
సాక్షి, తాడేపల్లి: అల్లూరి సీతారామరాజుకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘బ్రిటిష్ పాలనను ఎదురించి, స్వరాజ్య సాధనలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
‘‘గిరిజనుల హక్కుల కోసం ఆయన చేసిన స్వాతంత్ర్య పోరాటం చిరస్మరణీయమైనది. ఆ గొప్ప యోధుడిని కలకాలం గుర్తించుకునేలా అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాను ఏర్పాటు చేసి, ఆయన్ని గౌరవించుకున్నాం. నేడు ఆ మహావీరుడి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
బ్రిటిష్ పాలనను ఎదురించి, స్వరాజ్య సాధనలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు గారు. గిరిజనుల హక్కులకోసం, వారి ఆత్మగౌరవం కోసం, వారితో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర్య పోరాటం చిరస్మరణీయమైనది. ఆ గొప్ప యోధుడిని కలకాలం గుర్తుంచుకునేలా అల్లూరి సీతారామరాజు… pic.twitter.com/3VtISU9UwL
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2025