
సాక్షి, తాడేపల్లి: ప్రముఖ హిప్నాటిస్టు, మెజీషియన్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డా. బీవీ పట్టాభిరామ్ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, ఇంద్రజాలికుడిగా, రచయితగా ఆయన ప్రసిద్ధి చెందారని, తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, తమిళ భాషల్లో పట్టాభిరామ్ రాసిన పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందాయన్నారు.
అలాగే విద్యార్థుల కోసం తెలుగు రాష్ట్రాల్లో వేలాది పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు, వర్క్‌షాపులు, సెమినార్లను నిర్వహించి వారి జీవితాలపై ప్రభావం చూపారన్నారు. పట్టాభిరామ్ మృతితో విద్యా, వ్యక్తిత్వ వికాస రంగాల్లో తీవ్ర లోటు ఏర్పడిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నామన్నారు. పట్టాభిరామ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
‘‘బీవీ పట్టాభిరామ్ మృతి బాధించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు.
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డా. బి.వి. పట్టాభిరామ్ గారి మృతి బాధించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు భగవంతున్ని మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. pic.twitter.com/uK4lk2KBUL
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 1, 2025