అక్రమ కేసులకు భయపడం.. పోరాడతాం: గజ్జల సుధీర్ భార్గవరెడ్డి | Gajjala Sudheer Bhargav Reddy Fires On Chandrababu Diversion Politics | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులకు భయపడం.. పోరాడతాం: గజ్జల సుధీర్ భార్గవరెడ్డి

Jun 21 2025 6:14 PM | Updated on Jun 21 2025 7:08 PM

Gajjala Sudheer Bhargav Reddy Fires On Chandrababu Diversion Politics

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పల్నాడు పర్యటన విజయవంతం కావడం తట్టుకోలేకపోతోందని.. అందుకే అక్రమ కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డు పట్టుకున్న రవితేజ టీడీపీ కార్యకర్త.. అతన్ని హింసించి నా ప్రమేయం ఉన్నట్టుగా అక్రమ కేసు పెడుతున్నారు’’ అని భార్గవరెడ్డి ధ్వజమెత్తారు.

‘‘నాకు షార్ట్ కట్ రాజకీయాలు తెలియవు. జనానికి సేవ చేయటానికే రాజకీయాల్లోకి వచ్చా. కానీ నన్ను అణచివేయాలని చూస్తున్నారు. ఆ రోజు జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. పోలీసులను అడ్డుపెట్టి అందరినీ బెదిరించారు. వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించినా జనం తరలి వచ్చారు. సత్తెనపల్లి చుట్టూ 25 చెక్ పోస్టులు పెట్టారు. జనాన్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. రవితేజ ఆ ప్లకార్డు పట్టుకోవటం వెనుక టీడీపీ కుట్ర ఉంది.’’ అని సుధీర్‌ భార్గవ్‌రెడ్డి చెప్పారు.

‘‘రవితేజ, అతని కుటుంబం టీడీపీ కార్యకర్తలే. రవితేజని 18వ తేదీ రాత్రే అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని పోలీసు స్టేషను ఎదుట అతని భార్యే చెప్పింది. కానీ నిన్న అరెస్టు చేసినట్టు అతనితో బలవంతంగా చెప్పించారు. అతన్ని రెండు రోజులపాటు చిత్రహింసలకు గురి చేశారు. రవితేజతో నా పేరు చెప్పించి నాపై కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు. అక్రమ కేసులను ఎదుర్కొంటాం. న్యాయ పోరాటం చేస్తాం’’ అని  భార్గవ్‌రెడ్డి పేర్కొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement