రేపు వైఎస్సార్‌సీపీ యువజన విభాగం సభ్యులతో వైఎస్‌ జగన్‌ భేటీ | Ys Jagan To Meet With Ysrcp Youth Wing Members On July 1st | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్సార్‌సీపీ యువజన విభాగం సభ్యులతో వైఎస్‌ జగన్‌ భేటీ

Jun 30 2025 6:33 PM | Updated on Jun 30 2025 7:05 PM

Ys Jagan To Meet With Ysrcp Youth Wing Members On July 1st

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ యువజన విభాగం సభ్యులతో రేపు (మంగళవారం) ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ కానున్నారు. రేపు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ యువజన విభాగం ప్రతినిధులతో సమావేశమవనున్నారు. 

ఈ భేటీలో యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, యువజన విభాగం జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు పాల్గొంటారు. వీరితో పాటు పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement