ముఖ్యమంత్రి చంద్రబాబు, ‘ముఖ్యమైన మంత్రి’ నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వీరు ప్రస్తుతం ఏపీ పాలనలో కీలక వ్యక్తులు అనే విషయం తెలియంది కాదు. మరి అటువంటి కీలకమైన వ్యక్తులు పరిపాలన బాధ్యతల్ని అమరావతిలోనే గాలికొదిలేసి వారాంతంలో హైదరాబాద్‌కు వచ్చి చిల్ అవుతూ ఉంటారు. ‘ఏపీ ముఖ్య పాలకులు.. వీకెండ్ వర్క్ ఫ్రమ్ హైదరాబాద్’ అంటే వీరికి కచ్చితంగా సరిపోతుంది కదా. ఐటీ ఉద్యోగుల కంటే వేగంగా ఫ్రైడే ఈవెనింగ్ ఫ్లైట్ ఎక్కేది మన పాలకులేనేమో.
హైదరాబాద్ బ్రాండ్‌నే నమ్ముకున్న ‘విజనరీ’
రాజధాని అమరావతిలోనే కడతామని చెబుతూనే, వారాంతపు విశ్రాంతికి మాత్రం 'హైదరాబాద్ బ్రాండ్‌నే నమ్ముకున్న విజనరీ నాయకత్వం మన ఏపీ పాలకులది. అమరావతి నుంచి పాలన సాగించాల్సిన పాలకులు.. హైదరాబాద్‌లో పలకరింపులతో తెగ మురిసిపోతూ ఉంటారు. వీకెండ్ వచ్చిందంటే గన్నవరం ఎయిర్‌పోర్ట్ కంటే శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లోనే ఏపీ ప్రోటోకాల్ హడావిడి ఎక్కువగా కనిపిస్తోందంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
చంద్రబాబు అండ్ కో వీకెండ్ ట్రిప్ మరిచిపోయారా?
పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడటం లేదని అనుకుంటుందనే నానుడి ఉంది కదా.. ఇది వీరికి అతికినట్లే ఉంటుంది. మనం చేసే ‘జల్సా’ను పక్కను పెట్టి.. మిగతా వారిపై, ప్రధానంగా ప్రతిపక్షంపై ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని బురద జల్లడం మాత్రం బాగా చేస్తూ ఉంటారు. ‘జగన్ వందోసారి బెంగళూరు నుంచి తాడేపల్లికి’ అని ఈనాడు కథనం రాసింది. అది వ్యక్తిగత విషయం కదా.. వైఎస్ జగన్ బెంగళూరుకు ఎన్నిసార్లు వెళ్లి తాడేపల్లికి ఎన్నిసార్లు వస్తే తప్పేంటి?. వైఎస్ జగన్ గురించి రాసినప్పుడు ఎల్లో మీడియా చంద్రబాబు అండ్ కో కంపెనీ విషయంలో ఒక విషయం మరిచిపోయినట్లుంది.

వీకెండ్ వస్తే చాలు అమరావతి నుంచి హైదరాబాద్‌కు ఆగమేఘాల మీద వచ్చేసే చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌ల గురించి ఎల్లో మీడియాకు గుర్తు రాలేనట్లు ఉంది. వీరు వీకెండ్‌లో సేద తీరేందుకు హైదరాబాద్‌కు వచ్చే విషయాన్ని మాత్రం గోప్యంగా మాత్రం ఉంచుతుంది.
కానీ ప్రతిపక్ష నాయకుడైన ‘వైఎస్ జగన్ ఎన్నిసార్లు బెంగళూరు వెళ్లారు.. ఎన్నిసార్లు తాడేపల్లికి వచ్చారు’ అని వార్తను రాసి ఏదో చేయాలని ప్రయత్నిస్తుంది. ఇక్కడ వైఎస్ జగన్‌ను ఏదో రకంగా బద్నాం చేయాలనేది ఎల్లో మీడియా టార్గెట్ అనే విషయం మరోసారి రుజువైంది.
చలోరే చలోరే చల్.. చలోరే చలోరే చల్..!
చలోరే చలోరే చల్.. చలోరే చలోరే చల్.. ఇది జల్సా సినిమాలోని పాటలో ఒక లైన్. ఇది అచ్చంగా మన ప్రస్తుత ఏపీ పాలకులకు సరిపోతుంది. వీకెండ్‌లో అమరావతి నుంచి హైదరాబాద్‌కు చలోరే చలోరే చల్.. చలోరే అంటూ వాలిపోయి ‘కరో కరో జర జల్సా.. సా.. జల్సా తెలుసా తెలుసా తెలుసా ఎవ్వరికైనా తెలుసా’ అన్నట్లు ఉంటుంది వీరి హైదరాబాద్ వీకెండ్ ట్రిప్ జల్సా. మరి వీకెండ్ వస్తే హైదరాబాద్‌కు వచ్చే ఏపీ ముఖ్య పాలకుల గురించి, వారు ఎన్నిసార్లు హైదరాబాద్‌కు వెళ్లారు.. ఎన్నిసార్లు అమరావతికి వచ్చారు అనే విషయం ఒక్కసారి ఎల్లో మీడియా చెబితే బాగుంటుంది కదా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: ఎల్లో మీడియా మరో ‘పచ్చ’ పాత కథనం!


