ఎన్నేళ్లు తెలుగు ఇండస్ట్రీలో పని చేసినా కొందరు హీరోయిన్లకు తెలుగు అస్సలు రాదు. కానీ ఓ తమిళ నటి మాత్రం తెలుగులో ఒక్క సినిమా చేయకపోయినా తెలుగు స్పీచ్ అందరిని ఆకట్టుకుంది. మీథా రఘునాథన్ (Meetha Raghunath)
2022లో విడుదలైన "ముదల్ నీ ముదివం నీ" చిత్రంలో నటిగా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ
అందరూ కొత్త నటీనటులతో, కొత్త దర్శకుడితో తెరకెక్కిన ఆ చిత్రం థియేటర్స్‌లో అంతగా ఆడలేదు కానీ ఓటీటీలో సంచనలం సృష్టించింది.
2023లో ‘గుడ్ నైట్’(Good Night Movie) చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది మీథా రఘునాథ్.
మొదటి సినిమాలోలాగానే ఇందులో కూడా ఒక పక్కింటామ్మాయి పాత్రలో సింపుల్‌గా కనిపించింది. హాట్‌స్టార్‌లో రిలీజ్ అయిన ఈ చిత్రం క్లీన్ హిట్‌ను సాధించింది. ఈ చిత్రంలోనే ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
ఇక ఇప్పుడు 3 BHK (3 BHK Movie) సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది.
సిద్ధార్థ్ (Siddharth) హీరో నటించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఈవెంట్‌లో మీథా అనర్గళంగా తెలుగు మాట్లాడి అందరిని ఆకట్టుకుంది. హీరో సిద్ధార్థ్‌తో సహా అందరూ ఆమె తెలుగు స్పీచ్ విని అవాక్కయ్యారు. తెలుగులో ఒక్క సినిమా చేయకపోయినా..ఇంత చక్కగా తెలుగు మాట్లాతుందని అందరూ ఆమెను మెచ్చుకున్నారు.
2024 మార్చి 17న మిథా వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది.


