ఈసెట్‌ కౌన్సెలింగ్‌ ఎప్పుడో?: వైఎస్‌ జగన్‌ | YS Jagan Fires On Education System In Andhra Pradesh Over Delay In AP- ECET Counseling | Sakshi
Sakshi News home page

ఈసెట్‌ కౌన్సెలింగ్‌ ఎప్పుడో?: వైఎస్‌ జగన్‌

Jun 30 2025 4:48 AM | Updated on Jun 30 2025 10:08 AM

YS Jagan Fires On Education System In Andhra Pradesh Over Delay In AP- ECET Counseling

ఫలితాలొచ్చి 45 రోజులైనా ప్రారంభించరా?

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ 

టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ మండిపాటు 

అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు అంటూ నారా లోకేశ్‌కు చురకలు

సాక్షి, అమరావతి : ఏపీ ఈసెట్‌ ఫలితాలొచ్చి 45 రోజులవుతున్నా ఇప్పటికీ కౌన్సెలింగ్‌ ప్రారంభించలేదని.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ అంటూ ‘ఎక్స్‌’ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ టీడీపీ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు చురకలంటిస్తూ ఆదివారం ‘ఎక్స్‌’లోని తన ఖాతాలో వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు. ఆయన ఏమన్నారంటే.. 
‘‘రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ.

ఈసెట్‌ ఫలితాలొచ్చి దాదాపు 45 రోజులవుతున్నా ఇప్పటికీ కౌన్సెలింగ్‌ ప్రారంభం కాలేదు. మరోవైపు.. రేపటి నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్లాసులు ప్రారంభమవుతున్నాయి. ఇంజినీరింగ్‌ రెండో ఏడాదిలో అడ్మిషన్ల కోసం 34 వేల మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఈసెట్‌ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. మే 15న ఈ ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్‌ ప్రక్రియపై షెడ్యూల్‌ విడుదల చేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు’’.  


 

Advertisement
 
Advertisement
Advertisement