-
నాదల్కు చుక్కెదురు
బార్సిలోనా: స్పెయిన్ దిగ్గజం, 12 సార్లు చాంపియన్ రాఫెల్ నాదల్ బార్సిలోనా ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో నాదల్ 5–7, 1–6తో డి మినార్ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడిపోయాడు. 2003 తర్వాత నాదల్ మళ్లీ ఈ టోర్నీలో రెండో రౌండ్లో పరాజయం చవిచూశాడు. తుంటి గాయంతో నాదల్ ఈ ఏడాది కేవలం ఒక టోర్నీలో మాత్రమే పాల్గొన్నాడు. బ్రిస్బేన్ ఓపెన్‌లో నాదల్ క్వార్టర్ ఫైనల్లో ఆ్రస్టేలియా ప్లేయర్ జోర్డాన్ థాంప్సన్ చేతిలో ఓడిపోయాడు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు నాదల్ దూరం
స్పెయిన్ దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్ ఈనెల 14 నుంచి 28 వరకు జరిగే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు నాదల్ దూరం నుంచి వైదొలిగాడు. కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన 37 ఏళ్ల నాదల్ గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత తుంటి గాయంతో ఏడాదిపాటు ఆటకు దూరమయ్యాడు. గతవారం బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీతో నాదల్ పునరాగమనం చేశాడు. ఈ టోర్నీ లో జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయిన నాదల్ ఈ మ్యాచ్ సందర్భంగా ఎడమ కాలి కండరాల గాయానికి గురయ్యాడు. -
నాదల్ ఖాతాలో తొలి విజయం
తుంటి గాయం నుంచి కోలుకున్న స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ కొత్త ఏడాదిలో తొలి విజయం అందుకున్నాడు. బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నాదల్ 7–5, 6–1తో ప్రపంచ మాజీ మూడో ర్యాంకర్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్లో ఓడిపోయాక నాదల్ తుంటి గాయంతో మరే టోర్నీలోనూ ఆడలేదు. బ్రిస్బేన్ ఓపెన్‌తో పునరాగమనం చేసిన నాదల్ ఇదే టోర్నీ డబుల్స్‌లోనూ బరిలోకి దిగి తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. సింగిల్స్‌లో మాత్రం శుభారంభంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. -
ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రపంచ నం.1 టెన్నిస్ ప్లేయర్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌కు, ఆ సంస్థకే చెందిన డిజిటల్ ఇన్నోవేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అంతర్జాతీయ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఈ భాగస్వామ్యం అమల్లో ఉంటుంది. ఈ సందర్భంగా ఇన్ఫీ, నాదల్ కోచింగ్ టీమ్ కలిసి కృత్రిమ మేధ ఆధారిత మ్యాచ్ అనాలిసిస్ టూల్‌ను అభివృద్ధి చేయనున్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వ్యక్తులు, వ్యాపార దిగ్గజాలు ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మల్చుకుంటూ, ముందుకు ఎలా సాగాలనేది తెలుసుకునేందుకు నాదల్ చక్కని నిదర్శనమని సంస్థ సీఈవో సలిల్ పరేఖ్ తెలిపారు. ఇన్ఫోసిస్ డిజిటల్ రంగంలో తనకున్న అనుభవంతో టెన్నిస్ క్రీడకు కూడా సేవలు అందించే తీరు తనకు నచ్చిందని నాదల్ పేర్కొన్నారు. -
జొకోవిచ్‌ను ‘పచ్చిక’ కరిపించిన అల్కరాజ్.. నాదల్ భావోద్వేగ ట్వీట్ వైరల్
Wimbledon 2023 Mens Singles Winner Alcaraz: ఆల్ ఇంగ్లండ్ క్లబ్ వేదికపై కొత్త చరిత్ర నమోదైంది. క్లే కోర్టు స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకొని, హార్డ్‌కోర్ట్‌పై తొలి గ్రాండ్‌స్లామ్ సాధించిన తర్వాత ఇప్పుడు గ్రాస్ కోర్టుపై స్పెయిన్ ‘బేబీ బుల్’ మెరిశాడు. 23 గ్రాండ్‌స్లామ్‌ల చాంపియన్ జొకోవిచ్ వరుస విజయాలకు విరామమిస్తూ యువ సంచలనం కొత్త శకానికి నాంది పలికాడు. జొకోవిచ్‌ను ‘పచ్చిక’ కరిపించి రెండు పదుల వయసుకే కీర్తి శిఖరంపై నిలిచిన కార్లోస్ అల్కరాజ్ అద్భుత ఆటతో ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో విజేతగా నిలిచాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన సమరంలో ‘ఆల్‌టైమ్ దిగ్గజం’ జొకోవిచ్‌ను ‘పచ్చిక’ కరిపించి చాంపియన్‌గా అవతరించాడు. వరల్డ్ నంబర్‌వన్‌గా తన అద్వితీయ ఆటను అతను సాధించిన గెలుపు టెన్నిస్‌లో రాబోయే నూతన శకానికి నాంది పలికింది. 24వ టైటిల్‌తో పాటు క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన జొకోవిచ్ ఆఖరి వరకు తన స్థాయికి తగ్గ ఆటతో ప్రయత్నించినా... ఇద్దరి మధ్య ఉన్న ‘16’ ఏళ్ల అంతరం ఆట చివర్లో అతని జోరుకు అడ్డుకట్ట వేసింది. నాదల్ భావోద్వేగ ట్వీట్ వైరల్ నాదల్ వారసుడిగా గుర్తింపు తెచ్చుకొని పిన్న వయసులోనే పలు రికార్డులకు చిరునామాగా మారిన అల్కరాజ్ సగర్వంగా తన రెండో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని ప్రదర్శించాడు. ఈ నేపథ్యంలో ఈ స్పెయిన్ టెన్నిస్ స్టార్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సెర్బియా స్టార్, రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్‌ను ఓడించిన అతడి ఆటకు అభిమానులు మాత్రమే కాదు దిగ్గజ ఆటగాళ్లు సైతం ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో మరో స్పెయిన్ స్టార్, లెజెండ్ రాఫెల్ నాదల్ చేసిన ట్వీట్ ప్రత్యేకంగా నిలిచింది. ‘‘కంగ్రాట్యులేషన్స్ అల్కరాజ్. ఈరోజు మాకు నువ్వు ఎనలేని సంతోషాన్ని పంచావు. స్పానిష్ టెన్నిస్‌లో మన మార్గదర్శి, దిక్సూచి, వింబుల్డన్‌లో అద్భుతాలు చేసిన మనోలో సాంటానా కూడా నీ ఆట చూసి ఉప్పొంగిపోయి ఉంటారు. నిన్ను గట్టిగా హత్తుకుని ఈ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలని ఉంది చాంపియన్!!! మన టీమ్‌కు ఇదొక గొప్ప క్షణం’’ అని నాదల్.. అల్కరాజ్ను ఉద్దేశించి భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. కాగా తొంటినొప్పి కారణంగా నాదల్ ఈ ఏడాది వింబుల్డన్ చాంపియన్‌షిప్‌నకు దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. అల్కరాజ్ అద్భుత ఆట కారణంగా 24వ గ్రాండ్‌స్లామ్ గెలవాలన్న జొకోవిచ్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇక ఈ విజయంతో.. గతేడాది యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన అల్కరాజ్ ఖాతాలో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరింది. చదవండి: టీమిండియా కొత్త కెప్టెన్ అరంగేట్రం.. రహానేపై వేటు! అతడు కూడా.. ‘సెహ్వాగ్.. నీకు బ్యాటింగే రాదు! పాక్‌లో ఉంటే ఇక్కడి దాకా వచ్చేవాడివే కాదు’ జైశ్వాల్ ఒక్కడే కాదు.. అతడు కూడా టాలెంటెడ్.. ఛాన్స్ ఇస్తేనే: పాంటింగ్ Enhorabuena @carlosalcaraz . Nos has dado una alegría inmensa hoy y seguro que nuestro pionero en el tenis español, Manolo Santana, también ha estado animando allá dónde esté como de Wimbledon al que hoy te has unido. Un abrazo muy fuerte y a disfrutar del momento ¡¡¡Campeón!!!… pic.twitter.com/y0j2GowX3O — Rafa Nadal (@RafaelNadal) July 16, 2023
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్‌లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement