బాబు బురిడీ ‘రీకాలింగ్‌’ | Recalling Chandrababu Manifesto launched across the state | Sakshi
Sakshi News home page

బాబు బురిడీ ‘రీకాలింగ్‌’

Jun 28 2025 3:52 AM | Updated on Jun 28 2025 3:52 AM

Recalling Chandrababu Manifesto launched across the state

క్యూఆర్‌ కోడ్‌ను ఆవిష్కరిస్తున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి. చిత్రంలో ఎంపీ మిథున్‌ రెడ్డి, పార్టీ నేతలు ఉషశ్రీచరణ్, అనంత వెంకటరామిరెడ్డి తదితరులు

రాష్ట్రవ్యాప్తంగా ‘రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో’ ప్రారంభం

జిల్లా స్థాయి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు 

చంద్రబాబు ఇచ్చిన బాండ్లను డౌన్‌లోడ్‌ చేసి ప్రజలకు చూపించాలని నేతల పిలుపు 

ఏడాదిలో అమలు చేసిన హామీలను, కలిగిన లబ్ధిని వివరించాలి  

కూటమి సర్కారు మోసాలను బట్టబయలు చేయాలి 

సాక్షి నెట్‌వర్క్‌: ఎన్నికల సమయంలో అనేక హామీ­లిచ్చి, అధికారం చేపట్టాక ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు ‘రీకాలింగ్‌ చంద్ర­బాబూస్‌ మేనిఫెస్టో’ (చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ...) కార్య­క్రమాన్ని శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశించిన మేరకు తొలి దశలో జిల్లా స్థాయిల్లో ఏర్పాటుచేసిన సమావే­శాలకు విశేష స్పందన లభించింది. 

‘రీకాలింగ్‌ చంద్ర­బాబూస్‌ మేనిఫెస్టో’ కార్యక్రమం పోస్టర్లను, క్యూఆర్‌ కోడ్‌లను నాయ­కులు విడుదల చేశారు. చంద్రబాబు ఎన్నికల సమ­యంలో ‘బాబు ష్యూరిటీ–­భవిష్యత్‌ గ్యారెంటీ’ పేరుతో కుటుంబాల వారీగా వర్తించే పథకాల పేర్లు పేర్కొంటూ ఇచ్చిన బాండ్లను చూపించి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కలిగిన లబ్ధి, చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమం చేపడతా­మని ప్రకటించారు. చంద్ర­బాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటం సాగిస్తూనే ఉంటామని స్పష్టంచేశారు. 

ఆయా కార్యక్రమాల్లో పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయ­కర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐదు వారా­లపాటు జరిగే ‘రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని గ్రామ, గ్రామాన విజ­యంతం చేసేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 

చంద్రబాబుతో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: సజ్జల 
రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని వైఎస్సార్‌­సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతపురం జిల్లా బుక్కరా­యసముద్రంలో వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజ­క­వర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ అధ్యక్షతన నిర్వహించిన వైఎస్సార్‌సీపీ కార్యాల­యం ప్రారంభోత్సవం, ‘రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లా­డుతూ సీఎం చంద్రబాబు దుర్మార్గం, మోసాలు, అన్యాయాలు, దౌర్జన్యాలతో రికార్డు సాధించార­న్నారు. 

ఈ విషయంలో చంద్రబాబు ఏడాది పాల­నను గిన్నిస్‌బుక్‌ రికార్డుల్లో ఎక్కించవచ్చన్నారు. చంద్ర­బాబు మోసాలను ప్రజలకు గుర్తు చేసేందుకే ‘రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికలు పెడితే టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని ఆ పార్టీ అనుకూల సర్వే సంస్థలే చెబుతున్నాయన్నారు. వైఎస్సార్‌సీపీ అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
చంద్రబాబు బాండ్లు చూపించి 

ఏం చేశారో అడుగుతాం: బొత్స 
‘ఇదిగో చంద్రబాబు మేనిఫెస్టో. ఇవిగో ఆయనిచ్చిన బాండ్లు అని ప్రజలకు చూపిస్తాం. అధికారంలోకి వచ్చి ఏడాదైంది. చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని అడుగుతాం. చంద్రబాబు టక్కుటమార విద్యలతో ప్రజల్ని మోసం చేస్తే కుదరదు.’ అని శాసనమండలిలో విపక్ష నేత, వైఎస్సార్‌సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ బొత్స సత్యనారాయణ చెప్పారు. కాకినాడలో ‘రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం క్యూఆర్‌ కోడ్‌ను బొత్స, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు విడుదల చేశారు. 

బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో ఐదు వారాలపాటు నిర్వహించనున్న ‘రీకాలింగ్‌ చంద్ర­బాబూస్‌ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులందరూ సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ‘రీకాలింగ్‌ చంద్ర­బాబూస్‌ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం రూరల్‌ కంతేరులో బొత్స సత్యనారాయణ ప్రారంభించారు.  

అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు: పెద్దిరెడ్డి
‘చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎంత­కైనా దిగజారుతారు. ఎన్ని అబద్ధపు హామీలైనా గుప్పి­స్తారు. నమ్మిన వాళ్లను నట్టేట ముంచడానికి సైతం వెనకాడరు.’ అని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినే­టర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ­చంద్రారెడ్డి విమర్శించారు. తిరుపతిలో ‘రీకాలింగ్‌ చంద్ర­బాబూస్‌ మేనిఫెస్టో’ కార్యక్ర­మాన్ని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, తిరుపతి ఎంపీ మద్దిల గురు­మూర్తితో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇస్తున్న పథకాల కంటే ఎక్కువగా ఇస్తానని హామీలు ఇచ్చిన చంద్రబాబు... అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మోసం చేస్తున్న ప్రజాద్రోహి అని మండిపడ్డారు. భూమన కరుణాకర­రెడ్డి మాట్లాడుతూ తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి పాదాల చెంత చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పి ప్రజలను వంచించి ఓట్లు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

అదేవిధంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలోనూ ‘రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement