‘రప్పా రప్పా శ్రీకాంత్‌’కు రిమాండ్‌ | 14-day Remand For Man Who Waved Provocative Placard At Jagan Rally In Palnadu, More Details Inside | Sakshi
Sakshi News home page

‘రప్పా రప్పా శ్రీకాంత్‌’కు రిమాండ్‌

Jun 28 2025 9:17 AM | Updated on Jun 28 2025 11:23 AM

14-day remand for man who waved provocative placard at Jagan rally

సత్తెనపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఈ నెల 18న టీడీపీ సానుభూతిపరుడు బొల్లెద్దు రవితేజ వైఎస్సార్‌సీపీ అభిమానిగా మారి రప్పా రప్పా అంటూ ఓ పోస్టర్‌ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ పట్టణ మైనార్టీ సెల్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 దీనిలో ఏ–2 బొల్లెద్దు రవితేజ, ఏ–4గా ఉన్న ప్రకాశం జిల్లా మిన్నెకల్లుకు చెందిన ఆరేటి వెంకట మల్లికార్జునరావు అలియాస్‌ మల్లిఖార్జున్‌ అలియాస్‌ మల్లి సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో నివసిస్తున్నాడు. మల్లిని పట్టణ పోలీసులు ఈ నెల 23న కోర్టులో హజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. 

ఏ–3గా ఉన్న సత్తెనపల్లి రాజులకాలనీకి చెందిన నాగ శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి శుక్రవారం సత్తెనపల్లి మొదటి అదనపు సివిల్‌ జడ్జి(జూనియర్‌ డివిజన్‌) కోర్టులో హజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్‌ విధించారు. కాగా ఏ–2 బొల్లెద్దు రవితేజ, ఏ–4 ఆరేటి వెంకటమల్లిఖార్జునరావుల బెయిల్‌కు దరఖాస్తు చేయగా న్యాయమూర్తి బెయిల్‌ తిరస్కరించి న్యాయవాది సమక్షంలో విచారణకు కస్టడికి ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement