ఓటు వేయనివాడికి పథకాలు ఎందుకివ్వాలి ? | AP Speaker Ayyanna Patrudu Sensational Comments On Welfare For Non Voters Spark Controversy | Sakshi
Sakshi News home page

ఓటు వేయనివాడికి పథకాలు ఎందుకివ్వాలి ?

Jul 13 2026 8:24 AM | Updated on Jul 13 2026 10:08 AM

AP Speaker Ayyanna Patrudu Sensational Comments

విశాఖపట్నం: ఓటు వేయని వాడికి సంక్షేమ పథకాలు, పెన్షన్‌లు ఎందుకు ఇవ్వాలి? అంటూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విశాఖ రుషికొండలో ఆదివారం ఒక పుస్తకావిష్కరణ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటరు లిస్టులో పేరు లే­కుంటే.. ఆ ఓటరు చచ్చిపోయినట్లేనని, పోలింగ్‌ బూత్‌ వరకు వెళ్లి ఓటు వేయనివాడికి పథకాలు ఎందుకివ్వాలని ప్రశ్నించారు. 

ఓటరు లిస్టులో పేరు ఉందో.. లేదో.. తెలియని వాడికి కూడా పథకాలివ్వాలా అంటూ.. ఆవేశంతో ఊగిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఇంటింటికీ అధికారులను పంపించి ఓటు నమోదు చేసుకోవడమేంటి.. మీరు ఓటు నమోదు చేసుకోలేరా? ఆ బాధ్యత మీకు లేదా.. అంటూ అయ్యన్నపాత్రుడు నిలదీశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement