస్సార్సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి వచ్చారు. -
‘బాబు అనుకూల మీడియానే జగన్ బలం చూసింది.. ఒప్పుకుంది’
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ జెండా మోసిన వారికి, పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పకుండా ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. ఇదే సమయంలో చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఉందన్నారు. పెన్షన్లు పెంచామని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. దీనిపై ప్రజలే సమాధానం చెబుతారు అని కామెంట్స్ చేశారు.ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, నియోజక వర్గాల ఇంఛార్జిలు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం, వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘ప్రజలను మరోమారు మభ్యపెట్టేందుకు చంద్రబాబు తొలి అడుగు కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకే బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ చేపడుతోంది.వైఎస్ జగన్ చేసింది సుపరిపాలనో.. చంద్రబాబు చేసేది సుపరిపాలనా అనేది ప్రజలకు తెలియజేయాలి. కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా జగన్ చేసింది సుపరిపాలన. పెన్షన్లు పెంచామని చంద్రబాబు గొప్పలు చెబుతున్నాడు. ఎంతమంది పెన్షన్లు అందక ఇబ్బంది పడుతున్నారో మారుమూల గ్రామాలకు వెళితే తెలుస్తుంది. అదే వైఎస్ జగన్ సీఎంగా ఉండి ఉంటే ఈ ఏడాది కాలంలో ఏం చేయగలిగేవారో ప్రజలకు మనం తెలియజేయాలి. వైఎస్ జగన్ చెప్పినట్లు మన కార్యకర్తలకు సెల్ ఫోనే ఆయుధం. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం. జెండా మోసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..‘ఎన్నికల్లో చంద్రబాబు, టీడీపీ నేతలు ఇంటింటికీ తిరిగారు. బాండ్లు చూపించి మరీ ఎంతెంత వస్తాయో చెప్పారు. చంద్రబాబు రీకాల్ కార్యక్రమంలో బాబు ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించడం మన బాధ్యత. నియోజకవర్గం, మండల స్థాయిలో చంద్రబాబు రీకాల్ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా విజయవంతం చేయాలి. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ప్రజలు ఈ ప్రభుత్వంపై సంతృప్తిగా లేరు. ప్రభుత్వ వైఫల్యాన్ని మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ..‘పోరాటాలు మనకు, మన పార్టీకి కొత్త కాదు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి పోరాటం చేసిన పార్టీ వైఎస్సార్సీపీ. వైఎస్ జగన్ నేతృత్వంలో మరోసారి మనం పోరాటాలకు సిద్ధమవ్వాలి. ఆచరణ కాని అబద్ధాల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి. వైఎస్ జగన్‌ను చూసి చంద్రబాబు మారాడని ప్రజలు భ్రమపడి ఓటేశారు. వైఎస్సార్సీపీ పోరాటం వల్లే ఈ ప్రభుత్వం తల్లికి వందనం ఇచ్చింది. వైఎస్ జగన్ సత్తెనపల్లి కార్యక్రమానికి ఎవరూ కార్లు పెట్టవద్దని పోలీసులు హెచ్చరించారు. కానీ, వేల మంది అభిమానులు స్వచ్ఛందంగా వైఎస్ జగన్ వెంట తరలివచ్చారు. చంద్రబాబు అనుకూల మీడియానే వైఎస్ జగన్ బలం గురించి నిజం ఒప్పుకుంటోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించాలి.మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌కు, వైఎస్సార్సీపీకి అనుసంధానం కార్యకర్తలే. సచివాలయాలను నమ్ముకుని మనం మునిగిపోయాం. రెండు అబద్ధాలు చెప్పి అయినా సరే మనం అధికారంలోకి వద్దామని వైఎస్ జగన్‌ను కోరాం. కానీ, అబద్ధాలు వద్దని వైఎస్ జగన్ చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేని వ్యక్తి చంద్రబాబు. ఈ ఐదేళ్లూ పనిచేసిన మన కార్యకర్తలను మర్చిపోకుండా పేర్లు రాసుకుందాం. మళ్లీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి న్యాయం చేస్తాం. చంద్రబాబు ష్యూరిటీ మోసం గ్యారంటీని మనం జనంలోకి తీసుకెళ్లాలి. జంప్ జిలానీలంతా టీడీపీలోకి పోయారు. మన దగ్గర దమ్ బిర్యానీ వంటి నాయకులు, కార్యకర్తలు మిగిలారు’ అని చెప్పుకొచ్చారు. -
ఛీ..ఛీ.. ఇదేం తిండి!
-
మీ భవిష్యత్తు నాది..! కార్యకర్తలకు జగన్ భరోసా
-
Singayya Case: ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులు
-
బాబు మాటలు రాష్ట్రానికి చేటు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూత వైద్యుడి అవతారమెత్తారు. సొంత ఆలోచనో.. ఎవరైనా సలహా ఇస్తున్నారో తెలియదు కానీ.. భూతాల భాష మాట్లాడి తన పరువు తానే తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రతిష్టనూ మసకబారుస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలోనే భూతాలు, దెయ్యాలు అంటూ మాట్లాడటం ఆయనకు, రాష్ట్రానికీ గౌరవం పెంచే పనైతే కాదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ద్వేషం, కోపం ఏమైనా ఉండవచ్చు. కానీ, అందుకోసం ఇలా తనను తాను భూత వైద్యుడిగా పోల్చుకుంటూ భూస్థాపితం చేస్తానంటూ ఉపన్యాసాలు చెబితే ఎవరికి నష్టం?. ఆధునిక సమాజంలో భూత వైద్యులను ఎవరైనా విశ్వసిస్తారా? అలా నమ్మేవారు ఎవరైనా ఉంటే వారు అమాయకులు, అంధ విశ్వాసాలను అనుసరించేవారై ఉంటారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకు వెళతారనో, లేక తాము చేసిన హామీలను నెరవేర్చుతారనో ప్రజలు ఓట్లు వేస్తే, వారికి భేతాళ మాంత్రికుడి కబుర్లు చెబితే ఎలా?. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, గత ప్రభుత్వ హయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జగన్ ఎన్నడైనా ఈ భూతాల భాష వాడారా?. ఆయన హయాంలో రిలయన్స్ అంబానీ, అదానీ, జిందాల్, ఆదిత్య బిర్లా వంటి పెద్ద, పెద్ద పారిశ్రామికవేత్తలు విశాఖలో సదస్సులో పాల్గొని ఏపీ గురించి ఎంత గొప్పగా మాట్లాడారు!. వైఎస్ జగన్ దార్శనికతను ఎంతగానో మెచ్చుకున్నారు. వారిలో ఇప్పుడు ఎవరైనా జగన్‌ను భూతంగా చెప్పారా?. మళ్లీ అ భూతం వస్తుందా అని ఎవరైనా అడిగారా?. అది నిజంగా జరిగి ఉంటే వారి పేర్లు చెబుతారా?. అదేమీ లేకపోయినా చంద్రబాబు ఎందుకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్రం పరువు తీస్తున్నట్లు?. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం బాగుండాలి. వారికి అవసరమైన వసతులు, రాయితీలు కల్పించాలి. వైఎస్ జగన్ ఏమని చెప్పేవారు.. పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే.. తనకు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు.. వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరిస్తామని అనేవారు. అంతే తప్ప అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అలాంటి సమావేశాలలో కానీ, ఇతరత్రా పెట్టుబడిదారులు వచ్చినప్పుడు గానీ.. జగన్ ఒక్కమాటైనా అన్నట్లు లేదు. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న గ్రీన్ ఎనర్జీకి సంబంధించి లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చింది. సంబంధిత పరిశ్రమలు ఆచరణలోకి రావడం ఆరంభమైందీ జగన్ టైమ్‌లోనే కాదా?. కర్నూలు వద్ద వేల కోట్ల పెట్టుబడితో గ్రీన్ కో ప్లాంట్ వచ్చింది జగన్ హయాంలోనే.. అప్పుడు వచ్చిన పరిశ్రమలు కొన్నింటికి ప్రారంభోత్సవాలు చేసి తమ ఘనతేనని కూటమి పెద్దలు చెప్పుకోవడం లేదా?. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. కానీ, గత ప్రభుత్వంపై నిత్యం నిందారోపణలు చేస్తూ పెట్టుబడిదారులలో అనుమానాలు కల్గించేలా చేస్తే ఎవరైనా ధైర్యంగా పరిశ్రమలు పెడతారా?. అసలే కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికంగా, శాంతిభద్రతల రీత్యా అంత అనుకూల వాతావరణం లేదన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. పలు చోట్ల ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను కూటమి బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల నిర్వాకాల వల్ల పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడ్డ ఘటనలు చోటు చేసుకున్నాయి. చివరికి విద్యుత్ ప్లాంట్ల బూడిద గురించి కూడా కూటమి నేతలు గొడవలు పడ్డారే!.. అంతెందుకు! ఒక మాజీ ఎమ్మెల్యే తన ప్రాంతమైన తాడిపత్రిలో ఇంటికి వెళ్లడానికి ప్రయత్నిస్తే టీడీపీ నేత ఒత్తిడితో పోలీసులు ఆయనను బలవంతంగా అనంతపురం తరలించారే. ప్రభుత్వ పెద్దలకు తెలియదా! ఇది మంచి వాతావరణమా?.సాక్షి మీడియాతో పాటు మరికొన్ని మీడియా సంస్థలపై కక్ష కట్టి ప్రభుత్వం చేస్తున్న పనులు పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటాయా?. ఏదో ఒక సాకుతో సాక్షి మీడియా సంస్థలపై ఏపీ వ్యాప్తంగా దాడులు చేయిస్తే, దాడులకు తెగబడిన మూకలపై సరైన చర్య తీసుకోకపోతే శాంతిభద్రతలు ఉన్నట్లా? లేనట్లా?. ఈ వార్తలు దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియవా?. పారిశ్రామికవేత్తలు గమనించరా?. ఒక పారిశ్రామికవేత్తను సైతం ఒక మోసకారి నటి కేసులో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించగా, ఆయన ఏపీలో కాకుండా మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదించింది వాస్తవం కాదా?. ప్రజలలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇలా భూతాల కబుర్లు చెబుతున్నారని పారిశ్రామికవేత్తలు ఊహించలేరా!. వైఎస్ జగన్ ఏపీలో ఎక్కడకు వెళుతున్నా ప్రజలలో వస్తున్న ఆదరణను తట్టుకోలేక చంద్రబాబు ఇలాంటి మాటలు అంటున్నారని వారికి తెలియకుండా ఉంటుందా?. జగన్ టైమ్‌లో పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి టీడీపీ మీడియా చేయని ప్రయత్నం ఉందా?. ఆదానికి భూమి కేటాయిస్తే మొత్తం రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారంటూ ప్రచారం చేశారే? ఇన్ని ఉదాహరణలు ఎదురుగా పెట్టుకుని జగన్ టైంలో విధ్వంసం జరిగిందని, భూతమని, మరొకటని డైలాగులు చెబితే పారిశ్రామిక వేత్తలు అంత అమాయకులా? నమ్మడానికి!. వారు అమాయకులైన సాధారణ ప్రజల మాదిరి కాదు కదా!. సాధారణ ప్రజలు ఎన్నికల సమయంలో బహుషా భూత వైద్యులను నమ్మి ఉండవచ్చు. ఇష్టారీతిన చేసిన వాగ్ధానాలకు ఆకర్షితులై ఉండవచ్చు. అల్లాఉద్దీన్ అద్భుత దీపం అనుకుని ఓట్లు వేసి ఉండవచ్చు. లేదా ఈవీఎంల మహిమ ఉండవచ్చన్న భావన కూడా లేకపోలేదు.కూటమి అధికారంలోకి వచ్చాక కానీ.. వారికి భూత వైద్యులను నమ్మడం వల్ల లాభం లేదని తెలిసి ఉండవచ్చు. అందుకే ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకతను తట్టుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ భూతం కబుర్లు చెప్పి ప్రజలను డైవర్ట్ చేయాలని తలపెట్టినట్లు కనిపిస్తుంది. ఆ భూతం రాదని తనది హామీ అని చంద్రబాబు అంటున్నారు. ఈసారి ఏమర పాటుగా లేనని అంటున్నారు. అంటే ఏమిటి అర్థం? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న అనుమానం కలిగేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నట్లు అనిపించదా!. భూత వైద్యులను విశ్వసిస్తే ఉన్న వ్యాధులు పోకపోగా కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో భూత వైద్యుల పాలనలో అదే పరిస్థితి ఏర్పడుతోందా?. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జగన్ నెల్లూరు పర్యటన తాత్కాలిక వాయిదా
-
ప్రజలకు అండగా నిలబడాలి, నిత్యం వారికి అందుబాటులో ఉండాలి... వైఎస్సార్సీపీ యువజన విభాగం ప్రతినిధులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం
-
మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే విచక్షణాధికారం మాకు ఉంది
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు సింగయ్య మృతి కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మరణానికి బాధ్యులుగా చేస్తూ... కారులో ప్రయాణిస్తున్న మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనీ తదితరులపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాదనల సందర్భంగా కౌంటర్ దాఖలుకు తాము సమయం కోరుతుండగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వ్యతిరేకించారు. తమ వాదనలను పూర్తిగా వినిపించలేదని, అలాంటప్పుడు స్టే ఇవ్వడం సరికాదంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు. దీంతో క్వాష్ పిటిషన్లలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే విచక్షణాధికారం ఈ కోర్టుకు ఉందని జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి తేల్చిచెప్పారు.సింగయ్య మృతికి సంబంధించి నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజినీ, జగన్ పీఏ నాగేశ్వరరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలేవరకు తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. పిటిషనర్లపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. మంగళవారం జస్టిస్ శ్రీనివాసరెడ్డి మరోసారి విచారణ జరిపారు.సింగయ్య ప్రమాదవశాత్తు కారు కిందపడ్డారని సాక్షులు చెబుతున్నారు..వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ సింగయ్య గుర్తుతెలియని వాహనం కిందపడి మృతి చెందారని తొలుత మీడియాకు చెప్పిన జిల్లా ఎస్పీ, తర్వాత మాట మార్చారని పేర్కొన్నారు. అనంతరం బీఎన్ఎస్ సెక్షన్ 106ను సెక్షన్ 105కు మార్చారని తెలిపారు. కోర్టు తమకు రక్షణ కల్పించిన మాట వాస్తవమేనని, అయితే తప్పుడు ఉద్దేశాలతో పెట్టిన కేసు నిలవడానికి ఎంతమాత్రం వీల్లేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ప్రయాణించిన కారు కిందపడే సింగయ్య మృతి చెందారంటూ ఆ కారును సీజ్ చేశారన్నారు.ఆయనను అవమానించడానికే ఇలా చేశారని.. పోలీసుల అత్యుత్సాహానికి, నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడం లేదనడానికి, రాజకీయ కక్షకు ఇదో పరాకాష్ఠ అని తెలిపారు. కేసులో సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిశీలించాలంటూ దానిని చదివి వినిపించారు. సింగయ్యే ప్రమాదవశాత్తు కారు కింద పడ్డారని తెలిపారు. ఈ మేరకు వీడియోలు ఉన్నాయన్నారు. అతడు కారు కిందపడిన వెంటనే పార్టీ కార్యకర్తలు పక్కకు తీసుకొచ్చి అంబులెన్స్‌లో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారని, 40 నిమిషాలు బతికే ఉన్నారని వివరించారు.సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసినట్లు దర్యాప్తు అధికారే చెబుతున్నారు..సింగయ్యపైకి కారు ఎక్కించినట్లు పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సెక్షన్‌ను జత చేశారని సుబ్రహ్మణ్య శ్రీరామ్ తెలిపారు. నిర్లక్ష్యంగా కారు నడిపారంటూ మొదట కేసు పెట్టి, దానిని మార్చి కల్పబుల్ హోమిసైడ్ కింద కేసు పెట్టారన్నారు. సింగయ్య ప్రమాదవశాత్తు కారు కిందపడ్డారని సాక్షులు చెబుతుంటే, పోలీసులు మాత్రం కారులో ఉన్న వైఎస్ జగన్ తదితరులపై బీఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు పెట్టారని.. ఈ సెక్షన్ కింద కేసు ఎంతమాత్రం చెల్లదని వివరించారు. ఘటనాస్థలంలో లేనివారిని కూడా సాక్షులుగా పేర్కొంటూ వారి వాంగ్మూలాల ఆధారంగా కేసు పెట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు.విశ్వసనీయ సమాచారం అంటూ పోలీసులు వాస్తవాలను మరుగున పెడుతున్నారన్నారు. ఇది రాజకీయ దురుద్దేశాలను స్పష్టం చేస్తోందన్నారు. సింగయ్య కారు కింద పడిన వీడియోను సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లు దర్యాప్తు అధికారి చెబుతున్నారని, ఈ రోజుల్లో కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా ఏ వీడియోనైనా సృష్టించడం చాలా తేలిక అని వివరించారు. వైఎస్ జగన్ తదితరులు కారును వేగంగా నడపాలని డ్రైవర్‌ను తొందర పెట్టారంటూ పోలీసులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.జగన్ భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందిన్యాయమూర్తి స్పందిస్తూ... కోర్టు ఇప్పటికే పిటిషనర్లకు రక్షణ కల్పించింది కదా? అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. ఏజీ కౌంటర్ దాఖలుకు గడువు కోరుతున్నారని గుర్తుచేశారు. దీనికి శ్రీరామ్ ప్రతిస్పందిస్తూ, వైఎస్ జగన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్షతో వ్యవహరిస్తోందని, ఉద్దేశపూర్వకంగా భద్రతను పట్టించుకోవడం లేదని, దీంతో ఆయన పర్యటనల సందర్భంగా దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. పొదిలి, గుంటూరు మిర్చి యార్డు, అనంతపురం జిల్లాలో జరిగిన ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చాటుతున్నాయన్నారు. ప్రజలను నియంత్రించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, లేదంటే సింగయ్య కారు కింద పడేవారు కాదన్నారు. ఈ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందన్నారు.అత్యవసర విచారణ అవసరం లేదువిచారణ మొదలుకాగానే ఏజీ స్పందిస్తూ, మరిన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచుతామని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, రెండు వారాల గడువు ఇవ్వాలని, లేకపోతే వారం అయినా గడువు ఇవ్వాలని కోరారు. పిటిషనర్లకు హైకోర్టు ఇప్పటికే రక్షణ కల్పించిందని, అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... పిటిషనర్లు వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
అండగా నిలబడాలి: వైఎస్ జగన్
పార్టీ యువజన విభాగం కార్యాచరణలో ఇది ఆరంభం మాత్రమే. తర్వాత జిల్లాల్లో నా పర్యటన ఉంటుంది. ఇంకా పాదయాత్ర కూడా ఉంటుంది. ఇక ముందు మనం మళ్లీ మళ్లీ కలుస్తాం. ఇది మనం మమేకం కావడంలో తొలి అడుగు. – వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ‘‘రాజకీయాల్లో ఎదుగుదలకు యువజన విభాగంలో పదవి కీలకం.. అది తొలి అడుగు.. ఎమ్మెల్యే కావాలన్నదే ఆ పదవుల్లో ఉన్న వారి లక్ష్యం కావాలి...’ అని వైఎస్సార్సీపీ యువజన విభాగం ప్రతినిధులకు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. నిత్యం ప్రజలతో మమేకం కావడం.. ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించడం.. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలిచి వారితో కలిసి పోరాడడం.. ఈ మూడు లక్షణాలను పార్టీలో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, అప్పుడే రాజకీయాల్లో నిలబడి ఎదుగుతారని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజకీయాల్లో ఎదుగుదలకు మంచి అవకాశం ఉంటుందని.. అందుకే చొరవ చూపి వెంటనే కార్యాచరణ మొదలు పెట్టాలని దిశానిర్దేశం చేశారు.‘ఎదగడం మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. అయితే మీరు ఆ మూడు లక్షణాలను పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు దాన్ని బేరీజు వేసుకోవాలి. ఆరు నెలల్లో మీరు అది సాధించాలి. మీరు పిలుపునిస్తే కనీసం 2 వేల మంది కదిలి రావాలి..’ అని సూచించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ యువజన విభాగం ప్రతినిధుల సమావేశం జరిగింది. పార్టీ యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో పాటు సీనియర్ నేతలు హాజరయ్యారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై యువజన విభాగం ప్రతినిధులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే..ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడిగా ఎదిగేందుకు అవకాశం..పార్టీలో క్రియాశీలకంగా నిర్మాణ కార్యక్రమం సాగుతోంది. ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ, వారు హామీలు ఎగ్గొట్టే విధానాన్ని ఎండగడుతూ.. ఈ సర్కారును నిద్ర లేపుతున్నాం. ఇందులో చాలా క్రియాశీలకంగా ఉన్నాం. అయితే ఇంకా ఎదగాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు నాయకుడి దృష్టిలో పడతారు. అధికారంలో ఉన్నప్పుడు పాలకులకు పదవుల పంపకంపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. కాబట్టి నాయకులపై దృష్టి అందరిపై అంతగా ఉండదు. ఎవరైనా నాయకుడిగా ఎదగాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అది సాధ్యం. మన పార్టీ నుంచి ఎన్నికైన వారిలో చాలా మంది కొత్తవారే. మూడు లక్షణాలు అలవర్చుకోవాలి..ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజకీయంగా ఎదుగుతారు. అయితే అందుకు కొన్ని లక్షణాలు అలవర్చుకోవాలి. ఒకటి.. నిత్యం ప్రజలతో మమేకం కావాలి. ఎప్పుడూ వారికి అందుబాటులో ఉండాలి. చిక్కటి చిరునవ్వుతో చక్కగా పలకరించాలి. అందరితోనూ అలాగే వ్యవహరించాలి. ఇంకా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వారితో కలిసి పోరాడాలి. ప్రజల తరఫున నిలబడాలి. వారికి తోడుగా ఉండాలి. ఈ మూడు చేయగలిగితే ఎవరైనా నాయకుడిగా ఎదుగుతారు.అదే మీ లక్ష్యం కావాలి..నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్లకు చెబుతున్నా. ఈరోజు నుంచి మీరు పని మొదలు పెట్టండి. మీరు పిలుపునిస్తే కనీసం 2 వేల మంది రావాలి. ఇది నియోజకవర్గం ఇన్ఛార్జ్లకు ఇస్తున్న టార్గెట్. అలా లేకపోతే ఆ దిశగా కృషి చేయాలి. నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా ఇది మీ తొలి అడుగు. మీ చివరి అడుగు కనీసం ఎమ్మెల్యే కావడం. ఎదగడం మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. కానీ మీరు పై మూడు గుణాలు పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు దాన్ని బేరీజు వేసుకోవాలి. ఆరు నెలల్లో దాన్ని సాధించాలి. కార్యాచరణ ఇలా ఉండాలి..దీనికి తగ్గట్టుగానే గ్రామ, మండల, మున్సిపాలిటీ, వార్డు కమిటీలు ఏర్పాటు కావాలి. వాటిలో సమర్థులను నియమించండి. ఎదగడానికి సిద్ధంగా ఉన్నవారిని పార్టీలోకి తీసుకురండి. అసంఘటితంగా ఉన్నవారిని సంఘటితం చేయాలి. అలా మీరు పక్కా ప్రణాళికతో పని చేస్తే, చొరవ చూపితే, కృషి చేస్తే రాజకీయంగా బాగా ఎదుగుతారు. అప్పుడు మీరు ఒక్క పిలుపునిస్తే జనం కదిలి వస్తారు. ఇక పార్టీ జిల్లా అధ్యక్షులు, యువజన విభాగం అధ్యక్షుడిగా మీరు పిలుపునిస్తే కనీసం 5 వేల మంది రావాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోతే వెంటనే కమిటీల మీద దృష్టి పెట్టండి.వాటిని ఏర్పాటు చేయండి. వాటి పనితీరు ఎప్పటికప్పుడు బేరీజు వేయండి. నియోజకవర్గ స్థాయిలో ఉన్న యూత్ అధ్యక్షులకు చేదోడు వాదోడుగా ఉంటూ, సలహాలు ఇస్తూ వారిని చేయి పట్టుకుని నడిపించండి. తద్వారా మీరు ఎదుగుతారు. అప్పుడు మీరు పిలుపునిస్తే ఐదు వేలు కాదు.. 20 వేల మంది కదిలి వస్తారు. ఇక పార్టీ జోన్ విభాగం అధ్యక్షుడిగా మీరు పిలుపునిస్తే 10 వేల మంది రావాలి. అలా లేకపోతే, ఆ స్థాయికి ఎదగడం కోసం పక్కాగా ప్లాన్‌తో పని చేయండి. పార్టీలో కింది శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ ముందుకు నడిపించడం మీ కార్యాచరణ కావాలి. అలా మీరు రాజకీయంగా ఎదిగాక, మీరు పిలుపునిస్తే పది వేలు కాదు.. ఏకంగా 40 వేల మంది వస్తారు.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్..ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగడం కోసం పార్టీలో కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తున్నాం. వారు మీకు అండగా ఉంటారు. యువ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన యువ నాయకులను ఆ పదవుల్లో నియమిస్తాం. ఆర్గనైజేషన్ తెలిసిన వారు మీకు తోడుగా ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు పెడతారు. అలా కేసులు పెట్టినా ఎదుర్కొనేలా.. పార్టీ మీకు అండగా, తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చేందుకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన యంగ్ అభ్యర్థులను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తీసుకొస్తున్నాం. వారు పార్టీ జోన్లకు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పని చేస్తారు.ఆ విభాగాలు బలంగా ఉండాలి..పార్టీలో సంస్థాగతంగా యువజన, మహిళ, విద్యార్థి, రైతు విభాగాలు చాలా బలంగా ఉండాలి. అలాగే ఎస్సీ, బీసీ విభాగాలు కూడా పటిష్టంగా ఉండాలి. అప్పుడు పార్టీ మరింత బలపడుతుంది. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇవన్నీ పక్కాగా ఏర్పాటు చేసుకోవాలి. అలా అన్ని వ్యవస్థలు దృఢంగా ఏర్పడితే పార్టీ మరింత బలపడుతుంది. ఇంకా ఎదుగుతుంది. మీ ఫోన్.. మీ ఆయుధంఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో భాగస్వామ్యం కావాలి. ఇది సోషల్ మీడియా యుగం. కాబట్టి మీ ఫోన్ ఒక గన్ లాంటిది. అంటే అది ఒక ఆయుధం అన్నమాట. సోషల్ మీడియా ఎక్కౌంట్, యూట్యూబ్, ఎక్స్ పోస్టులు.. ఇలా అన్ని మాధ్యమాల్లో మీరు చురుకుగా ఉండాలి. గ్రామస్థాయి వరకు భాగస్వామ్యం కావాలి. మీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, పార్టీలో మా వరకు తెలియడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులందరికీ ఈ మెసేజ్ వెళ్లాలి. ఎవరికి, ఎక్కడ, ఏ అన్యాయం జరిగినా పార్టీ మొత్తం తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి. ఇదీ విజన్. ఇందులో భాగస్వాములు కావాలి. ఇది మీ అందరికీ తెలియాలి.విలువలు, విశ్వసనీయతకే పెద్దపీట2011లో మన పార్టీని స్థాపించాం. నేను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు నా వెనక ఎవరూ లేరు. నేను, అమ్మ.. ఇద్దరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాం. మా ఇద్దరితోనే పార్టీ ప్రస్థానం మొదలైంది. అప్పుడు నాతో రావడానికి కొందరు సిద్ధం కాగా.. ఇప్పుడు నా పరిస్థితే అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి, నాతో రమ్మని చెప్పను. రాజకీయంగా తెరమరుగైపోతావ్ అంటున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో నాతో రమ్మని చెప్పలేనన్నాను. దేవుడు దయ తలిచి, పరిస్థితులు చక్కబడ్డప్పుడు, నేను బాగున్నప్పుడు రమ్మని చెప్పా. ఎందుకంటే.. అప్పుడు నేను కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో ఢీ కొడుతున్నా. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ విలువలు, విశ్వసనీయతకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చా. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఏరోజూ వాటి విషయంలో రాజీ పడలేదు.ఒంటరిగా మొదలై ఎదిగాం..ఆ సమయంలో కాంగ్రెస్‌ను వీడి 18 మంది నాతో వస్తామన్నారు. వారందరినీ రాజీనామా చేయమని కోరా. అప్పటి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కూడా వస్తానంటే తననూ రాజీనామా చేయమన్నా. అలా 18 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ రాజమోహన్‌రెడ్డి అందరం ఉప ఎన్నికలకు వెళ్లాం. అప్పుడు నాకు 14వ లోక్‌సభలో రికార్డు స్థాయిలో అత్యధికంగా ఏకంగా 5.50 లక్షల మెజారిటీ వచ్చింది. పార్లమెంట్లో అందరూ మనవైపే చూశారు. దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో... నాపై కక్ష కట్టారు. సిట్టింగ్ ఎంపీగా ఎం.రాజమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో పార్టీ నుంచి 15 మంది విజయం సాధించారు. ఎక్కడా విలువలు, విశ్వసనీయత తగ్గలేదు.కాంగ్రెస్ – టీడీపీ కుమ్మక్కు...నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు చార్జీలు విపరీతంగా పెంచితే ఆ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. దానికి మద్దతు ఇవ్వాలని టీడీపీని కోరినా.. చంద్రబాబు కలిసి రాలేదు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి అండగా నిల్చి, నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడారు. కాంగ్రెస్, టీడీపీ రెండూ కుమ్మక్కయ్యాయి. దాంతో ఆ ప్రభుత్వం గట్టెక్కింది. అలా ఆ రెండు పార్టీలు విలువలు లేని రాజకీయం చేశాయి.టీడీపీకి దేవుడు మొట్టికాయ..రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే.. మన పార్టీ నుంచి 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు గెలిచారు. అయితే వారిలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను లాక్కున్నారు. అలా అనైతిక రాజకీయాలు చేశారు. కానీ ఆ తరువాత ఏం జరిగింది? 2019లో జరిగిన ఎన్నికల్లో మన పార్టీకి అఖండ విజయం దక్కింది. అదే టీడీపీకి ఆ ఎన్నికల్లో దేవుడు మొట్టికాయ వేశాడు. ఆ ఎన్నికల్లో టీడీపీకి సరిగ్గా 23 ఎమ్మెల్యే సీట్లు, మూడు ఎంపీ సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే అంతకుముందు మన పార్టీ నుంచి ఎంత మందినైతే అనైతికంగా లాక్కున్నారో, ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి సరిగ్గా అన్నే సీట్లు వచ్చాయి. -
వైఎస్ జగన్ భద్రతకు ప్రభుత్వం తిలోదకాలు
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగిన రక్షణ ఏర్పాట్లు చేయడం లేదని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. నిర్దేశిత విధి విధానాలు వేటినీ పోలీసులు పాటించడం లేదని పేర్కొన్నారు. ప్రజలను నియంత్రించేందుకు రోప్ పార్టీని ఏర్పాటు చేయడం లేదన్నారు. వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లిన ప్రతిచోటా అవాంఛనీయ ఘటనలకు ప్రభుత్వం, పోలీసులే ఆస్కారం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ నెల 3న వైఎస్ జగన్ నెల్లూరు వెళ్తున్నారని, అక్కడ తగిన భద్రత ఏర్పాట్లు చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. హెలిప్యాడ్ విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని వివరించారు. కాగా, ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు... నెల్లూరు పర్యటన సందర్భంగా వైఎస్ జగన్‌కు కల్పించనున్న భద్రతకు సంబంధించిన వివరాలను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసర పిటిషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ వైఎస్ జగన్ ఈ నెల 3న నెల్లూరు పర్యటనకు వస్తున్న సందర్భంగా తాత్కాలిక హెలిప్యాడ్ ఏర్పాటుకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పర్వతనేని చంద్రశేఖర్‌రెడ్డి హైకోర్టులో మంగళవారం అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ హరినాథ్ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపించారు. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్ల కోసం రెండు స్థలాలను సూచిస్తూ జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇచ్చామన్నారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు.ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) యతీంద్రదేవ్ వాదనలు వినిపిస్తూ, నెల్లూరు జిల్లా జైలు సమీపంలో హెలిప్యాడ్ సిద్ధం చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ విషయాన్ని పిటిషనర్లకు చెప్పామన్నారు. వైఎస్ జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. కాబట్టి ప్రత్యేకంగా రోప్ పార్టీ అవసరం లేదన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ, ప్రజలను నియంత్రించేందుకు రోప్ పార్టీ ఏర్పాటు చేస్తే నష్టం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల సందర్భంగా రోప్ పార్టీని తాను చూశానని తెలిపారు. యతీంద్రదేవ్ స్పందిస్తూ, వైఎస్ జగన్‌కు కల్పిస్తున్న భద్రత విషయంలో పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామని.. విచారణను బుధవారానికి వాయిదా వేయాలని కోరారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన తాత్కాలికంగా వాయిదా
వెంకటాచలం: ప్రతిపాదిత హెలిప్యాడ్ ప్రాంతం అనువైనది కాకపోవడంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన తాత్కాలికంగా వాయిదా పడిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే... వాటిని పోలీసులు, అధికారులు అమలు చేస్తున్నారని ఆరోపించారు. వెంకటాచలం మండలం చెముడుగుంటలోని నెల్లూరు సెంట్రల్ జైలు సమీపంలో పోలీసులు సూచించిన హెలిప్యాడ్ స్థలాన్ని వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులు జంకె వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, నెల్లూరు రూరల్, ఉదయగిరి సమన్వయకర్తలు ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి కుమార్తె పూజిత తదితరులు మంగళవారం పరిశీలించారు. కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసుల్లో.. కాకాణి గోవర్థన్‌రెడ్డి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో ములాఖత్ కోసం వైఎస్ జగన్ పర్యటనను ఖరారు చేస్తే పది రోజుల నుంచి కూటమి ప్రభుత్వం, పోలీసులు అంగీకరించడం లేదని తెలిపారు. చివరగా సెంట్రల్ జైలు సమీపంలో ముళ్ల పొదలు, హైటెన్షన్ విద్యుత్తు వైర్లు ఉన్న ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం సరికాదన్నారు. అక్కడ రోడ్లు వేయాలన్నా, రెండు, మూడు రోజులు పడుతుందని, హెలికాప్టర్‌కు తిరిగి ఇంధనం నింపాలన్నా రేణిగుంట వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. వేలాదిగా తరలివచ్చే వైఎస్ జగన్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని అధికారులు భద్రత కల్పించడం లేదని తెలిపారు. ప్రాంతం, సాంకేతికంగా సమస్యలు ఉన్నట్లు పార్టీ నాయకత్వానికి తెలియజేశామని చెప్పారు. దీంతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన తేదీని మళ్లీ నిర్ణయిస్తామని తెలిపారు. -
బీవీ పట్టాభిరామ్ మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: ప్రముఖ హిప్నాటిస్టు, మెజీషియన్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డా. బీవీ పట్టాభిరామ్ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, ఇంద్రజాలికుడిగా, రచయితగా ఆయన ప్రసిద్ధి చెందారని, తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, తమిళ భాషల్లో పట్టాభిరామ్ రాసిన పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందాయన్నారు.అలాగే విద్యార్థుల కోసం తెలుగు రాష్ట్రాల్లో వేలాది పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు, వర్క్‌షాపులు, సెమినార్లను నిర్వహించి వారి జీవితాలపై ప్రభావం చూపారన్నారు. పట్టాభిరామ్ మృతితో విద్యా, వ్యక్తిత్వ వికాస రంగాల్లో తీవ్ర లోటు ఏర్పడిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నామన్నారు. పట్టాభిరామ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.‘‘బీవీ పట్టాభిరామ్ మృతి బాధించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు.ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డా. బి.వి. పట్టాభిరామ్ గారి మృతి బాధించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు భగవంతున్ని మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. pic.twitter.com/uK4lk2KBUL— YS Jagan Mohan Reddy (@ysjagan) July 1, 2025 -
Prasanna Kumar: ఎన్ని కుట్రలు, కుతంత్రాలైనా చేసుకో సింహం నెల్లూరులో దిగుతుంది..
-
త్వరలోనే 2.0 పాదయాత్ర కార్యకర్తల్లో జోష్ పెంచిన జగన్
-
పార్టీ స్థాపించినప్పుడు ఉన్నది నేను,అమ్మా మాత్రమే...
-
సింగయ్య కేసుపై ఏపీ హైకోర్టు స్టే.. పొన్నవోలు రియాక్షన్..
-
Singayya Incident: వైఎస్ జగన్ పై విచారణకు స్టే విధించిన ఏపీ హైకోర్టు
-
Tadepalli: పార్టీ యువజన విభాగం నేతలతో YS జగన్ భేటీ
-
రాజకీయంగా ఎన్ని ఇబ్బందులొచ్చినా రాజీ పడలేదు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం అనేది రాజకీయాల్లో ఎంతో ముఖ్యమని, అందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని యువ విభాగాన్ని ఉద్దేశించి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన యువ విభాగ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘యూత్ వింగ్ అనేది పార్టీలో క్రియాశీలకమైంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర. పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి. లీడర్లుగా ఎదిగేందుకు ఇప్పుడు గొప్ప అవకాశం. పార్టీ ప్రారంభించిన కొత్తలో అందరూ కొత్తవాళ్లే. పార్టీ పెట్టిన కొత్తలో నేను, మా అమ్మ మాత్రమే ఉన్నాం. నామీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్నవాళ్లు నాతో వచ్చారు. నా ప్రస్థానం అక్కడ నుంచి మొదలయ్యింది.. .. ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీ నాకు వచ్చింది. పార్లమెంటులో ప్రతి సభ్యుడూ మనవైపు చూసే పరిస్థితి. దాన్ని జీర్ణించుకోలేక మనమీద పగబట్టారు. 18 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే.. వాళ్లందరిచేతా రాజీనామా చేయించాను. ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. ఆ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ కలిసే పోటీచేశాయి. 2014లో 67 మందితో గెలిచాం. మళ్లీ మన దగ్గర నుంచి 23 మందిని లాక్కున్నారు. .. ఎన్నికష్టాలు వచ్చినా, విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశాం. రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా రాజీ పడలేదు. ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది చాలా ముఖ్యం. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ప్రజలకు తోడుగా నిలబడాలి. మంచి పలకరింపు అన్నది కూడా చాలా ముఖ్యం. ఇవి చేయగలిగితే.. లీడర్‌గా ఎదుగుతారు. యూత్ వింగ్‌లో ఉన్న వారు ప్రభావంతంగా పనిచేయాలి. రాజకీయంగా ఎదగడం మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని రాజకీయంగా పెంచడం నా చేతుల్లో ఉంది. పెరగాలంటే.. మీరు కష్టపడాలి. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయండి. సమర్థత ఉన్నవారిని పార్టీ వ్యవస్థల్లోకి తీసుకురండి. పార్టీని వ్యవస్థీకృతంగా బలోపేతం చేయాలి... మీ పనితీరును మీరు ఎప్పటికప్పుడు మీరే మదింపు చేసుకోండి. జోన్ల వారీగా యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా పెడుతున్నాం. ఎమ్మెల్యేలుగా పోటీచేసిన యువకులు దీనికి ఉంటారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలోకి రావాలి. వాస్తవాలను చెప్పడానికి ఇది ఒక ఆయుధం. అన్యాయాలను, అక్రమాలను ఈ మాధ్యమం ద్వారా వెలుగులోకి తీసుకురావాలి. ప్రజలందరి దృష్టికి ఈ సమాచారాన్ని చేరవేయాలి. ఎవరికి, ఏ అన్యాయం జరిగినా సమాజం దృష్టికి తీసుకు రావాలి అని వైఎస్ జగన్ సూచించారు. ఈ భేటీలో యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సహా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు హాజరయ్యారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన ఏర్పాట్లపై అనిల్ కుమార్ యాదవ్..
-
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలు
-
రెంటపాళ్ల కేసు.. వైఎస్ జగన్‌పై విచారణకు హైకోర్టు స్టే
రెంటళ్లపాళ్ల కేసులో పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ జగన్ విచారణకు ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటిని నిలిపివేస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు పెట్టారంటూ వైఎస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.సాక్షి, అమరావతి: సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో ఏపీ పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్ జగన్‌ను పోలీసులు విచారించకుండా హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటిని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలుకు ఏజీ రెండు వారాల గడువు కోరగా.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు పెట్టారంటూ వైఎస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది.క్వాష్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది కదా?.. ఏజీతో హైకోర్టు బెంచ్వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వాలి: జడ్జితో జగన్ లాయర్ వాదనలు వినాల్సిన అవసరం లేదు: జడ్జితో అడ్వొకేట్ జనరల్ సంఘటన తర్వాత నాలుగు రోజుల తర్వాత వీడియో విడుదల చేశారు: : జగన్ లాయర్ సోషల్ మీడియాలో డౌన్లోడ్ చేశామని ఎస్ఐ చెప్పారు: జగన్ లాయర్ ఏఐతో ఏదైనా సృష్టించగలిగే అవకాశం ఉంది కదా: జగన్ లాయర్ కౌంటర్ దాఖలుకు రెండు వారాల సమయం ఇవ్వండి: జడ్జితో అడ్వొకేట్ జనరల్ఆధారాలు ఉన్నా ఇంకా సమయం దేనికి?: జగన్ లాయర్పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ పర్యటనకు వెళ్తుండగా.. వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య ప్రమాదవశాత్తూ మరణించాడు. అయితే జగన్ కాన్వాయ్ కారణంగానే సింగయ్య మరణించాడంటూ నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ వైఎస్ జగన్‌తో పాటు పలువురు ఆయన వ్యక్తిగత కార్యదర్శి, వైఎస్సార్సీపీ నేతలూ క్వాష్ పిటిషన్లు వేయగా.. వాటంన్నింటిని కలిపే హైకోర్టు విచారణ జరుపుతోంది. గత విచారణ సందర్భంగా.. సింగయ్య మృతికి వైఎస్ జగన్ కారకులు ఎలా అవుతారంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్నవాళ్లపై ఎలా కేసు పెడతారు?. ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యుల్ని చేస్తారు?. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. నేటి విచారణలో జగన్ విచారణపై ఏకంగా స్టే విధించడం గమనార్హం. -
వైఎస్సార్సీపీ యువజన విభాగంతో నేడు వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం ప్రతినిధులతో మంగళవారం సమావేశం కానున్నారు. యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులను, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలు
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలకు తెరలేపింది. జులై 3న వైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తోంది. హెలిప్యాడ్‌కి అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కలిగిస్తోంది. వైఎస్ జగన్ ప్రజాదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. 27న వైఎస్ జగన్ పర్యటన కోసం వైఎస్సార్సీపీ నేతలు దరఖాస్తు చేశారు.ఇప్పటికి అనుమతి ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. కేవలం 100 మందే రావాలంటూ పార్టీ నేతలకు పోలీసులు ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ స్థలం యజమానికి అధికారులు, పోలీసులు ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు. వైఎస్ జగన్ ఏ జిల్లాకు వెళ్లిన పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఆయన పర్యటనపై టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. అక్కసుతో హెలిప్యాడ్ రద్దు చేయించేలా టీడీపీ నేతలు కుట్రలు పన్నుతూ.. అడుగడుగునా అడ్డంకులు పెడుతున్నారు.ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ రావడం తథ్యం: అనిల్వైఎస్ జగన్ పర్యటనపై 10 రోజుల క్రితమే సమాచారం ఇచ్చామని.. పర్మిషన్ ఇవ్వకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ రావడం తథ్యమన్నారు. -
రేపు వైఎస్సార్సీపీ యువజన విభాగం సభ్యులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ యువజన విభాగం సభ్యులతో రేపు (మంగళవారం) ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు. రేపు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ యువజన విభాగం ప్రతినిధులతో సమావేశమవనున్నారు. ఈ భేటీలో యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, యువజన విభాగం జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు పాల్గొంటారు. వీరితో పాటు పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు. -
పాశమైలారం ఘటన.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: సంగారెడ్డి జిల్లా పాశమైలారం రియాక్టర్ పేలుడు ఘటనలో పలువురు మృతి చెందడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన జరగటం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్న వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.పటాన్చెరు పారిశ్రామికవాడ పాశమైలారంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. సిగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, మ్యాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్ సహా చాలా భాగం దెబ్బతింది. ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కనిపిస్తోంది. షిఫ్ట్‌లో 150 మంది కార్మికులు ఉండగా.. ప్రమాదం జరిగిన బ్లాక్‌లోనే 90 మంది దాకా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.. మృతుల సంఖ్య 14కి చేరింది. కంపెనీ మేనేజర్ ఒకరు సైతం మృతి చెందినట్లు సమాచారం. -
అన్నమయ్య జిల్లా రోడ్డు ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి
-
అన్నమయ్య జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అన్నమయ్య జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురి కావడం అత్యంత బాధాకరమని అన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.చదవండి: ఈసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడో? -
ఏపీలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది: వైఎస్ జగన్
-
ఏపీలో ఈసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారు? ఫలితాలొచ్చి 45 రోజులైనా ప్రారంభించకపోవడం ఏమిటి?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
ఈసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడో?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ఏపీ ఈసెట్ ఫలితాలొచ్చి 45 రోజులవుతున్నా ఇప్పటికీ కౌన్సెలింగ్ ప్రారంభించలేదని.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ అంటూ ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ టీడీపీ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు చురకలంటిస్తూ ఆదివారం ‘ఎక్స్’లోని తన ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ.ఈసెట్ ఫలితాలొచ్చి దాదాపు 45 రోజులవుతున్నా ఇప్పటికీ కౌన్సెలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు.. రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభమవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్ల కోసం 34 వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. మే 15న ఈ ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదల చేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు’’. -
అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు: వైఎస్ జగన్
తాడేపల్లి: ఏపీ ఈసెట్ రిజల్ట్స్ వచ్చి 45 రోజులవుతున్నా ఇంకా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చంద్రబాబు సర్కారును నిలదీశారు ఇది ఏపీ విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనమంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు వైఎస్ జగన్.‘రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం 34వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. గతనెల మే 15న ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదలచేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు’ అంటూ విమర్శించారు.రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 29, 2025 -
బాబుకు జగన్ క్యూఆర్ కోడ్ వణుకు
-
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు టీడీపీ నేతల అడ్డంకులు
-
వైఎస్ జగన్ హెలికాప్టర్‌ను దిగనివ్వం.. కోటంరెడ్డి అనుచరుల అరాచకం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటనకు టీడీపీ నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి జైల్లో ఉంచిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డితో ములాఖత్‌కు వైఎస్ జగన్ జూలై 3న నెల్లూరుకు రానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ కోసం వైఎస్సార్సీపీ నాయకులు స్థలాన్ని పరిశీలిస్తుండగా నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరులు అడ్డుపడుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలో వైఎస్సార్సీపీ నాయకులు మూడు వేర్వేరు ప్రైవేటు స్థలాలను చూడగా.. కోటంరెడ్డి అనుచరులు ఆయా భూముల యజమానులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అక్కడ ఉన్న నిర్మాణాలతో పాటు భూములపై వివాదాలు సృష్టిస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. వైఎస్సార్సీపీ నేతలు శనివారం కొత్తూరు అంబాపురంలోని క్రైస్తవ మిషనరీ ఆధ్వర్యంలో నడిచే ఓ పాఠశాల మైదానాన్ని హెలిప్యాడ్ కోసం ఎంపిక చేశారు. స్కూల్ యాజమాన్యం అనుమతితో జిల్లా అధికారులకు దరఖాస్తు చేశారు. అయితే, ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు మిషనరీ స్కూల్ వద్దకు వెళ్లి వీరంగం సృష్టించారు. ట్రస్ట్ భూముల్లో ప్రభుత్వ భూమి ఉందంటూ హడావుడి చేశారు. భవనాలను కూల్చేస్తామంటూ రాద్ధాంతానికి దిగారు. దీంతో స్కూల్ సంబం«దీకులు భయాందోళనకు గురై హెలిప్యాడ్‌కు స్థలం ఇవ్వబోమని చెప్పాల్సి వచ్చింది. వైఎస్ జగన్ జనాదరణ చూసి భయపడి..రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 143 హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి గద్దెనెక్కిన టీడీపీ కూటమి ఆ హామీలు నెరవేర్చలేక తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుంది. దీనిని నిలదీస్తూనే మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తుండడంతో రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. ఆయన నెల్లూరు జిల్లాకు వస్తున్నారని తెలియగానే సంఘీభావం తెలిపేందుకు వేలాదిమంది తరలివస్తారని టీడీపీ నేతల్లో భయం పుట్టింది. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు అవరోధాలు సృష్టిస్తున్నారు. హెలిప్యాడ్‌కు స్థలాలు ఇవ్వకుండా యజమానులను బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. -
మనుగడ కోసం ‘మహా’ కుట్ర!
సుభద్రాదేవి గర్భంతో ఉన్న సమయంలో ఒకసారి అర్జునుడు ఆమెకు యుద్ధరంగంలో పద్మవ్యూహానికి సంబంధించిన జ్ఞానాన్ని బోధిస్తున్నాడట! ఆమె నిద్రలోకి జారుకోవడాన్ని గమనించకుండా అర్జునుడు చెప్పడం కొనసాగిస్తుండగా గర్భస్థ శిశువైన అభిమన్యుడు ఊ... కొడుతూ వింటున్నాడట! పద్మ వ్యూహంలో ఎలా ప్రవేశించాలనే ఉపదేశాన్ని పూర్తిచేసి, ఎలా నిర్గమించాలనే కథను అర్జునుడు ప్రారంభిస్తాడు. అదే సమయంలో కృష్ణపరమాత్ముడు ప్రత్యక్షమై సుభద్ర నిద్రపోతు న్నది... ఇక చాల్లే అని ఆపించాడట! ఆ రకంగా అభిమన్యుడు పద్మవ్యూహ ప్రవేశాన్ని గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే క్షుణ్ణంగా నేర్చుకోగలిగాడు. భారత రామాయణాది ఇతిహాసాలు, పురా ణాలు మన సంస్కృతిలో భాగం కనుక, వాటికి సంబంధించిన కథలన్నీ నమ్మాలనే కట్టుబాటు ఉన్నది కనుక ఈ కథను కూడా మనం నమ్ముతాము.ఈ కాలంలో కూడా అంతకు మించిన వండర్ టెలీపతీ ఉన్నదనే సంగతి నిన్ననే తెలిసింది. ‘ఏపీ పోలీస్–హ్యాకథాన్ –25’ అనే పేరుతో నిన్న గుంటూరులో ఒక టెక్నాలజీ సదస్సు జరిగింది. సందర్భం ఏదైనా సరే, టెక్నాలజీకి ఆది మధ్యాంతాలు తానేనని చెప్పుకోవడం చంద్రబాబు ఆనవాయితీ. అదే ఒరవడిని ఇక్కడ కూడా కొనసాగించారు. దేశంలో ఆటోలు, మోటార్ బైక్‌ల ఊబరైజేషన్ కోసం రూపొందించిన ‘ర్యాపిడో’ వృత్తాంతాన్ని ఆయన సభికులకు వివరించారు. ఆ యాప్‌ను రూపొందించిన వ్యక్తి తండ్రి గతంలో తెలుగుదేశం పార్టీ కార్య కర్తగా ఉండేవారట! అందువల్ల బాబు దగ్గరికి వస్తూపోతూ ఆయన చెప్పే సంగతులన్నీ వినేవారట. అలా విన్న ఫలితమే ఆయన కుమారుడు ర్యాపిడో యాప్‌ను డెవలప్ చేయడానికి కారణమైందట! చంద్రబాబు చేసిన జ్ఞానబోధ తండ్రి తలలోంచి తరంగయానం చేసి కుమారుడి మేధను తేజోమయం చేసిందన్నమాట!ఇటువంటి విడ్డూరాలను శషభిషలేమీ లేకుండా చెప్పు కోవడం చంద్రబాబుకు పరిపాటే! భారతదేశానికి ఐటీని పరి చయం చేసిందీ, సెల్‌ఫోన్ తీసుకొచ్చిందీ తానేనని చెప్పు కోవడం చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఎవరూ మరిచి పోకుండా ఉండడానికి ఆయన మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తూనే ఉంటారు. కలామ్‌ను రాష్ట్రపతిని చేసిందీ, వాజ్‌పేయికి జ్ఞానో దయం కలిగించి ‘స్వర్ణ చతుర్భుజి’ పథకానికి శ్రీకారం చుట్టించిందీ తానేనని కూడా ఆయన చెప్పుకున్నారు. సత్య నాదెళ్ల,పీవీ సింధు విజయాల వెనుక తన పాత్ర, కోవిడ్‌కు వ్యాక్సిన్ కనిపెట్టడం వెనుక తన దూరదృష్టీ వగైరాల గురించి పలు సందర్భాల్లో ఆయన నొక్కి వక్కాణించారు. ఇటువంటి వాగాడంబరాన్ని చూసి చాలామంది చాలారకాల అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. ఎటువంటి అనుమానమూ అవసరం లేదు. ఆయన పూర్తి స్వస్థతతోనే ఇలా మాట్లాడుతుంటారు. ఉద్దేశ పూర్వకంగానే ఆయన ఈ హాస్యరసాన్ని పండిస్తుంటారు.ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమైపోతుందనే గోబెల్స్ సూత్రాన్ని ఆయన తన పొలిటికల్ ఫిలాసఫీకి పునాదిగా భావిస్తారు. తాను వందసార్లు చెబితే వెయ్యిసార్లు రీసౌండ్ ఇచ్చేందుకు యెల్లోమీడియా ఉండనే ఉన్నది. ఈ సూత్రాన్ని ప్రత్యర్థులను అప్రతిష్ఠ పాల్జేయడానికీ, తనను ప్రమోట్ చేసు కోవడానికీ రెండు వైపులా పదునున్న కత్తిలా ఆయన వాడుతుంటారు. ఇప్పుడీ కత్తిని దూయడం బాగా ఎక్కువైంది. తనకి ప్పుడు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న అఖండ ప్రజాదరణ ఆయనకు కలవరం కలిగిస్తున్నది. ఇంచుమించు తన రాజకీయ అనుభవంతో సమానమైన వయసున్న జగన్ మాస్ ఇమేజ్ ఎన్ని జన్మలెత్తితే తనకు లభించాలి? లభించదు! అందుకే ఆయనపై దాడి. ఆయన వ్యక్తిత్వంపై కనీవినీ ఎరుగని దాడి. కోడికత్తి, తల్లీ – చెల్లీ, బాబాయ్–గొడ్డలి అనే పసలేని పదబంధాలతో అరిగిపోయిన రికార్డుల్నే ఆశ్రయిస్తూ చేస్తున్న అనైతిక దాడి. మద్య నియంత్రణ కోసం జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఒక మంచి పాలసీకి సైతం అవినీతి మరక అంటించేందుకు ఆపసోపాలు పడుతూ చేస్తున్న అసహ్య కరమైన దాడి.ఏడాది గడిచిపోయింది. జగన్ వ్యక్తిత్వ హననం కోసం ఎక్కుపెట్టిన దాడులు, ఆయన పార్టీ శ్రేణుల్ని చెల్లాచెదురు చేయడానికి పెడుతున్న కేసులు, చేస్తున్న అరెస్టులు ఫలిత మిస్తున్న సూచనలేవీ కనిపించడం లేదు. పైపెచ్చు ఎదురుదాడి మొదలైంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక గళం వీధివీధినా ప్రతిధ్వనిస్తున్నది. ఇక వ్యక్తిత్వ హనన కార్యక్రమమొక్కటే సరిపోదని, ఇంకేదో పెద్ద దాడే జరపాలని భావిస్తున్నట్టు పలు వురు అనుమానిస్తున్నారు. జగన్‌పై ఏదో దారుణమైన కుట్ర జరుగుతున్నదని రాష్ట్ర ప్రజలు బహిరంగంగానే శంకిస్తున్నారు. ఈ అనుమానాలను నిజం చేస్తూ జగన్‌ను ఉద్దేశించి ‘ఆ భూతం తిరిగి రాదు, భూస్థాపితం చేస్తాన’ని ముఖ్యమంత్రి చెబు తున్నారు. టీవీ ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. పెట్టుబడిదారు లతో జరిగే సమావేశాల్లో చెబుతున్నారు. పోలీసు అధికారుల సమావేశాల్లోనూ అదే రాజకీయ ఉపన్యాసం. కలెక్టర్ల మీటింగ్ లోనూ అదే తరహా సంస్కారహీనమైన ప్రసంగం.‘జగన్ మళ్లీ వస్తే ఎలా’ అని పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎప్పుడు ప్రశ్నించారో తెలియదు. జగన్ హయాంలో పారి పోయిన కంపెనీలేమిటో చెప్పరు. కూటమి వచ్చాక రూపాయికి ఎకరం ఇస్తామంటే తప్ప పరుగెత్తుకొచ్చిన ఇతర కంపెనీలేమిటో చెప్పరు. నిజానికి వాస్తవాలను పరిశీలిస్తే పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. కూటమి నేతల కప్పం డిమాండ్లకు బెదిరి‘ఇండియా సిమెంట్స్’ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. చెట్టినాడు, భవ్య సిమెంట్లు లంచాలివ్వలేక లాకౌట్లు ప్రకటించాయి. నవీన్ జిందాల్‌పై తప్పుడు కేసు పెట్టి వేధిస్తే జెఎస్‌డబ్లు్య కంపెనీ రాష్ట్రాన్ని వదిలేసి మహారాష్ట్రలో 3 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నది. మామూళ్ళ కోసం కూటమి నేతలు యూబీ కంపెనీ లారీలను అడ్డుకున్న ఖ్యాతి ఢిల్లీ సర్కార్‌ను కూడా తాకింది. గ్రీన్‌టెక్ రీమిక్స్‌లో, కోకాకోలా ప్లాంట్‌లో స్థానిక ఎమ్మెల్యేలు లంచాలు డిమాండ్ చేసి రచ్చ కెక్కారు. రామాయపట్నం పోర్టు పనుల్లో వాటా కోసం ఎమ్మెల్యే లారీలను అడ్డుకొని గబ్బు లేపాడు. కూటమి పాలనలో ఇటువంటి ఘటనలను డజన్లకొద్దీ ఉదాహరించవచ్చు.ఇక రూపాయికి ఎకరం కోటా పెట్టుబడిదారులను మిన హాయించి కూటమి సర్కార్ తెచ్చిన పెట్టుబడులు ఏమున్నాయి? ఎన్టీపీసీ వాళ్ళు గ్రీన్ ఎనర్జీ కోసం లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేందుకు జగన్ హయాంలోనే ఒప్పందం కుదిరింది. దానికి సంబంధించిన పరిపాలనా అనుమతులు, భూ బదలాయింపులు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు దాన్ని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. జగన్ హయాంలో ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలోనే పది లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరి గాయి. ‘అవి మా ఘనతే’నని ఇప్పుడు కూటమి సర్కార్ ప్రక టించుకుంటున్నది. జగన్మోహన్రెడ్డి దావోస్‌లో ఆదిత్య మిట్టల్‌తో సమావేశమై స్టీల్ ప్లాంట్ స్థాపనకు ఒప్పందం చేసుకుంటే అది కూడా బాబు తన జేబులో వేసుకున్నారు. నిజం చెప్పాలంటే ఏపీలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగం పారి శ్రామికవేత్తలను భయకంపితులను చేస్తున్నది. రాష్ట్రానికి రావడా నికి వారు నిరాకరిస్తున్నారు. కాని, జగన్‌కు భయపడి పరిశ్ర మలు వెళ్ళిపోయాయనే తప్పుడు ప్రచారాన్ని మాత్రం కూటమి నేతలు హోరెత్తిస్తున్నారు. యెల్లో మీడియా గగ్గోలు పెడు తున్నది.జగన్‌ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు ఒకటికి రెండు సార్లు అనగానే, ఓ వృద్ధ నేత జగన్ తల నరుకుతానంటూ బీపీ పెంచుకుంటాడు. ఒకరి తర్వాత ఒకరు చొప్పున కూటమి నేతలు ఇటువంటి ప్రకటనలే చేస్తారు. జగన్మోహన్రెడ్డి జనంలోకి వెళ్తున్నప్పుడు ఆయనకు ఇవ్వాల్సిన జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను నిరాకరించడం ద్వారా కూటమి సర్కార్ తన ఉద్దేశాన్ని బయటపెట్టుకుంటున్నది. ఆయనొక విశేష ప్రజా దరణ కలిగిన మాస్ లీడర్. ఆయన బయటకు వెళ్ళినప్పుడు ప్రజలు ఏ స్థాయిలో ఆయన వెంట నడుస్తా రన్నది అనేకమార్లు రుజువైంది. పోలీసులకు ప్రత్యేకంగా చెప్ప వలసిన పని లేదు. రాప్తాడు హెలిప్యాడ్‌ను అసంఖ్యాక జన సమూహం చుట్టుముట్టిన విజువల్స్‌ను టీవీల్లో చూడలేదా? ఆయన రోడ్డు ప్రయాణాల్లో వాహనాన్ని చుట్టుముట్టి కారు బానెట్‌పైకి కూడా ఎగబాకడం కనిపించలేదా? ఆయనకు ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకపోతే ఆయనంటే గిట్టని శక్తులు సమూహంలో చొరబడి ఆయన సమీపానికి చేరుకునే అవకాశం లేదా? అటువంటిదేదో జరగాలనే ఉద్దేశం లేకపోతే ఆయన భద్రతను ఎట్లా ఉపేక్షిస్తారు? ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, కుట్రపూరిత నిర్లక్ష్యం!ఈ వ్యవహారంపై పోలీసులు చెబుతున్న కహానీ చిత్రంగా ఉన్నది. మేము వందమందికి మాత్రమే అనుమతిచ్చాము, కానీ వాళ్ళు వేలాదిమంది వెళ్లారని పోలీసుల అభియోగం. ప్రజలు వేలాదిగా తరలిరావాలని జగన్మోహన్రెడ్డి గానీ, ఆయన పార్టీ వాళ్ళు గానీ దండోరా వేయలేదే? వార్త తెలిసిన ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. వాళ్ళను అడ్డుకోవడానికి రెంటపాళ్ల చుట్టూ ఇరవై చెక్‌పోస్టులు పెట్టి పోలీసుల్ని మోహరించారు కదా! నియంత్రించగలిగారా? రోడ్డు మీద అడ్డుకుంటే చేలల్లోంచి, చెలకల్లోంచి, వంకల్లోంచి, డొంకల్లోంచి తండోప తండాలుగా జనం చేరుకోలేదా? చెక్‌పోస్టుల్లో మోహరించిన పోలీసు సైన్యాన్ని జగన్ భద్రత కోసం కేటాయిస్తే అవాంఛనీయ సంఘటనలేమీ జరగవు కదా! అవాంఛనీయ ఘటనలు జరగా లన్నదే ప్రభుత్వ ఉద్దేశమైనపుడు, అందుకోసమే కుట్ర చేస్తున్నప్పుడు ఈవిధంగా ఆలోచించడం కూడా కుదరని పని.ఈ కార్యక్రమంలో ఒక వైసీపీ అభిమాని దురదృష్టకర మరణాన్ని కూడా కుట్రపూరిత కథకు ఉపయోగించుకోవడం రోత పుట్టించే చర్య. మరో కారు కింద పడి గాయాలైన సింగయ్య మృతి చెందాడని ప్రకటించిన ఎస్పీ, మూడు రోజుల తర్వాత ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ప్లేటు మార్చిన వైనాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారు. ఒక ఫేక్ వీడియోను సృష్టించి జగన్ ప్రయాణించే కారు కిందనే పడి సింగయ్య మర ణించాడనే కథను ప్రచారం చేశారు. మూడు నాలుగు రోజుల పాటు యెల్లో మీడియా దీనిపై వీరంగం వేసింది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ లోకల్ నాయకురాలు మాత్రం కూటమి తానా అంటే తందానా అనే స్థాయికి దిగజారిపోయారు. సింగయ్య మరణంపై ఎస్పీ ముందుగా చెప్పిన ప్రకారం నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌కు వర్తించే సెక్షన్లపై కేసులు పెట్టారు. జగన్మోహన్రెడ్డి కారును రంగంలోకి దించిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే ప్రమాదం చేసినట్టు సెక్షన్లు మార్చారు. తమ పార్టీ కార్యకర్తను జగన్మోహన్రెడ్డితో పాటు అందులో ఉన్న వాళ్లంతా హత్య చేసే ఉద్దేశంతో కారు ఎక్కించారట! వాహనం ప్రమాదం చేస్తే అందులో ఉన్న ప్రయాణికులు ఎట్లా బాధ్యత వహిస్తారని ఉన్నత న్యాయస్థానమే చీవాట్లు వేయవలసి వచ్చింది. సాక్ష్యాధా రాలతో మళ్ళీ వస్తామని ప్రభుత్వ లాయర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. మరి ఏ సాక్ష్యాలున్నాయని కూటమి నేతలు, యెల్లో మీడియా నిపుణులు వీరంగం వేశారో?జగన్ భద్రతపై కూటమి సర్కార్ కపట నాటకమాడు తున్నది. ఒక ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన భద్రతను ఇస్తున్నామని హోంమంత్రి చెబుతున్నారు. జగన్మోహన్రెడ్డి కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనా? ఒంటరిగా పోటీలోకి దిగిన ఆయన పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి. మూడు పార్టీల కూటమికి 55 శాతం ఓట్లు పడ్డాయి. అవన్నీ నిజంగానే పడ్డాయని వాదన కోసం ఒప్పుకుందాం. 2024 ఎన్నికలపై పరిశోధన చేసిన వోట్ ఫర్ డెమోక్రసీ (విఎఫ్‌డీ) అనే సంస్థ అనేక అనుమానాలు వ్యక్తం చేసిన సంగతిని వదిలేద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసి ఎనిమిది గంటలకు తుది ప్రకటన చేసిన తర్వాత, వారం రోజుల పిదప అనూహ్యంగా పన్నెండున్నర శాతం ఓట్లు పెరిగిన మాయాజాలాన్ని కూడా వదిలేద్దాం. ఈవీఎమ్లలో ఎన్నికలు జరిగితే నూటికి నూరుపాళ్లు ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉన్నదని ఎలాన్ మస్క్ లాంటి వాళ్లు ఎంతోమంది చెబుతున్న విషయాన్ని పక్కనపెడదాం. ఈవీఎమ్‌లతో జరుగుతున్న ఎన్ని కల్లో అక్రమాలు జరుగుతున్నాయనీ, అందుకు సాక్ష్యాలున్నా యనీ అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్ చెబుతున్న మాటల్ని కూడా పెడచెవిన పెడదాం. అయినా మూడు పార్టీలకు కలిసి వచ్చిన ఓట్లు 1 కోటీ 53 లక్షలు. జగన్ ఒక్కడికే 1 కోటీ 33 లక్షల ఓట్లు పడ్డాయి. తేడా ఇరవై లక్షలు. వారంరోజుల తర్వాత అనూహ్యంగా పెరిగిన ఓట్లు 49 లక్షలని విఎఫ్‌డీ ప్రకటించింది. అయినా, జగన్ కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనా? ఇటు వంటి సాకులతో జగన్ భద్రతను ప్రమాదంలో పడేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తే, ఆయనకు పార్టీ కార్యకర్తలే రక్షణ కవచమవుతారు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
సింగిల్‌గా అయితే సీన్ సితారే
ఎవరెన్ని అనుకున్నారు.. భారీ మెజారిటీతో గెలిచాం అని లోలోన చంకలు గుద్దుకుంటున్నప్పటికి.. కూటమి నాయకులకు మాత్రం ఇంకా వైఎస్ జగన్ అంటే భయం పోలేదు. జగన్‌కు జనంలో ఉన్న మాస్ ఇమేజ్ కూటమి నాయకులకు నిద్రలేకుండా చేస్తుంది. జగన్ ఇల్లు దాటడం లేదని ఓవైపు అంటూనే ఆయన వీధిలోకి వస్తే జనసంద్రం ఎలా ఉంటుందో చూసి లోలోన టీడీపీ, జనసేన నాయకులు కుళ్ళు కుంటున్నారు.మొన్న ఏదో మూడు పార్టీల మధ్య పొత్తు కలిసి వచ్చి అలా గెలిచేసారు కానీ అన్ని సందర్భాల్లోనూ ఇదే ఫార్ములా వర్కౌట్ అవుతుందని చెప్పలేం అని సాక్షాత్తు కూటమి నాయకులే ఒప్పుకుంటున్నారు. ఓకే కాంబినేషన్‌తో మళ్లీ మళ్లీ వస్తే సినిమా హిట్ అవుతుందని గ్యారెంటీ లేదని వాళ్ళే అంగీకరిస్తున్నారు. అన్నిటికి మించి మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటే తప్ప విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ జగన్ అలవోకగా అధికారాన్ని చేపడతారని తెలుగుదేశానికి వంతపాడే మీడియా సంస్థలు కూడా అంగీకరిస్తున్నాయి.నిత్యం వైఎస్ జగన్‌ను ఆడిపోసుకునే ఓ చానల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఒంటరిగా పోటీ చేస్తే కూటమికి చావు దెబ్బ తప్పదని అంగీకరించారు. మరోవైపు సూపర్ సిక్స్ హామీలు ఏవి అమలు చేయకుండా కేవలం మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా హైప్ తెచ్చుకొని తెచ్చుకొని అంతా బాగుందని చెప్పుకుంటాను కూటమి నాయకులకు.. దాని పెయిడ్ మీడియాకు కూడా సమాజంలో ఏం జరుగుతుందో అన్న విషయం స్పష్టంగా తెలుసు. ఎన్నికలకు ముందు నోటికి వచ్చిన హామీలు ఇచ్చి.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏమాత్రం ఆధారాలు లేని అభాండాలు వేసి రకరకాల మాయలు చేసి గెలిచిన కూటమి నాయకులు ఇప్పటికే ప్రజల్లో చులకన అయ్యారు.హామీలు ఎగ్గొట్టడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దండాలు దోపిడీలు రౌడీయిజం ప్రతిపక్ష నాయకుల మీద దాడులు అరాచకం మినహా ఇంకేమీ పనులు చేయకపోవడంతో ప్రజలకు సైతం ప్రభుత్వం మీద అసహ్యం మొదలైంది. మొదటి ఏడాదిలోనే ఇంత వెగటు పుడితే రానున్న నాలుగేళ్లలో ఇది మరింత ముదిరి కూటమి నాయకులను తన్ని తరిమేసే పరిస్థితికి వస్తుందని వారికి అర్థమైంది. ఒకసారంటే వీరి మాటలు ప్రజలు నమ్మారు కానీ మళ్ళీ మళ్ళీ అవే హామీలు అవే మోసకారి మాటలు చెబితే ప్రజలు నమ్మి నెత్తిన పెట్టుకోరు అనే విషయం కూటమి నాయకులతో పాటు ఆ మీడియాకు సైతం ఎప్పటికే అర్థమైంది.అంతేకాకుండా ఇటీవల పలు ప్రైవేట్ సంస్థలు చేసిన సర్వేల్లో కూడా దాదాపుగా 50 శాతం మంది ఎమ్మెల్యేలకు రెండోసారి గెలిచే అవకాశం లేదని తేలడంతో వారు ఇప్పుడు బిత్తిరి చూపులు చూస్తున్నారు. ఏదైతేనేం ఉన్న ఈ నాలుగేళ్లు ఉన్న కాడికి దండుకుందాం అనే టార్గెట్‌తో చాలామంది ఎమ్మెల్యేలు సహజం వనరులతో పాటు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దందా చేస్తూ సొమ్ములు వెనకేస్తున్నారు.ఈ పరిస్థితి కూడా కూటమి మీడియాకు తెలుసు.. అందుకే తాజాగా జరిగిన డిబేట్లో ఓ యాంకర్ సైతం ఇదే విషయాన్ని చెప్పలేక చెప్పలేక కుమిలిపోతూ చెప్పారు. కూటమి పొత్తులో లేకపోతే వైఎస్ జగన్ నిలువరించడం అసాధ్యం అని యాంకర్‌తో పాటు రఘురాం కృష్ణంరాజు సైతం అంగీకరించారు. ఏడాదిలోనే వారి పాలనపై వారికే నమ్మకం కోల్పోవడంతో.. ప్రజల ఇప్పుడు వైఎస్ జగన్‌పై దృష్టిసారించారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలకు మరింత వివరించి వారి మద్దతు కూడగట్టుకునేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా సమాయత్తం అవుతున్నాయి..* సిమ్మాదిరప్పన్న -
‘పెట్టుబడులు తెచ్చిందేమో జగన్.. ప్రచారమేమో చంద్రబాబుది’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే పెట్టుబడులన్నీ కట్టుకథలేనని విమర్శించార వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్. ఆయన సీఎం అయిన ప్రతీసారి ఇలాంటి కట్టుకథలే చెప్పుకుంటూ ఉంటారని మండిపడ్డారు. ఈరోజు(శనివారం, జూన్ 28) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పోతిన మహేష్.. కోటి ఉద్యోగాలు అంటూ 1999లో చెప్పి కనీసం లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదనే విషయాన్ని పోతిన మహేష్ గుర్తు చేశారు. ‘ 2014లో కూడా 25 లక్షల ఉద్యోగాలు, పది లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తానని కథలు వినిపించారు. 2024లో కూడా 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ మళ్ళీ మోసం చేశారు. ఇలా ప్రతిసారీ దారుణమైన అబద్దాలు చెప్పి జనాన్ని వంచిస్తూనే ఉన్నారు. కోటి యాభై లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నట్టు చంద్రబాబుకు చెందిన ఎల్లోమీడియానే చెప్పింది. మరి ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు?, ప్రపంచంలో ట్రెండింగులో ఉన్న నాలుగు పదాలను పట్టుకుని అది తానే చేశానంటూ భజన చేయించుకోవటం చంద్రబాబుకు అలవాటు. చంద్రబాబు చెప్పే మాటలు హంబక్కేనని ప్రజలు గుర్తించాలి. జగన్ తెచ్చిన పరిశ్రమలను కూడా తానే తెచ్చినట్టు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. ఎన్టీపీసీ లక్షా పదివేల కోట్ల విలువైన ఎంఓయూని జగన్ ప్రభుత్వంలో చేసుకుంది. అన్ని అనుమతులు, భూకేటాయింపులన్నీ జగనే చేశారు. కానీ చంద్రబాబు చేసినట్టు భజన చేసుకుంటున్నారుఇలా అనేక ప్రాజెక్టులను జగన్ తెస్తే చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. పెట్టుబడులు తెచ్చేది జగన్, ప్రచారం చేసుకునేది చంద్రబాబు. కూటమి నేతల బెదిరింపులు, దాడులకు పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎవరైనా పెట్టుబడులు పెట్టటానికి వస్తారా?, బాలాజీగోవిందప్ప లాంటి పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలను అరెస్టులు చేసి జైల్లో పెడితే ఇక ఎవరు పెట్టుబడులు పెడతారు?, జిందాల్ కూడా చంద్రబాబు ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక మహారాష్ట్రకు పారిపోయారు. తాడిపత్రిలో ఆదినారాయణరెడ్డి ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీపై దాడి చేయించారు. పల్నాడులో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సిమెంట్ ఫ్యాక్టరీలపై దాడి చేయించారు. శ్రీకాకుళం, శ్రీకాళహస్తిలలో అక్కడి ఎమ్మెల్యేలు కమిషన్ల కోసం వేధించలేదా?, మైహోం వారి సిమెంట్ ఫ్యాక్టరీపై వేధింపులకు పాల్పడలేదా?, కృష్ణపట్నం పోర్టు నుండి కమీషన్లు ఇవ్వలేదని సోమిరెడ్డి దాడి చేశారు. కమీషన్లు ఇవ్వకపోతే ఎమ్మెల్యేలు సీజ్ ద ఫ్యాక్టరీ అంటున్నారు. ఇలాంటి వారి వలన రాష్ట్రానికి ఎలా పెట్టుబడులు వస్తాయి?, అశోక్ లేలాండ్ 2021లో జగన్ హయాంలోనే ఉత్పత్తి ప్రారంభించింది. స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ కూడా అయింది. కానీ లోకేష్ వెళ్ళి మళ్ళీ ప్రారంభిస్తున్నట్టు బిల్డప్పులు ఇచ్చారుడైకిన్ సంస్థ 2022లో జగన్ హయాంలో ప్రారంభిస్తే దాన్ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. ఎవరి హయాంలో ఎన్నెన్ని పరిశ్రమలు వచ్చాయో చర్చకు సిద్దమా?, చంద్రబాబు బినామీ కంపెనీలకు వేల కోట్ల విలువైన భూములను కట్టబెడుతున్నారు. ఎకరం 99 పైసలకే ఎవరికోసం ఇస్తున్నారో చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలి. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు ఏమీ లేవు. ఉద్యోగాల కల్పన అనేదే జరగటం లేదు. కానీ వేల కోట్ల విలువైన భూములను తమ బినామీ కంపెనీలకు దోచి పెడుతున్నారు. దీనిపై ప్రజలు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలి’ అని పోతిన మహేష్ పేర్కొన్నారు. -
మాజీ ప్రధాని పీవీ జయంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి. ఈ సందర్బంగా పీవీకి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళి అర్పించారు. సంస్కరణలతో దేశ ఆర్థిక స్థితిని మలుపు తిప్పిన దార్శనికుడు పీవీ అని ప్రశంసించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘సంస్కరణలతో దేశ ఆర్థిక స్థితిని మలుపు తిప్పిన దార్శనికుడు భారతరత్న పీవీ నరసింహారావు. భారతదేశ తొలి తెలుగు ప్రధానిగా దేశానికి ఎన్నో విశేషమైన సేవలందించిన పీవీ జయంతి సందర్భంగా నివాళులు’ అంటూ వ్యాఖ్యానించారు. సంస్కరణలతో దేశ ఆర్థిక స్థితిని మలుపు తిప్పిన దార్శనికుడు భారతరత్న పీవీ నరసింహారావు గారు. భారతదేశ తొలి తెలుగు ప్రధానిగా దేశానికి ఎన్నో విశేషమైన సేవలందించిన పీవీ గారి జయంతి సందర్భంగా నివాళులు.#PVNARSIMHARAO pic.twitter.com/zU8ZGDJBwl— YS Jagan Mohan Reddy (@ysjagan) June 28, 2025 -
‘రప్పా రప్పా శ్రీకాంత్’కు రిమాండ్
సత్తెనపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఈ నెల 18న టీడీపీ సానుభూతిపరుడు బొల్లెద్దు రవితేజ వైఎస్సార్సీపీ అభిమానిగా మారి రప్పా రప్పా అంటూ ఓ పోస్టర్‌ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ పట్టణ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్‌వలి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిలో ఏ–2 బొల్లెద్దు రవితేజ, ఏ–4గా ఉన్న ప్రకాశం జిల్లా మిన్నెకల్లుకు చెందిన ఆరేటి వెంకట మల్లికార్జునరావు అలియాస్ మల్లిఖార్జున్ అలియాస్ మల్లి సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో నివసిస్తున్నాడు. మల్లిని పట్టణ పోలీసులు ఈ నెల 23న కోర్టులో హజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఏ–3గా ఉన్న సత్తెనపల్లి రాజులకాలనీకి చెందిన నాగ శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం సత్తెనపల్లి మొదటి అదనపు సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) కోర్టులో హజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కాగా ఏ–2 బొల్లెద్దు రవితేజ, ఏ–4 ఆరేటి వెంకటమల్లిఖార్జునరావుల బెయిల్‌కు దరఖాస్తు చేయగా న్యాయమూర్తి బెయిల్ తిరస్కరించి న్యాయవాది సమక్షంలో విచారణకు కస్టడికి ఇచ్చారు. -
బుల్లెట్ ఫ్రూఫ్ కారు.. అంతా సక్రమమే
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): మాజీ సీఎం వైఎస్ జగన్ బుల్లెట్ ఫ్రూఫ్ కారును గుంటూరు రవాణాశాఖ అధికారులు (ఆర్టీవో) శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 18న వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ఏటుకూరు రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో వెంగళాయపాలెం వాసి సింగయ్య మృతి చెందిన విషయం విదితమే. తొలుత వైఎస్ జగన్ కాన్వాయ్కి ముందు వెళ్లిన వాహనం కింద పడి సింగయ్య మరణించాడని ఎస్పీ చెప్పారు. ఆ తర్వాత జగన్ వాహనం కింద పడినట్లు తప్పుడు కేసు పెట్టారు. ఈ నెల 24న తాడేపల్లిలోని మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి నుంచి బుల్లెట్ ఫ్రూఫ్ కారు ఏపీ40డిహెచ్2349ను రవాణా శాఖ అధికారులు స్వా«దీనం చేసుకుని, నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రెండు రోజుల అనంతరం వాహనాన్ని గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని ఓ షెడ్లో ఉంచారు. ఎంవీఐ గంగాధర్‌ప్రసాద్ నేతృత్వంలో శుక్రవారం కారును విస్తృతంగా తనిఖీ చేశారు. అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయని తనిఖీల్లో వెల్లడైంది. స్వయంగా ఎంవీఐ అధికారి బుల్లెట్‌ఫ్రూఫ్ కారును 20 నిమిషాలు (టెస్ట్ డ్రైవ్) నడిపి, ఎటువంటి లోపాల్లేవని గుర్తించారని తెలిసింది. బుల్లెట్ ఫ్రూఫ్ కారు వల్ల ఎటువంటి ఇబ్బందుల్లేవని ఆర్టీవో అధికారులు తేల్చి చెప్పారు. -
ప్రమాదానికి ప్రయాణికులు బాధ్యులవుతారా? సింగయ్య మృతి ఘటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై ఎలాంటి కఠిన చర్యలొద్దు... నల్లపాడు పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశం
-
ప్రయాణికులు.. ప్రమాదానికి బాధ్యులా?
సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా సింగయ్య మృతి చెందిన ఘటనకు సంబంధించి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇతర పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తీవ్రస్థాయిలో ప్రశ్నించింది. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న వారిపై కేసు ఎలా నమోదు చేస్తారని విస్మయం వ్యక్తం చేసింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సాధారణంగా ఆ వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తారే గానీ కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసు నమోదు చేయరని గుర్తు చేసింది.ప్రమాదానికి కారులో ఉన్న వారిని ఎలా బాధ్యులను చేస్తారని సూటిగా ప్రశ్నించింది. భారీ సంఖ్యలో జనం ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయని, కుంభమేళా లాంటి చోట్ల కూడా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సింగయ్య మృతికి సంబంధించి నమోదైన కేసులో వైఎస్ జగన్, ఇతర నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజిని తదితరులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ కేసు కొట్టివేయాలంటూ పిటిషన్లుసింగయ్య మృతికి సంబంధించి నల్లపాడు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై తేలేంతవరకు తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని తమ పిటిషన్లలో హైకోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సుబ్రహ్మణ్య శ్రీరాం, చిత్తరవు రఘు, న్యాయవాదులు యర్రంరెడ్డి నాగిరెడ్డి, శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి, ఆర్.యల్లారెడ్డి, కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎస్పీ మొదట వేరే కారు అని చెప్పారు.. ఆ తర్వాత మాట మార్చారు... మొదట పొన్నవోలు వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు కారులో ప్రయాణిస్తున్న వారు మాత్రమేనని, సింగయ్య మృతితో వీరికి ఎలాంటి సంబంధం లేదన్నారు. వాస్తవానికి ప్రమాదం జరిగిన రోజు గుంటూరు ఎస్పీ స్పందిస్తూ ఏపీ 26 సీఈ 0001 నంబర్ కారు ప్రమాదానికి కారణమని స్వయంగా చెప్పారని పొన్నవోలు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. మూడు రోజుల తర్వాత అదే ఎస్పీ మాట మార్చారన్నారు. ప్రమాదానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి తదితరులు ప్రయాణించిన వాహనమే కారణమంటూ మీడియా ముఖంగా చెప్పారని నివేదించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ప్రమాదానికి వాహనంలో కూర్చున్న వ్యక్తులను ఎలా బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. వాహనంలో ఉన్న వారిని ఎలా విచారిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని చెప్పారు. పిటిషనర్లు ప్రమాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్నారు. ప్రమాదం తరువాత సింగయ్యను రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారన్నారు. ఓ వ్యక్తి మరణానికి కారణమై ఇప్పుడు ఏమీ జరగలేదంటూ చెబుతున్నారన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ వాహనంలో ప్రయాణిస్తున్న వారిని ఎలా విచారిస్తారని ప్రశ్నించారు. ప్రయాణికులకు ఏం పాత్ర ఉంటుంది..? వేల మంది సమూహంగా ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. కుంభమేళా లాంటి భారీ జన సమూహాలు ఉన్న చోట ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. వాహన ప్రమాదంలో.. ఆ వాహనంలో ఉన్న ప్రయాణికులకు ఏం పాత్ర ఉంటుందని విస్మయం వ్యక్తం చేశారు. అంత భారీ జనసమూహంలోని ఓ వ్యక్తి వాహనం కింద పడితే.. ఆ వ్యక్తిని అలా చావనివ్వండి అని ఎవరైనా పక్కన పడేసి వెళ్లిపోరుగా? అలాంటి ఉద్దేశం వాహనంలో ఉన్న వారికి ఉంటుందా? అని పోలీసులను సూటిగా ప్రశ్నించారు. దీనిపై అన్ని ఆధారాలున్నాయని, సమయం ఇస్తే వాటిని కోర్టు ముందుంచుతామని ఏజీ దమ్మాలపాటి నివేదించడంతో.. విచారణ మంగళవారానికి వాయిదా వేస్తామని, అప్పటి వరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. ఈ సమయంలో పొన్నవోలు స్పందిస్తూ అప్పటి వరకు స్టే ఇవ్వాలని కోరగా, ఆ అవసరం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. వైఎస్ జగన్ భద్రతపై పోలీసుల నిర్లక్ష్యంవైఎస్ జగన్ తరఫున శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఒక మాజీ సీఎంకార్యక్రమంలో భద్రతాపరంగా తీవ్ర లోపాలున్నా పోలీసులు కనీస స్థాయిలో కూడా పట్టించుకోలేదని న్యాయస్థానానికి నివేదించారు. దీనిపై తాము న్యాయపరంగా పోరాటం చేస్తున్నామన్నారు. మొదట బీఎన్ఎస్ సెక్షన్ 106 కింద పెట్టిన కేసును పోలీసులు, తర్వాత 105 (కల్పబుల్ హోమిసైడ్) కిందకు మార్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. వైఎస్ జగన్ భద్రత, జనసమూహాలను నియంత్రించే విషయంలో పోలీసులు తీవ్ర ఉదాశీనత ప్రదర్శిస్తున్నారన్నారు. భద్రత కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించారని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘ప్రభుత్వాన్ని పూర్తి ఆధారాలు కోర్టు ముందుంచనివ్వండి... ఈలోపు మీకు కావాల్సింది రక్షణే కదా? మీకు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిస్తా..’ అని తెలిపారు. అనంతరం శ్రీరామ్ స్పందిస్తూ.. తదుపరి విచారణ వరకు తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ, అప్పటివరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. -
బాబు బురిడీ ‘రీకాలింగ్’
సాక్షి నెట్వర్క్: ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి, అధికారం చేపట్టాక ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ (చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ...) కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు ప్రారంభించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించిన మేరకు తొలి దశలో జిల్లా స్థాయిల్లో ఏర్పాటుచేసిన సమావేశాలకు విశేష స్పందన లభించింది. ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమం పోస్టర్లను, క్యూఆర్ కోడ్లను నాయకులు విడుదల చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్ గ్యారెంటీ’ పేరుతో కుటుంబాల వారీగా వర్తించే పథకాల పేర్లు పేర్కొంటూ ఇచ్చిన బాండ్లను చూపించి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కలిగిన లబ్ధి, చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటం సాగిస్తూనే ఉంటామని స్పష్టంచేశారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐదు వారాలపాటు జరిగే ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని గ్రామ, గ్రామాన విజయంతం చేసేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబుతో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: సజ్జల రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అధ్యక్షతన నిర్వహించిన వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రారంభోత్సవం, ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దుర్మార్గం, మోసాలు, అన్యాయాలు, దౌర్జన్యాలతో రికార్డు సాధించారన్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఏడాది పాలనను గిన్నిస్‌బుక్ రికార్డుల్లో ఎక్కించవచ్చన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజలకు గుర్తు చేసేందుకే ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికలు పెడితే టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని ఆ పార్టీ అనుకూల సర్వే సంస్థలే చెబుతున్నాయన్నారు. వైఎస్సార్సీపీ అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు బాండ్లు చూపించి ఏం చేశారో అడుగుతాం: బొత్స ‘ఇదిగో చంద్రబాబు మేనిఫెస్టో. ఇవిగో ఆయనిచ్చిన బాండ్లు అని ప్రజలకు చూపిస్తాం. అధికారంలోకి వచ్చి ఏడాదైంది. చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని అడుగుతాం. చంద్రబాబు టక్కుటమార విద్యలతో ప్రజల్ని మోసం చేస్తే కుదరదు.’ అని శాసనమండలిలో విపక్ష నేత, వైఎస్సార్సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ చెప్పారు. కాకినాడలో ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం క్యూఆర్ కోడ్‌ను బొత్స, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విడుదల చేశారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో ఐదు వారాలపాటు నిర్వహించనున్న ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులందరూ సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం రూరల్ కంతేరులో బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు: పెద్దిరెడ్డి‘చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు. ఎన్ని అబద్ధపు హామీలైనా గుప్పిస్తారు. నమ్మిన వాళ్లను నట్టేట ముంచడానికి సైతం వెనకాడరు.’ అని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. తిరుపతిలో ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తితో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్తున్న పథకాల కంటే ఎక్కువగా ఇస్తానని హామీలు ఇచ్చిన చంద్రబాబు... అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మోసం చేస్తున్న ప్రజాద్రోహి అని మండిపడ్డారు. భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి పాదాల చెంత చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పి ప్రజలను వంచించి ఓట్లు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలోనూ ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సింగయ్య ఘటనలో వైఎస్ జగన్ పై కేసు పొన్నవోలు కీలక వ్యాఖ్యలు
-
సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలు చేయాలో బాబు చెవిలో చెప్పాలట..!
-
గిన్నిస్ బుక్‌లోని బాబు మోసాలు, దుర్మార్గాలు: సజ్జల
ప్రజలకు ఎన్నికల వేళ హామీలను ఎంత తేలికగా ఇచ్చారో.. వాటిని అంతే తేలికగా ఇప్పుడు చంద్రబాబు కొట్టేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏడాదిలోనే ప్రజావ్యతిరేకతను కూటమి ప్రభుత్వం మూట కట్టుకుందని.. అందుకే బాబు మెడలు వంచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారాయన. అశేష ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్‌పై సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా ప్రయోజనం ఉండదని సజ్జల తేల్చేశారాయన. సాక్షి, అనంతపురం: అబద్దాలను ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబును మించినవారు లేరని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శింగనమల నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం.. రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో(Recalling Chandrababu’s Manifesto) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మోసాలను గుర్తుచేసేందుకే ఈ కార్యక్రమం. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు... ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో, సూపర్ సిక్స్ హామీలు ఎలా అమలు చేయాలో చెవిలో చెప్పాలంటున్నారు!. హామీలను తేలికగా ఇచ్చినట్లే.. అంతే తేలికగా కొట్టిపారేస్తుంటారాయన. అందుకే ఏడాది కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలన్న కుట్రలతో చంద్రబాబు సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలందరినీ జైల్లో పెట్టాలన్నది చంద్రబాబు కోరిక. వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేసి.. బాధితులపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. కానీ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా.. చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అన్ని ఆధారాలతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశాం... జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన మంచి చాలా ఉండేది. చంద్రబాబు దుర్మార్గాలను చెబుతూ పోతే వారం రోజులు పడుతుంది. చంద్రబాబు మోసాలు, దుర్మార్గాలను గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించొచ్చు. అబద్ధాలను ప్రచారంలో చంద్రబాబును మించినవారు లేరు. రాష్ట్రంలో మట్టి, ఇసుకను ఎల్లో మాఫియా మింగేస్తోంది. కూటమి నేతలు ఇళ్లకు వస్తే నిలదీయడానికి.. చంద్రబాబు మెడలు వంచడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన దేశంలో రీకాల్ సిస్టం లేదు.. లేకపోతే చంద్రబాబు సర్కార్‌కు పదవీ గండం ఉండేది. .. హామీలపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. గడికోట శ్రీకాంత్ రెడ్డి పై ఎస్‌వోజీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం దారుణం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేసేందుకు, ఆయన్ని లేకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. ఆయనకు ఉన్న భద్రతను తొలగించింది. పేరుకే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత.. ఆచరణలో అమలు చేయడం లేదు. .. సింగయ్య మృతి కేసులో జగన్‌పై కేసు నమోదు.. దుర్మార్గానికి పరాకాష్ట. ఎన్ని బెదిరింపులు వచ్చినా సత్తెనపల్లి లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని చూసేందుకు జనం పోటెత్తారు. వైఎస్ జగన్‌ను ఎంత అణచి వేయాలని చూస్తే... అంత ఎదుగుతారు. మంచి పనులు చేస్తే జనం ఆదరిస్తారన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించాలి. వైఎస్ జగన్‌కు మద్దతుగా లక్షల మంది ఉన్నారు. వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. .. హామీలను త్రికరణ శుద్ధి తో అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట తప్పారు. అందుకే రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఇంటింటికీ వచ్చే మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీయాలి. చంద్రబాబు మోసాలను ప్రజల్లో తీసుకెళ్లండి’’ అని సజ్జల పార్టీ శ్రేణులను ఉద్దేశించి పిలుపు ఇచ్చారు. ఇంకా రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్ట్ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు చంద్రబాబు మోసాలను వివరించారు. ‘‘టీడీపీ కూటమి గెలుపు పై ఇప్పటికీ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంల అక్రమాల ద్వారా గెలిచారని ప్రజలు భావిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. చంద్రబాబు అక్రమ కేసులకు వైఎస్సార్ సీపీ నేతలు భయపడరు. నారా లోకేష్ రెడ్ బుక్‌ను ఎడమ కాలితో తన్ని ఎదిరిస్తాం. ప్రజలకు అండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ఉంటారు’’:::మాజీ మంత్రి శైలజానాథ్ప్రజా సమస్యలపై పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరు?. దళిత, గిరిజన బాలికల పై అఘాయిత్యాలు జరిగితే పవన్‌కు పట్టదా?. :::మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్చంద్రబాబు మోసాలను ప్రజల్లో కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా హామీలను అమలు చేయలేదు. చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య వెన్నుపోటు. అప్పుడు ఎన్టీఆర్ కు... ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దే. నవరత్నాలను పకడ్బందీగా అమలు చేసి వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ పోరాట ఫలితంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. :::వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. టీడీపీ కూటమి పై రోజు రోజుకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. టీడీపీ ఓటమి ఖాయం అని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ ప్రతి రోజూ జగన్ జపం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం లో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కటం లేదు. రైతులను గాలికొదిలేసి... మద్యం వ్యాపారులకు మాత్రమే చంద్రబాబు గిట్టుబాటు ధరలు కల్పించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ అమరావతి లో ఖర్చు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. :::వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి -
జగన్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: రెంటపాళ్ల పర్యటన కేసులో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. కారు ప్రమాదం జరిగితే.. కారులో ఉన్నవాళ్లపై కేసు ఎలా పెడతారు? అంటూ పోలీసులను నిలదీసింది. అలాగే ఈ కేసులో తదుపరి విచారణ జరిగేదాకా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెన్నపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త మరణించాడు. జగన్ కాన్వాయ్ వల్లే అతను మరణించాడని కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు.. నిందితుల జాబితాలో ఆయన పేరును కూడా చేర్చారు. అయితే రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు నమోదు చేశారని, ప్రజల్ని కలవకుండా అడ్డుకునేందుకే ఈ ప్రయత్నమని పేర్కొంటూ వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌తో పాటు ఇదే కేసులో వైఎస్సార్సీపీ నేతలు వేసిన మరో నాలుగు క్వాష్ పిటిషన్లను కలిపి హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ‘‘కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్నవాళ్లపై ఎలా కేసు పెడతారు?. ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యుల్ని చేస్తారు?. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ లాయర్ మరింత గడువు కోరగా.. తదుపరి విచారణను మంగళవారానికి(జులై 1వ తేదీకి) వాయిదా వేసింది. అప్పటిదాకా నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. జగన్ క్వాష్ పిటిషన్లో ఏముందంటే..మృతుడి భార్య లూర్థు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ 106(1) (నిర్లక్ష్యం కారణంగా చావుకు కారకులు) ప్రకారం మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎందుకనో.. బీఎన్ఎస్ సెక్షన్ 105 (హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్), 49 (నేరానికి ప్రేరేపించడం) సెక్షన్లుగా మార్చారు. మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కిందపడి నలిగినట్లు లేదని.. పోలీసుల వాదన నమ్మదగినదిగా లేదు. ప్రమాదానికి టాటా సఫారీ వాహనం కారణమని మొదట్లో పోలీసులు తెలిపారు. ఆ వాహన యజమానిని, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వాంగ్మూలాలను నమోదు చేసి, పూచీకత్తు తీసుకున్నాక బెయిల్‌పై విడుదల చేశారు.కాన్వాయ్‌లోని గుర్తుతెలియని వాహనం సింగయ్యను ఢీకొన్నట్లు గుంటూరు ఎస్పీ స్వయంగా ప్రకటించారు. నా పర్యటన(రెంటపాళ్ల) వివరాలను పోలీసులకు ముందుగానే అందజేసినా.. తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. ప్రజలను కలవకుండా అడ్డుకోవాలనే రాష్ట్రప్రభుత్వం ఈ కేసు పెట్టింది. పై అంశాలను పరిగణనలోకి తీసుకొని నాపై నమోదుచేసిన కేసును కొట్టేయాలి -
ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ తదితరుల వ్యాజ్యాలపై నేడు విచారణ
-
మొహర్రం మాసం ప్రారంభం.. ముస్లింలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: మొహర్రం మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి గుర్తుగా నిర్వహించుకునే ఈ పవిత్ర మాసాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని.. మొహర్రం స్ఫూర్తిగా మానవతావాదానికి పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.మొహర్రం మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి గుర్తుగా నిర్వహించుకునే ఈ పవిత్ర మాసాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, మొహర్రం స్ఫూర్తిగా మానవతావాదానికి పునరంకితం కావాలని…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 27, 2025 -
వైఎస్ జగన్ @ గన్నవరం ఎయిర్ పోర్ట్
-
సీఎం గారి భూతవైద్యం
-
చంద్రబాబు సర్కార్ మరోసారి రాజ్యాంగ ఉల్లంఘనపై జగన్ ఫైర్
-
హైకోర్టులో విచారణ జరుగుతున్నా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అప్పులా?... టీడీపీ కూటమి సర్కారుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అప్పులా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: హైకోర్టులో విచారణ కొనసాగుతున్నప్పటికీ టీడీపీ కూటమి సర్కారు రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ బుధవారం ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ) ద్వారా ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్) బాండ్లు జారీ చేయించి 9.30 శాతం వడ్డీకి రూ.5,526 కోట్లు అప్పు చేసిందని ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు.రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థి క క్రమశిక్షణ లేకపోవడం, రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందనేందుకు ఇదే తార్కాణమన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పుల్లో సగం అప్పులను టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే చేసిందన్నారు. ఈమేరకు ‘ఎక్స్’లో కేంద్ర ఆర్థి క శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ మీడియా సంస్థలను ట్యాగ్ చేస్తూ వైఎస్ జగన్ గురువారం తన ఖాతాలో పోస్టు చేశారు. అందులో ఏమన్నారంటే..‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి.. రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందనేందుకు ఇది మరో తార్కాణం. 2025 జూన్ 25న ఎన్సీడీ బాండ్లు జారీ చేయడం ద్వారా ఏపీఎండీసీ రెండో దశలో 9.30 శాతం వడ్డీతో రూ.5,526 కోట్ల మేర అప్పులు చేసింది. దీంతో ఎన్సీడీ బాండ్ల ద్వారా చేసిన అప్పు రూ.9 వేల కోట్లకు చేరుకుంది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వానికి, ఏపీఎండీసీకి నోటీసులు జారీ చేసినప్పటికీ రెండో దఫా అప్పులు చేశారు. రెవెన్యూ వ్యయం కోసం రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా అప్పులు చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి.. ఆర్బీఐలో రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ ఖాతాపై ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు టీడీపీ కూటమి ప్రభుత్వం అజమాయిషీ కల్పించింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించకుండా ఖజానా నుంచి నేరుగా నిధులను డ్రా చేసుకునే అధికారం ప్రైవేటు వ్యక్తులకు కల్పించింది. ఇది భారత రాజ్యాంగంలోని 203, 204, 293(1) ఆరి్టకల్స్‌ను ఉల్లంఘించడమే. అంతేకాదు.. ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు కనీవినీ ఎరుగని విధంగా రూ.1,91,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి అయిన ఖనిజ సంపదను అదనపు భద్రతగా తనఖా పెట్టింది.అది కూడా కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం! రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్‌పై అజమాయిషీ కల్పించి.. అసాధారణ రీతిలో భారీ విలువ కలిగిన ప్రభుత్వ ఆస్తిని తనఖా పెట్టడానికి అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఎన్సీడీ బాండ్లు... ఎస్డీఎల్ (రాష్ట్ర అభివృద్ధి రుణాలు) కంటే మరింత సురక్షితమైనవని ఎవరికైనా అర్థమవుతుంది. అయినప్పటికీ 9.30 శాతం వడ్డీకి ఏపీఎండీసీ ఎన్సీడీ బాండ్లు జారీ చేసింది.ఇది ప్రస్తుతం ఎస్డీఎల్ వడ్డీ రేటు కంటే 2.60 శాతం ఎక్కువ. అధిక వడ్డీ రేటు కారణంగా ఏపీఎండీసీపై ఏడాదికి అదనంగా రూ.235 కోట్ల భారం పడుతుంది. ఎన్సీడీ బాండ్ల వ్యవధి పదేళ్లు. అంటే.. ఈ డబ్బంతా ఎవరి జేబులోకి వెళ్తుందో చెప్పగలరా చంద్రబాబూ? ఎన్సీడీ బాండ్లు జారీ చేయడం ద్వారా చేసిన అప్పుతో 13 నెలల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్, ఆఫ్ బడ్జెట్ రుణాలు.. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన రుణంలో 50 శాతాన్ని దాటిపోయాయి’ -
వైఎస్ జగన్ తదితరుల వ్యాజ్యాలపై విచారణ నేటికి వాయిదా
సాక్షి, అమరావతి: సింగయ్య మృతికి సంబంధించి తమపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా... అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పూర్తి వివరాలను సమర్పించేందుకు గడువు ఇవ్వాలని కోరారు. కేసు డైరీని తెప్పించుకుని చూడాల్సి ఉందన్నారు.కొన్ని వ్యాజ్యాల్లో తాను, మరికొన్ని వ్యాజ్యాల్లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తారని తెలిపారు. కాబట్టి వైఎస్ జగన్ తదితరుల వ్యాజ్యాలపై విచారణను సోమ లేదా మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. ఈ అభ్యర్థనను పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చిత్తరవు రఘు, యర్రంరెడ్డి నాగిరెడ్డి, శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని, పిటిషనర్లపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లేవీ చెల్లవని తెలిపారు.పిటిషనర్లపై కేసు నమోదు ద్వారా పోలీసులు న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారని పేర్నొన్నారు. విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తే అభ్యంతరం లేదని, అప్పటివరకు కఠిన చర్యలేవీ తీసుకోకుండా రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. దమ్మాలపాటి స్పందిస్తూ అరెస్ట్ చేస్తారనే ఆందోళన కారణంగానే ఈ పిటిషన్లు దాఖలు చేశారని.. అలాంటప్పుడు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని అన్నారు. వైఎస్ జగన్ తదితరుల తరఫు న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ, మధ్యంతర రక్షణ కోరే హక్కు పిటిషనర్లకు ఉందని వివరించారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందన్నారు. తదుపరి విచారణ వరకు కఠిన చర్యలేవీ తీసుకోకుండా మౌఖిక హామీ ఇచ్చేలా ఏజీకి స్పష్టం చేసినా చాలని పేర్కొన్నారు. -
ఇది మనమంతా గర్వించదగ్గ క్షణం: వైఎస్ జగన్
తాడేపల్లి: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో అడుపెట్టిన శుభాంశు శుక్లా బృందానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇది నిజంగా మనందరికీ గర్వకారణమైన క్షణమని వైఎస్ జగన్ కొనియాడారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు జగన్.‘28 గంటల ప్రయాణం తర్వాత, అంతరిక్ష నౌక ఐఎస్ఎస్తో విజయవంతంగా డాకింగ్ జరగటం సంతోషకరం. శుభాంశు శుక్లా బృందం 14 రోజులపాటు పరిశోధనలు చేయబోతున్నారు. నాసా, ఇస్రోలు సంయుక్తంగా ఈ మిషన్‌ను విజయవంతం చేసి ఒక మైలురాయిని అధిగమించాయి.ఈ చారిత్రక విజయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నా’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.Truly a proud moment! Very happy to learn that after a 28-hour journey, the spacecraft successfully docked with the ISS. #ShubhanshuShukla and team are set for 14 days of crucial research. The #Ax4 Mission, a joint effort by NASA and ISRO, marks a significant milestone in space…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2025 ఆ 14 రోజులు ఎలా ఉంటుందనేదే అత్యంత ఆసక్తిగా ఉంది: శుభాంశు శుక్లాISSలోకి అడుగుపెట్టి.. చరిత్ర సృష్టించిన శుభాంశు -
‘పవన్ ఎవరి నార తీస్తావ్..ఎవరి మక్కెలు ఇరగదీస్తావ్!’
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో గురువారం భేటీ అయ్యారు. వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనల్లో భద్రతా లోపాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు సింగయ్య మృతిపై చంద్రబాబు చేస్తున్న రాజకీయాల్ని వివరించారు.అనంతరం, వైఎస్సార్సీపీ శాసన మండలి విపక్షనేత,బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో చట్టవ్యతిరేక చర్యలను చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌కు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వడం లేదు. భద్రత కల్పించకపోగా తిరిగి మా నాయకుడితో పాటు మాపై కేసులు పెడుతున్నారు. ఇది అప్రజాస్వామికం. ఈ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోంది. గవర్నర్ దృష్టికి అన్ని అంశాలను తీసుకెళ్లాం. సత్తెనపల్లిలో ప్రైవేట్ వాహనం ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని సాక్షాత్తూ జిల్లా ఎస్పీనే స్టేట్ మెంట్ ఇచ్చారు. సింగయ్య ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్‌కు సంబంధం లేదన్నారు. మూడు రోజుల తర్వాత ప్రభుత్వం ఒత్తిడితో ఎస్పీ మరో ప్రకటనను చేశారు. కారు డ్రైవర్ , కారులో ఉన్న జగన్‌తో పాటు మరికొంత మందిపై కేసులు పెట్టారుఇలాంటి దుర్మార్గపు చర్యలు ఏనాడూ చూడలేదు. చరిత్రలో ఎన్నడూ చూడనట్లు కేసులు నమోదు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాధరణ ఉన్న నాయకుడు. మా నాయకుడికి రక్షణ కల్పించాలి. సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా?. నిజంగా ప్రభుత్వం భద్రత కల్పిస్తే ఘటన జరిగినపుడు ఎవరూ ఎందుకు చూడలేదు.ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఏడాది కాలంలోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది .ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయడం మా బాధ్యత. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చూడలేదు’ అని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,హోమంత్రి అనితకు బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. పవన్ ఎవడి నార తీస్తారు.. ఎవరి మక్కెలు ఇరగదీస్తారు.ప్రజలే అందరి నార తీస్తారని గుర్తుంచుకోండి. తెలివితక్కువ మాటలు వెనక్కి తీసుకోవాలి. బాధ్యతా రాహిత్యమైన మాటలు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం ఎమ్మెల్యే కాదు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. గతంలో పర్యటనల సమయంలో చంద్రబాబు ఎందుకు అడిగారు. జడ్ ప్లస్ ఉన్న వ్యక్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా అని ఎందుకు ప్రశ్నించారు -
సింగయ్య మృతి ఘటనపై ఫేక్ వీడియోతో బాబు మార్క్ కుట్ర
-
చంద్రబాబు సర్కార్ మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘించటంపై వైఎస్ జగన్ ఫైర్
-
నీ వయసు 80 సంవత్సరాలు.. బుచ్చయ్య చౌదరికి దాడిశెట్టి రాజా కౌంటర్
-
బాబూ.. 9,000 కోట్ల అప్పు కోసం.. 1,91,000 కోట్ల గనుల తాకట్టు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు సర్కార్ మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అప్పులు చేయడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారు.. 5,526 కోట్లను బాండ్ల జారీ ద్వారా అప్పులు చేశారని తెలిపారు. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి? అని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదు. చంద్రబాబు సర్కార్ అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారు. రూ. 5,526 కోట్లను బాండ్ల జారీ ద్వారా అప్పులు చేశారు. గతంలోనే ఈ రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ అప్పులు చేశారు. రానున్న రోజుల్లో మళ్ళీ మళ్ళీ ఏపీఎండీసీ ద్వారా అప్పులు చేయటానికి సిద్దమయ్యారు.ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రైవేటు వ్యక్తులు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా చేయటానికి వీల్లేదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పార్టీలే నేరుగా నిధులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 203, 204, 293(1) నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. రూ.9000 కోట్ల అప్పుల కోసం ఏపీఎండీసీకి చెందిన రూ. 1,91,000 కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టటం దారుణం. అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావటం ద్వారా APMDCపై సంవత్సరానికి రూ.235 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి?. మా హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పుల్లో సగం చంద్రబాబు ఈ ఒక్క ఏడాదిలోనే చేశారు’ అని చెప్పుకొచ్చారు.Andhra Pradesh Government’s lack of fiscal discipline and disregard for the Constitutional framework.It is learnt that, on 25th June, 2025, APMDC concluded the second tranche of its NCD (bond) issuance at a coupon (interest) rate of 9.30% and raised Rs. 5,526 crores, taking the… pic.twitter.com/wiJSs6q1lK— YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2025 -
వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: ఏపీలో వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసులో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి, కేఎన్ఆర్, విడదల రజిని, పేర్ని నాని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు విచారణకు సమయం కోరారు. దీంతో, తదుపరి విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.ఇదిలా ఉండగా.. వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసులో కుట్రపూరితంగా తన పేరును చేర్చారంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నల్లపాడు పోలీసులు నమోదుచేసిన కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు. జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామానికి వైఎస్ జగన్ వెళ్లారు. ఆ పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని చీలి సింగయ్య అనే దళితుడు మృతిచెందాడని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. రాజకీయ ప్రతీకారంతోనే తనపై ఈ కేసు పెట్టారని జగన్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. పిటిషన్లో ఏముందంటే..మృతుడి భార్య లూర్థు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ 106(1) (నిర్లక్ష్యం కారణంగా చావుకు కారకులు) ప్రకారం మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎందుకనో.. బీఎన్ఎస్ సెక్షన్ 105 (హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్), 49 (నేరానికి ప్రేరేపించడం) సెక్షన్లుగా మార్చారు. మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కిందపడి నలిగినట్లు లేదని.. పోలీసుల వాదన నమ్మదగినదిగా లేదు. ప్రమాదానికి టాటా సఫారీ వాహనం కారణమని మొదట్లో పోలీసులు తెలిపారు. ఆ వాహన యజమానిని, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వాంగ్మూలాలను నమోదు చేసి, పూచీకత్తు తీసుకున్నాక బెయిల్‌పై విడుదల చేశారు.కాన్వాయ్‌లోని గుర్తు తెలియని వాహనం సింగయ్యను ఢీకొన్నట్లు గుంటూరు ఎస్పీ స్వయంగా ప్రకటించారు. తన పర్యటన(రెంటపాళ్ల) వివరాలను పోలీసులకు ముందుగానే అందజేసినా.. తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. ప్రజలను కలవకుండా అడ్డుకోవాలనే రాష్ట్రప్రభుత్వం ఈ కేసు పెట్టింది. పై అంశాలను పరిగణనలోకి తీసుకొని నాపై నమోదుచేసిన కేసును కొట్టేయాలి అని పేర్కొన్నారు. -
జగన్ భద్రతపై నారా వారి కుట్రలు.. పక్క ఆధారాలతో...
-
జగన్ కు ప్రాణహాని.. బుల్లెట్ ప్రూఫ్ కారు సీజ్.. తరువాత జరగబోయేది ఇదే!
-
ప్రజల్ని కలవకుండా అడ్డుకునేందుకే ఈ కేసు
వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసులో కుట్రపూరితంగా తన పేరును చేర్చారంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. నల్లపాడు పోలీసులు నమోదుచేసిన కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేయగా.. ఇవాళ అది విచారణకు రానుంది. జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామానికి వైఎస్ జగన్ వెళ్లారు. ఆ పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని చీలి సింగయ్య అనే దళితుడు మృతిచెందాడని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. రాజకీయ ప్రతీకారంతోనే తనపై ఈ కేసు పెట్టారని జగన్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. పిటిషన్లో ఏముందంటే..మృతుడి భార్య లూర్థు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ 106(1) (నిర్లక్ష్యం కారణంగా చావుకు కారకులు) ప్రకారం మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎందుకనో.. బీఎన్ఎస్ సెక్షన్ 105 (హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్), 49 (నేరానికి ప్రేరేపించడం) సెక్షన్లుగా మార్చారు. మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కిందపడి నలిగినట్లు లేదని.. పోలీసుల వాదన నమ్మదగినదిగా లేదు. ప్రమాదానికి టాటా సఫారీ వాహనం కారణమని మొదట్లో పోలీసులు తెలిపారు. ఆ వాహన యజమానిని, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వాంగ్మూలాలను నమోదు చేసి, పూచీకత్తు తీసుకున్నాక బెయిల్‌పై విడుదల చేశారు.కాన్వాయ్‌లోని గుర్తుతెలియని వాహనం సింగయ్యను ఢీకొన్నట్లు గుంటూరు ఎస్పీ స్వయంగా ప్రకటించారు. నా పర్యటన(రెంటపాళ్ల) వివరాలను పోలీసులకు ముందుగానే అందజేసినా.. తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. ప్రజలను కలవకుండా అడ్డుకోవాలనే రాష్ట్రప్రభుత్వం ఈ కేసు పెట్టింది. పై అంశాలను పరిగణనలోకి తీసుకొని నాపై నమోదుచేసిన కేసును కొట్టేయాలిమరోవైపు ఇదే వ్యవహారంపై తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె.నాగేశ్వరరెడ్డి, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి బుధవారం హైకోర్టులో పిటిషన్లు వేశారు. మరోవైపు.. మాజీ మంత్రులు పేర్ని నాని , విడదల రజిని హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలు అన్నీ ఇవాళే విచారణకు రానున్నాయి. -
జగన్ పై కుట్ర.. టీడీపీ ఆఫీస్ నుంచే ప్లాన్
-
బాబు మోసాలపై.. జగన్ యాక్షన్ ప్లాన్
-
చేసేది మేమే.. నిజం ఒప్పుకున్న లోకేష్
-
జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం సీజ్.. అదిగో కుట్ర - ఇదిగో సాక్ష్యం..
-
ఇంటింటికీ వంచన. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీపై గ్రామగ్రామాన.. ఇంటింటా ప్రచారం. పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు
-
ఫేక్ వీడియోతో బాబు మార్క్ కుట్ర!
సింగయ్యను పచ్చ బ్యాచ్ చంపేసిందా? వరుస పర్యటనలతో జనంలోకి దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని నిలువరించడానికే కూటమి ప్రభుత్వం ఇలా పన్నాగం పన్నిందా? జగన్, పార్టీ నేతలపై దొంగ కేసులు బనాయించింది ఇందుకేనా? తాజాగా బయటికి వచ్చిన వీడియోలు, వైద్యులు రాసిన శవ పంచనామా, పోలీసులు తీసుకున్న దొంగ సాక్షి వాంగ్మూలం... అన్నీ చూస్తే అవుననే భావించాల్సి వస్తోంది. 4 టన్నుల బరువున్న వాహనం మీద ఎక్కితే బతుకుతారా? ఇది గుద్దితే బాధితుడు కాలుపై కాలు వేసుకుని పడుకునే అవకాశం ఉందా? లేదని ఎవరికైనా అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వానికి, మడుగులొత్తే పోలీసులకు అర్థం కాదు. ఎందుకంటే జగన్మోహన్రెడ్డిని ఏదో రకంగా కేసులో ఇరికించడమే వారి కుట్ర కాబట్టి.. సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదాన్ని ఎల్లో మీడియా ఎంత దుర్మార్గంగా చిత్రీకరించిందో, చంద్రబాబు ప్రభుత్వం అంతకంటే దుర్మారంగా వ్యవహరించింది. వైఎస్ జగన్‌ను ఈ కేసులో ఇరికించేందుకు పక్కా కుట్ర పన్ని.. పోలీసుల ద్వారా వ్యవహారం నడిపించింది. ప్రమాదం జరిగిన వెంటనే కాన్వాయ్‌తో సంబంధం లేని వాహనం ఢీకొట్టడం వల్లే సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడని స్వయంగా జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. మూడు రోజుల తర్వాత సోషల్ మీడియాలో వచి్చన ఒక ఫేక్ వీడియో ఆధారంగా జగన్ వాహనం కిందే సింగయ్య పడ్డాడంటూ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో మాట మార్చారు. కాన్వాయ్ వాహనం నడుపుతున్న ప్రభుత్వ డ్రైవర్ రమణారెడ్డి ఏ1గా, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ2గా, ఆయన పీఏ కె.నాగేశ్వరరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజినిలను ఈ కేసులో చేర్చారు. అయితే పోలీసులు, ఎల్లో మీడియా చెబుతున్న, చూపిస్తున్న వీడియో విశ్వసనీయతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 4 టన్నుల బరువున్న వాహనం ఎక్కితే కాలు మీద కాలు వేసుకుని మాట్లాడుతాడా?మామూలు ఫార్చూనర్ వాహనం రెండు వేల కిలోలు ఉంటుంది. అదే బుల్లెట్‌ప్రూఫ్ వాహనమైతే 3.5 టన్నుల బరువు ఉంటుంది. అందులో ఉన్న మనుషులతో కలిపి 4 టన్నులు ఉంటుంది. ఇంత బరువున్న వాహనం ఒక మనిషి మెడపై నుంచి వెళితే స్పాట్లోనే నుజ్జునుజ్జుగా మారి చనిపోతాడు. అలాంటిది ఆ వాహనం కిందే పడ్డాడని చెబుతున్న సింగయ్య స్వల్ప గాయాలతో అరగంటకు పైగా స్పృహలోనే ఉండటంతో పాటు కాలుమీద కాలేసుకుని పడుకుని తనను ఆసుపత్రికి తీసుకువెళ్లమని అడుగుతున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. స్థానికులు ప్రైవేటు వాహనంలో అతడ్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా పోలీసులు ఒప్పుకోలేదు. దాదాపు 30 నిమిషాల తర్వాత అంబులెన్స్ వచ్చే వరకు ఆగి.. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు. అప్పటికి కూడా అతను స్పృహలోనే ఉన్నాడు. అతని వంటిపై స్వల్ప గాయాలే కనపడుతున్నాయి. వీడియో కూడా అతను కారు టైరు కింద పడినంత వరకే ఉంది. ఆ తర్వాత అతన్ని బయటకు తీసిన వీడియో ఎందుకు బయటకు రాలేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కాబట్టి, ఏఐ టెక్నాలజీతో ఈ వీడియోను సృష్టించినట్లు స్పష్టం అవుతోంది. చిన్న గాయాలకే చనిపోయాడా? మృతుడి శరీరంపై చిన్న చిన్న గాయాలు మాత్రమే ఉన్నాయని మార్చురీలో వైద్యులు నోట్ చేశారు. ఎడమ బుగ్గ, దవడ, కుడి కంటి కింద, ఛాతిపై కుడి వైపు, కుడి మోచేయి వెనుక నుంచి అరచేయి వెనుక భాగం వరకు, మోకాళ్ల వద్ద దోక్కుపోయి తోలు లేచిన గాయాలు ఉన్నాయని వైద్యులు స్పష్టంగా పేర్కొన్నారు. ఇంత చిన్న గాయాలు ఉన్నప్పుడు అతను అదే రోజు చనిపోయే అవకాశం లేదని, సింగయ్య వంటిపై చిన్న గాయాలు మాత్రమే ఉన్నాయని ప్రత్యక్ష సాక్షి, హైకోర్టు న్యాయవాది కోటేష్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీన్నిబట్టి ఇది కుట్ర అని స్పష్టంగా తెలుస్తోంది. దుర్మార్గానికి పరాకాష్టపోలీసులు తీసుకున్న సాక్షి వాంగ్మూలం దారుణంగా ఉంది. సింగయ్య వాహనం కింద పడిన తర్వాత కూడా డ్రైవర్‌ను కారులో ఉన్న జగన్మోహన్రెడ్డితో పాటు మిగిలిన వారు ఆపకుండా పోనీయమంటూ ఆదేశాలు ఇచ్చినట్లుగా రాశారు. అసలు వీఐపీ వెహికల్లో ఉన్న వారు డోర్ గ్లాస్లు వేసిన కారులో ఏం మాట్లాడారో బయటి వారికి ఎలా తెలుస్తుంది? సంఘటన జరిగిన సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కారు ఫుట్ రెస్ట్ ప్లేట్‌పై నిలబడి బయటి ప్రజలకు అభివాదం చేస్తుండటం ఆ ఫేక్ వీడియోలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సాక్షుల పేరుతో అబద్ధపు వాంగ్మూలాలు సృష్టించి ఈ కేసును బనాయించినట్లు కనపడుతోందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి వేలాది మంది ప్రజలకు అభివాదం చేస్తూ.. వారితో మమేకమైన తీరు స్పష్టంగా కనిపిస్తుంటే.. ఆయన కారు కింద ఓ వ్యక్తి పడినప్పటికీ.. వాహనం పోనివ్వమని చెప్పారంటూ ఎఫ్ఐఆర్లో రాయడం దుర్మార్గానికి పరాకాష్ట. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. -
'బాబు ష్యూరిటీ'.. ఇంటింటికీ వంచన
చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే.. ప్రజాగళం.. సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ హామీలు వస్తాయి. చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి. గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత? ఇక ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత? అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి(పథకాల వారీగా) నెలకు ఎంతెంత చొప్పున, ఏడాదికి ఎంత వస్తుంది.. అలా ఐదేళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది.. అని చెబుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్ పంపారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, ఆ వివరాలన్నీ తీసి రెడీగా పెట్టుకోండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే గత ఏడాది వడ్డీతో సహా బాకీ, ఈ ఏడాది ఇవ్వాల్సింది ఎప్పుడిస్తారని నిలదీయండి.ఏడాది గడిచింది. హనీమూన్ పీరియడ్ ముగిసింది. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే. కాబట్టి అందరినీ కలుపుకొనిపోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వాటిపై పోరాడాలి. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం. అప్పుడే మనం సత్తా చూపగలం. ఎందుకంటే ఇది రాక్షస రాజ్యం. ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ల దగ్గరకు పోయినా, ప్రయోజనం ఉండడం లేదు. కాబట్టి, మనం ప్రతి చోటా, ప్రతి క్షణం ప్రజలతో కలిసి వారి కోసం పని చేయాలి.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు.. ఇంటింటికీ ఆ హామీలను అమలు చేస్తానంటూ సంతకాలతో పంపించిన బాండ్లు గుర్తు చేస్తూ.. వాటిని ఏ మాత్రం అమలు చేయని చంద్రబాబు మోసాన్ని ప్రజల్లో ఎండగడుతూ.. దాని వల్ల ప్రతి కుటుంబం ఎంతెంత నష్టపోయింది? ఇంకా ఎంత నష్టపోతోంది? అన్న విషయాలపై అందరికీ అవగాహన కల్పించేలా ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ (చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ..) పేరుతో ఐదు వారాల బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, పార్టీ జిల్లా అధ్యక్షులతోపాటు పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు. ‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ’ కార్యక్రమానికి సంబంధించి సమావేశంలో క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించి.. రాష్ట్రంలో ఇంటింటికీ దాన్ని చేర్చే కార్యక్రమాన్ని వైఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపై విస్తృతంగా చర్చించి, పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలకు మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్. ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదురాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం పూర్తయింది. ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడూ లేదు. ఇంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా ప్యతిరేకత ఈ ప్రభుత్వంపై కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు ఈ వ్యతిరేకత మ«ధ్య, ప్రజలకు మంచి చేయాల్సింది పోయి, ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. అందుకే ఈ రోజు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్‌తో పాటు, అణిచివేత చూస్తున్నాం. రెడ్‌బుక్ పాలన చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రెండు ప్రభుత్వాల మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మన ఐదేళ్ల పాలనలో ఎలాంటి వివక్ష లేకుండా పథకాలు అందించాం. ఎవరు, ఏ పార్టీ అని చూడకుండా మంచి చేశాం. కానీ, కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో కనిపిస్తోంది ఏమిటంటే.. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, విచ్చలవిడిగా అన్యాయాలు చేస్తున్న పరిస్థితులు మాత్రమే. మన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులతో పాటు, పాలనలో పూర్తి పారదర్శకత చూపాం. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించాం. ఇలా ఎన్నో మార్పులు చేసి చూపాం. కానీ, చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యవంతం చేయండి ఈ సంవత్సరంలో చంద్రబాబు పాలనతో ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత? ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి, ఇంకా ఎంత నష్టం జరుగుతుంది. మరోవైపు మన ప్రభుత్వం ఉండి ఉంటే, ఎంతెంత ప్రయోజనాలు అందేవి అనేది చెప్పాలి. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలి. చంద్రబాబు ఇచ్చిన హామీల రిబ్బన్ కూడా కట్ చేయకుండా, అన్నీ అమలు చేశామని చెబుతున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే, నాలుక మందం అంటున్నాడు. అసలు చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు? ఇంటింటికీ బాండ్లు పంపించి ఎలా నమ్మించాడు? ఇప్పుడు ఎలా మోసం చేస్తున్నాడు? వీటన్నింటిపై గ్రామ గ్రామాన తీసుకుపోయేదే ఈ కార్యక్రమం. దీని పేరు.. ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’. అదే తెలుగులో.. ‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’ అందుకోసం ఈరోజు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ జరిగింది.చంద్రబాబు పచ్చి మోసాలను వివరించడమే లక్ష్యంచంద్రబాబు పచ్చి మోసాలను ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే.. ప్రజాగళం.. సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ హామీలు వస్తాయి. చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి. గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత? ఇక ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత? అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి (పథకాల వారీగా) నెలకు ఎంతెంత చొప్పున, ఏడాదికి ఎంత వస్తుంది.. అలా ఐదేళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది.. అని చెబుతూ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్ పంపారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, ఆ వివరాలన్నీ తీసి రెడీగా పెట్టుకోండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే నిలదీయాలి. గత ఏడాది బాకీ వడ్డీతో సహా.. ఈ ఏడాది ఇంకా ఎంత రావాలో.. అది ఎప్పుడు ఇస్తారో అడగండి. ఇవి కాకుండా, చంద్రబాబు గత ఎన్నికల్లో ఏం చెప్పారన్నది పథకాల వారీగా వివరిస్తూ.. వాస్తవానికి ఇప్పుడు ఏం చేస్తున్నారన్నది ప్రస్తావించాలి. ఇంకా రైతు భరోసా మొదలు ఉచిత బస్సు వరకు అమలు కాకపోవడంపై ఇటీవల నా ప్రెస్ కాన్ఫరెన్స్‌లోని మాటలు.. పక్కనే చంద్రబాబునాయుడి నాటి మాటలు చూపుతూ.. సూటిగా ప్రశ్నించేలా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. చంద్రబాబు దగా, మోసాలపై ఈనెల 4న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని మీరంతా బాగా పని చేసి విజయవంతం చేశారు. అందుకు మీ అందరికీ నా అభినందనలు. మొన్నటి యువత పోరు కార్యక్రమం కూడా బాగా జరిగింది. ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన వారికి కూడా నా అభినందనలు. జగన్ చేస్తున్నవే కాకుండా అంతకు మించి ఇస్తానన్నాడుఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా.. అంతకు మించి ఇస్తానన్నాడు. జగన్‌కన్నా ఎక్కువ చేస్తానన్నాడు. ఆ మాటలు చెప్పడమే కాకుండా, ప్రతి ఇంటికి తన నాయకులు, కార్యకర్తలను పంపించి.. ఆ కుటుంబం వద్దనే వారు కూర్చుని, మిస్డ్ కాల్ ఇప్పించారు. దాంతో ఓటీపీ కూడా ఇప్పించారు. దాన్ని ఎంటర్ చేయగానే, ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది. దాని వల్ల ఎంతెంత వస్తుంది? ఐదేళ్లలో మొత్తం ఎంత వస్తుంది? అన్న పూర్తి గణాంకాలతో కూడిన బాండ్ కూడా ఇప్పించారు. ఆ బాండ్‌పై ఏమని ఉందంటే.. ‘చంద్రబాబునాయుడు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. 2024లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, భవిష్యత్తుకు గ్యారెంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను..’ అని ఉంది. ఇంకా వాటిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలు, సంతకాలు కూడా ఉన్నాయి. ఏయే పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుంది.. అంటూ ఆ కుటుంబంలో సభ్యులు, పథకాల వల్ల వారికి ఏడాదికి, అయిదేళ్లకు అందే నగదు వివరాలను కూడా వివరించారు.సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలు ప్రలోభాలు.. పచ్చి మోసంపై నిలదీయండి⇒ తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి.. ఈ పథకాల కింద మీరు అర్హులయ్యారు. మీకు 2024 జూన్ నుంచే ఆ మొత్తం అందుతుంది.. అంటూ బాండ్లు ఇచ్చి, ప్రలోభాలు పెట్టి, పచ్చి మోసం చేశారు. అవన్నీ ఇప్పుడు ప్రజల్లో ప్రస్తావిస్తున్నాం. అందుకే ప్రజలంతా డిమాండ్ చేయాలి. మాకు జూన్ 2024 నుంచి ఇస్తామన్నావు. కానీ ఇవ్వలేదు. మీరు చెప్పినదాని ప్రకారమే మాకు ఇంత బాకీ ఉన్నావు. మరి ఈ ఏడాది ఎప్పుడిస్తున్నావు?అంటూ ప్రజలు చంద్రబాబును నిలదీయాలి.⇒ అలా బాండ్లు ఇచ్చి కూడా అన్నీ ఎగ్గొట్టిన చంద్రబాబు, మరో వైపు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్.. ఇప్పటికి ఆరు త్రైమాసికాలు పెండింగ్. ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.4,200 కోట్లు. కానీ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మరో వైపు వసతి దీవెన కింద ఏటా రూ.1,100 కోట్లు చొప్పున రెండేళ్లకు రూ.2,200 కోట్లు పెండింగ్. ⇒ ఇంకా ఆరోగ్యశ్రీ. ఈ పథకం కోసం నెలకు రూ.300 కోట్లు అవసరం. అలా ఏడాదికి రూ.3,600 కోట్లు బకాయిలు. దీంతో నిరుపేదలకు ఈ పథకం ద్వారా వైద్య సేవలు అందడం లేదు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. చేయూత, ఆసరా, నేతన్న నేస్తం.. ఇలా ఏ పథకం లేదు. వ్యవసాయం మొత్తం తిరోగమనం. ఎక్కడా పంటలకు కనీస గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేనే లేదు.ఐదు వారాల కార్యక్రమంవీటన్నింటి మధ్య.. మనం రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో.. అదే తెలుగులో ‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ.. అనే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఐదు వారాల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తొలుత జిల్లా స్థాయిలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు మీడియా సమావేశంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. ఆ తర్వాత రెండు బటన్లు నొక్కితే చంద్రబాబు మేనిఫెస్టో, బాండ్లు వస్తాయి. మరో బటన్ నొక్కితే, ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో వస్తుంది. ఆ స్కాన్ ఎలా చేయాలో వారు చూపుతారు. రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో, మూడో దశలో మండల స్థాయిలో క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ.. ఆ స్థాయి నాయకుల ప్రెస్ కాన్ఫరెన్స్. నాలుగో దశలో గ్రామ స్థాయిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. ఇందులో గ్రామ కమిటీలను ఇన్వాల్వ్ చేయాలి. ఈ ప్రక్రియలో ఎక్కడైనా మండల, గ్రామ కమిటీల ఏర్పాటు అప్పటికి పూర్తి కాకపోయి ఉంటే.. దాన్నీ పూర్తి చేయాలి.అందమైన అబద్ధంతో దగా– కురసాల కన్నబాబు, మాజీ మంత్రిక్యూఆర్ కోడ్, ఆ స్కానింగ్.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం తదితర అంశాలను వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు వివరించారు. గ్రామాల్లో రచ్చబండ నిర్వహించడం ద్వారా, ఇంటింటా ఈ కార్యక్రమం చేయాలన్నారు. ఈ రోజు ఇక్కడ మొదలైన ఈ కార్యక్రమం ఐదు వారాల్లోగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ చేరాలని కోరారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ.. అంటూ ఒక అందమైన అబద్ధాన్ని సృష్టించి, ప్రచారం చేసి, ప్రజలను పచ్చి దగా చేస్తూ, అందంగా మోసగించిన విధానాన్ని ఇంటింటా వివరించాలన్నారు. -
మాజీ సీఎం వైఎస్ జగన్ పై అక్రమ కేసు కోసం కుతంత్రం
-
ఫేక్ వీడియోతో "పచ్చ" కుట్ర...
-
అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా.. వైఎస్ జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బయల్దేరడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మన దేశం నుండి మొదటి వ్యోమగామి శుభాంశు శుక్లానే కావటం అందరూ గర్వించాల్సిన విషయం. శుక్లా సహా ఆయన టీమ్ ప్రయాణం సుఖవంతం కావాలి. ఈ మిషన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.A proud moment for India as Group Captain Shubhanshu Shukla from the Indian Air Force becomes the first ISRO astronaut to travel to the International Space Station on Axiom Mission 4. Wishing Group Captain Shukla and the entire crew a safe journey and a successful mission. The… pic.twitter.com/MX5Z8fkFmw— YS Jagan Mohan Reddy (@ysjagan) June 25, 2025భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. ఇస్రో-నాసా సంయుక్త యాక్సియం-4 మిషన్ కోసం భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి బయల్దేరారు. ఆయన ఈ మిషన్‌కు పైలట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నాం కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ నలుగురు వ్యోమగాములతో బయల్దేరింది. సుమారు 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి శుక్లా నేతృత్వంలోని బృందం చేరుకోనుంది. -
YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేత
-
మీ ఇంటికి TDP నేతలు రాగానే వీటన్నింటిపై నిలదీయాలి: YS జగన్
-
కూటమి మోసాలు ఎండగట్టేందుకు YSRCP సరికొత్త ప్రోగ్రాం
-
YS Jagan: చంద్రబాబు మోసాలను క్యూఆర్ కోడ్ రూపంలో ఇంటింటికీ చేర్చాలి
-
టీడీపీకి భారీ షాక్.. జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి ఎస్.బాల సుబ్రమణ్యం
సాక్షి, తాడేపల్లి: అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాల సుబ్రహ్మణ్యం వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం.. నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన సుగవాసి కుటుంబం టీడీపీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక ఆ పార్టీని వీడి వైఎస్ జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు.సుగవాసి పాలకొండ్రాయుడి రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2000లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పని చేశారు. 2001లో మరోసారి రాయచోటి జడ్పీటీసీగా గెలిచారు. 2012లో జరిగిన రాయచోటి ఉప ఎన్నికలో టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఆయన ఓడిపోయారు. 2024లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయిన సుగవాసి పాలకొండ్రాయుడు పెద్దకుమారుడే సుబ్రహ్మణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్.వి.సతీష్‌కుమార్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, రమేష్ కుమార్ రెడ్డి, ఎన్.శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు. -
ఇక ఇంటింటికీ బాబు మోసాలు.. ప్రారంభించిన వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల టైంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు. అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడుతూ.. ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’.. ‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’ పేరుతో ఐదువారాల పాటు బృహత్తర కార్యక్రమం జరపాలని ఆయన నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన క్యూ ఆర్ కోడ్‌ను ఆవిష్కరించిన ఆయన.. ఇంటింటికీ దాన్ని చేర్చేలా కార్యక్రమం ప్రారంభించారు. సాక్షి, గుంటూరు: బుధవారం తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సం అవుతోంది. ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడూ లేదు. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా ప్యతిరేకత కనిపిస్తోందని అన్నారాయన. చంద్రబాబునాయుడు.. ఈ వ్యతిరేకత మధ్య, ప్రజలకు మంచి చేయాల్సింది పోయి, ప్రజలను తప్పు దోవ పట్టించాలని చూస్తున్నారు. అందుకే ఈరోజు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్‌తో పాటు, అణిచివేత చూస్తున్నాం. రెడ్‌బుక్ పాలన చూస్తున్నాం. గత వైయస్సార్సీపీ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మధ్య స్పష్టంగా తేడా కనిపిస్తోంది. మన 5 ఏళ్ల పాలనలో వివక్ష లేకుండా పథకాలు అందించాం. పార్టీ చూడకుండా మంచి చేశాం. అదే ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోంది ఏమిటంటే, కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, విచ్చలవిడిగా అన్యాయాలు కనిపిస్తున్నాయి.అన్ని వ్యవస్థలు విధ్వంసంమన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులతో పాటు, పాలనలో పూర్తి పారదర్శకత చూపాం. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించాం. ఇలా ఎన్నో మార్పులు చూశాం. కానీ చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతుంది.రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో.. ఉద్దేశమిదేఏడాది పాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత? ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి, ఇంకా ఎంత నష్టం జరుగుతోంది. మరోవైపు మన ప్రభుత్వం ఉండి ఉంటే, ఎంతెంత ప్రయోజనాలు అనేది చెప్పాలి. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలి. చంద్రబాబు తానిచ్చిన హామీల రిబ్బన్ కూడా కట్ చేయకుండా, అన్నీ అమలు చేశామని చెబుతున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే, నాలుక మందం అంటున్నాడు. ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం ప్రారంభం. చంద్రబాబు మ్యానిఫెస్టోలో ఏం చెప్పాడు? ఇప్పుడు ఎలా మోసం చేస్తున్నాడు? అన్నింటిపై గ్రామ గ్రామాన, తీసుకుపోయేదే ఈ కార్యక్రమం. దీని పేరు.. ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’(Recalling Chandrababus manifesto). అదే తెలుగులో.. ‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’చంద్రబాబు హామీలు. బాండ్లుఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా. అంతకు మించి ఇస్తానన్నాడు. జగన్‌కన్నా ఎక్కువ చేస్తానన్నాడు. – ఆ మాటలు చెప్పడమే కాకుండా, ప్రతి ఇంటికి తన నాయకులు, కార్యకర్తలను పంపించి.. ఆ కుటుంబం వద్దనే వారు కూర్చుని, మిస్డ్ కాల్ ఇప్పించారు. దాంతో ఓటీపీ వచ్చింది. దాన్ని ఎంటర్ చేయగానే, ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది. దాని వల్ల ఎంతెంత వస్తుంది? అన్న వివరాలతో బాండ్ వస్తుంది.దానిపై ఏమని ఉంటుంది అంటే..చంద్రబాబునాయుడు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంటూ ఆయన, పవన్‌కళ్యాణ్ ఇద్దరూ సంతకం చేశారు. ఇంకా ఏయే పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుంది.. అంటూ పథకాలు వివరించారు. తల్లికి వందనం కింద ఇంత, అన్నదాతా సుఖీభవ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి.. ఈ పథకాల కింద మీరు అర్హులయ్యారు. మీకు 2024 జూన్ నుంచే ఆ మొత్తం అందుతుంది.ప్రలోభాలు. పచ్చి మోసంఏపీ ప్రజలకు ఇలా బాండ్లు ఇచ్చి, ప్రలోభాలు పెట్టి, చంద్రబాబు అండ్ కో పచ్చి మోసం చేశారు. అవన్నీ ఇప్పుడు ప్రజల్లో ప్రస్తావిస్తున్నాం. అందుకే ప్రజలంతా డిమాండ్ చేయాలి. మాకు జూన్ 2024 నుంచి ఇస్తామన్నావు. కానీ ఇవ్వలేదు. మాకు ఇంత బాకీ ఉన్నావు. మరి ఈ ఏడాది ఎప్పుడిస్తున్నావు? అంటూ ప్రజలు చంద్రబాబును నిలదీయాలి. అడగాలి.ఇవన్నీ ఎగ్గొట్టారుఒకవైపు అన్ని పథకాలు ఎగ్గొట్టిన చంద్రబాబు, మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్. ఆరు త్రైమాసికాలు పెండింగ్. అలా రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.4200 కోట్లు. కానీ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మరోవైపు వసతి దీవెన కింద ఏటా రూ.1100 చొప్పున రెండేళ్లకు రూ.2,200 కోట్లు. పెండింగ్. ఆరోగ్యశ్రీ. నెలకు రూ.300 కోట్లు. అలా ఏడాదికి రూ.3,600 కోట్లు బకాయిలు. దీంతో నిరుపేదలకు పథకంలో వైద్య సేవలు అందడం లేదు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. చేయూత, ఆసరా.. ఇలా ఏ పథకం లేదు. వ్యవసాయం తిరోగమనం. ఎక్కడా పంటలకు కనీస గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేనే లేదు.ఐదు వారాల కార్యక్రమంవీటన్నింటి మధ్య.. మనం రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని 5 వారాలు చేద్దాం. తొలుత పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు. పార్టీ జిల్లా అధ్యక్షులు పాల్గొంటారు. వీళ్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. ఆ తర్వాత రెండు బటన్లు నొక్కితే, చంద్రబాబు మ్యానిఫెస్టో, బాండ్లు వస్తాయి. మరో బటన్ నొక్కితే, ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో వస్తుంది. ఆ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో, మూడో దశలో మండల స్థాయిలో క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ. ఆ స్థాయి నాయకుల ప్రెస్కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.నాలుగో దశలో గ్రామస్థాయిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. ఇందులో గ్రామ కమిటీలను ఇన్వాల్వ్ చేయాలి.ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడే ఎక్కడైనా మండల, గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కాకపోతే.. దాన్నీ పూర్తి చేయాలి. 5 వారాల ఈ కార్యక్రమం జరిగే నాటికి గ్రామస్థాయిలో కూడా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి కావాలి.చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వివరించడమే మన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే.. ప్రజాగళం. సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ హామీలు వస్తాయి. అంతే కాకుండా చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి. గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత? ఇక ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత? అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి (పథకాల వారీగా) నెలకు ఎంతెంత చొప్పున, ఏడాదికి ఎంత వస్తుంది?. అలా 5 ఏళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది.. అని చెబుతూ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్ పంపారు. కానీ ఒక్క రూపాయి కూడా అందలేదు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఫోటోలతో పాటు, వాటిపై పార్టీ నాయకుల సంతకాలు పెట్టి, ఇంటింటా పంచారు. అవన్నీ రెడీగా పెట్టుకొండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే నిలదీయాలి. గత ఏడాది నుంచి ఇంత బాకీ. ఈ ఏడాది ఇంకా ఎంత రావాలి అనేది తెలియజేయాలి.ఇవే కాకుండా, చంద్రబాబు గత ఎన్నికల్లో ఏం చెప్పారు? పథకాల వారీగా వివరిస్తూ.. వాస్తవానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు?. తల్లికి వందనం మొదలు ఉచిత బస్సు వరకు అన్నీ నేను మాట్లాడిన మాటలు.. పక్కనే చంద్రబాబునాయుడివి నాటి మాటలు చూపుతూ.. సూటిగా ప్రశ్నించేలా ఈ కార్యక్రమం ఉంటుంది.ప్రజలతో మమేకం కావాలిఏడాది గడిచింది. హానీమూన్ పీరియడ్ ముగిసింది. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే. కాబట్టి అందరినీ కలుపుకుపోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వారికి అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలపై పోరాడాలి. అప్పుడే మనం సత్తా చూపగలం.ఇది రాక్షస రాజ్యం. అందుకే..ప్రజా సమస్యలపై మనం పోరాడాలి. వారితో మమేకం కావాలి. ఎందుకంటే ఇది రాక్షస రాజ్యం. ప్రజలకు సమస్యలు పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ల దగ్గరకు పోయినా, ప్రయోజనం ఉండడం లేదు. కాబట్టి, మనం ప్రతి చోటా, ప్రతి క్షణం ప్రజలతో మమేకం కావాలి. వారి సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలి. కృషి చేయాలి.చివరగా.. ఈనెల 4న ‘వెన్నుపోటు దినం’ బాగా చేశారు. మీ అందరికీ నా అభినందనలు. మొన్నటి యువతపోరు చాలా చోట్ల బాగా జరిగింది. వారందరికీ కూడా నా అభినందనలు అని వైఎస్ జగన్ కేడర్‌ను ఉద్దేశించి అన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. -
ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్
సాక్షి,అమరావతి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పల్నాడు జిల్లా సత్తెన పల్లి రోడ్డు ప్రమాదం కేసులో వైఎస్ జగన్ ఈ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు గురువారం విచారించనుంది. పేర్ని నాని, విడదల రజిని, వైవీ సుబ్బారెడ్డి, కేఎన్ఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లను కూడా రేపు హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
Tadepalli: YSRCP నేతలతో జగన్ కీలక సమావేశం
-
YSRCP నేతల విజువల్స్ @తాడేపల్లి
-
చిన్న పిల్లలకు కూడా రక్షణ లేదు.. మంత్రి అనితకు రోజా కౌంటర్
-
ఈ సమావేశానికి ముఖ్య కారణం ఇదే..
-
వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాధ్, పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతో పాటు, రీజినల్ కో–ఆర్డినేటర్లు సహా పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం, వైఎస్సార్సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై సమావేశంలో చర్చించారు. సూపర్‌సిక్స్ హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. పార్టీ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
జగన్ ప్రజల మనిషి.. కారు సీజ్ చేస్తే బస్సులో వెళ్తాడు..
-
YS జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం సీజ్ పై KS ప్రసాద్ ఫైర్
-
నేడు వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం
-
Jahnavi Inspirational Story: జాహ్నవి జీవితాన్ని మలుపుతిప్పిన వైఎస్ జగన్ ఆర్థికసాయం
-
నిరుద్యోగ భృతి హామీ ఎక్కడ?
-
‘రప్పా.. రప్పా’పై కేబినెట్లో చర్చ.. జాగ్రత్తగా మాట్లాడండి
సాక్షి, అమరావతి: మంత్రివర్గ సమావేశంలో ‘రప్పా.. రప్పా’ డైలాగ్ రాజకీయంపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఇటీవల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్తెనపల్లి పర్యటనలో టీడీపీ కార్యకర్త రవితేజ ‘పుష్ప–2’ సినిమాలోని డైలాగ్ ‘రప్పా.. రప్పా’ అంటూ పోస్టర్ ప్రదర్శించిన విషయం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై వివాదం రాజేసిన చంద్రబాబు, టీడీపీ నేతలు చివరకు ఆ పోస్టర్ ప్రదర్శించిన రవితేజ టీడీపీ కార్యకర్త అని తేలడంతో కంగుతున్నారు.దీంతో, ఈ విషయంలో కూటమికి నష్టం జరిగిందా? లాభం జరిగిందా? అనే దానిపై మాట్లాడుకున్నారు. కొందరు మంత్రులు చంద్రబాబు మెప్పు కోసం ఈ విషయంలో వైఎస్ జగన్‌కే నష్టం జరిగిందని, వారికి బాగా డ్యామేజ్ అయిందనే రీతిలో మాట్లాడినట్టు సమాచారం. భిన్నాభిప్రాయంతో ఉన్న మరికొందరు బయటకు వచ్చాక రియాలిటీగా మాట్లాడితే బాగుంటుందని అన్నట్టు తెలిసింది. అలాగే జగన్ పర్యటనలో ఆయన కారుకింద పడి కార్యకర్త మృతి చెందిన వ్యవహారంపై ఒక మంత్రి ప్రస్తావించగా.. చంద్రబాబు స్పందిస్తూ చట్టప్రకారం ఏం చేయాలో అది చేస్తామని తెలిపారు. పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలని చంద్రబాబు సూచించారు. సబ్జెక్టు తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడకూడదని, తెలంగాణకు జవాబిచ్చే రీతిలో ఉండాలని, అదే సమయంలో అక్కడి వారికి వ్యతిరేకంగానూ ఉండకూడదని చెప్పినట్టు సమాచారం. మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నట్టు చెప్పాలని సూచించారు. కాగా, మంత్రివర్గ సమావేశం మొదలుకాగానే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వెళ్లిపోయారు. సమావేశానికి వచ్చి కూర్చున్న ఆయన తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని తెలియడంతో సీఎంకు చెప్పి వెళ్లిపోయారు. -
జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్తున్న పోలీసులు
-
ప్రజల వద్దకు వెళ్లకుండా.. జగన్‌ను అడ్డుకునే కుట్రే!
సాక్షి, అమరావతి: విశేష ప్రజాదరణతో సాగుతున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలను అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కారు కుతంత్రాలను కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం రలిగిస్తున్న వైఎస్ జగన్‌ను అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా బరి తెగించి వ్యవహరిస్తోంది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన మాజీ సీఎం జగన్ భద్రతా ఏర్పాట్ల పట్ల కుట్రపూరిత వైఖరిని అవలంబిస్తోంది. వైఎస్ జగన్‌కు చెందిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఏకపక్షంగా జప్తు చేయడం చంద్రబాబు సర్కారు పన్నాగంలో తాజా అంకం. తద్వారా వైఎస్ జగన్ భద్రతపై ఉద్దేశపూర్వకంగా ఏడాదిగా సాగిస్తున్న కుట్రలకు మరింత పదునుపెట్టింది. పాలనలో తన ఘోర వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెర తీసిన తాజా పన్నాగం ఇదిగో ఇలా ఉంది...అక్రమ కేసు... ఏకపక్షంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం సీజ్ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఉదంతాన్ని వక్రీకరిస్తూ టీడీపీ కూటమి సర్కారు కుట్రలను కొనసాగిస్తోంది. ఆ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి ఓ వాహనం ఢీకొనడంతో మృతి చెందారు. అధికారిక కాన్వాయ్‌లో లేని ఓ ప్రైవేట్ వాహనం (ఏపీ 26 సీఈ 0001 టాటా సఫారీ) ఢీకొనడంతో సింగయ్య మృతి చెందినట్లు తమ విచారణలో వెల్లడైందని స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ అధికారికంగా ప్రకటించారు. ఆ వాహనాన్ని పోలీసులు జప్తు చేసి పోలీస్ స్టేషన్‌కు కూడా తరలించారు. కానీ ఆ ఉదంతాన్ని వక్రీకరిస్తూ వైఎస్ జగన్‌పై అక్రమ కేసు నమోదుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఎస్పీ సతీశ్ మూడు రోజుల్లోనే మాట మార్చాల్సి వచ్చింది.వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనే సింగయ్య మృతి చెందారని ఓ కథను తెరపైకి తెచ్చి అక్రమ కేసు నమోదు చేశారు. మూడు రోజుల్లోనే మాట మార్చి అక్రమ కేసు నమోదు చేయడం వెనుక కుట్ర కోణం తాజాగా బయటపడింది. వైఎస్ జగన్ ప్రయాణించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని గుంటూరు పోలీసులు మంగళవారం జప్తు చేసి తరలించుకుపోవడంతో ప్రభుత్వ పన్నాగం స్పష్టమైంది. అంటే వైఎస్ జగన్ ప్రయాణించేందుకు పటిష్ట భద్రతా ప్రమాణాలతో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం అందుబాటులో లేకుండా చేయడమే లక్ష్యమన్నది తేటతెల్లమైంది. ఎందుకంటే ఇదే కేసులో ఇప్పటికే ఓ ప్రైవేటు వాహనాన్ని (ఏపీ 26 సీఈ 0001 టాటా సఫారీ) పోలీసులు జప్తు చేశారు. అదే కేసులో మళ్లీ వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తాజాగా జప్తు చేయడం గమనార్హం. తద్వారా బుల్లెట్ ప్రూఫ్ వాహనం అందుబాటులో లేకుండా చేయడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యమన్నది స్పష్టమైంది. జగన్ భద్రతపై బాబు కుట్రలు..వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ కుట్ర. అందుకోసం ఏడాదిగా కుతంత్రాలు పన్నుతూనే ఉంది. ఏడాదిగా వైఎస్ జగన్ పర్యటనల్లో భద్రతా ఏర్పాట్లపై ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. మాజీ సీఎంహోదాలో ఆయన పర్యటనలకు పూర్తి భద్రతా ప్రమాణాలతో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాలి. కానీ పాతబడిన ఓ డొక్కు వాహనాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆ వాహనం మొరాయిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దాంతో ఓ పర్యటనలో ప్రభుత్వం సమకూర్చిన డొక్కు వాహనం నుంచి దిగి మరో ప్రైవేటు వాహనంలో వైఎస్ జగన్ పర్యటించారు.బుల్లెట్ ప్రూఫ్ కాని వాహనంలో ఆయన ప్రయాణించాల్సి రావడంతో వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆందోళ చెందారు. ఎందుకంటే వైఎస్ జగన్ పర్యటనలకు విఘాతం కలిగించేందుకు టీడీపీ గూండాలు ఎటువంటి దుస్సాహసానికైనా తెగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు అనుమతితో పార్టీనే ఓ కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేసింది. ఆ వాహనంలోనే ప్రస్తుతం వైఎస్ జగన్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వాహనాన్ని ఆయనకు అందుబాటులో లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నింది. అందుకే సింగయ్య మృతి ఉదంతాన్ని వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదు చేసి వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని జప్తు చేసింది. ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకునే కుట్రే...వైఎస్ జగన్ పట్ల వెల్లువెత్తుతున్న విశేష ప్రజాదరణను తట్టుకోలేకే చంద్రబాబు ప్రభుత్వం ఈ కుతంత్రాలు పన్నుతోంది. ఆయన ఎంత విస్తృతంగా పర్యటిస్తే... తమ ప్రభుత్వ వైఫల్యాలు అంతగా వెలుగులోకి వస్తాయన్నది టీడీపీ పెద్దల భయం! జగన్ పర్యటనలకు దారి పొడవునా వేలాది మంది జనం తరలి వస్తుండటం ప్రభుత్వ పెద్దలను కలవరపరుస్తోంది. ఆ అక్కసుతోనే వైఎస్ జగన్‌ను భూస్థాపితం చేస్తానని సీఎం చంద్రబాబు ఇటీవల మీడియా చానెళ్ల ఇంటర్వ్యూల్లో ప్రకటించడం గమనార్హం. మరోవైపు వైఎస్ జగన్ పర్యటనల్లో ఉద్దేశపూర్వకంగా భద్రతా ఏర్పాట్లలో వైఫల్యాలను గమనిస్తుంటే చంద్రబాబు తన వ్యాఖ్యలను చేతల్లో చూపిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అక్రమంగా జప్తు చేశారు. కేసు దర్యాప్తు పేరిట ఆ వాహనాన్ని సుదీర్ఘ కాలం జప్తులో ఉంచాలన్నది పన్నాగం.మరోవైపు టీడీపీ ప్రభుత్వం ఎలాగూ పూర్తి కండిషన్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చదు. తద్వారా వైఎస్ జగన్ జిల్లా పర్యటనలను అడ్డుకోవాలన్నదే ప్రభుత్వ కుతంత్రమన్నది స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు కుట్రలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ న్యాయ పోరాటానికి సన్నద్ధమవుతోంది. వైఎస్ జగన్ భద్రత పట్ల ప్రభుత్వం కుట్రపూరితంగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లనుంది. సింగయ్య మృతి ఉదంతాన్ని వక్రీకరిస్తూ నమోదు చేసిన అక్రమ కేసుపైనా న్యాయ పోరాటం చేయనుంది. వైఎస్ జగన్ భద్రత పట్ల ప్రభుత్వ కుతంత్రాలపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా మాజీ ముఖ్యమంత్రికి పటిష్ట భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేస్తున్నారు. 40 ఏళ్ల సీనియర్‌నని తరచూ చెప్పుకునే చంద్రబాబు పూర్తి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.బయటపడిన భద్రతా వైఫల్యాలుజడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత పట్ల ప్రభుత్వం కుట్రపూరిత వైఖరి ప్రదర్శిస్తోంది. ఆయన జిల్లాల పర్యటనలో ప్రభుత్వం, పోలీసులు ఉద్దేశపూర్వకంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు. జిల్లా పర్యటనలపై ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చినా సరే కనీస స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు. గతంలో అనంతపురం, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటనల్లో అడుగడుగునా భద్రతా వైఫల్యాలు బయటపడ్డాయి. అయినా ప్రభుత్వ తీరు ఏమాత్రం మారడం లేదు. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనలోనూ భద్రతా వైఫల్యం బయటపడింది. వైఎస్ జగన్ వాహనం ముందు ఎస్కార్టు వాహనాలు ఏర్పాటు చేయలేదు. ఆయన వాహనానికి ఇరువైపులా రోప్ పార్టీ పోలీసులు లేరు. దాంతో వైఎస్సార్సీపీ అభిమానులే కాదు... ఆ ముసుగులో గుర్తుతెలియని వ్యక్తులు, ఆగంతకులు వైఎస్ జగన్ వాహనంపైకి చొచ్చుకొచ్చారు.ఓ యువకుడు ఏకంగా వాహనం బానెట్‌పైకి ఎక్కి మరీ హల్చల్ చేశాడు. జడ్ ప్లస్ భద్రత ఉన్న ఓ మాజీ సీఎం వాహనం బానెట్‌పైకి యువకుడు ఎక్కినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగించింది. అదేదో కాకతాళీయంగా జరిగింది కాదు.. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వైఎస్ జగన్ భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారన్నది సుస్పష్టం. జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే హెలీప్యాడ్ వద్ద కనీస భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు. తద్వారా భారీ సంఖ్యలో అభిమానులతోపాటు ఆ ముసుగులో విద్రోహ శక్తులు హెలికాఫ్టర్ వద్దకు చొచ్చుకుని వచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల అనంతపురం పర్యటనలో ఇటువంటి పరిస్థితే తలెత్తి హెలికాఫ్టర్‌కు సాంకేతిక సమస్య ఎదురైంది. దాంతో జగన్ అనంతపురం జిల్లా నుంచి బెంగళూరుకు హెలికాఫ్టర్‌లో కాకుండా రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. -
నేడు వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతోపాటు, రీజినల్ కో–ఆర్డినేటర్లు పాల్గొంటారు.టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం, వైఎస్సార్సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై సమావేశంలో చర్చిస్తారు. సూపర్‌సిక్స్ హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఆ దిశలో పార్టీ నాయకులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. -
లెక్కలేసి మరీ బాండ్లు ఇచ్చారు.. ఇప్పుడేమైంది?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఇవ్వకుండా చేస్తున్న మోసాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా యువతీ యువకులు చేపట్టిన ‘యువత పోరు’ విజయవంతం కావడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై సోమవారం నరసరావుపేటలో పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.ఇంట్లో ఎంత మంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంత మందికి నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు కదా.. ఇప్పుడు ఆ హామీ ఏమైందని సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’లో తన ఖాతాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తమకు చేస్తున్న మోసాలు, ఎగరగొడుతూ నిర్వీర్యం చేస్తున్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు, పలు సమస్యలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువతీ యువకులు ‘యువత పోరు’ పేరిట రోడ్డెక్కి ఈ ప్రభుత్వం కళ్లు తెరిచేలా బ్రహ్మాండంగా నిరసన చేపట్టినందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై సోమవారం నరసరావుపేటలో పోలీసుల లాఠీఛార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాను.మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికీ వెళ్లి వివిధ రకాలుగా బాండ్లు పంచారు. ఇంట్లో ఎంత మంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంత మందికీ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేలు చొప్పున ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ మేరకు జూన్–2024 నుంచి వారి వారి ఖాతాల్లో జమ అవుతుందన్నారు. టీడీపీ అధికార గెజిట్ ఈనాడు పత్రికలో రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు కోటిన్నరపైనే ఉన్నారని రాస్తే, మీ మేనిఫెస్టో, మీరు ఇంటింటికీ పంచిన బాండ్ల ప్రకారం నెలకు రూ.3 వేలు చొప్పున ఈ ఏడాదిలో మీరు ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఒక్కరికీ ఇవ్వకపోగా, ఈ ఏడాది కూడా మళ్లీ ఎగరగొట్టే మోసానికి దిగారు.ఆరు త్రైమాసికాల ఫీజు పెండింగ్మరోవంక 2024 జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించి విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అదే సంవత్సరం 2024లో చెల్లింపులు చేయాలి. ఎన్నికల కారణంగా అది నిలిచిపోయింది. అప్పటి నుంచి ఈ జూన్–2025 వరకు ఆరు త్రైమాసికాలుగా మొత్తంగా రూ.4,200 కోట్లు పెండింగ్. ఇందులో ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. వసతి దీవెన కింద ఏప్రిల్–2024న చెల్లించాల్సిన ఒక విడత, ఈ ఏడాది ఏప్రిల్–2025లో చెల్లించాల్సిన మరో విడత కలిపి రూ.2,200 కోట్లు పెండింగ్. మొత్తంగా రూ.6,400 కోట్లకు గాను ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మీరు ఇవ్వక పోవడంతో ఇవాళ విద్యార్థులు చదువులు మానుకుని, పనులకు పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.చంద్రబాబూ.. మీరు చేయాల్సింది చేయకుండా, ఎగరగొట్టినందుకు ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదంతో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్లంతా చేసిన తప్పేమిటి? కేవలం కలెక్టర్‌ను కలిసి డిమాండ్ పత్రం ఇవ్వాలనుకోవడం తప్పా? మీరు ఇస్తామన్న వాటి కోసం డిమాండ్ చేయడం తప్పా? మీ రెడ్‌బుక్ రాజ్యాంగ పాలనకు నిన్న నరసరావుపేటలో జరిగిన ఘటన నిదర్శనం కాదా? రోజురోజుకూ మీ అబద్ధాలు, మీ మోసాలు, మీ దౌర్జన్యాలు మితిమీరి పోతున్నాయి. మీరు చేస్తున్న పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండి. -
వైఎస్ జగన్‌పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు దిగింది కూటమి ప్రభుత్వం. సొంత డబ్బులతో వైఎస్ జగన్ కొనుగోలు చేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లారు. సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో వైఎస్ జగన్ బుల్లెట్ వాహనాన్ని తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి తరలించారు. వైఎస్ జగన్ భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ భద్రతను గాలికొదిలేసింది. ఈ క్రమంలోనే డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వైఎస్ జగన్‌కు కేటాయించింది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చలేదు. దాంతో వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తానే కొనుగోలు చేసుకున్నారు. ఇప్పటికే సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో ఏపీ 26 సీఈ 0001 నంబర్ గల సఫారీ వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు.. ఇప్పుడు వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్లారు. సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. -
లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు కదా.. ఇప్పుడేమైంది?: వైఎస్ జగన్
తాడేపల్లి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా చేసిన మోసంపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా యువతీ, యువకులు చేపట్టిన ‘యువత పోరు’ సక్సెస్ కావడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘యువత పోరు’ పేరిట రోడ్డెక్కి తమ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం కళ్లు తెరిచేలా బ్రహ్మాండంగా విజయవంతం కావడంలో సహకరించిన వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నిరసన కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై నిన్న(సోమవారం) నరసరావుపేటలో పోలీసుల లాఠీఛార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు వైఎస్ జగన్.లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు కదా.. ఇప్పుడేమైంది?‘నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికీ వెళ్లి వివిధ రకాలుగా బాండ్లు పంచారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంతమందికీ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేల చొప్పున ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ, బాండ్లు ఇచ్చారు. చంద్రబాబుగారు అధికారంలోకి రాగానే ఆ మేరకు జూన్ -2024 నుంచి వారి వారి ఖాతాల్లో జమ అవుతుందని, ప్రజలకు బాండ్లు రాసిమరీ ఇచ్చారు. టీడీపీ అధికార గెజిట్ ఈనాడు దినపత్రికలో రాష్ట్రంలో ఉపాధికోసం, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు కోటిన్నరపైనే ఉన్నారని రాస్తే, మీ మేనిఫెస్టో, మీరు ఇంటింటికీ పంచిన బాండ్ల ప్రకారం నెలకు రూ.3వేల చొప్పున ఈ ఏడాది కాలంలో మీరు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఒక్కరికీ ఇవ్వకపోగా, ఈ ఏడాది మళ్లీ ఎగరగొట్టే మోసానికి దిగారు.ఫీజు రీయింబర్స్మెంట్ మాట ఏమైంది?మరోవంక 2024 జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అదే సంవత్సరం 2024లో చెల్లింపులు చేయాలి. ఎన్నికల కారణంగా అది నిలిచిపోయింది. అప్పటినుంచి ఈ జూన్-2025వరకూ 6 త్రైమాసికాలుగా మొత్తంగా రూ.4,200 కోట్లు పెండింగ్. ఇందులో ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. వసతి దీవెన కింద ఏప్రిల్-2024న చెల్లించాల్సిన ఒక విడత, ఈ ఏడాది ఏప్రిల్-2025 లో చెల్లించాల్సిన మరో విడత కలిపి రూ.2,200కోట్లు పెండింగ్. మొత్తంగా రూ.6,400 కోట్లకు గానూ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మీరు ఇవ్వకపోవడంతో ఇవాళ విద్యార్థులు చదువులు మానుకుని, పనులకు పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.ఇకనైనా తప్పులు సరిదిద్దుకోండి..చంద్రబాబుగారూ మీరు చేయాల్సింది చేయకుండా, ఎగరగొట్టినందుకు ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదంతో అణగదొక్కే ప్రయత్నంచేస్తున్నారు. వీళ్లంతా చేసిన తప్పేమిటి? కేవలం కలెక్టర్‌ను కలిసి డిమాండ్ పత్రం ఇవ్వాలనుకోవడం తప్పా? మీరు ఇస్తామన్న వాటికోసం కూడా డిమాండ్ చేయడం తప్పా? మీ రెడ్‌బుక్ రాజ్యాంగ పాలనకు నిన్న నరసరావుపేటలో జరిగిన ఘటన నిదర్శనం కాదా? రోజురోజుకూ మీ అబద్ధాలు, మీ మోసాలు, మీ దౌర్జన్యాలు, మీరు చేస్తున్న పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండి’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు..@ncbn గారి కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తమకు చేస్తున్న మోసాలు, ఎగరగొడుతూ నిర్వీర్యం చేస్తున్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు, పలు సమస్యలపై వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువతీయువకులు “యువత పోరు’’ పేరిట రోడ్డెక్కి తమ నిరసన కార్యక్రమాన్ని… pic.twitter.com/TIp3bv8rOm— YS Jagan Mohan Reddy (@ysjagan) June 24, 2025 -
రేపు వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ విస్తృత స్థాయి సమావేశం
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 10.30గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు పాల్గొంటారని పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. -
కారు టైరు కింద కూటమి సర్కార్ కుట్రలు, కుతంత్రాలు
-
దంగేటి జాహ్నవికి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,తాడేపల్లి: అంతరిక్ష యానానికి ఎంపికైన దంగేటి జాహ్నవికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు.ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదిగా ట్వీట్ చేశారు. ‘అంతరిక్ష యానానికి ఎంపికయిన మొదటి భారతీయ యువతి, అందునా ఏపీకి చెందిన యువతి కావటం ఆంధ్రులకు గర్వకారణం. జాహ్నవి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం’ అని ట్వీట్లో పేర్కొన్నారు. Heartiest congratulations to Ms. Jahnavi Dangeti on being selected as an Astronaut Candidate for Titans Space’s ASCAN programme, for a mission slated for launch in 2029. Your brilliance makes every Indian and every Andhrite proud. Wishing you continued success as you inspire many… pic.twitter.com/P1JMDktu5p— YS Jagan Mohan Reddy (@ysjagan) June 24, 2025 -
YS Jagan: ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికెళ్లడం తప్పా?
-
వైఎస్ జగన్ పై కేసు.. పోతిన మహేష్ స్ట్రాంగ్ రియాక్షన్
-
మాజీ సీఎం జగన్ నివాసంపై దాడి చేసిన వారి గుర్తింపు
సాక్షి టాస్క్ ఫోర్స్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంపై తరచూ దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. శనివారం కూడా గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి వైఎస్ జగన్ ఇంటి ప్రధాన ద్వారం వద్ద తాటికాయలు విసిరి పారిపోయారు. ఈ ఘటనపై ఆదివారం వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల నుంచి పోలీసులకు ఒత్తిడి రావడంతో అప్పటికప్పుడు ఆ కారును గుర్తించి తెనాలికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సోమవారం వారి వీడియో తీసి మీడియాకు విడుదల చేశారు.‘తెనాలికి చెందిన కుమార్ వంశీ, ధరణిసాయి స్నేహితులు. కుమార్‌వంశీ చెన్నైలో, ధరణిసాయి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి నెలా ఒక వీకెండ్లో తెనాలి వచ్చి ధరణిసాయికి చెందిన ఏపీ 39 బీక్యూ 1496 నంబరు గల కారులో తిరుగుతూ ఉంటారు. శనివారం కారుకు ఇంజిన్ ఆయిల్ మార్పించుకుని ఉండవల్లి సెంటర్ మీదుగా స్క్రూ బ్రిడ్జి దాటి సీతానగరం మీదుగా మంగళగిరిలోని మిత్ర దాబాకు వెళ్లారు. మార్గంమధ్యలో కారు దిగి మూత్రం పోసుకుని అక్కడున్న తాటికాయలు తీసుకుని కారులో పెట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్లారు.మాజీ ముఖ్యమంత్రి నివాసం దగ్గరకు వెళ్లిన తర్వాత ఆ తాటికాయలను విసిరేశారు. అది పొరపాటుగా జరిగింది. ఉద్దేశపూర్వకంగా చేయలేదు’ అని వీడియోలో పేర్కొన్నారు. అయితే, వారు మూత్రం పోసిన ప్రదేశంలోని తాటికాయలు తీసుకుని కారులో పెట్టుకుని ఆడుకుంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారు చెప్పిన ప్రకారం డంపింగ్ యార్డు వద్ద మలమూత్రాలను విసర్జిస్తారు. అలాంటి ప్రాంతంలో పడి ఉన్న తాటికాయలు తీసుకుని కారులో పెట్టుకుని పొరపాటున విసిరినట్లు పోలీసులు చక్కగా వారికి ట్రైనింగ్ ఇచ్చి కట్టుకథను చెప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రెస్‌మీట్ పెట్టి మీడియాకు వివరాలు వెల్లడించకుండా వారిద్దరూ పొరపాటు అయ్యిందని చెప్పిన వీడియోను పోలీసులు విడుదల చేయడం గమనార్హం. వైఎస్ జగన్ నివాసం వద్ద ఎప్పుడూ సందర్శకులు ఉంటారు. అయినా అక్కడే కారు అద్దం దించి తాటికాయలు ఎలా లోపలికి విసిరేశారనే విషయాలను పోలీసులు ప్రశ్నించకుండానే, వారు చేసింది పొరపాటు, పోలీస్ డైరీలో నమోదు చేసి పొరపాటుగా నిర్ధారించి వదిలివేశామని చెప్పడం విశేషం. -
సింగయ్య చనిపోయే అవకాశమే లేదు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల సత్తెనపల్లి పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదానికి వక్రభాష్యం చెబుతూ కూటమి సర్కార్ అక్రమ కేసుల నమోదుకు తెగబడిందని ప్రత్యక్ష సాక్షులు దాసరి వీరయ్య, న్యాయవాది కోటేష్ పేర్కొన్నారు. చీలి సింగయ్య అనే కార్యకర్త ప్రైవేట్ వాహనం ఢీకొని మృతి చెందినట్టు గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ అధికారికంగా ప్రకటించిన తర్వాత మూడు రోజుల కుట్రపూరిత తర్జనభర్జనల అనంతరం ఆ రోడ్డు ప్రమాదాన్ని వక్రీకరించి ప్రభుత్వం నక్క జిత్తులను ప్రదర్శిస్తోందన్నారు వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా పనిచేస్తోందని వారు దుయ్యబట్టారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. ప్రత్యక్ష సాక్షుల్లో ఒకరైన వైఎస్సార్సీపీ నేత దాసరి వీరయ్య మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా నేను కూడా కాన్వాయ్‌లో వెళ్లాను. మేం చూసే సమయానికి సింగయ్య స్వల్పగాయాలతో ఉన్నారు.మేం వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా బాధ్యత వహించి ఆటోలో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని అనుకున్నాం. కానీ.. అక్కడ ఉన్న ఏఎస్ఐ రాజశేఖర్ వద్దని అడ్డుకున్నారు. అంబులెన్స్‌లోనే తీసుకెళ్లాలన్నారు. దాంతో సింగయ్య వివరాలు తీసుకుని అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాం. అతనికి ఉన్న గాయాలను చూస్తే చనిపోయే అవకాశమే లేదు. తలకు ఎక్కడా గాయాలు కూడా కాలేదు. సింగయ్య మరణంపై అనుమానం ఉంది. ఈ రెడ్‌బుక్ రాజ్యాంగంలో ఏదైనా జరగొచ్చు’ అని పేర్కొన్నారు. తేలికపాటి గాయాలే అయ్యాయి హైకోర్టు న్యాయవాది బరిగల కోటేష్ మాట్లాడుతూ.. ‘చీలి సింగయ్య గాయాలతో ఉన్నప్పుడు నేను అక్కడే ఉన్నా. ఆయనకు తేలికపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. వెంటనే నా కారులోంచి గొడుగు తెచ్చి ఆయనకు ఎండ తగలకుండా పట్టుకున్నాను. సోషల్ మీడియాలో వచి్చన ఒక వీడియోను తీసుకుని ఎస్పీ మాట్లాడిన తీరు సరికాదు. అంతకుముందు ఇంకో కారు నంబర్ చెప్పి.. ఇప్పుడు జగన్ కారు అని చెప్పటం ఏమి టి? బాధ్యత కలగిన ఎస్పీ అలా మాట్లాడటం సరికాదు. సింగయ్య మరణం, ఎలా జరిగిందనే అంశంపై నేను లీగల్‌గా తేల్చుకుంటా’ అని చెప్పారు. -
సింగయ్య మృతి కేసులో కూటమి దొంగాట!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రోడ్డు ప్రమాదంలో మరణించిన సింగయ్య కేసులో కూటమి ప్రభుత్వం పోలీసులతో ఆడిస్తున్న దొంగాట చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా గుంటూరు సమీపంలోని ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలో చీలి సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన రెండు గంటల్లోనే గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ, జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆగమేఘాలపై మీడియా సమావేశం నిర్వహించి వైఎస్ జగన్‌ను చూసేందుకు వచ్చిన సింగయ్య ఆయనపై పూలు వేసేందుకు రోడ్డుపైకి వచ్చినప్పుడు ప్రైవేటు వాహనం ఢీకొందని ప్రకటించారు.ఆసుపత్రికి తరలిస్తుండగా సింగయ్య మృతి చెందాడని చెప్పారు. ఈ ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాన్వాయ్‌కు 50 మీటర్ల ముందు ఉన్న టాటా సఫారి ఏపీ26 సీవీ 0001 వాహనం తగలడంతో సింగయ్య గాయపడ్డాడని చెప్పారు. ఆ వాహనం ఆగకుండా వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు. ఆ రోజే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఆ వాహన డ్రైవర్‌ను తాడేపల్లి స్టేషన్‌కు, తర్వాత ఎస్పీ కార్యాలయానికి, చివరగా నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. తాను ర్యాష్‌గా డ్రైవ్ చేసిన మాట నిజమేనని, వైఎస్ జగన్‌ను ఫొటోలు తీసేందుకు ముందుకు వచ్చానని, ప్రమాదం జరిగిన విషయం తనకు తెలియదని ఆ వాహన డ్రైవర్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత వాహనాన్ని సీజ్‌చేసి, డ్రైవర్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత కథ మార్చేశారు మూడు రోజులు తిరిగేసరికి పోలీసులు మొదట్లో చెప్పిన కథను మార్చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వాహనమే ఢీకొట్టిందని చెప్పుకొచ్చారు. ఈ కేసులో ఆ వాహనం డ్రైవర్ రమణారెడ్డితోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, పీఏ కె.నాగేశ్వరరెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని పేర్లు చేర్చి సెక్షన్లు కూడా మార్చారు. మళ్లీ ఇదే ఐజీ, ఎస్పీ మీడియా ముందుకు వచ్చి కూటమి పెద్దలు ఇచ్చిన స్క్రిప్ట్ చదివారు.డ్రైవర్ రమణారెడ్డిని విచారించడంతో పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతా సిబ్బందిని కూడా పిలిచి ఆ సమయంలో ఎక్కడ ఉన్నారంటూ విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి కారణమని మొదట గుంటూరులోని నల్లపాడు స్టేషన్లోనే ముందుభాగంలో ఉంచిన ఏపీ 26 సీవీ 0001 వాహనాన్ని రాత్రికి రాత్రి స్టేషన్ వెనక్కి మార్చేశారు. దానిని ఎవరూ గుర్తుపట్టకుండా నంబర్ ప్లేట్లను కూడా తొలగించారు. ఆ వాహనం యాక్సిడెంట్‌కు కారణం కానప్పుడు.. ఆ వాహనాన్ని వదిలేయకుండా స్టేషన్ వెనుక దాచడం కూటమి పెద్దల దొంగాటను బయటపెట్టింది. -
మానవత్వం, నైతికతపై మీరా మాట్లాడేది?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతిపై విష ప్రచారంతో టీడీపీ, ఎల్లో బ్యాచ్ చేస్తున్న క్షుద్ర రాజకీయాలను ‘ఎక్స్’ వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కడిగిపారేశారు. ‘‘ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది.ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా కూడా మా మీద విష ప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడం ఆశ్చర్యకరం..’ అని ధ్వజమెత్తారు. ‘మీ పర్యటనల సమయంలో.. మీ మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు? ఎంత చేశారు? ఎంత మేర చేశారు? మానవత్వం, నైతికత గురించి మీరా మాట్లాడేది?..’ అని సీఎం చంద్రబాబును సూటిగా నిలదీశారు. ఇప్పటికైనా మారండి..! అని హితవు పలుకుతూ సోమవారం తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు.అందులో ఏమన్నారంటే.. చంద్రబాబూ..! ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి చేశారు? గతంలో మీరుగానీ, మీ పవన్‌కళ్యాణ్‌గానీ తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా? ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా?ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా.. మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్ హక్కు కాదా? మాకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం..! లేదంటే మూడ్ రానప్పుడు మీకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్‌డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వాని కైనా ఉంటుందా? అది మీకైనా, నాకైనా!! జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వంలో పోలీసులు అయినా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రొటోకాల్ అనుసరించి ఆమేరకు ఆ మాజీ ముఖ్యమంత్రికి సెక్యూరిటీ కల్పించాలి. ఇది నాకైనా, మీకైనా ఒకటే. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రొటోకాల్ ఇది.మరి జెడ్ ప్లస్ సెక్యూరిటీతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి తన ప్రోగ్రామ్‌కు సంబంధించిన రూట్‌మ్యాప్ ఇచ్చిన తర్వాత.. పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రొటోకాల్‌లో భాగమైనప్పుడు.. మరి మీ రోప్ పార్టీలకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకుని, ఎవరూ వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? మనుషుల తాకిడి ఎక్కువగా ఉన్న పరిస్థితుల మధ్య! అందుకే కదా.. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో, ప్రొటోకాల్‌లో భాగంగా ఈ రోప్ పార్టీని, పైలట్ వాహనాలను పెట్టడానికి కారణం. ⇒ మరి మీ పైలట్ వెహికల్స్, అందులో సెక్యూరిటీ, రోప్ పార్టీలు.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ, ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేవు? ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా లేక వెహికల్ కింద ఎవరూ పడలేదన్నదా? ⇒ జెడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి. గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్ కూడా చేయాలి. ఇది ప్రొటోకాల్. మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చేయకపోవడంతో గవర్నమెంటు అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టా. డ్రైవర్‌ను మీరు (గవర్నమెంటు) ప్రొటోకాల్ ప్రకారం ఇచ్చారు. మరి మీ గవర్నమెంటు డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్, మీరు ఇచ్చిన పైలట్ వెహికల్స్, మీ రోప్ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు.. మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా? అందుకే కదా ఈ ప్రొటోకాల్. ⇒ ఆ రోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి? మరి ఎందుకు ఈ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు?⇒ ప్రతిపక్షంగా ఉన్నందున నేను ప్రెస్‌మీట్ పెట్టి గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలపై మీరు చెప్పిన మాటలు, గతంలో మీరు ఇంటింటికీ పంపించిన బాండ్లను, మీ మేనిఫెస్టో, మీ అబద్ధాలను, మీ మోసాలను బయటపెడితే.. మీ పాలనా వైఫల్యాలను, రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్పోజ్ చేస్తే... రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, తద్వారా ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని, అతలాకుతలమవుతున్న రైతులు, అక్కచెల్లెమ్మలు, పిల్లల బతుకులు.. వీటన్నింటినీ నేను చెబితే... వాటికి సమాధానం చెప్పలేక, ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నామీద ప్రేమను చూసి తట్టుకోలేక, మీరు డైవర్షన్ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరం. కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మారండి. ⇒ ఒక్కటి మాత్రం నిజం. నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు.. దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే మా పార్టీ ప్రత్తిపాడు ఇన్‌ఛార్జి బాలసాని కిరణ్, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని మావాళ్లు చెప్పారు. వెంటనే నేను స్పందించి మరుసటి రోజు కూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.10 లక్షలు ఆరి్థక సహాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చా.ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను మేం నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా కూడా మామీద విషప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం! -
‘జగనన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు’
తిరుపతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. జగనన్న ఎక్కడకు వెళ్లినా సముద్రంలా జనప్రవాహం వస్తోందన్నారు రోజా. అదే సమయంలో ఈవీఎం ప్రభుత్వం అని ఇప్పటికే ప్రజల్లో చర్చ మొదలైందన్నారు. ‘కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలుకు దిగుతున్నారు, కేసులు పెడుతున్నారు. జూన్ 18న జగనన్న కాన్వాయ్ ముందు చనిపోయారు అంటూ ఎస్పీ చెప్పారు, జూన్ 22 తేదీ నాటికి ఎస్పీ చేత అబద్ధం చెప్పించారు. కల్తీ నెయ్యి ఘటనలో ఈవో ముందు నిజాలు మాట్లాడిన తర్వాత మాట్లాడించారు, ఆ తర్వాత వారం రోజుల్లో ఎలా వెంటనే మాట మార్చారు అనేది ప్రజలు గమనించారు. ఏడాది గా జరుగుతున్న ఘటనలపై కూడా కేసులు పెట్టాలి. సింహాచలం గోడ ఘటనలో అద్భుతమైన ఏర్పాట్లు చేశాం అన్నారు హోం మంత్రి, గోడ కూలి భక్తులు చనిపోయిన ఘటనపై హోం మంత్రిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు?, గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ లో బైక్ స్టంట్ లు చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు విని ఇద్దరు చనిపోయారు. దీనిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు?, ఏడాది పాలనలో మీ ప్రభుత్వంలో మీటింగ్‌లకు ప్రజలు రావడం లేదు. జగనన్న మీటింగ్‌లకు పొలాల్లోంచి పరుగులు పెడుతూ జనం వస్తున్నారు. మీరు విడుదల చేసిన క్లిప్‌లో ముందు, వెనుక వీడియా విడుదల చేయాలి. జగనన్న ప్రజల మనిషి. కోవిడ్ సమయంలో ప్రజల ప్రాణాలు ఎలా కాపాడారో ఈ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. మానవత్వం లేని వాళ్లు మీరు, మీ కుమారుడు, అబద్ధాలతో ఓట్లు వేయించుకున్నారు’ అని ఆర్కే రోజా మండిపడ్డారు. -
సింగయ్య ఉదంతం.. విషప్రచారంపై వైఎస్ జగన్ ధ్వజం
సాక్షి, గుంటూరు: చంద్రబాబుగారూ.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన పర్యటనల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం.. వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి ఉదంతంపై ఎల్లో బ్యాచ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుగారూ.. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు?. గతంలో మీరుకాని, మీ పవన్‌కళ్యాణ్ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా?. ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా?.. 👉ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా, మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా, ఆటోమేటిక్ హక్కు కాదా?. మీకు బుద్ధిపుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే, మూడ్ రానప్పుడు మేం మీకు జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్‌డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? అది మీకైనా, నాకైనా? . 👉జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులు అయినా జడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను ఫాలో అయ్యి, ఆమేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలి. ఇది నాకైనా, మీకైనా ఒకటే. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రొటోకాల్. మరి జడ్‌ప్లస్ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే, తన ప్రోగ్రాంకు సంబంధించి రూట్‌మ్యాప్ ఇచ్చిన తర్వాత, పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్‌లో భాగమైనప్పుడు, మరి మీ రోప్ పార్టీల, జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్‌పట్టుకుని, ఎవ్వరూ వాహనంమీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? 👉 మనుషుల తాకిడి ఎక్కువ ఉన్న పరిస్థితుల మధ్య! అందుకే కదా జడ్‌ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో, ప్రొటోకాల్‌లో భాగంగా ఈ రోప్ పార్టీని, పైలట్ వాహనాలను పెట్టడానికి కారణం. మరి మీ పైలట్ వెహికల్స్, అందులో సెక్యూరిటీ, రోప్‌పార్టీలను జడ్‌ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ, ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు, ఎందుకు లేరు. ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం?. మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా? లేక వెహికల్ కింద ఎవరూ పడలేదన్నదా?.. 👉 జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి, గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్‌కూడా చేయాలి. ఇది ప్రొటోకాల్. మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చెయ్యకపోతే, గవర్నమెంటు అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టా. డ్రైవర్‌ను మీరు (గవర్నమెంటు) ప్రొటోకాల్ ప్రకారం ఇచ్చారు. మరి మీ గవర్నమెంటు డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్, మీరు ఇచ్చిన పైలట్ వెహికల్స్, మీ రోప్ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా? అందుకే కదా ఈ ప్రొటోకాల్. 👉ఆరోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి? మరి ఎందుకు ఈ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు?. ప్రతిపక్షంగా నేను ప్రెస్‌మీట్ పెట్టి, సుదీర్ఘంగా గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలపై మీరు చెప్పినమాటలు, గతంలో మీరు ఇంటింటికీ పంపించిన బాండ్లను, మీ మేనిఫెస్టో, మీ అబద్ధాలను, మీ మోసాలను బయటపెడితే, మీ పాలనా వైఫల్యాలను, రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్పోజ్ చేస్తే, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, తద్వారా రాష్ట్ర ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని, అతలాకుతలమవుతున్న రైతులు, అక్క చెల్లెమ్మలు, పిల్లల బ్రతుకులు, వీటన్నింటినీ నేను చెబితే, వాటికి సమాధానం చెప్పలేక, ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నామీద ప్రేమను చూసి తట్టుకోలేక, మీరు దిగజారి డైవర్షన్ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరం. కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మారండి. 👉ఒక్కటి మాత్రం నిజం. నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి చేరి, తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నాదృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే ప్రత్తిపాడు మా పార్టీ ఇన్‌ఛార్జి బాలసాని కిరణ్, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని మా వాళ్లు చెప్పారు. వెంటనే నేను స్పందించి మరుసటి రోజుకూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.10లక్షల ఆర్థిక సహాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చాను. ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను మేం నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా మా మీద విషప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం? అయినా నేను చంద్రబాబుగారిని ప్రశ్నిస్తున్నా.. మీ పర్యటనల సమయంలో, మీ మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు? ఎంత చేశారు? ఎంత మేర చేశారు? మీరా మానవత్వం గురించి, నైతికత గురించి మాట్లాడేది? ఇప్పటికైనా మారండి! అని ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.•@ncbn గారూ.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? •చంద్రబాబు గారూ.. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరుకాని, మీ పవన్‌కళ్యాణ్ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 23, 2025 -
నిజం బయటపెట్టిన సింగయ్య వీడియో
-
KSR Live Show: డ్రైవర్ పై ఒత్తిడి.. అబద్ధపు వాగ్మూలంతో జగన్ ను ఇరికించేందుకు కుట్ర..!
-
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై వైఎస్ఆర్ సీపీ నేతలు..
-
ఎల్లో కుట్ర బయటపెట్టిన సింగయ్య కొత్త వీడియో..
-
నెల్లూరులో జగన్ పై ఉన్న అభిమానం అంటే ఏంటో చూపిస్తా..
-
కూటమి కుట్ర.. ప్రెస్ మీట్ లో మాట మార్చిన ఎస్పీ సతీష్
-
వైఎస్ జగన్ పై అక్రమ కేసు నమోదు కోసం కూటమి ప్రభుత్వ కుతంత్రం
-
సింగయ్య మృతి ఉదంతంలో ఏ1 చంద్రబాబు ప్రభుత్వమే..!