Roger Federer-Rafael Nadal: ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు.. ఫెదరర్, నాదల్ కన్నీటి పర్యంతం

స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఓటమితో కెరీర్‌కు ముగింపు పలికాడు. చిరకాల మిత్రుడు.. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్‌తో కలిసి లావెర్ కప్‌లో డబుల్స్ మ్యాచ్ ఆడిన ఫెదరర్ మ్యాచ్ అనంతరం కన్నీటి పర్యంతమయ్యాడు. ఫెదరర్ కన్నీళ్లు పెట్టడం చూసి నాదల్ కూడా తట్టుకోలేకపోయాడు. ఇక తన చిరకాల మిత్రుడు టెన్నిస్ కోర్టులో కనిపించడన్న బాధను కన్నీటి రూపంలో బయటపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు.. ఫెదరర్, నాదల్ ఏడుస్తున్న ఫోటోలను షేర్ చేసి.. ''చిరకాల ప్రత్యర్థులు.. బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్.. ఈ దృశ్యం చూడడానికే బాధగా ఉంది'' అంటూ క్యాప్షన్ జత చేసింది.
Biggest rivals, best mates 🥹 #Fedal pic.twitter.com/CZcEkGVrXA
— #AusOpen (@AustralianOpen) September 24, 2022
Rafa Nadal and Roger Federer in tears after Federer’s retirement is the best sports moment you’ll see in some time.
Ultimate respect. 🐐🐐 pic.twitter.com/fUeY8wQSTM
— Barstool Sports (@barstoolsports) September 23, 2022
లావెర్ కప్ 2022లో భాగంగా శుక్రవారం అర్థరాత్రి జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో ఫెదరర్-నాదల్ జోడి ఓటమి పాలైంది. టీమ్ వరల్డ్ ఫ్రాన్సెస్‌కు చెందిన టియాఫో-జాక్ సాక్ జంట చేతిలో 4-6, 7-6(7-2), 11-9తో ఓటమి పాలయ్యారు. తొలి సెట్‌ను నాదల్-ఫెదరర్ జంట గెలిచినప్పటికి.. రెండో సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. అయితే టై బ్రేక్‌లో టియాఫో-జాక్ సాక్ జంట విజృంభించి రెండో సెట్‌ను కైవసం చేసుకున్నారు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో హోరాహోరీగా తలపడినప్పటికి టియాఫో-జాక్ జంట అద్భుతమైన షాట్లతో ఫెదరర్-నాదల్‌ను నిలువరించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు.
ఇక ఓటమితో కెరీర్‌కు ముగింపు పలికిన ఫెదరర్‌కు టెన్నిస్ అభిమానులు చివరిసారి ఘనంగా వీడ్కోలు పలికారు.'' నీలాంటి క్లాసిక్ ఆటగాడు మళ్లీ టెన్నిస్‌లో దొరక్కపోవచ్చు.. మిస్ యూ ఫెడ్డీ'' అంటూ కామెంట్ చేశారు. ఇక చిరకాల మిత్రులైన నాదల్- ఫెదరర్ ముఖాముఖి పోరులో 40 సార్లు తలపడగా.. 16 సార్లు ఫెదరర్.. 24 సార్లు నాదల్ విజయాలు సాధించాడు. ఇక మరొక టెన్నిస్ స్టార్ జొకోవిచ్‌తో 50 సార్లు తలపడగా.. 23 సార్లు ఫెదరర్.. 27 సార్లు జొకోవిచ్ గెలుపు రుచి చూశాడు.
ఫెదరర్ తన కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్స్ నెగ్గగా.. అందులో ఆస్ట్రేలియా ఓపెన్ ఆరుసార్లు, ఫ్రెంచ్ ఓపెన్ ఒకసారి, ఎనిమిది సార్లు వింబుల్డన్, ఐదుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించాడు. తన కెరీర్ మొత్తంలో 1526 సింగిల్స్, 223 డబుల్స్ మ్యాచ్‌లు ఆడిన ఫెడరర్ ఒక్కసారి కూడా మ్యాచ్ మధ్యలో రిటైర్ కాలేదు.
►కెరీర్‌లో గెలిచిన మొత్తం టైటిల్స్ – 103
►గెలుపు–ఓటములు – 1251–275
►కెరీర్ ప్రైజ్‌మనీ – 13 కోట్ల డాలర్లు (సుమారు రూ.1042 కోట్లు)
►తొలిసారి వరల్డ్ నంబర్‌వన్ – 02/02/2004
►ఒలింపిక్ పతకాలు (2) – 2008 బీజింగ్‌లో డబుల్స్ స్వర్ణం, 2012 లండన్‌లో సింగిల్స్ కాంస్యం
►వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ – మొత్తం 310 వారాలు (ఇందులో వరుసగా 237 వారాలు)
►గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ విజయాల సంఖ్య – 369
►కెరీర్‌లో కొట్టిన ఏస్‌లు – 11,478
చదవండి: ఒకే ఫ్రేమ్‌లో ఆ 'నలుగురు'.. షేక్ అవుతున్న ఇంటర్నెట్
సంబంధిత వార్తలు