నేడు వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం | Ys Jagan To Hold Key Meeting With Ysrcp Leaders At Tadepalli on June 25 | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం

Jun 25 2025 4:06 AM | Updated on Jun 25 2025 8:45 AM

Ys Jagan To Hold Key Meeting With Ysrcp Leaders At Tadepalli on June 25

సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతోపాటు, రీజినల్‌ కో–ఆర్డినే­టర్లు పాల్గొంటారు.

టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం, వైఎస్సార్‌సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై సమావేశంలో చర్చిస్తారు. సూపర్‌సిక్స్‌ హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. ఆ దిశలో పార్టీ నాయకులకు జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement