ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్, నాదల్‌ | Roger Federer, Rafael Nadal Advance At Wimbledon | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్, నాదల్‌

Jul 7 2019 5:34 AM | Updated on Jul 7 2019 5:34 AM

Roger Federer, Rafael Nadal Advance At Wimbledon - Sakshi

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్‌ విభాగంలో రెండో సీడ్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), మూడో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఫెడరర్‌ 7–5, 6–2, 7–6 (7/4)తో లుకాస్‌ పుయి (ఫ్రాన్స్‌)పై, మూడో సీడ్‌ నాదల్‌ 6–2, 6–3, 6–2తో సోంగా (ఫ్రాన్స్‌)పై గెలిచారు. మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో సెరెనా విలియమ్స్‌ (అమెరికా)  6–3, 6–4తో జులియా జార్జెస్‌ (జర్మనీ)పై, టాప్‌ సీడ్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–1, 6–1తో హరియెట్‌ డార్ట్‌ (బ్రిటన్‌)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement