ఇదేంది‘రప్పా’..! అడ్డంగా దొరికిపోయిన టీడీపీ | Yellow Media Conspiracy Exposed Over Pushpa Dialogue Poster At YS Jagan Palnadu Visit, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Palnadu Posters Controversy: ఇదేంది‘రప్పా’..! అడ్డంగా దొరికిపోయిన టీడీపీ

Jun 20 2025 7:18 AM | Updated on Jun 20 2025 9:23 AM

Palnadu: Yellow Media Conspiracy Exposed Over Pushpa Dialogue Poster

సార్వత్రిక ఎన్నికలకు ముందు భాష్యం ప్రవీణ్‌ ఆ«ధ్వర్యంలో టీడీపీలో చేరిన బొల్లెద్దు రవితేజ తండ్రి ఐలయ్య, సమీప బంధువులు

రప్పారప్పా పోస్టర్‌ ప్రదర్శించిన రవితేజకు తెలుగుదేశం సభ్యత్వం 

ఎన్నికల ముందే భాష్యం ప్రవీణ్‌ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన కుటుంబం  

రవితేజ అరెస్టుతో వెలుగులోకి నిజాలు  

అతను టీడీపీ కోవర్టే..  అలజడులు సృష్టించేందుకే పంపారని 

వైఎస్సార్‌సీపీ అభిమానుల ధ్వజం  

సాక్షి, నరసరావుపేట: అధికారపార్టీ అడ్డంగా బుక్కయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెంటపాళ్ల పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీ అభిమానులు ప్రదర్శించిన ఫ్లెక్సీలపై కూటమి నేతలు, వారి అనుకూల మీడియా రెండు రోజులుగా నానాయాగీ చేశారు. ‘‘సైకోలు వీరంగం చేశారు, నరకుడు భాష ఏంటి’’ అటూ పచ్చ పత్రికల్లో వార్తలు రాయడంతోపాటు టీవీ చానళ్లలో డిబేట్లు నిర్వహించారు.

వైఎస్సార్‌సీపీ అభిమానులకు వ్యతిరేకంగా విష ప్రచారం చేశారు. కూటమి మంత్రులు, ప్రజాప్రతినిధులు గగ్గోలు పెట్టారు. పుష్ప సినిమాలోని రప్పా.. రప్పా.. పోస్టర్‌ ప్రదర్శించిన బొల్లెద్దు రవితేజపై టీడీపీ మైనార్టీ సెల్‌ సత్తెనపల్లి టౌన్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌ వలి చేత పోలీసులకు ఫిర్యాదు చేయించారు. పోలీసులూ తక్షణం కేసు నమోదు చేశారు. తీరా చూస్తే రవితేజ టీడీపీ వాడేనని తేలిపోయింది. దీంతో అధికారపార్టీ అడ్డంగా దొరికిపోయింది.  

బయటపడిన అసలు నిజాలు  
పోలీసులు పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం 88 తాళ్లూరు గ్రామానికి చెందిన బొల్లెద్దు రవితేజను బుధవారం రాత్రి  అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది. రవితేజ కుటుంబ సభ్యులు తాము టీడీపీ అభిమానులమని తమకు వైఎస్సార్‌సీపీతో సంబంధం లేదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ చేతుల మీదుగా పచ్చ కండువా కప్పుకుని టీడీపీలో చేరామని ఫొటోలు చూపారు.

            బొల్లెద్దు రవితేజపై ఉన్న టీడీపీ సభ్యత్వ కార్డు  

రవితేజ పేరు మీద ఉన్న టీడీపీ సభ్యత్వ కార్డునూ వారే బయటపెట్టారు. దీంతో టీడీపీ నేతలు, సోషల్‌మీడియా కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు. టీడీపీ సభ్యత్వం ఉండి వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో ఎందుకు పాల్గొన్నాడని, ఏ ఉద్దేశంతో హాజరయ్యాడు? రవితేజ వెనుక ఎవరున్నారంటూ సోషల్‌మీడియాలో వైఎస్సార్‌సీపీ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. రవితేజ టీడీపీ కోవర్టేనని, వైఎస్‌ జగన్‌ పర్యటనలో ఆలజడులు సృష్టించడానికే టీడీపీ నేతలు అతనిని పంపి కుట్రలు పన్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. 

 

టీడీపీ నేతల కొత్త రాగం  
వైఎస్సార్‌సీపీ అభిమానులపై టీడీపీ చేసిన దు్రష్పచారం బూమరాంగ్‌ కావడంతో ఆ పార్టీ నేతలు కొత్త రాగం మొదలుపెట్టారు. రవితేజ తల్లిదండ్రులు టీడీపీ వారేనని, కానీ రవితేజ మాత్రం వైఎస్సార్‌సీపీ అభిమాని అంటూ బుకాయిస్తున్నారు. బీమా ఉందని టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడంటూ పెదకూరపాడు నేతలతో వీడియోలు విడుదల చేయించారు. దీనికి సోషల్‌ మీడియా యాక్టివిస్టులు గట్టి సమాధానాలు ఇచ్చారు. కోట్ల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారంటూ మహానాడులో చేసే ప్రసంగాలన్నీ వట్టివేనా అంటూ ప్రశి్నంచారు. జీవిత బీమా ఉంటుందని ఆశచూపి ఇతర పార్టీల నేతలకూ సభ్యత్వాలు అంటగడుతూ గొప్పలు చెప్పుకుంటున్నారా అంటూ ఎద్దేవా చేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement