నాదల్‌ కెరియర్‌లో 85 విజయం | Rafael Nadal Got First Title In 2020 | Sakshi
Sakshi News home page

నాదల్‌ కెరియర్‌లో 85 విజయం

Mar 2 2020 1:38 AM | Updated on Mar 2 2020 2:58 AM

Rafael Nadal Got First Title In 2020 - Sakshi

అకాపుల్కో: ప్రపంచ రెండో ర్యాంకర్, స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ ఈ ఏడాది తన ఖాతాలో తొలి టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన మెక్సికో ఓపెన్‌ ఏటీపీ–500 టోర్నీలో 33 ఏళ్ల నాదల్‌ చాంపియన్‌గా నిలిచాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో నాదల్‌ 6–3, 6–2తో టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై గెలిచాడు. టైటిల్‌ గెలిచే క్రమంలో నాదల్‌ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. మెక్సికో ఓపెన్‌ను నాదల్‌ నెగ్గడం ఇది మూడోసారి. గతంలో నాదల్‌ 2013, 2015లలో విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా నాదల్‌ కెరీర్‌లో ఇది 85వ సింగిల్స్‌ టైటిల్‌. తాజా టైటిల్‌తో నాదల్‌ వరుసగా 17వ ఏడాది కనీసం ఒక టైటిల్‌ను సాధించినట్లయింది. విజేతగా నిలిచిన నాదల్‌కు 3,72,785 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 69 లక్షలు)తోపాటు 500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement