అన్నమయ్య జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | YS Jagan condolences over Annamayya district road accident | Sakshi
Sakshi News home page

అన్నమయ్య జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Jun 30 2025 10:52 AM | Updated on Jun 30 2025 3:25 PM

YS Jagan condolences over Annamayya district road accident

సాక్షి, తాడేపల్లి: అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

అన్నమయ్య జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురి కావడం అత్యంత బాధాకరమని అన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చ‌ద‌వండి: ఈసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడో? 

Advertisement
 
Advertisement
Advertisement